children at risk
-
స్క్రీన్కు అతుక్కుంటే ప్రమాదమే!
న్యూఢిల్లీ: పన్నెండేళ్లలోపు చిన్నారులు ఎక్కువ సేపు స్క్రీన్లకు అతుక్కుపోతే మెదడు పనితీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గత 23 సంవత్సరాలపాటు 30,000 మంది చిన్నారుల మెదడు ఇమేజ్‌లను విశ్లేషించి సంబంధించిన సమగ్ర అధ్యయనాన్ని హాంకాంగ్, చైనా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల బృందం బహిర్గతంచేసింది. చిన్నారుల మెదడు సంక్లిష్ట అభివృద్ది క్రమంపై ‘డిజిటల్’ ప్రభావం స్థాయిని లెక్కించేందుకు ఈ అధ్యయనం చేపట్టారు. మెదడు అభివృద్ధి చెందే క్రమంలో కొత్త రకం పనులు చేయాల్సి వచ్చినపుడు న్యూరాన్ల నెట్వర్క్ ఏ మేరకు మార్పులకు లోనవుతుందనే అంశాలనూ శాస్త్రవేత్తలు పరిశీలించారు. రీసెర్చ్ కోసం చిన్నారి మెదడు 33 విభిన్న ఇమేజ్‌లను విశ్లేషించారు... ► ఎక్కువ సేపు టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటంతో 12 ఏళ్లలోపు చిన్నా రుల మెదడు పనితీరు ప్రభావితమవుతోంది ► దీంతో మెదడు పైపొర కార్టెక్స్లో నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయి ► జ్ఞాపకశక్తి, ప్లానింగ్ సామర్థ్యం, స్పందించే గుణంలో మార్పులు వస్తున్నాయి ► దీంతో స్పర్శ, ఒత్తిడి, వేడి, చల్లదనం, నొప్పి వంటి ఇంద్రియ సంబంధ అంశాలను మెదడు ప్రాసెస్ చేసే విధానంలోనూ మార్పులు కనిపించాయి ► జ్ఞాపకశక్తి, వినడం, భాష వంటి వాటిని గుర్తుంచుకునే మెదడు భాగంలో నిర్మాణాత్మక మార్పులు వచ్చాయి ► దృశ్య సమాచారాన్ని సరిపోల్చే మెద డు భాగంలో భౌతిక మార్పులు కనిపించాయి ► ముఖ్యంగా ‘ట్యాబ్’ను వినియోగించే వారి మెదడు పనితీరు, సమస్యల పరిష్కార సామర్థ్యం బాగా తగ్గిపోయాయి. ► మేథస్సు, మెదడు పరిమాణం తగ్గిపోవడానికి వీడియో గేమ్స్, అత్యధిక ఇంటర్నెట్ వినియోగమే కారణమని రీసెర్చ్ వెల్లడించింది. ► డిజిటల్ అనుభవాలు చిన్నారుల మెదడులో మార్పులు తెస్తున్నాయని అధ్యయనం కరస్పాండింగ్ రచయిత, హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన హూయిలీ చెప్పారు. -
బ్రాండెడ్ చాక్లెట్స్కు నకిలీ సరుకు తయారు చేస్తున్న ముఠా
-
చిన్నపిల్లలు తినే చాక్లేట్లను కల్తీ చేస్తున్న ముఠా
-
భారతావనికి బాలలే భారమా?
పీడిత సమాజంలో పీడనకు ఒక వర్గం బాలలు బలవుతున్నారు. అందుకే బాలలు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని స్థితిలో భారత సమాజం ఉందంటే అతిశయోక్తి కాదు. సమాజంలో మూడు వంతులుగా ఉన్న బాలల స్థితిగతులను పరిశీలించాల్సిందే. ఈ ప్రాధాన్యత దృష్ట్యా బాలల కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయి చట్టాలు రూపొం దాయి. ప్రత్యేక హక్కులు బాలలకు దఖలు పడ్డాయి. ఇవి భారతదేశంలో 1992 నుండి అమలులోనికి వచ్చాయి. వివక్ష లేకుండా అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం, భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం, జీవించే హక్కును కలిగి ఉండటం బాలల హక్కుల మూల సూత్రాలు. పేదరికం కారణంగా చదువుకి దూరమై కష్టతరమైన పనులు చేస్తూ గడపాల్సిన దుఃస్థితిలో బాలలు ఇప్పటికీ ఉన్నారు. కనీసం ఉపాధి అవకాశాలను అంది పుచ్చుకునే చదువు వరకు కూడా వెళ్లలేకపోతున్నారు. 5 నుండి 14 ఏళ్ల వయసు ఉన్న బాల బాలికలలో ప్రతి 8 మందిలో ఒకరు తమ కోసమో, తమ కుటుంబం కోసమో పాలబుగ్గల ప్రాయంలోనే పనివారుగా మారుతున్నారు. 29 శాతం ప్రాథమిక విద్యకు ముందే బడి మానేస్తున్నారు. వీరిలో అట్టడుగు వర్గాల పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) వల్ల 5వ తరగతి కూడా పూర్తి చేయకుండానే బాలలు డ్రాపవుట్లుగా మారే ప్రమాదముంది. జాతీయ నూతన విద్యావిధానం పూర్తి స్థాయిలో అమలైతే బాలలు యాచకులుగా, బాల కార్మికులుగా, వలస బాధితులుగా, నేరగాళ్లుగా తయారయ్యే అవకాశం ఉంది. బీజేపీ అధికారంలోనికి రాగానే బాలకార్మికుల పనికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేసింది. ఏ దేశంలో కూడా ఇలాంటి సాహసం చేసిన దాఖలాలు లేవు. బాలలే ఈ సమాజానికి పెట్టుబడి అని ఒకవైపు అంటూనే ఇటువంటి చట్టాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇందువల్ల పిల్లలు కూలీలుగా మారే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)... భారత్‌లో ప్రతి 100 మందికి 79 మంది బాలలు రక్త హీనతతో, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపింది. శారీరక ఎదుగుదల లేని బాలలు 64 శాతం మందీ, తగినంత బరువులేని బాలలు 43 శాతం మందీ ఉన్నారనీ, ప్రతి ఏటా అంధత్వంతో కోటి మంది ఇబ్బందులు పడుతున్నారనీ డబ్ల్యూహెచ్ఓ తేటతెల్లం చేసింది. శిశు సంరక్షణకూ, బాలల ఆరో గ్యానికి తగిన బడ్జెట్ కేటాయించక పోవడం కార ణంగా మన దేశంలో బాలల పరిస్థితి ఇంతగా దిగజారింది. మనసుంటే ప్రస్తుతం ఉన్న వనరులూ, చట్టాల తోనే బాలల స్థితిగతులను మెరుగుపరచవచ్చని కేరళ రాష్ట్రం నిరూపించింది. బాలలకు పౌష్టికాహారం అందించడంలో కేరళ మొదటి స్థానంలో ఉంది. విద్యా రంగంలో మోడల్‌గా ఉంది. వరల్డ్ విజన్ ఇండియా, ఐఎఫ్ఆర్ లీడ్లు సంయుక్తంగా 24 సూచికలతో చేసిన సర్వేలో కేరళ చిన్నారుల సంక్షేమంలో టాప్‌లో ఉందని వెల్లడైంది. బీజేపీ పాలిత ప్రాంతమైన జార్ఖండ్ ఆఖరి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్ఈపీ అమలైతే రేపటి పౌరుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. బాలల్లో అన్నార్తులు, అనాథలు, యాచకులు, నేరగాళ్లు, సంఘ విద్రోహశక్తులు ఉండకూడదంటే వినాశకర సంస్కరణలు ఆపాలి, ఆగాలి. బాలలకు రాజ్యాంగం ఇచ్చే హక్కులను చిత్తశుద్ధితో అమలు చేయాలి. ప్రతి శిశువుకు మంచి భవితను కోరుకునే హక్కు ఉంది. ఆ హక్కుల రక్షణకు పోరాడే వేదికలకు మద్దతునివ్వాలి. కె.విజయ గౌరి, వ్యాసకర్త యు.టి.ఎఫ్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొబైల్: 89853 83255 -
అమెరికాలో మంకీపాక్స్ కలవరం.. 30 మంది చిన్నారులకు సోకిన వైరస్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను మంకీపాక్స్ కలవరానికి గురి చేస్తోంది. 30 మందికి పైగా చిన్నారులు ఈ వైరస్ బారిన పడినట్లు ఆ దేశ అంటువ్యాదుల నియంత్రణ కేంద్రం గణాంకాలు వెల్లడించాయి. వీటి ప్రకారం అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 18,417 కేసులు వెలుగు చూశాయి. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఈ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా వయోజనులకు సోకుతున్న ఈ వ్యాధి చిన్నారులకూ వ్యాపించడం అమెరికాను ఆందోళనకు గురి చేస్తోంది. 11 రాష్ట్రాల్లోని చిన్నారులు మంకీపాక్స్ బారినపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్క టెక్సాస్‌లోనే 9 మంది చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు పేర్కొంది. అమెరికాలో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా కాలిఫోర్నియాలో 3,291 మంది బాధితులున్నారు. ఆ తర్వాత న్యూయార్క్‌లో 3,273 కేసులు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం టెక్సాస్‌లో తొలి మంకీపాక్స్ మరణం నమోదైంది. 8 ఏళ్ల లోపు చిన్నారులకు మంకీపాక్స్ సోకితే చాలా ప్రమాదమని అంటువ్యాధుల కేంద్రం హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 96 దేశాల్లో మొత్తం 41,600 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా కనీసం 12 మంది చనిపోయారు. అత్యధికంగా అమెరికాలోనే ఈ కేసులు వెలుగుచూశాయి. చదవండి: కరోనా, మంకీపాక్స్ రెండూ ఒకే రకమైన వైరస్‌లా? -
దిక్కుమాలిన టిక్‌టాక్ బ్లాకౌట్ ఛాలెంజ్! ఏడుగురు చిన్నారులు బలి
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచ వ్యాప్తంగా తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది చైనాకు చెందిన షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్. కొద్ది రోజుల్లోనే మిలియన్ల మంది దానిని వినియోగించటం ప్రారంభించారు. అయితే.. దానికి ఎక్కువగా యువకులు, చిన్నారులు బానిసలవుతున్నారు. అందులోని ఛాలెంజ్‌లను అనుసరించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. టిక్‌టాక్ తీసుకొచ్చిన 'బ్లాకౌట్ ఛాలెంజ్' కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారంతా 15 ఏళ్ల వయసులోపు వారే కావటం గమనార్హం. ఏమిటీ బ్లాకౌట్ ఛాలెంజ్? యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చె టిక్‌టాక్.. బ్లాకౌట్ ఛాలెంజ్‌ను తీసుకొచ్చింది. ఈ ఛాలెంజ్.. ఆక్సిజన్ అందకుండా చేసుకుని అపస్మారక స్థితికి చేరుకునేలా ప్రోత్సహిస్తుంది. బెల్టులు, చిన్న చిన్న బ్యాగులకు కట్టే దారాలతో తమను తాము ఊపిరి ఆడకుండా చేసుకోవాలి. బ్లాకౌట్ ఛాలెంజ్ ద్వారా తమ పిల్లలు ఊపిరాడకుండా చేసుకుని చనిపోయినట్లు టిక్‌టాక్‌పై పలువురు తల్లిదండ్రులు కేసులు పెట్టినట్లు ది వెర్జ్ న్యూస్ గురువారం వెల్లడించింది. ఇటీవలే శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన లాలాని వాల్టన్(8), అరియాని అరోయో(9)ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. గతంలో 2021, జనవరిలో ఇటలీలో పదేళ్ల చిన్నారి, మార్చిలో అమెరికాలోని కొలొరాడోలో 12 ఏళ్ల బాలుడు, జూన్‌లో ఆస్ట్రేలియాలో 14 ఏళ్ల బాలుడు, జులైలో ఓక్లాహోమాలో 12 ఏళ్ల చిన్నారి, డిసెంబర్లో పెన్సిల్వేనియాలో 10 ఏళ్ల బాలిక మృతి చెందారు. టిక్‌టాక్ ప్రమాదకరమైన ఛాలెంజ్‌లతో చిన్నారులను ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించారు పెన్సిల్వేనియా చిన్నారి నైలాహ్ అండర్సన్ తల్లి తవైన అండర్సన్. తన మొదటి పేజీలోనే ఈ ఛాలెంజ్‌ను ఉంచటం వల్ల పిల్లలు ఎక్కువగా చూస్తున్నారని ఆరోపించారు. వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నాం.. టిక్‌టాక్ బ్లాకౌట్ ఛాలెంజ్ వల్ల చిన్నారులు చనిపోతున్నట్లు కేసులు నమోదవుతున్న క్రమంలో సంస్థ ప్రతినిధి సమాధానమిచ్చారు. వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రమాదకర కంటెంట్ కనిపిస్తే వెంటనే తొలగిస్తామని తెలిపారు. చిన్నారులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. చదవండి: మాల్ పార్కింగ్‌లో శవమై కనిపించిన టిక్‌టాక్ స్టార్ -
పోలియో బదులు శానిటైజర్.. చిన్నారులు అస్వస్థత
ముంబై: పోలియో చుక్కల పంపిణీలో సిబ్బంది చేసిన నిర్వాకంతో చిన్నారులు అస్వస్థతకు గురయ్యాయి. కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వినియోగించే శానిటైజర్‌ను పోలియో చుక్కల మాదిరిగా వేశారు. దీంతో చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారు. అయితే ఈ ఘటనపై చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆదివారం (జనవరి 31) చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ చేశారు. అయితే యావత్మల్లో పిల్లలకు పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ చుక్కలు వేశారు. దీంతో చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపింది. శానిటైజర్ చుక్కలు వేయించుకున్న 12 మంది పిల్లల అస్వస్థతకు గురయ్యారు. కంగారుపడిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు గుర్తించారు.. పిల్లలకు పోలియో బదులు శానిటైజర్ వేశారని. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం బాగుందని.. కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. అయితే విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్, ఆరోగ్య, ఆశా కార్యకర్తలను సస్పెండ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతున్న పాక్!
ఇస్లామాబాద్: తమ దేశంలో ట్యూబర్క్లోసిస్ (టీబీ) వ్యాక్సిన్ కొరత చాలా ఉండటంతో పాకిస్థాన్ తీవ్ర ఆందోళన చెందుతోంది. గత రెండు నెలల నుంచి ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో టీబీ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి చిన్నారులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయని పాక్ అధికారులు భావిస్తున్నారు. కొరత వల్ల చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చి వ్యాధుల నుంచి కాపాడుకోలేకపోతామని స్థానిక ఆరోగ్య సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం జాతీయ ఆరోగ్య సర్వీసు(ఎన్హెచ్ఎస్)కు బీసీజీ సిరంజీలు అవసరమని ఓ లేఖలో వెల్లడించింది. అందుకు స్పందించిన ఎన్హెచ్ఎస్ కార్యదర్శి అయుబ్ షేక్ మాట్లాడుతూ... ఇటీవలే కొనుగోలు చేసిన సిరంజీలు, ఇతర మెడికల్ ఐటమ్స్ ను వారంలోగా పంపిస్తామని చెప్పారు. వాక్సిన్స్ అందుబాటులో లేకపోతే చిన్నారుల ఆరోగ్యం ఏమైతుందోనని పంజాబ్ ప్రాంతం అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెల ఆరు లక్షల వ్యాక్సిన్స్ అందిస్తామని ఎన్హెచ్ఎస్ వెల్లడించింది. పంజాబ్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయని తమ లేఖలో జాతీయ ఆరోగ్యశాఖకు వివరించారు.