డెల్టా వేరియంట్‌పై షాకింగ్‌ అధ్యయనం | corona Delta variant may spread as easily as chicken pox says study | Sakshi
Sakshi News home page

Delta Variant: చికెన్‌ పాక్స్‌ అంత సులువుగా, తీవ్రంగా!

Published Fri, Jul 30 2021 6:08 PM | Last Updated on Fri, Jul 30 2021 6:45 PM

corona Delta variant may spread as easily as chicken pox says study - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మూడో వేవ్‌ ముంచుకొస్తోందన్న ఆందోళన కొనసాగుతున్న తరుణంలో ‘డెల్టా వేరియంట్’ పై  తాజా నివేదిక మరింత ఆందోళన పుట్టిస్తోంది. ఇది  ఇతర వేరియంట్‌ల కంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ను కలిగిస్తుందని, అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన చికెన్‌పాక్స్ కంటే సులభంగా వ్యాప్తి చెందుతుందని యూఎస్ హెల్త్ అథారిటీని ఉటంకిస్తూ అక్కడి మీడియా నివేదించింది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇంకా ప్రచురితం కాని డేటా ప్రకారం భారతదేశంలో ముందుగా గుర్తించిన డెల్టా వేరియంట్‌ రెండు డోసులు తీసుకున్న వ్యక్తుల నుంచి  బాగా వ్యాప్తి  చెందే అవకాశం ఉందని  వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్‌ టైమ్స్‌  కథనాలను ప్రచురించాయి. డెల్టా సోకిన వ్యక్తిలో వైరస్‌ లోడ్‌ మూములు దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అని తాజా అధ్యయనం తెలిపింది. దీనిపై శుక్రవారం సీడీసి అదనపు డేటాను ఏజెన్సీ ప్రచురిస్తుందని భావిస్తున్నారు.

క‌రోనా వైర‌స్‌కు చెందిన డెల్టా వేరియంట్ చాలా ప్ర‌మాద‌క‌ర‌ంగా విస్త‌రిస్తోంద‌ని, వ్యాక్సిన్ల ర‌క్ష‌ణ వ‌ల‌యం కూడా దీన్ని అడ్డుకోలేదని, మ‌రింత విధ్వంస‌క‌ర‌ంగా విజృంభించే ప్ర‌మాదముందని సీడీసీ వెల్లడించింది. కోవిడ్‌ వ్యాక్సిన్ తీసుకున్న వారికి డెల్టా వేరియంట్ సోకితే, వారి ముక్కు, గొంతులో ఎంత వైర‌స్ ఉంటుందో, వ్యాక్సిన్ తీసుకోని వారిలో కూడా అంతే వైర‌ల్ లోడ్ ఉంటుంద‌ని సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ పీ వాలెన్స్కీ వెల్లడించారు. వైరస్‌ లోడ్‌ మూములు దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువనీ, మెర్స్‌, సార్స్‌, ఎబోలా, కామ‌న్ కోల్డ్‌, సీజ‌న‌ల్ ఫ్లూ, స్మాల్ పాక్స్ వైర‌స్‌ల క‌న్నా డెల్టా వేరియంట్ వేగంగా విస్త‌రిస్తుందని పేర్కొన్నారు.  అలాగే డెల్టా వేరియంట్‌తో చాలా తీవ్రమైన ముప్పు అని వస్తున్న డేటాతో ఆందోళన రేపుతోందని, దీనిపై తక్షణమే గట్టి చర్యలు అవసరమని పేర్కొన్నారు. అందుకే అందరూ ముఖ్యంగా  పాఠశాల విద్యార్థులు, సిబ్బంది  ఇతరులు తప్పనిసరిగా మాస్క్‌లు  ధరించాలని వాలెన్స్కీ చెప్పారు. 

కాగా అమెరికాలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్న‌వారితో వైర‌స్ వ్యాప్తి అవుతున్న‌ట్లు తాజాగా తేలింది. దీంతో అందరూ మాస్క్  ధరించాలని సీడీసీ మ‌ళ్లీ ఆదేశాలు జారీ చేసింది. టీకా  వైరస్‌  తీవ్రతను  90 శాతం అడ్డుకున్నప్పటికీ ఇన్ఫెక్షన్ లేదా ట్రాన్స్‌మిషన్‌ను నివారించడంలో తక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చు అని తెలిపింది. డెల్టా వేరియంట్ సోకిన వారిలో ఇత‌ర కేసుల‌తో పోలిస్తే వైర‌ల్ లోడ్ అధికంగా ఉందనీ, ఆల్ఫా వేరియంట్ సోకినవారు గాలిలోకి వ‌దిలే లోడ్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్‌తో గాలిలోకి విడుద‌ల‌య్యే వైర‌ల్ లోడ్ ప‌ది రెట్లు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు సీడీసీ అంచ‌నా వేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement