CDC
-
మరోసారి కరోనా పంజా?
న్యూఢిల్లీ: కోవిడ్–19 సృష్టించిన విలయాన్ని దేశ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ప్రాణాంతక మహమ్మారి కాటుకు లక్షల మంది బలయ్యారు. క్రమంగా వైరస్ వ్యాప్తి నిలిచిపోయింది. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, కోవిడ్–19 మరోసారి విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా, దక్షిణ కొరియా తదితర దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. అమెరికాలో 25 రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతున్నట్లు సెంటర్ ఫర్ డిసీజజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. దక్షిణ కొరియాలో చాలామంది కరోనా బారినపడి, చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇండియాలో ఈ ఏడాది జూన్, జూలైలో 908 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు బాధితులు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో జూన్ 24 నుంచి జూలై 21 మధ్య వారానికి సగటున 17,358 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలియజేసింది. ఇతర దేశాల్లో ఉన్నట్లుగా ఇండియాలో పరిస్థితి అంత తీవ్రంగా లేకపోయినా మనం అన్నింటికీ ఇప్పటి నుంచే సిద్ధపడి ఉండడం మంచిదని నోయిడాలోని శివ నాడార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వైరాలజిస్టు దీపక్ సెహగల్ సూచించారు. వైరస్ మరోసారి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ఈసారి వైరస్ వ్యాప్తిలో వేగం 11 శాతం పెరిగిందని, బాధితుల్లో 26 శాతం మంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసిందని వెల్లడించారు. ఇది నిజంగ ఆందోళకరమైన పరిణామమేనని పేర్కొన్నారు. -
గండం నుంచి గట్టెక్కిన చైనా.. భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు!
బీజింగ్: కరోనా గండం నుంచి చైనా మరోసారి గట్టెక్కింది. జనవరిలో మొదట్లో కోవిడ్ పీక్ స్టేజికి వెళ్లి భారీగా నమోదైన కేసులు, మరణాలు ఎట్టకేలకు దిగొచ్చాయి. మూడు వారాల క్రితంతో పోల్చితే గణనీయంగా తగ్గాయి. జనవరి మొదటి వారంతో పోల్చితే కరోనా కొత్త కేసులు 72 శాతం, మరణాలు 79 శాతం తగ్గినట్లు చైనా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం అధికారిక వెబ్సైట్లో బుధవారం వెల్లడించింది. చైనా జనాభాలో 80శాతం మంది కరోనా బారినపడ్డారని, మరో రెండు మూడు నెల్లలో మరో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వ శాస్త్రవేత్త ఒకరు గతవారమే హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం కరోనా లెక్కలను అధికారికంగా వెల్లడించింది. కేసులు తగ్గినట్లు పేర్కొంది. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం జనవరి 4న 1,28,000 కరోనా రోగులు ఉండగా.. జనవరి 23 నాటికి ఆ సంఖ్య 36,000కు పడిపోయింది. అలాగే మరణాలు అప్పుడు రోజుకు 4,273 నమోదు కాగా.. ఇప్పుడా సంఖ్య 896కు దిగొచ్చింది. జ్వరంతో ఆస్పత్రులకు వెళ్లిన వారి సంఖ్య డిసెంబర్ 22న 28 లక్షలుగా ఉండగా.. జనవరి 23 నాటికి ఆ సంఖ్య లక్షా 11వేలకు పడిపోయింది. చదవండి: మోదీకి షాకిచ్చిన అమెరికా.. బీబీసీ డాక్యుమెంటరీపై యూటర్న్! -
అమెరికాలో మంకీపాక్స్ కలవరం.. 30 మంది చిన్నారులకు సోకిన వైరస్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను మంకీపాక్స్ కలవరానికి గురి చేస్తోంది. 30 మందికి పైగా చిన్నారులు ఈ వైరస్ బారిన పడినట్లు ఆ దేశ అంటువ్యాదుల నియంత్రణ కేంద్రం గణాంకాలు వెల్లడించాయి. వీటి ప్రకారం అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 18,417 కేసులు వెలుగు చూశాయి. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఈ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా వయోజనులకు సోకుతున్న ఈ వ్యాధి చిన్నారులకూ వ్యాపించడం అమెరికాను ఆందోళనకు గురి చేస్తోంది. 11 రాష్ట్రాల్లోని చిన్నారులు మంకీపాక్స్ బారినపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్క టెక్సాస్‌లోనే 9 మంది చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు పేర్కొంది. అమెరికాలో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా కాలిఫోర్నియాలో 3,291 మంది బాధితులున్నారు. ఆ తర్వాత న్యూయార్క్‌లో 3,273 కేసులు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం టెక్సాస్‌లో తొలి మంకీపాక్స్ మరణం నమోదైంది. 8 ఏళ్ల లోపు చిన్నారులకు మంకీపాక్స్ సోకితే చాలా ప్రమాదమని అంటువ్యాధుల కేంద్రం హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 96 దేశాల్లో మొత్తం 41,600 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా కనీసం 12 మంది చనిపోయారు. అత్యధికంగా అమెరికాలోనే ఈ కేసులు వెలుగుచూశాయి. చదవండి: కరోనా, మంకీపాక్స్ రెండూ ఒకే రకమైన వైరస్‌లా? -
Omicron Alert: కోవిడ్ బారిన పడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులు! 30 కోట్లు దాటిన కేసులు!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు కొనసాగుతున్నప్పటికీ శుక్రవారం నాటికి 300 మిలియన్ల (30 కోట్లు)కు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యినట్లు నివేదికలు తెల్పుతున్నాయి. మరోవైపు డజన్ల కొద్ది దేశాల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శర వేగంగా వ్యాపిస్తోంది. హాస్పిటల్లో పెరిగిన ఐదేళ్లలోపు పిల్లల చేరికలు వాక్సిన్‌కు అర్హత వయసులేని వారికి సంబంధించిన డేటాను అమెరికా శుక్రవారం విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం గత కొద్దివారాలుగా కోవిడ్ మహమ్మారి బారినపడ్డ ఐదేళ్లలోపు పిల్లలు ఆసుపత్రుల్లో చేరడం పెరిగిందని తెల్పింది. అందోళనకరమైన ఈ తాజా పరిణామం దృష్ట్యా పిల్లలకు టీకాల అవసరం ఎంతైన ఉందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ డాక్టర్ రోచెల్ వాలెన్స్కీ పేర్కొన్నారు. గత నెల (డిసెంబర్) మధ్యకాలం నుంచి దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి వేగం పుంజుకుంది. ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల రేటు ప్రతి లక్ష పిల్లల్లో 2.5 నుంచి 4 కంటే ఎక్కువ నమోదవుతుంది. 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లల్లో ఈ రేటు లక్షమందికి గాను 1గా నమోదవుతుందని మొత్తం 14 రాష్ట్రాల్లో 250 ఆసుపత్రుల్లో సీడీసీ సేకరించిన సమాచారం ప్రకారం తయారు చేసిన డేటా తెల్పుతోంది. నాలుగో డోస్ అవసరం లేదు: యూకే మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి నాలుగో డోస్ వ్యాక్సిన్ తీసుకోవల్సిన అవసరం లేదని బ్రిటీష్ ఆరోగ్య అధికారులు (యూకే) శుక్రవారం తెలిపారు. మూడో డోస్ తీసుకున్న 3 నెల్ల తర్వాత 65 అంతకంటే ఎక్కవ వయసున్న వృద్ధులు ఆసుపత్రుల్లో చేరడం దాదాపు 90 శాతం తగ్గిందని యూకే హెల్త్ సెక్యురిటీ ఏజెన్సీ తెల్పింది. కోవిడ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్లు దాటాయి ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 300 మిలియన్లను దాటింది. కాగా గత వారం రోజుల్లో డజన్ల కొద్దీ దేశాలలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అధికారిక ఏఎఫ్‌పీ గణాంకాల ప్రకారం గడచిన ఏడు రోజుల్లో మొత్తం 34 దేశాల్లో అత్యధిక సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో యూరప్‌కు చెందినవి 18 దేశాలుకాగా, ఆఫ్రికాలో ఏడు దేశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక్కవారంలోనే 13.5 మిలియన్ల కొత్త కేసులు నమోదవ్వడాన్నిబట్టి కోవిడ్ ఉధృతి ఎంత వేగంగా ఉందో తెలుస్తోంది. మరణాల సగటు రేటు మాత్రం మూడు శాతం పడిపోయింది. యుఎస్, యుకె, కెనడా, ఇజ్రాయెల్ నుండి వచ్చిన డేటా ప్రకారం ఒమిక్రాన్‌తో ఆసుపత్రుల్లో చేరే ప్రమాదం 70 శాతం కంటే తక్కువగా ఉందని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ అథారిటీ శుక్రవారం తెలిపింది. ఐతే గతంలో వచ్చిన వేరియంట్లకంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, తక్కువ ప్రమాదకారి అని తెలియజేసింది. చదవండి: అమెరికా చరిత్రలో ఇది చీకటి రోజు.. డొనాల్డ్ ట్రంప్‌పై బైడెన్ తీవ్ర విమర్శలు -
కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక
వాహింగ్టన్: గత యేడాది మారణహోమం సృష్టించిన కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ శర వేగంతో వ్యాప్తి చెందే అవకాశం ఉందని యూఎస్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గురువారం వెల్లడించింది. అమెరికాలోని మొత్తం కరోనా కేసుల్లో ఒమిక్రాన్ కేసులు 3 శాతం ఉన్నాయని ఈ సందర్భంగా సీడీసీ డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ పేర్కొన్నారు. యూఎస్ దేశ వ్యాప్తంగా 96 శాతం మెజార్టీ కేసులన్నీ డెల్లా ఫ్లస్కు చెందినవి కాగా, 3 కంటే ఎక్కువ శాతం కేసులు ఒమిక్రాన్‌కు చెందినవని ఆయన తెలిపారు. 75 దేశాల్లోని 36 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూశాయని, కేవలం రెండు రోజుల వ్యవధిలో కొత్త వేరియంట్ కేసులు రెట్టంపయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా యూఎస్ నేషనల్ జినోమిక్ సీక్వెన్సింగ్ అనాలిసిస్ డేటాను సీడీజీ విడుదల చేసింది. వారాల వ్యవధిలోనే ఒమిక్రాన్ విజృంభణ కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కోవిడ్ డెల్టా ప్లస్‌ను డామినెట్ చేసే ఆధిపత్య జాతిగా పురోగమిస్తుందని యూఎస్ సీడీసీ నివేదించింది. మరోవైపు ఈయూ/ఈఈఏ దేశాల్లో 2022 మొదటి రెండు నెలల్లో ఒమిక్రాన్ వీఓసీ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, పండుగ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా యూరోపియన్ హెల్త్ కమిషనర్ స్టెల్లా కిరియాకిడ్స్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. చదవండి: ఆరు గంటలపాటు పోలీసులను పరుగులు పెట్టించింది.. అంతా ఫేక్! #WATCH | US Centers for Disease Control and Prevention (CDC) Director Rochelle Walensky said, "...Early data suggest that Omicron is more transmissible than Delta, with a doubling time of about two days." pic.twitter.com/RbbLoaQ3Nk — ANI (@ANI) December 15, 2021 -
డెల్టా వేరియంట్‌పై షాకింగ్ అధ్యయనం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మూడో వేవ్ ముంచుకొస్తోందన్న ఆందోళన కొనసాగుతున్న తరుణంలో ‘డెల్టా వేరియంట్’ పై తాజా నివేదిక మరింత ఆందోళన పుట్టిస్తోంది. ఇది ఇతర వేరియంట్ల కంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్ను కలిగిస్తుందని, అత్యంత ప్రమాదకరమైన చికెన్‌పాక్స్ కంటే సులభంగా వ్యాప్తి చెందుతుందని యూఎస్ హెల్త్ అథారిటీని ఉటంకిస్తూ అక్కడి మీడియా నివేదించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇంకా ప్రచురితం కాని డేటా ప్రకారం భారతదేశంలో ముందుగా గుర్తించిన డెల్టా వేరియంట్ రెండు డోసులు తీసుకున్న వ్యక్తుల నుంచి బాగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ కథనాలను ప్రచురించాయి. డెల్టా సోకిన వ్యక్తిలో వైరస్ లోడ్ మూములు దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అని తాజా అధ్యయనం తెలిపింది. దీనిపై శుక్రవారం సీడీసి అదనపు డేటాను ఏజెన్సీ ప్రచురిస్తుందని భావిస్తున్నారు. కరోనా వైరస్‌కు చెందిన డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరంగా విస్తరిస్తోందని, వ్యాక్సిన్ల రక్షణ వలయం కూడా దీన్ని అడ్డుకోలేదని, మరింత విధ్వంసకరంగా విజృంభించే ప్రమాదముందని సీడీసీ వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి డెల్టా వేరియంట్ సోకితే, వారి ముక్కు, గొంతులో ఎంత వైరస్ ఉంటుందో, వ్యాక్సిన్ తీసుకోని వారిలో కూడా అంతే వైరల్ లోడ్ ఉంటుందని సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ పీ వాలెన్స్కీ వెల్లడించారు. వైరస్ లోడ్ మూములు దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువనీ, మెర్స్, సార్స్, ఎబోలా, కామన్ కోల్డ్, సీజనల్ ఫ్లూ, స్మాల్ పాక్స్ వైరస్ల కన్నా డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. అలాగే డెల్టా వేరియంట్‌తో చాలా తీవ్రమైన ముప్పు అని వస్తున్న డేటాతో ఆందోళన రేపుతోందని, దీనిపై తక్షణమే గట్టి చర్యలు అవసరమని పేర్కొన్నారు. అందుకే అందరూ ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, సిబ్బంది ఇతరులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వాలెన్స్కీ చెప్పారు. కాగా అమెరికాలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారితో వైరస్ వ్యాప్తి అవుతున్నట్లు తాజాగా తేలింది. దీంతో అందరూ మాస్క్ ధరించాలని సీడీసీ మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. టీకా వైరస్ తీవ్రతను 90 శాతం అడ్డుకున్నప్పటికీ ఇన్ఫెక్షన్ లేదా ట్రాన్స్‌మిషన్‌ను నివారించడంలో తక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చు అని తెలిపింది. డెల్టా వేరియంట్ సోకిన వారిలో ఇతర కేసులతో పోలిస్తే వైరల్ లోడ్ అధికంగా ఉందనీ, ఆల్ఫా వేరియంట్ సోకినవారు గాలిలోకి వదిలే లోడ్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్‌తో గాలిలోకి విడుదలయ్యే వైరల్ లోడ్ పది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు సీడీసీ అంచనా వేసింది. -
రెండు టీకా డోసులు తీసుకుంటే మాస్కులు అక్కర్లేదు
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి భారీ ఊరట లభించింది. టీకా తీసుకున్న వారందరూ బయటకి వచ్చినప్పుడు మాస్కులు ధరించనక్కర్లేదని ది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మినహాయింపునిచ్చింది. అయితే సమూహాల్లోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. రెండు టీకా డోసులు తీసుకున్న వారంతా బయటకు వచ్చి నడుస్తున్నప్పుడు, పరుగులు పెట్టినప్పుడు, కొండలు గుట్టలు ఎక్కినప్పుడు, బైక్ మీద ఒంటరిగా వెళ్లినప్పుడు మాస్కులు పెట్టుకోనక్కర్లేదని ది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. అయితే పార్టీలు, ఫంక్షన్లు, స్పోర్ట్స్ స్టేడియాలు, ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాల్లో మాత్రం మాస్కు ధరించడం తప్పనిసరి అని పేర్కొంది. మరోవైపు అధ్యక్షుడు జో బైడెన్ కూడా ప్రజలందరూ ముందుకు వచ్చి టీకాలు తీసుకొని మాస్కు లేని ప్రపంచంలో తిరగవచ్చునని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు మాస్కులు అక్కర్లేదని ప్రకటించిన మొట్టమొదటి దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. చదవండి: (ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం.. 150 జిల్లాల్లో లాక్డౌన్?) -
కరోనా నుంచి కోలుకున్న వెంటనే టీకా వేయించుకోవచ్చా?
వేసుకోకూడదు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణై కోలుకున్న వెంటనే వ్యాక్సిన్ వేయించుకునేందుకు తొందరపడకూడదు. కోలుకున్నాక కనీసం 4 నుంచి 8 వారాల వరకు టీకా అవసరం లేదని కేంద్రం చెబుతోంది. కరోనా బారిన పడి కోలుకున్న 85 శాతం మంది శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయి ఉంటాయి. మిగతా వారిలో టీ సెల్ ఆధారిత రక్షణ ఉంటుంది. ఈ దశలో కోవిడ్ వ్యాక్సిన్ అవసరం లేదు. మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుంది. అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) ప్రకారం 90 రోజులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం 6 నెలల వరకు కూడా వ్యాక్సినేషన్ వాయిదా వేసుకోవచ్చు. వాస్తవానికి చాలా దేశాల్లో కరోనా పాజిటివ్ తర్వాత ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలా అన్నదానిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. ఒక్కో దేశంలో ఒక్కో రకంగా విధానాలు ఉన్నాయి. మొత్తంగా కరోనా పాజిటివ్ నుంచి కోలుకున్నామంటేనే మనలో రక్షణ ఏదో ఒక రూపంలో (బీ లేదా టీ సెల్) ఉంటుంది. అంటే మళ్లీ కరోనా వచ్చే అవకాశం దాదాపు 6 నెలల వరకు తక్కువే. ఆ తర్వాత వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుంది. - డాక్టర్ కిరణ్ మాదల క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ఇక్కడ చదవండి: పిల్లలకు కరోనా వస్తే ప్రమాదమా..? పాజిటివ్ వచ్చిన అందరికీ ఆక్సిజన్ సపోర్ట్ అవసరమా? ఇలా చేస్తే ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ పెరుగుతుందా? -
Double Masking: రెండు మాస్కులు ధరిస్తే కరోనా రాదా?
వాషింగ్టన్: మహమ్మారి కరోనా వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మాస్కు కచ్చితంగా ధరించాలని అందరికీ తెలుసు. రెండు మాస్కులు ధరిస్తే రెండింతల రక్షణ లభిస్తోందని తెలుసా? ఇలా ధరిస్తే వైరస్ బారినపడే అవకాశాలే లేవని అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజా పరిశోధనలో తేలింది. రెండు టైట్ ఫిట్ మాస్కులు సార్స్–కోవ్–2 సైజ్ వైరస్‌ను సమర్థంగా ఫిల్టర్ చేస్తాయని, నోరు, ముక్కులోకి వెళ్లకుండా అడ్డుకుంటాయని ఈ పరిశోధన చెబుతోంది. డబుల్ మాస్కుల వాడకం మంచిదే.. ►మాస్కుల్లో ఎక్కువ బట్ట పొరలు వాడడం వల్ల వాటి మధ్య ఖాళీ స్థలం తగ్గిపోతుంది. ఖాళీ లేకపోతే లోపలికి వైరస్ ప్రవేశించే ఆస్కారం ఉండదు. కనుక వైరస్ కణాలను ఇది సాధ్యమైనంత వరకు అడ్డుకుంటుంది. ►మాస్కు ముఖానికి సరిగ్గా అమరకపోతే రక్షణ పెద్దగా ఉండదు. కనుక డబుల్ మాస్కును ధరించడం వలన ముఖ భాగాన్ని వీలైనంత కవర్ చేస్తుంది. ఇందులో బట్ట పొరలను ఖాళీ లేకుండా బిగువుగా కలిపి కుట్టిన మాస్కు ఉత్తమమైనదని చెప్పారు. ►సాధారణ క్లాత్‌మాస్క్ 56.1 శాతం రక్షణ కల్పిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. సర్జికల్ మాస్కు అయితే 51.4 శాతం రక్షణ ఇస్తుందన్నారు. సర్జికల్ మాస్కుపై క్లాత్‌మాస్కు ధరిస్తే కరోనా నుంచి రక్షణ 85.4 శాతం వరకు ఉంటుందన్నారు. క్లాత్ లేదా సర్జికల్ మాస్కు వలన 77 శాతం రక్షణను ఇస్తుంది. ప్రయోజనాలు.. ►డబుల్ మాస్కులు వాడకం వలన మీకు శ్వాస పీల్చుకోవడంలో ఏ రకంగాను ఇబ్బందులు ఉండవు. ► డబుల్ మాస్కులు ధరించి సులభంగా మాట్లాడుకోవచ్చు. చేయకూడనవి.. ►వాడేసిన మాస్కులు రెండింటినీ గానీ, సర్జికల్ మాస్కులు రెంటిని కలిపి డబుల్ మాస్కులా వాడకూడదు ►మార్కెట్లో దొరుకుతున్న ఎన్95 మాస్క్‌ను ఏ ఇతర మాస్కు తో ఉపయోగించరాదు. ►రసాయన పదార్థాలను మాస్కు కు కలిపి ఉపయోగించరాదు. ►పాడైన, రంధ్రాలు పడినమాస్కులను వాడరాదు డబుల్ మాస్కును సరైన రీతిలో వాడుతున్నామనడానికి ఉదాహరణ ►మనం గాలి పీలుస్తున్నప్పుడు, మన మాస్కు లోపల వైపుకు వెళ్తున్నట్లు ఉండాలి ►అద్దాలు వాడే వారు గాలి వదిలినప్పుడు పొగతో వారి అద్దాలు కమ్ముకోవడం. ►అద్దం ముందు నిల్చుని మనం గాలిని బలంగా వదిలినప్పుడు మన కళ్లకు ఆ గాలి తగలడం. (చదవండి: ‘ఊపిరి’కి ఎందుకీ కష్టం?) -
భయపడొద్దు.. వ్యాక్సిన్‌లో కరోనా వైరస్ ఉండదు
సాక్షి, హైదరాబాద్: ‘‘వ్యాక్సిన్ వేయించుకున్నాక జ్వరం, ఒళ్లు నొప్పులు, కొద్దిగా దగ్గు వస్తాయి. జలుబు చేసినట్లు కూడా ఉంటుంది. ఇవన్నీ అందరికీ కచ్చితంగా వస్తాయి. వారు ఆస్పత్రులకు వెళ్లి కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నాక 15 రోజుల వరకు ఎప్పుడు టెస్టు చేయించుకున్నా పాజిటివ్ అనే వస్తుంది. అలాంటి వారిని భయపడొద్దని చెప్పండి. టెస్టులు చేయించుకోవద్దని చెప్పండి. అనవసరంగా పాజిటివ్ అని భయపడొద్దు..’అంటూ వైద్య సిబ్బంది చెప్తున్నట్టుగా ఓ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. .. అయితే ఇది ఎంతమాత్రం నిజం కాదని, దాన్ని నమ్మవద్దని వైద్య నిపుణులు చెప్తున్నారు. వ్యాక్సిన్లలో కరోనా వైరస్ ఉండదని, వ్యాక్సిన్ వల్ల పాజిటివ్ రాదని స్పష్టం చేస్తున్నారు. అమెరికాకు చెందిన ‘వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ)’కూడా ఇప్పటికే దీనిపై తగిన వివ రణ ఇచ్చింది. ఏ వ్యాక్సిన్ వేయించుకున్నా టెస్టుల్లో పాజిటివ్ రాదని.. ఒకవేళ వస్తే సదరు వ్యక్తికి నిజంగా కరోనా ఇన్ఫెక్షన్ సోకి నట్టేనని తెలిపింది. అంతకుముందే వైరస్ సోకి తగ్గిపోతే.. యాంటీబాడీస్ టెస్టుల్లో నిర్ధారణ చేసుకోవచ్చని పేర్కొంది. ఇం దులో ఐజీఎం టెస్టులో పాజిటివ్ వస్తే అంతకుముందు వారంలో ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అని.. ఐజీజీలో పాజిటివ్ వస్తే అం తకు 14 రోజులకు ముందు ఎప్పుడైనా కరోనా వచ్చినట్టు వెల్లడి అవుతుందని వివరించింది. వ్యాక్సిన్ వేసుకున్నాక పాజిటివ్ వస్తే.. కరోనా అప్పటికే సోకి ఉండటంగానీ, వ్యాక్సిన్ వేసుకున్నాక సోకడంగానీ జరిగి ఉంటుందన్న నిర్ధారణకు రావాలని తెలిపింది. చదవండి: (లాక్‌డౌన్‌పై 48 గంటల్లో చెప్పండి?) 1) ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు: మోడెర్నా, ఫైజర్ టీకాలు ఈ కోవలోకి వస్తాయి. ఈ వ్యాక్సిన్లలో కరోనా వైరస్‌లోని జన్యు పదార్థాన్ని ఎంఆర్ఎన్ఏగా మార్చి వినియోగిస్తారు. నిజానికి ఒరిజినల్ కరోనా వైరస్‌లో ఆర్ఎన్ఏ మాత్రమే ఉంటుంది. దీన్ని జెనెటిక్ పద్ధతిలో ఎంఆర్ఎన్ఏగా మారుస్తారు. ఈ ఎంఆర్‌ఎన్‌ఏలో స్పైక్ ప్రొటీన్ డేటా ఉంటుంది. వ్యాక్సిన్ వేసినప్పుడు అందులోని ఎంఆర్ఎన్ఏ శరీర కణాల్లోకి వెళ్లి స్పైక్ ప్రొటీన్‌గా మారుతుంది. అది కణాల నుంచి బయటికి రాగానే శరీరం గుర్తించి యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2) ఎడినో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్లు: స్పుత్నిక్, జాన్సన్, ఆక్స్ఫర్డ్ టీకాలు ఈ తరహాలో అభివృద్ధి చేశారు. ఇందులో.. మనుషులు, ఇతర జంతువుల్లో జలుబును కలిగించే ఎడినో వైరస్‌లను తీసుకుని, బలహీన పరుస్తారు. వాటికి కరోనా వైరస్ జన్యుపదార్థాన్ని జోడించి వ్యాక్సిన్ రూపొందిస్తారు. అందుకే వీటిని ఎడినో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్లు అంటారు. ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మన శరీరం.. టీకాలోని అడినోవైరస్‌ను, దానికి జోడించిన కరోనా స్పైక్ ప్రొటీన్స్‌ను గుర్తించి యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌లో చింపాంజీలో జలుబును కలిగించే ఎడినో వైరస్‌ను వెక్టార్‌గా వాడారు. జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలో మనుషుల్లో జలుబుకు కారణమయ్యే ఎడినో వైరస్ 26 రకాన్ని వినియోగించారు. స్పుత్నిక్‌లో అయితే తొలిడోసులో ఎడినో వైరస్ 26, రెండో డోస్‌లో ఎడినో వైరస్ 25 రకాలను వెక్టార్లుగా వాడారు. 3) ఒరిజినల్ వైరస్‌ను నిర్వీర్యం చేసి..: ఒరిజినల్ కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేసి ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే తరహా టీకా కోవాగ్జిన్. ఈ తరహా వ్యాక్సిన్ రక్తంలోకి ప్రవేశించగానే.. శరీరంలోని టీసెల్స్ అది అసలైన వైరస్‌గా భావించి అంటుకుంటాయి. దీనితో డి సెల్స్ ప్రభావితమై.. శరీరంలో రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తాయి. దీనితో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. ఏ మాత్రం వైరస్ ఉన్నా ‘ఆర్టీపీసీఆర్’ గుర్తిస్తుంది ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం గొంతు లేదా ముక్కు నుంచి శాంపిళ్లు తీసుకుంటారు. సజీవంగా ఉన్న వైరస్‌లో ఆర్ఎన్ఏ జన్యు పదార్థం ఉంటుంది. ఆ శాంపిల్స్‌కు ఎంజైమ్‌ను కలిపి డీఎన్ఏగా మారుస్తారు. దీనిని 36 రెట్లు వృద్ధి చేసి.. ఆర్టీపీసీఆర్లోని యాంటిలిఫికేషన్ టెక్నాలజీ ద్వారా పరీక్షిస్తారు. వైరస్ ఉంటే కచ్చితంగా గుర్తించేలా టెస్టు ఉంటుంది. చాలా వరకు 20 సార్లు వృద్ధి చేసే సరికే కరోనా వైరస్ ఉందా లేదా అన్నది తేలిపోతుంది. వ్యాక్సిన్లన్లీ యాంటీ బాడీస్‌ను ప్రేరేపించేవే.. కరోనా వ్యాక్సిన్లన్నీ కూడా మన శరీరంలో యాంటీ బాడీస్‌ను లేదా టీ సెల్స్‌ను ప్రేరేపించేవి మాత్రమే. ఒకవేళ వైరస్ సోకినా తక్కువ లోడ్‌తో ఇన్ఫెక్షన్ వస్తుంది. రోగ తీవ్రత తగ్గుతుంది. వ్యాక్సిన్ వేసుకోని వాళ్లకంటే వ్యాక్సిన్లు వేసుకున్న వారిలో నమోదయ్యే కేసులు 80-94 శాతం తక్కువగా ఉన్నాయని గమనించాలి. - డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల వ్యాక్సిన్ తీసుకున్నాక ఆర్టీపీసీఆర్లో ఏమీ కనిపించదు.. కరోనా వ్యాక్సిన్లు వేటిలోనైనా వాహకాలుగా వాడే వైరస్లు పూర్తిగా నిర్వీర్యం చేసినవే. వాటికి సంతతిని పెంచుకునే సామర్థ్యం ఉం డదు. మన శరీరంలో జన్యు పదార్థాన్ని టీ, బీ సెల్స్‌ను ప్రభావితం చేయడానికి మాత్రమే ఉద్దేశించినవి. దీనివల్ల శరీరంలో యాంటీ బాడీస్ తయారై.. అసలు వైరస్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాయి. వ్యాక్సిన్లలో వాడే జన్యు పదార్థాలు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో దొరకవు. అందువల్ల వ్యాక్సిన్ తీసుకున్నాక టెస్టుల్లో పాజి టివ్ వచ్చే సమస్యే తలెత్తదని సీడీసీ స్పష్టం చేసింది. 3 రకాలుగా వ్యాక్సిన్లు ఎలా అభివృద్ధి చేస్తారన్న వివరాలు వెల్లడించింది. -
కరోనాపై సీడీసీ వైఫల్యం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచం నుంచి స్మాల్ పాక్స్ (తట్టు), అమెరికాలో పోలియోను సమూలంగా నిర్మూలించి ప్రజారోగ్య వ్యవస్థలో స్వర్ణ ప్రమాణంగా నిలిచి ప్రపంచ దేశాల నీరాజనాలందుకున్న అమెరికాలోని ‘సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)’ సంస్థ నేడు కరోనా కట్టడి విషయంలో అబాసుపాలయింది. అమెరికాలో నేటికి కరోనా కేసులు దాదాపు 94 లక్షలకు చేరుకోగా మతుల సంఖ్య 2,35,000లకు చేరుకుంది. అట్లాంటా కేంద్రంగా పని చేస్తోన్న సీడీసీ ఈసారి ఎందుకు విఫలమైంది ? అందుకు బాధ్యులెవరు? సీడీసీలో 30 ఏళ్ల అనుభవం కలిగిన ప్రముఖ అంటు రోగాల నిపుణులు జాయ్ బట్లర్ ఏం చేస్తున్నారు? అంటు రోగాల ఆటకట్టించడంతోపాటు వాటి మూలాలను కనిపెట్టడంలో డెటిక్టివ్ తెలివి తేటలు కలిగిన బట్లర్ సేవలు ఎందుకు అందుబాటులో లేవు ? అమెరికాపై ఆంథ్రాక్స్ దాడి దర్యాప్తులో ఎఫ్‌బీఐ ఆయన అందించిన సహకారం, హెచ్1ఎన్1 ఫ్లూకు వ్యాక్సిన్ పంపిణీలో ఆయన సేవలు మరువ లేనివి. అలాంటి వ్యక్తి సీడీసీకి అందుబాటులో ఉండగా, కరోనా వైరస్ కట్టలుతెంచుకొని ఎందుకు విజంభిస్తోంది ? 74 ఏళ్ల సీడీసీ చరిత్రలో 2020 సంవత్సరం ఒక్కటే చీకటి అధ్యాయంగా సీడీసీ వర్గాలే చెబుతున్నాయంటే అందుకు బాధ్యులెవరు? (9 లక్షల వైరస్లు మానవులపై దాడి!) తమ కార్యకలాపాల్లో అణువణువున దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యాలయం జోక్యం చేసుకోవడం వల్లనే కరోనా వైరస్‌ను నిలువరించడంలో సీడీసీ ఏం చేయలేక చేతులెత్తేయాల్సి వచ్చిందని బట్లర్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ను అమలు చేయడంలో, వాటిని ఎత్తివేయడంలో సీడీసీ నిర్దేశించిన ప్రమాణాలను, ప్రతిపాదనలను అధ్యక్ష భవనం పూర్తిగా కాలరాసిందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి నిబంధనలు లేకుండానే దేశంలోని ప్రార్థనా మందిరాలన్నింటినీ తెరచుకునేందుకు అధ్యక్ష భవనం అనుమతించిందని ఆరోపించాయి. (కరోనా వైరస్ మలి దశ పంజా!) కరోనా వైరస్ పట్ల మొదటి నుంచి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తు వచ్చినా ట్రంప్ ప్రవర్తనను, తాము వ్యక్తిగత వ్యవహారమని సరిపెట్టుకున్నామని, అదే చివరికి దేశం పాలిట ప్రాణాంతకం అవుతుందని భావించలేదని సీడీసీ వర్గాలు పేర్కొన్నాయి. ‘కరోనా నన్నేమీ చేయలేదు’ అంటూ మొదటి నుంచి మాస్క్ కూడా ధరించని ట్రంప్, చివరకు తనతోపాటు భార్యకు కూడా కరోనా రావడంతో తొలి సారిగా మాస్క్ ధరించిన విషయం తెల్సిందే. రెండేళ్ల క్రితం సీడీసీ డైరెక్టర్‌గా ట్రంప్ నియమించిన రాబర్ట్ రెడ్ ఫీల్డ్, ఆఫీసు రాకుండా రోజు అధ్యక్ష భవనంకు వెళ్లి అక్కడ హాజరు వేయించుకునేవారనే విమర్శలు కూడా గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. చైనాలోని వూహాన్ నగరంలో కొత్త రకం నిమోనియా కేసులు వచ్చిన విషయాన్ని చైనా తర్వాత గుర్తించిన శాస్త్రవేత్తల్లో సీడీసీ సీనియర్ శాస్త్రవేత్త అన్నే షూచాట్ ఒకరు. 2003లో సార్స్ మూలాలను కనుగొనేందుకు ఆమె చైనా వెళ్లారు. అంటు రోగాలపై ప్రజాదరణ పొందిన ‘కంటేజియస్’ హాలివుడ్ చిత్రంలో కేట్ విన్సిలేట్ పాత్రకు అన్నే షూచాట్యే స్ఫూర్తి. వుహాన్‌లో అంతు చిక్కని నిమోనియా కేసులను పరిశీలించాల్సిన అవసరం ఉందంటూ 2019, డిసెంబర్ 31 ఉదయం 8.25 గంటలకు బట్లర్‌తోపాటు ఇతర సహచరులకు షూచాట్ ఈ మెయిల్ పంపించారు. (నేను సూపర్ మ్యాన్‌ను: ట్రంప్) ఆ తర్వాత వారంతా సమావేశమై కొత్త వైరస్ గురించి చర్చించారు. అప్పటికే చైనాలో 27 కేసులు బయట పడినట్లు గుర్తించారు. దేశాధ్యక్ష భవనాన్ని కూడా హెచ్చరించారు. అధ్యక్ష భవనం వారిని పట్టించుకోక పోవడమే కాకుండా, దాన్నో రాజకీయ వ్యవహారంగా చూసింది. పర్యవసానమే సీడీసీ వైఫల్యమని బట్లర్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలను, విమర్శలను సీడీసీని పర్యవేక్షించే ‘డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్’ అధికార ప్రతినిధి ఖండించారు. -
గాలి ద్వారా కరోనా వ్యాప్తి
వాషింగ్టన్: గాలిలో ఉన్న కరోనా వైరస్ నాలుగ్గంటల తర్వాత కూడా వ్యాప్తి చెందవచ్చునని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తెలిపింది. వెలుతురు తక్కువ వున్న ప్రాంతంలో ఆరడుగులకుపైగా దూరం పాటించినప్పటికీ కరోనా ఇతరులకు వ్యాప్తి చెందినట్లు ఆధారాలున్నాయని సీడీసీ తెలిపింది. కరోనా సోకిన వారి నుంచి వెలువడే నీటి తుంపర్లు, రేణువులు, పొగమాదిరిగా గాలిలో కలిసి ఉండి, భూమిమీద పడతాయని అందుకే ఆరడుగుల సామాజిక దూరం నియమం పెట్టారని సీడీసీ తెలిపింది. తుంపర్లలో ఉన్న వైరస్ కొన్ని సెకన్ల నుంచి, గంటల వరకు గాలిలో ఉంటుందని, రెండు మీటర్లకు దూరం వరకు ప్రయాణం చేయగలుగుతుందని, తక్కువ వెలుతురు ఉన్న చోట గాలి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపారు. (కృష్ణబిల పరిశోధనలకు పట్టం) -
ఉల్లి: గజగజ వణికిపోతున్న అమెరికన్లు
వాషింగ్టన్: మన దగ్గర ఉల్లి వాడకం లేని ఇళ్లు చాలా అరుదు. కూర, పులుసు, రసం.. చివరకు మజ్జిగలోకి కూడా ఉల్లిపాయ నంజుకు కావాలి చాలా మందికి. ఇది మనదేశంలో పరిస్థితి. కానీ ఇప్పుడు అమెరికన్లు ఉల్లి పేరు వింటే చాలు.. గజగజ వణికిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అమెరికాలో ఉల్లిపాయలు ఓ భయంకరమైన వ్యాధిని కలిగిస్తున్నాయట. దీని గురించి స్వయంగా అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(సీడీసీ) వెల్లడించింది. గత కొద్ది రోజులుగా అమెరికా, కెనడాలో సాల్మొనెల్లా(ఫుడ్ పాయిజన్ కలిగించే బ్యాక్టీరియా) మహమ్మారి కేసులు ఎక్కువగా వెలుగు చేస్తున్నాయంట. ఇప్పటి వరకు మొత్తం 34 రాష్ట్రాల్లో 400 మందికి ఈ బ్యాక్టీరియా సోకినట్లు అధికారులు వెల్లడించారు. సాల్మొనెల్లా ప్రధానంగా పొట్టలోని పేగులపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా డయేరియా (విరేచనాలు), జ్వరం, కడుపు నొప్పి వంటివి వస్తాయి. (రక్తపు వాంతులు, జుట్టంతా రాలిపోయి..) ఇది ఒక్కొక్కరిలో ఆరు గంటలపాటూ ఉంటుంది. బ్యాక్టీరియా సోకిన ఆరు గంటల తర్వాత ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరిలో ఆరు రోజుల తర్వాత కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు అధికారులు. అమెరికా, కెనడాకు నౌకల్లో వెళ్లిన ఎర్ర ఉల్లిపాయల్లో ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా చేరిందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఉల్లిపాయలు... అమెరికాలోని 50 రాష్ట్రాలతోపాటూ, కెనడాలోని అన్ని సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లకు ఆగస్ట్ 1న సప్లై అయ్యాయి. వీటిలో ఎరుపు, పసుపు, తెలుపు, తీపి పసుపు రంగు ఉల్లిపాయలున్నాయి. వీటన్నింటిలో కన్నా కూడా ఎర్ర ఉల్లిపాయల్లో ఎక్కువగా సాల్మొనెల్లా వైరస్ ఉన్నట్లు గుర్తించింది సీడీసీ. థాంప్సన్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి వచ్చిన అన్ని రకాల ఉల్లిపాయలనూ వాడవద్దని సీడీసీ జనాలను హెచ్చరించింది. (చైనాను వణికిస్తున్న మరో మాయదారి వైరస్) Salmonella Outbreak Update: Don’t eat, serve or sell recalled onions from Thomson International or food made from these onions. Check the list of brand names to see if you have recalled onions: https://t.co/1uvWO6f6cZ pic.twitter.com/U5ORm1d5V0 — CDC (@CDCgov) August 3, 2020 సాల్మొనెల్లా లక్షణాలు సాల్మొనెల్లా బ్యాక్టీరియా సోకిన వారిలో వెంటనే లక్షణాలు కనిపించవు. 8 గంటల నుంచి 72 గంటల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి 4 రోజుల నుంచి 7 రోజుల పాటూ ఉంటాయి. డయేరియా, జ్వరం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, తలనొప్పి వంటివి వస్తాయి. చాలా మంది డాక్టర్ల దగ్గరకు వెళ్లకుండానే రికవరీ అవుతారు. ముసలి వాళ్లు, పిల్లలకు ఈ సమస్య వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడమే మేలు. సాల్మొనెల్లో సోకితే... ఎక్కువ నీరు తాగాలి. -
క్వారంటైన్ ఎన్నాళ్లు..?
వాషింగ్టన్: కరోనా వైరస్ గురించి మాట్లాడకుండా ఎవరికీ ఒక గంట కూడా గడవడం లేదు. ఒకప్పుడు కరోనా సోకిన వారు 14 రోజులు ఐసోలేషన్‌లో ఉన్నా సరిపోయేది కాదు. వారికి పరీక్ష చేసినా పాజిటివ్ వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. అంతగా లక్షణాలు కనిపించడం లేదు. మూడు రోజులకే నెగెటివ్ వస్తోంది. వైరస్ బలహీన పడుతోందనడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. అలాంటప్పుడు ఎన్నాళ్లు క్వారంటైన్లో ఉండాలన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాంటి రోగ లక్షణాలు లేకుండా ఇంటికే పరిమితం కావడం చాలా మందికి దుర్భరంగా మారింది. మరోవైపు లక్షణాలున్న వారు తాము బయటకి వస్తే, మిగిలిన వారికి ఎక్కడ వైరస్ వ్యాప్తి చెందుతుందేమోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్స్(సీడీసీ) తాను గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను సవరించింది. (వాడిన మాస్క్‌లను ఎలా పడేయాలంటే..) లక్షణాలు లేకపోయినా పాజిటివ్ వచ్చినవారు వారికి పరీక్ష నిర్వహించిన దగ్గర్నుంచి 10 రోజులు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుంది. అంతకు ముందు వరకు రెండు సార్లు నెగెటివ్ వచ్చాక కోవిడ్ రోగులకి స్వేచ్ఛ లభించేది. అయితే ప్రపంచ దేశాల్లో జరిగిన అధ్యయనాల్లో ఎవరి శరీరంలోనూ తొమ్మిది నుంచి 11 రోజులకు మించి వైరస్ జీవించి ఉండదని తేలింది. దీంతో సీడీసీ తన నిబంధనల్ని మార్చి 10 రోజులు ఇంటిపట్టున ఉంటే సరిపోతుందని పేర్కొంది. ఎవరు ఏం చెప్పారంటే... ► డబ్ల్యూహెచ్ఓ జూన్‌లో సిఫారసు చేసిన మార్గదర్శకాల ప్రకారం.. లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ వస్తే 10 రోజులు, స్వల్ప లక్షణాలుంటే 13 రోజులు, తీవ్రత ఎక్కువగా ఉండి ఆస్పత్రి పాలైతే డిశ్చార్జ్ అయిన దగ్గర్నుంచి రెండు వారాలు ఐసోలేషన్‌లో ఉండాలి. ► యూకేలో లిసెస్టర్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ జూలియాన్ తాంగ్ కరోనా రోగులు 10 రోజుల ఐసలేషన్‌లో ఉంటే సరిపోతుందన్నారు. పది రోజుల తర్వాత వారి శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ అది బలహీనపడిపోయి వ్యాప్తి చెందదని తాము నిర్వహించిన క్లినికల్ పరీక్షల్లో తేలిందన్నారు. ► నేచర్ పత్రిక చేసిన అధ్యయనంలో కరోనా శరీరంలోకి ప్రవేశించాక ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీలు అయిదో రోజు నుంచి వైరస్‌ను నిర్వీర్యం చేయడం మొదలు పెడతాయని తేలింది. ఎనిమిది లేదా తొమ్మిదో రోజూ ఎవరి శరీరంలోనూ వైరస్ జీవించి ఉండదు. మరొకరికి సంక్రమించే అవకాశం లేదని ఆ పత్రిక వెల్లడించింది. ► సింగపూర్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షసియల్ వేయబుల్ నిర్వహించిన అధ్యయనంలో 11 రోజుల తర్వాత వైరస్ బలహీనపడుతుందని తేలింది. ► మన దేశంలో నిబంధనల ప్రకారం వరుసగా మూడు రోజుల పాటు జ్వరం రాకుండా ఉంటే కోవిడ్ రోగుల్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. ఆ తర్వాత 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలి. అది ముగిశాక ఇంట్లో వారితో కలిసిమెలిసి ఉండొచ్చు కానీ మరో ఏడు రోజులు ఇంటికే పరిమితం కావాలి. మొత్తంగా 17 రోజుల తర్వాత వారు బయటకి రావచ్చు. ► కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రష్యాలో కరోనా రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలి. ఆ తర్వాత పరీక్షలో నెగిటివ్ వచ్చాక ఇల్లు దాటి బయటకి అడుగుపెట్టొచ్చు. -
ఇంట్లోనే వైరస్ ముప్పు
సియోల్: ఇంట్లో కుటుంబ సభ్యులు ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ సోకడం అధికంగా జరుగుతోందని దక్షిణ కొరియా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. వైరస్ సోకిన ప్రతీ 10 మందిలో ఒకరికి కుటుంబ సభ్యుల నుంచి సోకినట్టు ఆ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ఫలితాలను అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రచురించింది. కరోనా పాజిటివ్ వచ్చిన 5,706 మంది రోగులపై అధ్యయనం చేస్తే వారి ద్వారా 59 వేల మందికి వైరస్ సోకినట్టు తేలింది. ప్రతీ 100 మంది కోవిడ్ రోగుల్లో ఇద్దరికి వేరే కారణాల ద్వారా వైరస్ సోకినట్టు ఆ సర్వే వెల్లడించింది. కుటుంబ సభ్యుల ద్వారా వైరస్ సోకిన వారిలో అత్యధికులు టీనేజ్‌లో ఉన్నవారు లేదంటే 60–70 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారని తేలింది. ఇక తొమ్మిదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారికి వైరస్ సోకడం అత్యంత అరుదుగా జరిగిందని ఈ అ«ధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్లలో ఒకరైన డాక్టర్ చో యంగ్జూన్ తెలిపారు. దక్షిణ కొరియాలో వైరస్ ఉధృతి అత్యధికంగా ఉన్న జనవరి 20, మార్చి 27 మధ్య సర్వేని నిర్వహించారు. -
వాటి ద్వారా కరోనా సోకే అవకాశం తక్కువ!
వాషింగ్టన్: ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే చర్యల్లో భాగంగా అనేక దేశాలు లాక్డౌన్ నిబంధలను సడలిస్తున్నాయి. మాస్కు ధరించడం, సామాజిక ఎడబాటు పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్‌తో కలిసి జీవించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కరోనా వ్యాప్తి గురించి కీలక అంశాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తాజాగా తన వెబ్సైట్లో పొందుపరిచింది. మనిషి నుంచి మనిషికి మాత్రమే వైరస్ అత్యంత సులభంగా వ్యాపిస్తుందని, వస్తువులు ఇతర ఉపరితలాల ద్వారా కరోనా ట్రాన్స్మిషన్ జరిగే అవకాశం తక్కువని పేర్కొంది. అదే విధంగా జంతువుల నుంచి మనిషికి వైరస్ సోకే అవకాశం కూడా తక్కువేనని వెల్లడించింది. (ఫేస్‌మాస్క్‌ల గురించి మనకు ఏం తెలుసు?) ఈ మేరకు ‘‘కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు, మాట్లాడినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరల ద్వారా వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఆ సమయంలో మనం సదరు వ్యక్తికి ఆరు అడుగుల దూరంకన్నా తక్కువ దూరంలో మాత్రమే ఉంటే వైరస్ సోకే ప్రమాదం మరింత ఎక్కువగా ఉన్నట్లు’’ అని పేర్కొంది. అదే విధంగా నర్సింగ్ హోంలు, జైళ్లు, క్రూయిజ్ షిప్పులు, మాంసం ప్యాకింగ్ ప్లాంట్లు తదితర ప్రదేశాల్లో అత్యధిక మంది గుమిగూడే అవకాశం ఉన్నందున వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుందని వెల్లడించింది. వాషింగ్టన్లో మార్చిలో గాయక అభ్యాస బృందం వల్ల దాదాపు 52 మందికి కరోనా పాజిటివ్ తేలిన విషయాన్ని ఈ సందర్భంగా సీడీపీ ఉటంకించింది. ఇలాంటి సూపర్ స్ప్రయిడ్లను దృష్టిలో ఉంచుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.(కరోనా కట్టడికి రాగి పూత వేయాల్సిందే!) కరోనా ఎలా సోకుతుంది? కరోనా పేషెంట్ నుంచి ఓ వ్యక్తిలోకి కరోనా చేరాలంటే ఆ వైరస్‌కు దాదాపు 1000 కణాలు (వైరల్ పార్టికల్స్ - వీపీ) చేరాలి. (శ్వాస ద్వారా నిమిషానికి 20వీపీ, మాట్లాడినపుడు 200 వీపీ, దగ్గినపుడు 200 మిలియన్ వీపీ (వెంటిలేషన్ తక్కువగా ఉన్న చోట గాలిలో ఇవి కొన్ని గంటల పాటు బతికే ఉంటాయి), తుమ్మినపుడు 200 మిలియన్ వీపీ). ఇలా వీపీలను పరిగణలోకి తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అంచనా వేయొచ్చు. సక్సెస్ఫుల్ ఇన్ఫెక్షన్కు ఫార్ములా వైరస్‌కు ఎక్స్పోజ్ అయి ఉన్న తీరు *సమయం = సక్సెస్ఫుల్ ఇన్ఫెక్షన్ ఉదాహరణకు :కరోనా ఉన్న వ్యక్తికి ఆరడుగుల దూరంలో 45 నిమిషాల కంటే తక్కువ సమయం ఉంటే మనకు కరోనా సోకే అవకాశం తక్కువే. ఇకపోతే, మాస్కు ధరించినప్పటికీ ఆ వ్యక్తి ముఖంలో ముఖం పెట్టి అంటే అత్యంత సమీపం నుంచి అతడితో 4 నిమిషాలు లేదా అంతకన్నా ఎక్కువ సేపు మాట్లాడితే వైరస్ మనలో ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆ వ్యక్తులు మన పక్కనుంచి నడుచుకుంటూ లేదా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్లినట్లయితే వైరస్ అంటుకునే ప్రమాదం తక్కువగానే ఉంటుంది. అంతేకాదు వెలుతురు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో నిర్ణీత సమయం పాటు వైరస్ మనదరి చేరే అవకాశం ఉండదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కిరాణా, కూరగాయల కొట్టుకు వెళ్లినపుడు కరోనా బారిన పడే రిస్క్ మధ్యస్థంగా ఉంటుంది. ఇక అన్నింటికంటే ఇండోర్ స్సేస్లో ఎక్కువ సేపు గుమిగూడి ఉండటం అత్యంత ప్రమాదకరం. పబ్లిక్ బాత్రూంలు, సామూహిక ప్రదేశాలు, రెస్టారెంట్ల లోపల కూర్చోవడం చాలా రిస్కుతో కూడుకున్న పని. తద్వారా కరోనా తొందరగా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఆఫీసులు, పాఠశాలల్లో భౌతిక దూరం పాటించినప్పటికీ వైరస్ సోకే ప్రమాదం అత్యంత ఎక్కువగా ఉంటుంది. పార్టీలు, పెళ్లిళ్లు, వ్యాపార కేంద్రాలు, సమావేశాలు, సినిమా హాళ్లు, కన్సర్ట్లు, ప్రార్థనా స్థలాలు ద్వారా అధిక స్థాయిలో కేసులు నమోదయ్యే అవకాశం ఎక్కవుగా ఉంది. కాబట్టి కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బయటకు వెళ్లకుండానే పనులు చక్కబెట్టుకోగల మార్గాల కోసం అన్వేషించడం ఉత్తమం. ముఖ్యంగా ఇప్పుడే ఆఫీసుకు పరిగెత్తుకుంటూ వెళ్లాలనే భావన ఉద్యోగులు, యాజమాన్యాలకు ఉండకపోవడమే మంచిది. ప్రమాదకర అంశాలు ఔట్‌డోర్ కంటే ఇండోర్ శ్రేయస్కరం. చీకటి, మూసి ఉన్న ప్రదేశాల కంటే వెలుతురులో ఉండటం మంచిది. జన సాంద్రత తక్కువగా ఉన్నచోటకు వెళ్తే ప్రమాద తీవ్రత కూడా తక్కువగానే ఉంటుంది. సమూహాల్లో సంచరించకపోవడం అత్యుత్తమం -
వ్యక్తి నుంచి వ్యక్తికే
సాక్షి, హైదరాబాద్ : న్యూస్ పేపర్ పట్టుకుంటే, కరెన్సీ ద్వారా కరోనా వస్తుందన్న వదంతులను అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) తోసిపుచ్చింది. కరోనా వ్యాధిగ్రస్తులు తాకిన వస్తువులు లేదా పరిసరాలను ముట్టుకుంటే కరోనా వస్తుందన్న వదంతులు నిజం కాదని తేల్చింది. వస్తువులు లేదా పేపర్ మరేదైనా ముట్టుకుంటే కరోనా సోకినట్లు ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదని వ్యాధుల నియంత్రణ కేంద్రం (సీడీసీ) తాజా అధ్యయనంలో వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సమాన ప్రతిష్ట కలిగిన ఈ సంస్థ తాజాగా నిర్వహించిన అధ్యయన నివేదిక అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. (బుసలు కొడుతున్న కరోనా) దీన్ని ‘ది న్యూయార్క్ పోస్ట్’ప్రచురించింది. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తితో నేరుగా కలవడం, వారి ద్వారా వచ్చిన ఇతరులను కలవడం, వారి పక్కనే ఉండటం వల్ల వస్తుందని తెలిపింది. అంతే తప్ప పాజిటివ్ వ్యక్తి పట్టుకున్న వస్తువులను, ఉపరితలాలను తాకడం వల్ల కరోనా వచ్చినట్లు స్పష్టమైన ఆధారాలు దొరకలేదని సీడీసీ తేల్చిచెప్పింది. అలాగని వస్తువులు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మానేయొద్దని, దానికి అంత ప్రాధాన్యం ఇవ్వొద్దని మాత్రమే పేర్కొంది. కరోనా వైరస్ వ్యక్తి నుంచి వ్యక్తికి మాత్రమే సోకుతుందని స్పష్టం చేసింది. బయటకు వైరస్ లక్షణాలు లేని వారి నుంచి కూడా మరో వ్యక్తికి నేరుగా వ్యాపిస్తుందని పేర్కొంది. అయితే మార్చిలో ఇదే సంస్థ విడుదల చేసిన నివేదికలో.. పరిసరాలను తాకడం వల్ల రావొచ్చని పేర్కొంది. ఇప్పుడు మాత్రం పరిసరాలు, వస్తువులను తాకడం వల్ల అంత సులభంగా రాదని తాజా అధ్యయనంలో తేల్చి చెప్పింది. ‘వైరస్ ఉన్న వ్యక్తి తాకిన వస్తువును లేదా ఉపరితలాన్ని మరో సాధారణ వ్యక్తి చేతితో ముట్టుకుని నోరు లేదా ముక్కు లేదా కళ్లను తాకడం ద్వారా కరోనా రావొచ్చు’అని తెలిపింది. (నియంత్రిత సాగే రైతు‘బంధు’) అమెరికా కేసులను అధ్యయనం చేసి.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అలా వచ్చిన లక్షలాది కేసులన్నింటినీ అధ్యయనం చేసి ఈ నివేదిక ఇచ్చినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇతర దేశాల్లో వచ్చిన కేసులను కూడా సీడీసీ అధ్యయనం చేసినట్లు నిపుణులు అంచనా వేశారు. దీంతో పాటు తెలంగాణలో నమోదైన పాజిటివ్ కేసులను పరిశీలిస్తే, ఎక్కువ శాతం కరోనా కేసులు కుటుంబాల్లోనే వెలుగు చూశాయి. అత్యంత దగ్గరి సంబంధం కలిగిన వారికే కరోనా సోకిందని తేలింది. పాజిటివ్ ఉన్న వ్యక్తికి 6 అడుగుల కంటే దగ్గరగా ఉండటం, వారితో దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తుల మధ్య వ్యాపిస్తుంది. వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వారు దగ్గడం, తుమ్మడం, మాట్లాడేటప్పుడు వచ్చే తుంపర్లు మరో వ్యక్తి నోటిలో లేదా ముక్కులో పడటానికి కారణమవుతాయి. అప్పుడు సులువుగా కరోనా వ్యాప్తిస్తుంది. అందువల్ల ఆరు అడుగుల భౌతికదూరం పాటించాలని, మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని సీడీసీ స్పష్టం చేసింది. నివేదికలోని పలు సూచనలు కరోనా సోకిన వ్యక్తి, అనుమానిత లక్షణాలున్న వారు ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సీడీసీ పలు సూచనలు చేసింది. గాలి, వెలుతురు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల వారి శ్వాసకోశ బిందువులు బయటకు వెళ్లడానికి వీలుంటుంది.– వారు ఉండే ఇంటిని శుభ్రంగా ఉంచాలి. వస్తువులను, ఉపరితలాలను, సూక్ష్మక్రిములు, ధూళి, మలినాలను తొలగించాలి. స్విచ్‌లు, హ్యాండిల్స్, డెస్క్‌లు, మరుగుదొడ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను శుభ్రపరచాలి. టచ్ స్క్రీన్లను ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో తుడవాలి. టేబుళ్లు, కుర్చీలు, ఫోన్లు, టాబ్లెట్లు, టచ్ స్క్రీన్లు, రిమోట్ కంట్రోల్స్, కీ బోర్డులు తుడవాలి. ఉపరితలాలను శుభ్రపరిచేటప్పుడు చేతి తొడుగులు ధరించాలి. వాటిని వెంటనే తీసేయాలి. చేతులు తరచూ కడుక్కోవాలి. లేకుంటే కనీసం 60 శాతం ఆల్కహాల్ కలిగి ఉన్న హ్యాండ్ శానిటైజర్ వాడాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి వీలైతే తన గదిలోనే తినాలి. పెద్ద చర్చ జరుగుతోంది సీడీసీ ఇచ్చిన నివేదికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమెరికాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనూ ఇతర అనేకచోట్ల కేసులు రికార్డు అయ్యాయి. ఒకవేళ ఉపరితలాలు, వస్తువుల ద్వారా కరోనా సోకేటట్లయితే ఇప్పటికే దేశంలోనూ లక్షలాది కేసులు నమోదయ్యేవి. కాబట్టి సీడీసీ అధ్యయనం వాస్తవానికి అత్యంత దగ్గరగా ఉంది. - డాక్టర్ కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
ఇక మీదట ఇవి కూడా కరోనా లక్షణాలే
ఇప్పటివరకు జ్వరం, దగ్గు, జలుబును మాత్రమే కరోనా లక్షణాలుగా పరిగణించాం.. కానీ ఇప్పుడు అది రూటు మార్చింది. మరిన్ని లక్షణాలతో విరుచుకుపడుతోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనం.. రుచి, వాసన గ్రహించే శక్తిని కోల్పోవడం, కండరాల నొప్పి, చలి, వణకడం, తలనొప్పి, గొంతు నొప్పి వంటివాటిని కరోనా లక్షణాల జాబితాలో చేరింది. కోవిడ్-19 బారిన పడిన 2వ రోజు నుంచి 14 రోజుల మధ్యలో ఈ లక్షణాలు కనిపించే ఆస్కారం ఉందని హెచ్చరించింది. దీంతో కరోనా లక్షణాల సంఖ్య తొమ్మిదికి చేరింది. 1. రుచి లేదా వాసన గ్రహించే శక్తి కోల్పోవడం: బ్రిటన్‌లో కరోనా వ్యాధిగ్రస్తుల్లో చాలామందికి ఇలాంటి లక్షణం ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. దీని ద్వారా తమకు తెలీకుండానే ఇతరులకు వైరస్‌ను అంటించే ప్రమాదముందని పేర్కొంది. 2. చలి: ఇతర దేశాల్లో చలి చిన్నసమస్యగా కొట్టిపారేస్తారు. కానీ ఊరికే చలి పెడుతుందంటే ఆ మాటను తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే ఇది కూడా వ్యాధి లక్షణమేనని అధ్యయన కారులు నొక్కి చెప్తున్నారు. 3. వణకడం: కరోనా బారిన పడ్డ ఓ పాత్రికేయుడు చలి వణుకు కారణంగా పల్లు పటపట కొరుకుతూ పళ్లూడగొట్టుకోవడంతో ఈ లక్షణం బయటపడింది. కాబట్టి మన దగ్గర మండుటెండలోనూ చలిపెడుతుందంటే వారిపై ఓ కన్నేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి కారణం లేకుండానే చలితో వణకడం కూడా కోవిడ్ ప్రధాన లక్షణం. 4. కండరాల నొప్పి: అమెరికాలో సుమారు 14 శాతానికి పైగా కరోనా బాధితుల్లో ఈ లక్షణం వెలుగు చూసింది. ముఖ్యంగా వయసు పైబడిన వారిని కండరాల నొప్పి వేధిస్తోంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న కేసుల్లో ఈ లక్షణం బయటపడింది. 5. తలనొప్పి: జలుబు ఉన్నప్పుడు తలనొప్పి రావడం సర్వసాధారణం. అయితే తల తిరుగుతున్నట్లు అనిపించినా, తలంతా నొప్పిగా అనిపించినా దాన్ని తేలికగా తీసిపారేయడానికి లేదు. తాజాగా నమోదవుతున్న కేసుల్లో తలనొప్పి కూడా కనిపిస్తోందని అధ్యయనం పేర్కొంది. 6. గొంతు మంట: 60 శాతానికి పైగా కేసులు దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. సాధారణ సమయాల్లో వీటిని పెద్దగా పట్టించుకోకపోయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఇందులో ఏ ఒక్క లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందేనని చెబుతున్నారు. -
మరోసారి కాటేస్తుంది జాగ్రత్త!
వాషింగ్టన్/బీజింగ్/ఇస్లామాబాద్: కరోనా మహమ్మారి ఈ ఏడాది చివరిలో తీవ్రంగా అమెరికాపై విరుచుకుపడే అవకాశముందని సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ హెచ్చరించారు. అమెరికాలో దాదాపు 8.24 లక్షల మంది వైరస్ బారిన పడగా, 45 వేలకు పైగా మరణాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అమెరికాలో ఒకవైపు ఫ్లూ మరోవైపు కరోనా వైరస్లు విజృంభిస్తాయని రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ వాషింగ్టన్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తొలిదశలో కరోనా వైరస్ వ్యాప్తికి ఫ్లూ తోడై ఉండిఉంటే తట్టుకోవడం కష్టమయ్యేదనీ, అదృష్టవశాత్తూ ఫ్లూ తగ్గుముఖం పడుతున్న సమయంలో కరోనా వచ్చిందన్నారు. రానున్న శీతాకాలంలో ఇప్పటి కంటే తీవ్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇమ్రాన్‌కు కరోనా పరీక్ష పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు బుధవారం కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థ ఈదీ ఫౌండేషన్ ఛైర్మన్ ఫైసల్ ఈదీ ఇటీవల ఇమ్రాన్‌ను సందర్శించడం, ఆ తరువాత ఆ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడిన నేపథ్యంలో ఈ పరీక్షలు అవసరమయ్యాయి. కాగా, ఇమ్రాన్‌కు నెగటివ్ అని పరీక్ష ఫలితాల్లో తేలింది. అమెరికాలో చైనాపై కేసు కరోనా వైరస్ విషయంలో చైనా వ్యవహారాలను ప్రశ్నిస్తూ అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం ఒక కేసు దాఖలు చేసింది. సమాచారాన్ని తొక్కిపెట్టడం, ముందస్తు హెచ్చరికలు చేసిన వారిని అరెస్ట్ చేయడం, వైరస్ అంటువ్యాధి లక్షణాన్ని తిరస్కరించడం ద్వారా చైనా ప్రపంచానికి సరి చేయలేనంత నష్టం కలుగజేసిందని, ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీయడంతోపాటు మానవ బాధలకు కారణమైందని మిస్సోరి అటార్నీ జనరల్ ఎరిక్ షిమిట్ స్థానిక కోర్టులో ఈ కేసు దాఖలు చేశారు. వూహాన్ డైరీ రచయితపై వ్యతిరేకత కరోనా వైరస్ పుట్టినిల్లు వూహాన్లో లాక్డౌన్ పరిస్థితులపై ఓ పుస్తకం రాసిన చైనా రచయిత ఫాంగ్ఫాంగ్పై అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫాంగ్ఫాంగ్ తన ఆన్లైన్ డైరీలో వూహాన్‌లోని పరిస్థితులను వివరించారు. రోగులతో నిండిన ఆస్పత్రులు, చికిత్స అందించలేమంటూ కొందరిని తిప్పి పంపడం, రోగుల బంధువుల మరణాల వంటి విషయాలను పేర్కొన్నారు. -
డిశ్చార్జ్ అయినవారికి మళ్లీ కరోనా!
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు పదిహేను లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా సుమారు 89వేలమంది మరణించారు. మూడు లక్షల మంది పైచిలుకు దానితో పోరాడి విజయం సాధించారు. అయినప్పటికీ కేసుల సంఖ్యతో పోలిస్తే కోలుకున్నవారి సంఖ్య చాలా తక్కువ. ఈ క్రమంలో ఓ పిడుగులాంటి వార్త అందరినీ కలవరపెడుతోంది. కోలుకున్న కరోనా పేషెంట్లకు మళ్లీ కరోనా వచ్చే అవకాశాలు లేకపోలేదని దక్షిణ కొరియాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అభిప్రాయపడింది. ద.కొరియాలో కరోనా నుంచి బయటపడి క్వారంటైన్లో ఉంటున్న 51 మంది పేషెంట్లకు మరోమారు పరీక్షలు నిర్వహించి చూడగా పాజిటివ్ అని తేలిందని సీడీసీ డైరెక్టర్ జనరల్ జియాంగ్ యన్‌కియాంగ్ వెల్లడించారు.(‘నా గుండెకు చిల్లు పడినట్లుగా అనిపిస్తోంది’) దీంతో వారిని తిరిగి ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇలా వైరస్ మళ్లీ తిరగబెట్టడంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని యన్‌కియాంగ్ తెలిపారు. అంతేకాక కొన్ని కేసుల్లో ఓరోజు పాజిటివ్ అని వస్తే, మరోరోజు నెగిటివ్ అని వస్తుందని, దీనిపైనా దృష్టి సారించామన్నారు. కాగా కరోనా సోకిన రోగికి రెండు సార్లు నెగిటివ్ రిపోర్టు వస్తేనే అతను పూర్తిగా కోలుకున్నట్లు భావిస్తారు. ఇదిలా ఉండగా బుధవారం నాటికి ద.కొరియాలో 10,384 కేసులు నమోదు కాగా 6,776 మంది కోలుకున్నారు. (14 లక్షలు దాటిన కరోనా కేసులు) -
అమెరికాలో మూడు లక్షలు
వాషింగ్టన్/బీజింగ్/జెనీవా: ఇదీ కరోనా మహమ్మారి చేస్తున్న విలయం తాండవం. కోవిడ్–19 అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అక్కడ మొత్తం 3 లక్షల కేసులు నమోదయ్యాయి. కేవలం 24 గంటల వ్యవధిలో 30 వేల కొత్త కేసులు నమోదైతే, అదే సమయంలో 1,500 మంది మరణించారు. ఈ పరిణామాలతో అమెరికాలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రజలందరూ బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సిఫారసు చేసింది. ఈ విషయాన్ని వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలందరూ సాధారణ మాస్క్‌లే ధరించాలని చెప్పారు. తీవ్రంగా మాస్క్‌ల కొరత ఎదుర్కొంటున్న అమెరికా వైద్యసిబ్బందికి అవసరమయ్యే ఎన్95 మాస్క్‌లు పౌరులు వాడవద్దని సూచించారు. ఇంట్లో తయారు చేసుకునే మాస్క్ వేసుకోవాలన్నారు. అయితే తాను మాత్రం మాస్క్ వేసుకోనని ట్రంప్ వ్యాఖ్యానించడం విశేషం. ఒక వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందదని చెప్పగా, అమెరికా శాస్త్రవేత్తలు కేసుల సంఖ్య పెరగడానికి గాలి ద్వారా వైరస్ సోకుతుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని నిర్ధారించడానికి మరికొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు. అమెరికాలో కేసులు ఇంచుమించుగా 3 లక్షలకి దగ్గర్లో ఉంటే, మృతులు 7 వేలు దాటేశాయి. గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాలి: యూఎన్: కరోనా విశ్వరూపం చూపిస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ అన్నారు. యుద్ధవాతావరణం ఉండి, పెద్ద సంఖ్యలో శరణార్థులు ఉన్న సిరియా, లిబియా, యెమన్ వంటి దేశాలకు వైరస్ విస్తరిస్తే ఎంతటి కల్లోలం రేగుతుందో ఊహించడానికే కష్టంగా ఉందని అన్నారు. కోవిడ్ మృతులకు చైనా నివాళి కోవిడ్‌తో మృతి చెందిన వారికి చైనా జాతియావత్తూ శనివారం నివాళులర్పించింది. కరోనా వైరస్‌పై తొలిసారిగా హెచ్చరించిన డాక్టర్ లీ వెన్లియాంగ్తో సహా 3,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారి మృతికి సంతాప సూచకంగా ప్రజలందరూ మూడు నిముషాలపాటు మౌనం పాటించారు. జాతీయ జెండాను అవనతం చేశారు. స్పెయిన్‌లో అత్యవసర పరిస్థితి పొడిగింపు స్పెయిన్‌లో కరోనా మృతుల సంఖ్య రాను రాను పెరిగిపోతూ ఉండడంతో జాతీయ అత్యవసర పరస్థితిని మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టుగా ప్రధాని సాంచెజ్ ప్రకటించారు. శనివారానికి ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 11,744కి చేరుకుంది. ఇక కేసుల సంఖ్య లక్షా 24 వేలు దాటేసింది. ఇటలీలో మరో 766 మంది మరణిస్తే కొత్త కేసుల సంఖ్య పెరుగుదల నాలుగు శాతం మాత్రమే నమోదైంది. జర్మనీలో కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 6,082 మందికి వైరస్ సోకింది. కువైట్‌లో శనివారం తొలి మరణం సంభవించింది. బ్రిటన్‌లో కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఒకేరోజు 708 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 4,313కి చేరుకుంది. న్యూయార్క్‌లో రెండున్నర నిమిషాలకో మరణం కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తున్న న్యూయార్క్‌లో అంతిమ సంస్కారానికి కూడా వేచి చూసే పరిస్థితులు నెలకొని ఉంటే మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇంచుమించుగా ప్రతీ రెండున్నర నిమిషాలకు ఒక మరణం నమోదవుతోందని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్యూ క్యూమో వెల్లడించారు. గత 24 గంటల్లో 562 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య దాదాపుగా 3 వేలకు చేరుకుంది. ఇక కేసుల సంఖ్య లక్ష దాటేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు: 11,69,262 మరణాలు: 62,730 కోలుకున్న వారు: 2,41,762 -
బుద్ధి మాంద్యం వాటి వల్లే!
వాషింగ్టన్: మెదడు వ్యాధులు, బుద్ధి మాంద్యం వంటి ప్రక్రియల్లో కీలక పాత్ర పోషించే 30 వారసత్వ జన్యువులను తొలిసారిగా పరిశోధకులు గుర్తించారు. నాడీ కణాల అభివృద్ధి లోపాలు ప్రపంచవ్యాప్తంగా 2.13 కోట్ల ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం(సీడీసీ) చెబుతోంది. మానసిక వైకల్యం లేదా బుద్ధి మాంద్యం 18 ఏళ్ల పిల్లల్లోనూ కనిపిస్తోందని మేరీలాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1 నుంచి 3 శాతం జనాభా ఎంతో కొంత దీని బారిన పడ్డారని తెలిపారు. అందులో సగం కేసులకు పోషకాహార లోపం వంటి కారకాలే కారణమని, మిగిలిన 50 శాతం కేసులకు జన్యు లోపాలు, జన్యు మార్పిడులే కారణమని వివరించారు. నెదర్లాండ్‌లోని రాడ్బౌడ్ వర్సిటీ మెడికల్ సెంటర్, పాకిస్తాన్‌లోని వర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ ఈ అధ్యయనం చేపట్టాయి. -
ఐడీబీఐ బ్యాంకులో వాటాలకు సీడీసీ ఆసక్తి
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు ఇంగ్లాండ్‌కి చెందిన సీడీసీ, సింగపూర్‌కి చెందిన జీఐసీ తదితర సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. 15 శాతం వాటాల కొనుగోలు కోసం ప్రపంచ బ్యాంకు గ్రూప్‌లో భాగమైన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో కూడా కేంద్రం చర్చలు జరుపుతోంది. ఐడీబీఐ బ్యాంకు ఎండీ కిశోర్ ఖరాత్ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఐడీబీఐ బ్యాంకులో దాదాపు 80 శాతం వాటాలు ఉన్నాయి. వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా వీటిని 50 శాతానికన్నా తక్కువకి తగ్గించుకోవాలని యోచిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు, వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించుకునే దిశగా ఐడీబీఐ బ్యాంకు మూడేళ్ల ప్రణాళికను రూపొందించింది. దీని కోసం రూ. 20,000 కోట్లు సమీకరించనుంది. మూడేళ్లలో వ్యాపార పరిమాణాన్ని రెట్టింపు చేసుకోవాలని, ప్రస్తుతమున్న రూ. 5 లక్షల కోట్ల నుంచి రూ. 10 లక్షల కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఖరాత్ తెలిపారు. మరోవైపు మార్కెట్లో పరిస్థితులు సరిగ్గా లేనందున సంస్థాగత ఇన్వెస్టర్లకు రూ. 3,771 కోట్ల విలువ చేసే షేర్ల విక్రయ యోచనను ఐడీబీఐ బ్యాంకు తాత్కాలికంగా పక్కన పెట్టింది. మంగళవారం బ్యాంకు షేరు 1.8 శాతం పెరిగి రూ. 59.50వద్ద ముగిసింది. -
ఏదీ.. నాటి వైభవం!
ఒకనాడు చెరుకు రైతులను ప్రోత్సహించి, చెరుకు సాగు పెంపుదల కోసం కృషి చేసిన ‘చెరుకు అభివృద్ధి మండళ్లు’ ప్రస్తుతం నిస్సహా య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా యి. సర్కారు అండ కరువై అలంకారప్రాయంగా మిగిలాయి. ఘన చరిత్ర కలిగిన సీడీసీలు నిధులు లేక, ఆదాయ వనరులు పడిపోయి నిర్వీర్యంగా దర్శనమిస్తున్నాయి. * అలంకారప్రాయంగా మారిన సీడీసీలు * పడిపోయిన ఆదాయ వనరులు * చెరుకు రైతుకు ప్రోత్సాహం కరువు * తెలంగాణ సర్కారుపైనే ఇక ఆశలు బోధన్: చక్కెర పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలో ఉండగా చెరుకు అభివృద్ధి మండళ్లకు (సీడీసీలు) పుష్కలంగా ఆదాయం ఉండేది. ఎందుకంటే, అపుడు చెరు కు క్రషింగ్ గణనీయంగా సాగేది. ఉమ్మడి రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలు ప్రయివేట్ సంస్థల గుప్పిట్లోకి వెళ్లడం, చెరుకు సాగు భారీగా తగ్గిపోవడంతో ఆదా యం పడిపోయింది. ప్రయివేటు యాజమాన్యాలు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. తెలంగాణ సర్కారయినా సీడీసీలకు మళ్లీ జీవం పోస్తే మేలు జరుగుతోందని రైతులు ఆశిస్తున్నారు. నామమాత్రపు సేవలు గతంలో చెరుకు సాగు విస్తీర్ణం పెంచేందుకు సీడీసీలు రైతులకు రాయితీపై పురుగు మందులు, ఎరువులు, సాగు నీటి సరఫరాకు పైపులు అందించేవి. చెరుకు రవాణాకోసం రహదారులు కూడా నిర్మించేవి. ప్రస్తు తం ఈ సేవలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. బోధన్ అసిస్టెంట్ కేన్ కమిషనర్ కార్యాలయ పరిధిలో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో చెరుకు ఫ్యాక్టరీలు లేనందున అక్కడ సీడీసీలు ఏర్పాటు కాలే దు. నిజామాబాద్ జిల్లాలో బోధన్, కామారెడ్డి,పిట్లం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో సీడీసీలున్నాయి. ఇందులో నిజామాబాద్ సీడీసీ మూతపడిం ది. కామారెడ్డి, పిట్లం సీడీసీల ద్వారా కొంత మేరకు సేవలందిస్తున్నారు. చెరుకు క్రషింగ్ పైనే సీడీసీలకు ఆదాయం వస్తుంది. క్రషింగ్ అయిన ప్రతి టన్నుకు ఎనిమిది రూపాయల చొప్పున యాజమాన్యాలు సీడీసీలకు చెల్లించాలి. రైతుల బిల్లుల నుంచి మరో నాలు గు రూపాయలు వస్తాయి. ప్రభుత్వ నిధులేమీ ఉండ వు. చెరుకు సాగు క్రమంగా పడిపోయి, సీడీసీలకు ఆదాయం తగ్గిపోయింది. రాజకీయ పునరావాస కేంద్రాలు ప్రభుత్వాలు సీడీసీ చైర్మన్, డెరైక్టర్లను నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తున్నాయి. దీంతో అవి రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నా యి. ఆసియా ఖండంలోనే అతి పెద్ద వ్యవసాయాధార పరిశ్రమగా పేరుపొందిన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో ఉండగా, 1990 వరకు ప్రతి సీజన్లో ఐదు లక్షల టన్నుల వరకు చెరుకు క్రషింగ్ అయ్యేది. ఇక్కడ 1962లో సీడీసీని ఏర్పాటు చేశారు. అప్పట్లో పుష్కలంగా ఆదాయం సమకూ రింది. 2002లో ఈ ఫ్యాక్టరీని ప్రయివేటీకరించారు. అప్పటి నుంచి 2013-14 సీజన్ వరకు ఇక్కడ రెండు లక్షల టన్నులకు పైగా మాత్రమే క్రషింగ్ జరిగింది. ఫలితంగా సీడీసీకి ఆదాయం పడిపోయింది. ఈ ఏడాది 1.09 లక్షల టన్నుల వరకు క్రషింగ్ జరిగే అవకాశం ఉంది. మరోవైపు చెరుకును సాగు చేస్తున్న రైతులకు లాభసాటి ధర అందని ద్రాక్షగానే మిగులుతోంది. చెరుకును లాభదాయకం గా మార్చేందుకు, ఇతర రాష్ట్రాలలో అనుసరిస్తున్న సాగు పద్ధతులు, అధిక దిగుబడుల విధానాలను అధ్య యనం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు సీడీసీలు, రైతులు, శాస్త్రవేత్తల భాగస్వామ్యం ఉండేలా చూడాలని రైతు నాయకులు కోరుతున్నారు. టీఆర్ఎస్ హామీ మే రకు చక్కెర ఫ్యాక్టరీలు ప్రభుత్వ పరమైతే సీడీసీలకు పూర్వ వైభవం వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి చక్కెర ఫ్యాక్టరీల పురోగతికి కోసం ప్రభుత్వం చెరుకు రైతులను ప్రోత్సహించాలి. రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి, లాభసాటి ధర అందే విధంగా చూస్తే సాగు గణనీ యంగా పెరిగే అవకాశం ఉం టుంది. ‘మన ఊరు-మన ప్రణాళిక’, స్టేట్ షుగర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ విభాగం ద్వారా చక్కెర పరిశ్రమల అభివద్ధి కోసం ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అవి పరిశీలనలో ఉన్నాయి. చెరుకు సాగు పెరిగితే సీడీసీలకు ఆదాయ వనరులు సమకూరుతాయి. - ఎం జాన్ విక్టర్, అసిస్టెంట్ కేన్ కమిషనర్, బోధన్