delta
-
ఇజ్రాయెల్ కంపెనీతో జతకట్టిన రిలయన్స్
భారతదేశపు రిలయన్స్ రిటైల్ వెంచర్.. సెప్టెంబర్ 10న ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం డెల్టా గలీల్ ఇండస్ట్రీస్‌తో జాయింట్ వెంచర్‌ను ప్రకటించింది. ఇన్నర్‌వేర్ మార్కెట్‌ను విస్తరించడంలో భాగంగా 50/50 జాయింట్ వెంచర్ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయి. ఈ భాగస్వామ్యం ద్వారా డెల్టా గలీల్.. రిలయన్స్ ఉత్పత్తుల డిజైన్ అండ్ తయారీకి సహకరిస్తుంది.వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్లో తన పాదముద్రను విస్తరించేందుకు డెల్టా గలీల్ ఈ భాగస్వామ్యాన్ని ఉపయోగించుకుంటుంది. ఇందులో భాగంగానే రిటైల్, హోల్‌సేల్ వంటి వాటితో పాటు.. బ్రాండ్ల పోర్ట్‌ఫోలియోను విస్తరించనుంది.భారతీయ వినియోగదారుల డిమాండ్స్ తీర్చడానికి.. వారు కోరుకునే దుస్తుల ఆవిష్కరణలను ఏర్పాటు చేయడమే ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశ్యం. కంపెనీ గణనీయమైన వృద్ధికి కూడా ఈ జాయింట్ వెంచర్ దోహదపడుతుంది. డెల్టా గలీల్ ఇండస్ట్రీస్ అనేది పురుషులు, మహిళలు, పిల్లల కోసం బ్రాండెడ్ & ప్రైవేట్ లేబుల్ దుస్తులను అందించే సంస్థ. ఈ కంపెనీ 1975లో ప్రారంభమైంది.రిలయన్స్ రిటైల్ & డెల్టా గలీల్ భాగస్వామ్యం గురించి రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. భారతీయ వినియోగదారులకు వినూత్న ఉత్పత్తులను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. రిలయన్స్‌తో కలిసి ప్రయాణించడం చాలా ఆనందంగా ఉందని డెల్టా గలీల్ సీఈఓ పేర్కొన్నారు. -
డెల్టా కార్ప్‌కు మరో రూ.6,384 కోట్ల జీఎస్టీ నోటీస్
న్యూఢిల్లీ: డెల్టా కార్ప్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. రూ. 6,384 కోట్ల షార్ట్ పేమెంట్ కోసం ఒక జీఎస్టీ నోటీసును అందుకుంది, దీనితో కంపెనీపై మొత్తం పన్ను డిమాండ్ దాదాపు రూ. 23,000 కోట్లు దాటింది. పన్ను డిమాండ్లు ఏకపక్ష మైనవని, చట్ట విరుద్ధంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. వీటిని సవాలు చేయనున్నట్లూ వెల్లడించింది. సంస్థ ప్రకటన ప్రకారం, డీజీజీఐ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్), కోల్‌కతా విభాగం అక్టోబర్ 13న డెల్టా కార్ప్ అనుబంధ సంస్థ అయిన డెల్టాటెక్ గేమింగ్‌కు జీఎస్టీ నోటీసు పంపుతూ, జనవరి 2018 నుండి నవంబర్ 2022 కాలానికి సంబంధించి రూ. 6,236.8 కోట్ల పన్ను చెల్లింపుల డిమాండ్ చేసింది. జూలై 2017 నుండి అక్టోబర్ 2022 వరకు మరో 147.5 కోట్ల రూపాయల పన్ను డిమాండ్ నోటీసునూ అందించింది. రూ. 16,800 కోట్ల షార్ట్ పేమెంట్ నిమ్తి్తం కంపెనీకి గత నెలలో షోకాజ్ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్ గేమింగ్ సంస్థలు, కాసినోలు తమ ప్లాట్‌ఫారమ్‌లపై ఉంచిన స్థూల పందెం విలువపై 28 శాతం జీఎస్టీ చెల్లించవలసి ఉంటుందని ఆగస్టులో జీఎస్టీ అత్యున్నత స్థాయి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీకి తాజా జీఎస్టీ నోటీసులు వెలువడ్డం గమనార్హం. చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఈ–గేమింగ్ కంపెనీలకు రెట్రాస్పెక్టివ్ ప్రాతిపదికన జీఎస్టీ పన్ను డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ ఇటీవల స్పష్టం చేశారు. డేటాను పూర్తిగా విశ్లేషించిన మీదటే పన్ను మొత్తంపై నిర్ధారణకు వస్తున్నట్లు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో డెల్టా కార్ప్ షేర్ ధర 9 శాతం పడిపోయి రూ.120కి పడింది. -
డెల్టా కార్ప్ కథ కంచికేనా? జియా మోడీ మేజిక్ చేస్తారా? అసలెవరీ మోడీ?
Delta Corp-Zia Mody: గత కొన్ని రోజులు డెల్టా కార్ప్ లిమిటెడ్ వార్తల్లో నిలుస్తోంది.ముఖ్యంగా GST ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ (DG) నుండి ఇటీవల రూ. 16,822 కోట్ల పన్ను నోటీసుల నేపథ్యంలో స్టాక్మార్కెట్లో భారీ నష్టాలను నమోదు చేసింది. దీనికి తోడు ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా కంపెనీలో సగటు ధరకు 15,00,000 షేర్లను విక్రయించడం మార్కెట్లో ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. ఫలితంగా రెండు రోజుల్లో ఏకంగా 24 శాతం కుప్పకూలింది. సెప్టెంబర్ 25న ఎన్ఎస్ఈలో స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి రూ.140.35కి పడిపోయింది. అయితే బుధవారం నాటి మార్కెట్లో లాభాలతో కొనసాగుతోంది. భారతదేశంలో క్యాసినో కంపెనీలకు వేల కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలతో జీఎస్టీ అధికారులు పలు కంపెనీలకు షాక్ ఇచ్చింది. భవిష్యత్‌లో మరింతమందికి నోటీసులిచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ నోటీసులపై ఇప్పటికే డ్రీమ్ 11ను కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో డెల్టా కార్ప్ న్యాయపోరాటం చేస్తుందా? చేస్తే ఫలితం ఎలా ఉండబోతోంది? అసలు డెల్టాకార్ప్ ఎవరిది అనే విషయాలను ఒక సారి చూద్దాం. (నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం) డెల్టాకార్ప్ ఓనర్ ఎవరో తెలుసా డెల్టా కార్ప్ ప్రముఖ న్యాయవాది జియా మోడీ భర్త జయదేవ్ మోడీకి చెందినది. జియా ప్రముఖ కార్పొరేట్ లాయర్. పాపులర్ మహిళా వ్యాపారవేత్త. అంతేకాదు భారత మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ కుమార్తె. జియా మోడీ ప్రముఖ లా సంస్థ AZB & పార్టనర్స్ కి సహ వ్యవస్థాపరాలు మేనేజింగ్ భాగస్వామిగా ఉన్నారు. మూడు నెలల క్రితం క్యాసినోల కోసం స్థూల పందెం విలువపై 28 శాతం GST విధించాలని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆన్లైన్ కంపెనీలు గందరగోళం పడ్డాయి. డెల్టా కార్పొ, డ్రీమ్ 11 సమా పలు కీలక కంపెనీలకు వేల కోట్ల పన్ను ఎగవేత నోటీసులందాయి. నెల రోజుల క్రితం డెల్టా కార్పొ ముఖ్య ఆర్థిక అధికారి రాజీనామా చేశారు. రెండు నెలల క్రితం కంపెనీ తన ఆన్లైన్ గేమింగ్ బిజినెస్కంపెనీ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ను నిలిపివేసినట్లు సమాచారం. 16,822 కోట్ల పన్ను నోటీసు మీడియం-టర్మ్‌లో ప్రతికూలమని ఎనలిస్టుల అంచనా. (వేల కోట్ల జీఎస్టీ ఎగవేత: అధికారుల షాక్..కోర్టుకెక్కిన డ్రీమ్11) ఎలాంటి కేసునైనా..ఇట్టే! RSG ఇండియా నివేదిక ప్రకారం, భారతదేశంలో, ఆసియాలోనే అతిపెద్ద కార్పొరేట్ అటార్నీలలో ఒకరైన జియా ఎలాంటి క్లిష్ట సమస్యనైనా ఈజీగా పరిష్కరించే చాకచక్యం సొంతమని ఆమె క్లయింట్లు నమ్ముతారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ పన్ను నోటీసు వివాదంనుంచి విజయవంతంగాగా బయపడుతుందా అనే చర్చ జోరుగా నడుస్తోంది. గత ఐదేళ్లలో కంపెనీ అమ్మకాలు 11 శాతం, నికర లాభం 13 శాతం పెరిగాయి. కంపెనీపై పెట్టుబడిదారుల నమ్మకంతోపాటు, టాక్స్‌ల కు సంబంధించిన కొన్ని టెక్నికల్ సమస్యల రీత్యా డెల్టాకార్ప్‌కు లాంగ్ టర్మ్‌లో పెద్దగా ఇబ్బంది లేదనేది ఇండస్ట్రీ వర్గాల అంచనా. డెల్టా కార్ప్ పని అయిపోయినట్టేనా? భారతీయ కాసినో పరిశ్రమలో ఆధిపత్యం, బలమైన బ్రాండ్ నమ్మకమైన కస్టమర్ బేస్ కారణంగా డెల్టా కార్ప్ దీర్ఘకాలిక దృక్పథం ఆశాజనకంగా కనిపిస్తుంది. సవాళ్లను నావిగేట్ చేయగల కంపెనీ సామర్థ్యాన్ని నమ్మే పెట్టుబడిదారులు, ప్రస్తుత స్టాక్ ధర తగ్గుదల కొనుగోలు అవకాశమని రైట్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు, క్వాంట్-బేస్డ్ PMS ఫండ్ మేనేజర్ సోనమ్ శ్రీవాస్తవ అన్నారు. పన్ను ఎగవేత ఆరోపణలమొత్తం జూలై 2017-మార్చి 2022 వరకు ఉన్న లాభాలపై, అయితే కొత్త జీఎస్టీ అక్టోబర్ 2023 నుండి మాత్రమే అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో విజయం డెల్టా కార్ప్దే అని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా దివంగత బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా భార్య రేఖ ఒకప్పుడు క్యాసినో ఆపరేటర్లో వాటాదారులుగా ఉన్నారు. అయితే 2022లో తమ వాటాలను విక్రయించారు. డెల్టా కార్ప్‌లో 1 శాతం కంటే ఎక్కువ వాటా ఉన్న వాటాదారులెవరూ లేరు. -
సాక్షి మనీ మంత్రా: నష్టాల ముగింపు, జీఎస్టీ సెగ, డెల్టా కార్ప్ ఢమాల్!
దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస లాభాల నుంచి వెనక్కి తగ్గాయి. ఆరంభంలో లాభాల్లో ఉన్న సూచీలు లాభాల స్వీకరణతో ఫ్లాట్‌గా మారాయి. ఆ తరువాత మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 224 పాయింట్ల నష్టంతో 65394 వద్ద,నిఫ్టీ 55 పాయింట్లు క్షీణించి 19384 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19400దిగువకు చేరింది. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు లాభపడగా, ఐటీ షేర్లు నష్టపోయాయి. ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్ర బ్యాంకు, ఐషర్ మోటార్స్,సన్‌ఫార్మా టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఎల్‌టిఐఎండ్‌ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ అదానీ ఎంటర్ప్రైజెస్ బీపీసీఎల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో నష్టపోయాయి. మరోవైపు రానున్న ఫలితాల నేపథ్యంలో టీసీఎస్, హెచ్‌సీఎల్ నష్టపోయాయి. జీఎస్టీ పెంపు: కుప్పకూలిన డెల్టా కార్ప్ మరోవైపు క్యాసినో ఆపరేటర్ డెల్టా కార్ప్ లిమిటెడ్ ఏకంగా 25 శాతం కుప్పకూలింది. తాజా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కాసినోలపై జీఎస్టీ 18-28 శాతానికిపెంచడంతో25 లోయర్ సర్క్యూట్లో లాక్ అయింది. ఇది రెండు నెలల కనిష్ట స్థాయి. రికార్డులో స్టాక్‌కి ఇదే అతిపెద్ద సింగిల్ డే డ్రాప్ కూడా. ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1,600 కోట్లు నష్టపోయింది. ఈ క్షీణత దాని మొత్తం ఆర్థిక సంవత్సరం 2023 ఆదాయం రూ.1,021 కోట్ల కంటే ఎక్కువే కావడం గమనార్హం. అటు మంగళవారం నాటి ముగింపు 82.36తో పోలిస్తే బుధవారం డాలర్‌తో రూపాయి 12 పైసలు పెరిగి 82.24 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
కావేరి డెల్టాలో ‘కోల్’ కల్లోలం
ఏడాదికి మూడు పంటలతో కళకళలాడే డెల్టా జిలాల్లో కల్లోలం రేగుతోంది. నిత్యం పచ్చదనంతో ఉండే సురక్షిత వ్యవసాయ క్షేత్రంలో నేలబొగ్గు తవ్వకాలకు కేంద్రం అనుమతించ్చిందనే సమాచారంతో అక్కడి రైతులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వివిధ రాజకీయ పార్టీలు పోరుబాట పట్టాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలను పునఃసమీక్షించి వెనక్కి తీసుకోవాలని సీఎం స్టాలిన్ ప్రధాని మోదీకి లేఖ రాయడం గమనార్హం. సాక్షి, చైన్నె: కావేరి డెల్టా పరిధిలోని సురక్షిత వ్యవసాయ క్షేత్రంలో నేల బొగ్గు తవ్వకాలకు కేంద్రం అనుమతించిందనే సమాచారంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ఆరు చోట్ల నేల బొగ్గు సొరంగాలు, 11 చోట్ల పరిశోధనలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మినిస్టరీ ఆఫ్ కోల్ నోటిఫికేషన్ జారీ చేయడంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వీటికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని పీఎంకే నేత అన్భుమణి రాందాసు డిమాండ్ చేశారు. సురక్షిత క్షేత్రంలో కేంద్రం నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ డిమాండ్ చేశారు. నేపథ్యం ఇదీ.. రాష్ట్రంలో పచ్చటి పంట పొలాలతో నిండిన జిల్లాలుగా తిరువారూర్, తంజావూరు, పుదుకోట్టై, పెరంబలూరు, అరియలూరు, నాగపట్నం, కడలూరు, తిరుచ్చికి పేరుంది. ఇక్కడ లక్షలాది ఎకరాలల్లో వరి పంట, వేలాది ఎకరాలలో ఇతర పంటలు సాగవుతున్నాయి. అలాగే పెద్దఎత్తున కొబ్బరి సాగవుతోంది. కావేరినది నీటి ఆధారంగానే ఇక్కడ పంటలు పండుతున్నాయి. గత కొన్నేళ్లుగా వరుణుడి కరుణ, కావేరి పరవళ్లతో ఇక్కడి అన్నదాతల్లో ఆనందం తాండవిస్తోంది. అయితే డెల్టా జిల్లాల్లోని భూగర్భంలో ఉన్న ఇంధనం, హైడ్రో కార్బన్, గ్యాస్, నేల బొగ్గు వంటి నిక్షేపాలను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం గత కొంతగాలంగా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కేంద్రం ఇచ్చిన అనేక ఉత్తర్వులకు వ్యతిరేకంగా డెల్టాలో మహోద్యమాలు జరిగాయి. కేంద్రం వ్యూహాలకు చెక్ పేట్టే విధంగా, రైతుల్లో నెలకొన్న ఆందోళనను పోగొట్టే రీతిలో గత అన్నాడీఎంకే ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కీలక తీర్మానం చేసింది. డెల్టా జిల్లాలను సురక్షిత వ్యవసాయ క్షేత్రంగా ప్రకటిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఈ క్షేత్రంలో వ్యవసాయం మాత్రమే చేపట్టాలని, ఇతర పరిశ్రమలు, తవ్వకాలకు అనుమతులు లేవని స్పష్టం చేసింది. అలాగే గతంలో జారీ చేసిన ఇతర పరిశ్రమలకు సంబంధించిన అనుమతులను రద్దు చేశారు. దీంతో డెల్టా సురక్షిత వ్యవసాయ క్షేత్రంగా మారింది. అదే సమయంలో రాష్ట్రంలో అధికార మార్పు తర్వాత.. ప్రస్తుతం కేంద్రం మళ్లీ చాప కింద నీరులా డెల్టాపై కన్నేసి వ్యూహాలకు పదును పెట్టడం మంగళవారం అక్కడి రైతుల్లో ఆందోళన రేకెత్తించింది. నైవేలి తరహాలో.. కడలూరు జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆ జిల్లాను పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకునే విధంగా దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. నైవేలి పరిసరాల్లో నేల బొగ్గు తవ్వకాల పేరిట గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకోవడం వివాదానికి దారి తీసింది. దీనికి వ్యతిరేకంగా ఓ ఉద్యమమే ప్రారంభమైంది. అలాగే వీరాణ్ణం రిజర్వాయర్ పరిధిలో నేల బొగ్గు తవ్వకాలకు పరిశోధనలు చేయడం వెలుగులోకి రావడంతో కల్లెం వేయడానికి ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమయంలో డెల్టాలో ప్రధాన జిల్లాగా ఉన్న తంజావూరు ఒరత్తనాడు పరిధిలో ఆరు చోట్ల నేల బొగ్గు తవ్వకాలకు సొరంగాలపై కేంద్రం దృష్టి పెట్టడం వివాదానికి దారి తీసింది. తిరువారూర్– తంజావూరు జిల్లాల పరిధిలో ఆరు చోట్ల నేల బొగ్గు తవ్వకాలకు సంబంధించిన సొరంగాలు, పరిశోధనలకు కేంద్రం అనుమతి ఇవ్వడం వెలుగు చూసింది. ఈ సమాచారం అన్నదాతల్లో ఆగ్రహాన్ని రేపింది. సురక్షిత క్షేత్రాన్ని చిన్నాభిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయంటూ రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం స్పందించకుంటే మరో ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించాయి. అడ్డుకట్ట వేసేందుకు.. కావేరి డెల్టాలోని లక్షా 25 వేల ఎకరాల పంట పొలాలను సర్వనాశనం చేయడానికి కేంద్రం సిద్ధమైందని పీఎంకే నేత అన్భుమణి రాందాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని వివరించారు. తంజావూరు జిల్లా పరిధిలో 11 చోట్ల పరిశోధనలు, ఆరు చోట్ల సొరంగాల తవ్వకాలకు కేంద్రం కార్యచరణ సిద్ధం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా కేంద్రం ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకోవడం తగదని హితవుపలికారు. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ తక్షణం స్పందించాలని, అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేయాలని పట్టుబట్టారు. బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. సురక్షిత వ్యవసాయం క్షేత్రంలో పరిశోధనలకు కేంద్రం అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా మని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ వ్యాఖ్యలు చేశారు. రైతులతో కలిసి పెద్దఎత్తున పోరాటాలకు తాము సిద్ధం అని ప్రకటించారు. ఆందోళన వద్దు.. కేంద్రం అనుమతులు ఇచ్చినంత మాత్రాన అవన్నీ అమల్లోకి వచ్చే ప్రసక్తే లేదని వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న స్థలాల్లో, తమ అనుమతి లేకుండా కేంద్రం ఎలా తవ్వకాలపై దృష్టి పెడుతుందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడిస్తారన్నారు. తిరువారూర్, తంజావూరు పర్యటనలో ఉన్న క్రీడల శాఖమంత్రి ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడుతూ, కేంద్రం చర్యలను ఆదిలోనే కట్టడి చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా డెల్టాలో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. సురక్షిత వ్యవసాయ క్షేత్రాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వివరించారు. తక్షణం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లంక భూములకు డి పట్టాలు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలోని లంక భూములకు డి పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ, బీ కేటగిరీలుగా గుర్తించిన లంక భూములకు సంబంధించి వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వడంతోపాటు సి కేటగిరీలో ఉన్న భూములకు ఐదేళ్ల లీజు పట్టాలు ఇవ్వనుంది. ఈ మేరకు లంక భూముల అసైన్డ్ నిబంధనలను సవరిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ జీఓ జారీ చేశారు. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లోని ఒండ్రు మట్టి ఒక దగ్గర చేరి ఉన్న భూములు కాలక్రమేణా సాధారణ భూములుగా మారి సారవంతంగా ఉండడంతో రైతులు (శివాయి జమేదార్లు) వాటిని సాగు చేసుకుంటున్నారు. ఏ, బీ కేటగిరీ భూముల్లోని కొందరికి గతంలో డి పట్టాలిచ్చారు. మునిగిపోయే అవకాశం ఉండడంతో సీ కేటగిరీ భూములకు పట్టాలివ్వకుండా ఒక సంవత్సరం లీజుగా ఇచ్చారు. వాటినే లీజు పట్టాలుగా పిలుస్తారు. ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా పట్టాలు పూర్వపు తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ మూడు కేటగిరీల్లో ఉన్న లంక భూములను సాగు చేసుకుంటున్న చాలా మందికి పట్టాలు లేవు. అలాంటి వారిని గుర్తించి నిబంధనల ప్రకారం పట్టాలివ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి ఏ, బీ కేటగిరీల్లోని భూములకు ఆమోదంతో పట్టాలివ్వనుంది. సీ కేటగిరీ కింద ఉన్న భూములకు గతంలో ఇచ్చే సంవత్సరం లీజును ఐదేళ్లకు పొడిగించి ఇవ్వనున్నారు. అసైన్మెంట్ కమిటీల ఆమోదంతో పట్టాలిచ్చే అధికారాలను జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు. లంక భూముల్లో సీజీఎఫ్ (కో–ఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్) సొసైటీలు ఉండేవి. మిగిలిన ప్రాంతాల్లోని సీజీఎఫ్‌ఎస్ భూములకు పట్టాలిచ్చినా, లంక భూముల్లోని సీజీఎఫ్‌ఎస్ భూములకు మాత్రం ఇవ్వలేదు. ఈ సొసైటీలు రద్దయ్యే పరిస్థితుల్లో వాటి కింద ఉన్న అర్హులను గుర్తించి తాజాగా పట్టాలివ్వాలని నిర్ణయించారు. గతంలో ఇచ్చిన పట్టాలు, అడంగల్‌లో నమోదైన పట్టాదారులకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు డి పట్టాలివ్వాలని జీవోలో స్పష్టం చేశారు. 10 వేల మందికి మేలు లంక భూముల కేటగిరీలను మార్చేందుకు తాజాగా అవకాశం కల్పించారు. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, రివర్ కన్సర్వేటర్ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్)లతో ఉన్న కమిటీ కేటగిరీ మార్పుపై వచ్చే దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్ సిఫారసు చేస్తారు. ఈ సిఫారసుల ఆధారంగా జిల్లా కలెక్టర్ దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ మేరకు నిబంధనలను సవరించారు. దీనివల్ల సుమారు 10 వేల మంది లంక భూముల రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. అర్హులకు పట్టాలివ్వగా మిగిలిన భూముల్లో 50 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ రైతులకు, మిగిలిన 50 శాతం భూమిలో మూడింట రెండొంతుల (2/3) భూమిని బీసీ రైతులకు, మిగిలిన (1/3) భూమిని నిరుపేద రైతులకు పంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏ కేటగిరీ: గట్టుకు దగ్గరగా ఉండి, వరద వచ్చినా కొట్టుకుపోని భూమి బీ కేటగిరీ: ఏ కేటగిరీ భూమికి ఆనుకుని, కొంత నదిలోకి ఉన్న భూమి సీ కేటగిరీ: ఏ, బీ కేటగిరీకి ఆనుకుని నదిలోకి ఉండి.. వరదలు వస్తే పూర్తిగా మునిగిపోయే భూమి -
కరోనా కొత్త రూపాంతరం దడ! ... ఇప్పటి వరకు 25 కేసులు నమోదు!
Deltacron Cases Found In UK: కరోనా వైరస్ కొత్త రూపాంతరం గురించి ప్రపంచ ఆరోగ్య నిపుణులు ఆందోళనకు గురవుతున్నారు. ఇది డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల లక్షణాలను ప్రదర్శిస్తున్నందున డెల్టాక్రాన్‌గా నిపుణలు వ్యవహరించారు. అంతేకాదు డెల్టాక్రాన్‌గా పిలుస్తున్న ఈ హైబ్రిడ్ వేరియంట్‌ని యూకేలో తొలిసారిగా గుర్తించారు. అయితే ఈ వేరియంట్ ఎంతగా వ్యాప్తి చెందుతుంది, ఎంతవరకు ప్రమాదకరమైనది అనే విషయాలను అధికారికంగా ఇప్పటివరకు యూకే నిపుణులు వెల్లడించలేదు. అయితే సెకండ్‌వేవ్‌లో డెల్టా వేగంగా వ్యాపించి ఎంతలా ప్రాణాంతకంగా మారిందో తెలిసిందే. మూడోవేవ్‌లో ఒమిక్రాన్ అంత ప్రభావంతంగా వ్యాప్తి చెందకపోయినప్పటికి మరింత ప్రమాదకారి మాత్రం కాలేదు. అలాగే మరణాల సంఖ్య, కేసుల సంఖ్య తక్కువే. ఈ మేరకు ఈ డెల్టాక్రాన్ వేరియంట్‌ను గత ఏడాది చివర్లో సైప్రస్‌లో లియోనిడోస్ కోస్ట్రికిస్ అనే పరిశోధకుడు మొదటిసారిగా కనుగొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ సైప్రస్‌లో పనిచేస్తున్న లియోనిడోస్ కోస్ట్రికిస్ తన బృందం ఈ డెల్టాక్రాన్కి సంబంధించి సుమారు 25 కేసులను గుర్తించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు 25 డెల్టాక్రాన్ కేసుల సీక్వెన్సులు జనవరి 7, 2022న వైరస్‌లో మార్పులను ట్రాక్ చేసే అంతర్జాతీయ డేటాబేస్ అయిన GISAIDకి పంపించారు కూడా. కానీ కొంతమంది నిపుణులు మాత్రం ఇది "ల్యాబ్ ఎర్రర్‌గా" తోసిపుచ్చారు. ఈ క్రమంలో ఇంపీరియల్ కాలేజ్ లండన్ బార్క్లే లాబొరేటరీలో పరిశోధనా సహచరుడు థామస్ పీకాక్ కూడా డెల్టాక్రాన్ అంత ప్రభావవంతమైనది కాదని స్పష్టంగా తెలుస్తుందని అన్నాడు. కానీ కోస్ట్రికిస్ తన వాదనను సమర్థించటమే కాక కరోనా వైరస్ కొత్త రూపాంతరం అయిన ఈ హైబ్రిడ్ వేరియంట్ డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తుందంటూ హెచ్చరిస్తున్నాడు. మరోవైపు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒమిక్రాన్ వేరియంట్ చాలా దేశాల్లో వేగంగా సంక్రమించే అత్యంత ప్రమాదకర వేరియంట్‌గా ఉందని పేర్కొనడం గమనార్హం. (చదవండి: కుక్క గర్భవతి అనుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు... ఆశ్చర్యపోయిన వైద్యులు) -
మార్చికల్లా కరోనా మటాష్..! గుడ్ న్యూస్ చెప్పిన టాప్ సైంటిస్ట్
న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని అల్లాడిస్తున్న వేళ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వేసిన అంచనాలు కొత్త ఊపిరిపోస్తున్నాయి. కరోనా పీడ ఎప్పుడు విరగడైపోతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రజలు కోవిడ్–19 నిబంధనల్ని నిర్లక్ష్యం చేయకుండా తు.చ. తప్పకుండా పాటిస్తే మరో రెండు నెలల్లోనే ఆ మంచిరోజులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి మార్చి నాటికి ఎండమిక్ దశకు చేరుకుంటుందని ఐసీఎంఆర్‌లో వ్యాధుల నివారణ విభాగం చీఫ్ సమీరన్ పాండా చెప్పారు. ఎండమిక్ దశ అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి కరోనా ఉధృతి కనపడకుండా అక్కడక్కడా విసిరేసినట్లు కొద్ది ప్రదేశాలకు కరోనా వ్యాప్తి పరిమితం కావడం, కరోనా సాధారణ వైరస్‌గా మారిపోయి ప్రజలు దానితో సహజీవనం చేసే పరిస్థితికి చేరుకోవడం. ప్రజలందరూ కోవిడ్ రక్షణ కవచాలైన మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం వంటివి తప్పనిసరిగా చేస్తూ ఉంటే, కొత్త వేరియంట్లు ఏవీ పుట్టుకొని రాకపోతే కరోనా ఇక తుది దశకు చేరుకున్నట్టేనని అన్నారు. కరోనా ఎండమిక్ దశ మార్చి 11 నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ‘‘డెల్టా వేరియంట్ స్థానాన్ని ఒమిక్రాన్ ఆక్రమిస్తే కరోనాకి అదే ముగింపు అవుతుంది. కొత్తగా ఏ వేరియంట్లు రాకపోతే ఇక కరోనా ముగిసిపోయినట్టే. డిసెంబర్ 11 నుంచి మొదలైన కరోనా థర్డ్ వేవ్ మూడు నెలల్లో ముగిసిపోతుంది’’ అని ఐసీఎంఆర్ నిపుణుల బృందం గణిత శాస్త్ర విధానం ఆధారంగా రూపొందించిన అంచనాల్లో వెల్లడైందని పాండా తెలిపారు. ‘‘మార్చి 11 నుంచి కరోనా ఉధృతి తగ్గిపోతుంది. ఢిల్లీ, ముంబైలలో కోవిడ్–19 కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయో లేదో తెలియాలంటే మరి రెండు, మూడు వారాలు వేచిచూడాలి. ఆ రెండు నగరాల్లో పాజిటివిటీ రేటు తగ్గుతున్నప్పటికీ అక్కడ కరోనా పరిస్థితి ఏ దశలో ఉందో ఇప్పుడే చెప్పలేము. ఒకట్రెండు రోజుల్లో అక్కడ పరిస్థితులపై ఒక అంచనాకి రాలేము. ప్రస్తుతానికి ఒమిక్రాన్, డెల్టా కేసులు అక్కడ 80:20 నిష్పత్తిలో నమోదవుతున్నాయి’’ అని పాండా వివరించారు. కరోనా పరీక్షలు తప్పనిసరి వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి వివిధ దశల్లో ఉందని పాండా చెప్పారు. కరోనా మహమ్మారి రూపాంతరం చెందుతూ ఉంటే దానికి అనుగుణంగా కోవిడ్–19 పరీక్షలకు సంబంధించి వ్యూ హాలు మార్చుకుంటామన్నారు. కరోనా పరీక్షలు తగ్గించాలని తాము ఎప్పుడూ రాష్ట్రాలకు చెప్పలేదన్నారు. కరోనా స్వభావం మారినప్పుడల్లా ఐసీఎంఆర్ కోవిడ్–19 పరీక్షలు, నిర్వహణ వ్యూహాలను మార్చుకుంటూ ఉంటుందని వివరించారు. కరోనా అత్యవసర పరిస్థితులు ఇక ఉండవ్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ దావోస్: కోవిడ్–19తో విధించే అత్యవసర పరిస్థితులు ఈ ఏడాదితో ముగిసిపోయే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేస్తోంది. వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలను నిర్మూలించి అందరికీ లభ్యమయ్యేలా చర్యలు చేపడితే కోవిడ్–19 మర ణాలు, ఆస్పత్రిలో చేరికలు, లాక్డౌన్లు వంటివి అరికట్టవచ్చునని డబ్ల్యూహెచ్ఒ ప్రతినిధి డాక్టర్ మైఖేల్ ర్యాన్ చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ అసమానతలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మైఖేల్ ఇలాంటి వైరస్‌లో మన పర్యావరణ వ్యవస్థలో అంతర్భాగంగానే ఎప్పటికీ ఉంటాయన్నారు. అన్ని దేశాలకు సమానంగా టీకా పంపిణీ జరిగితే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ఇక రాకపోవచ్చునని అన్నారు. ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కేసుల ఉధృతి కొనసాగుతూ ఉండడంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగించినట్టుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. అయితే పరస్పర ఒప్పందం ఉన్న దేశాలకు ప్రత్యేక విమానాలు నడుస్తాయని, అందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. కరోనా మొదటి వేవ్ సమయంలో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలపై డీసీజీఏ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి విడతల వారీగా నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. 40 దేశాలకు ప్రత్యేక విమానాలు మాత్రం యథాతథంగా తడుస్తాయని డీసీజీఏ పేర్కొంది. ఒకే రోజు 2.82 లక్షల కరోనా కేసులు దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ఒకే రోజు 2,82,970 కేసులు నమోదయ్యాయి. 18,31,000కి క్రియాశీల కేసుల సంఖ్య చేరుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ప్రతీ కరోనా కేసుని జన్యుక్రమ విశ్లేషణకు పంపించడం సాధ్యం కాదని అందుకే ఒమిక్రాన్ కేసులు ఎంత శాతం నమోదవుతున్నాయో కచ్చితమై న లెక్కలు చెప్పలేమని స్పష్టం చేసింది. రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 15.53శాతంగా ఉంది. (కీలక విషయాలు వెల్లడి.. రాష్ట్రాల కోవిడ్ మృతుల సంఖ్యలో భారీ తేడా?) -
వైరస్ టెన్షన్!.. తారస్థాయిలో విరుచుకుపడుతున్న థర్డ్‌వేవ్
సాక్షి హైదరాబాద్: ఊహించినట్లే జరుగుతోంది. గ్రేటర్లో థర్డ్‌వేవ్ తారస్థాయికి చేరుతోంది. ఒకవైపు డెల్టా.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్లు గ్రేటర్‌వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. క్రిస్మస్, డిసెంబర్ 31 వేడుకల తర్వాత రికార్డు స్థాయిలో కేసులు నమోదువుతుండటం, చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో తారస్థాయికి చేరిన కేసులు.. ఆగస్టు తర్వాత తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ మూడో వారం నుంచి మళ్లీ కేసుల సంఖ్య పెరుతూ వచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మూడు రోజుల క్రితం.. 397 పాజిటివ్ కేసులు నమోదైతే.. తాజాగా బుధవారం ఒక్కరోజే 1,285 మందికి వైరస్ నిర్ధారణ కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. హెచ్చరికలు బేఖాతరు.. కోవిడ్ టీకాలు అందుబాటులోకి రావడంతో పాటు వైరస్ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఆగస్టు నుంచి కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ వచ్చింది. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభించాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి దశలవారీగా విద్యా సంస్థలను పునఃప్రారంభించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు సినిమా థియేటర్లు, పర్యాటక ప్రదేశాలు, హోటళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు రోజువారీ పనులు కొనసాగించాలని వైద్యులు సూచించినప్పటికీ.. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నామనే ధీమాతో వాటిని పూర్తిగా విస్మరించారు. వైద్యనిపుణుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండుగలు, పబ్బాల పేరుతో విందులు, వినోదాల్లో మునిగి తేలారు. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు సభలు, సమావేశాలకు వచ్చిన కార్యకర్తలు సైతం మాస్కులను విస్మరించారు. భౌతిక దూరం అనే అంశాన్ని పూర్తిగా మరిచిపోయారు. శానిటైజర్‌తో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోకపోవడం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరించింది. మచ్చుకు కొన్ని కేసులు ఇలా.. మెయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డిగూడలోని ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాల టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న వందమంది క్రీడాకారుల్లో ఇటీవల చెన్నైలో జరిగిన టెన్నిస్ పోటీలకు 40 మంది హాజరై వచ్చారు. వీరిలో స్థానికంగా ఉన్న ఓ ఇంటర్నేషనల్ స్కూలు విద్యార్థులు కూడా ఉన్నారు. టోర్నమెంట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత వీరిలో ఆరుగురు క్రీడాకారులకు దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. మూడు రోజుల క్రితం వీరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, వీరిలో నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో శిక్షణ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. స్కూలు యాజమాన్యం కూడా ఆఫ్‌లైన్ క్లాసులను రద్దు చేసి, ఆన్లైన్లో పాఠాలు బోధిస్తోంది. నాదర్గుల్ సమీపంలో నివాసం ఉంటున్న డీఆర్డీఓకు చెందిన ఓ కీలక అధికారి ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనను స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. అప్పటికే ఆయనకు సన్నిహితంగా తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు మెలగడంతో ఆ తర్వాత వారికి కూడా వైరస్ సోకింది. వైరస్ నిర్ధారణ అయినప్పటికీ.. లక్షణాల తీవ్రత పెద్దగా లేకపోవడంతో వారంతా హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకున్నారు. శంషాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చాడు. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ర్యాండమ్ చెకప్‌లో భాగంగా ఆయన నుంచి నమూనాలు సేకరించి, పరీక్షించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ తర్వాత జరిపిన జీనోమ్ సీక్వెన్సీ పరీక్షల్లో ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తేలింది. అప్పటికే ఆయన ఇంటికి చేరుకోవడం, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలగడం వల్ల ఆయన ద్వారా ఆయన కుమారునికి, ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ నిర్ధారణ అయింది. కోర్‌సిటీ కంటే.. శివారు ప్రాంతాల్లోనే.. నిజానికి ఫస్ట్, సెకండ్ వేవ్‌లో వైరస్ పూర్తిగా కోర్ సిటీకే పరిమితమైంది. ప్రస్తుతం శివారు ప్రాంతాల మున్సిపాలిటీలకు, మారుమూల గ్రామాలకు విస్తరించింది. సిటీ నుంచి శివారు ప్రాంతాలకు రాకపోకలు పెరిగింది. దీంతో పాటు వైరస్ శివారు ప్రాంతాలకు విస్తరించింది. సిటిజన్లతో పోలిస్తే.. శివారు బస్తీవాసుల్లో వైరస్‌పై సరైన అవగాహన లేదు. ఓ వర్గం ప్రజల్లో టీకాలపై ఇప్పటికీ మూఢ నమ్మకం నెలకొంది. దీనికి అపోహ తోడైంది. ఇప్పటికీ చాలా మంది టీకాలు వేసు కోకుండా దూరంగా ఉండిపోయారు. టీకా వేసుకోక పోవడానికి తోడు వీరిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వీరు త్వరగా వైరస్ బారిన పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఫంక్షన్ హాళ్లు, ప్రముఖ హోటళ్లు, ఐటీ అనుబంధ సంస్థలన్నీ ఓర్‌ఆర్‌ఆర్‌కు అటూఇటుగా విస్తరించి ఉండటం, ఇక్కడికి రాకపోకలు ఎక్కువగా జరుగుతుండటం కూడా రికార్డు స్థాయిలో కేసుల నమోదుకు మరో కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు వైరస్ నిర్ధారణ అయిన వారిలో పెద్దగా లక్షణాలు కన్పించకపోవడం, ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను గుర్తించి, కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించకపోవడం, ఈ విషయం తెలియక ప్రజలు తరచూ ఆయా ప్రాంతాల్లో సంచరిస్తుండటం, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిపై నిఘా కూడా లేకపోవడం, మందులు, కాయకూరలు, నిత్యవసరాల కొనుగోలు పేరుతో వీరంతా సాధారణ పౌరుల్లా బయట తిరుగుతుండటం కూడా ఆయా ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటానికి కారణ మ ని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ, తెలంగాణ జిల్లాల నుంచే కాదు.. సరిహద్దు రాష్ట్రాల బాధితులు చికిత్స కోసం ఇక్కడికే వస్తున్నారు. వీరికి సహాయంగా వచ్చిన వారు ఆస్పత్రి ఆవరణలో సాధారణ రోగుల మధ్య తిరుగుతున్నారు. -
పెరుగుతోంది! పారాహుషార్!
సునామీ గురించి విన్నాం... చూశాం. కానీ కోవిడ్ సునామీ గురించి? గత వారంగా రోజూ సగటున 9 లక్షల ప్రపంచ కేసుల ట్రెండ్ చూస్తుంటే, అటు డెల్టా, ఇటు కొత్త ఒమిక్రాన్ వేరియంట్లతో రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలపై కోవిడ్ కేసులు సునామీలా విరుచుకుపడే ప్రమాదం ఉందంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. భారీగా కేసులొచ్చి, ఆస్పత్రిలో చేరేవాళ్ళు, మృతులు పెరిగితే, ఇప్పటికే రెండేళ్ళుగా పరిమితికి మించి శ్రమిస్తున్న ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి పడే ముప్పుంది. డబ్ల్యూహెచ్ఓ బుధవారం చేసిన ఈ హెచ్చరిక ఓ పెను ప్రమాదఘంటిక. అసలే ఆరోగ్య సిబ్బంది కొరత కాగా, వారిలో అనేకులు కరోనా బారినపడడం కష్టాలను మరింత పెంచుతోంది. ప్రపంచ దేశాల్లో అంతకంతకూ పెరుగుతున్న కేసుల సంఖ్య... పండుగల వేళ మన దేశాన్ని పారాహుషార్ అంటోంది. ప్రపంచవ్యాప్తంగా గత వారంలో 11 శాతం మేర కరోనా కేసులు హెచ్చాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్లలో రికార్డుస్థాయిలో కరోనా బారినపడుతున్నారు. 61.9 శాతం జనాభాకు పూర్తిగా టీకాలు వేసిన అమెరికాలో పరిస్థితే ఇలా ఉంటే, మిగతాచోట్ల ఏమిటో ఊహించుకోవచ్చు. నిజానికి, ఈ ఏడాది చివరి కల్లా ప్రతి దేశంలో 40 శాతం మందికి పూర్తిగా టీకా వేయాలనీ, కొత్త ఏడాది మధ్యకల్లా అది 70 శాతానికి చేరాలనీ భావించారు. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థలో సభ్యు లైన 194 దేశాల్లో 92 దేశాలు ఈ ఏటి 40 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోవట్లేదు. అదీ విషాదం. అతి కొద్ది ధనిక దేశాల చేతుల్లోనే టీకాలు, ఆరోగ్య పరికరాలు పోగుపడడంతో సమానత్వం అసాధ్యం. కరోనాపై పోరులో వర్ధమాన దేశాలు వెనకబడ్డాయి. కొత్త వేరియంట్లకూ సందు చిక్కింది. గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ తక్కువ ప్రాణాంతకమని ప్రాథమిక స్టడీలు చెబుతున్నా, పెద్దయెత్తున ఆస్పత్రి పాలయ్యే ప్రమాదమైతే ఉంది. కరోనాతో ఉద్యోగులు క్వారంటైన్లో ఉంటే, వ్యాపారాలకూ దెబ్బే. ఆర్థిక రంగాన్ని దృష్టిలో పెట్టుకొనో ఏమో అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు బాధితులు 10 రోజులు ఐసొలేషన్‌లో ఉండాల్సి ఉంటే, దాన్ని తాజాగా 5 రోజులకే తగ్గిస్తున్నాయి. ఈ వివాదాస్పద నిర్ణయం ఎంతవరకు శాస్త్రీయమో చెప్పలేం. ఐసొలేషన్ రోజుల్ని తగ్గించడంతో బాధితుల నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి వేగవంతం కావచ్చని నిపుణుల అనుమానం. డాక్టర్ల మందులతో పాటు నర్సుల సేవ కీలకమైన వేళ భారత్ లాంటి చోట్ల నర్సుల కొరత ఉంది. ప్రతి వెయ్యిమందికీ ముగ్గురు నర్సులుండాలని ఆరోగ్యసంస్థ మాట. భారత్‌లో 1.7 మందే ఉన్నారు. మన దేశంలోనూ రోజుకు సగటున 8 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. సగటు కరోనా పాజిటివిటీ రేటు 0.92 శాతం. గత 24 గంటల్లో 13 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 33 రోజుల తర్వాత దేశంలో తొలిసారి కేసుల సంఖ్య 10 వేలు దాటింది. భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులూ వెయ్యికి చేరుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్రల్లో కేసులు పెచ్చరిల్లుతున్నాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 1.73 శాతం దాటింది. అక్కడి కేసుల్లో 46 శాతం ఒమిక్రాన్‌వే. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో గత వారంగా కరోనా పెరగడం, ఢిల్లీ – ముంబయ్‌లలో ఇప్పటికే కరోనా థర్డ్‌వేవ్ వచ్చేసిందనీ, సామాజిక వ్యాప్తి జరుగుతోందనీ వార్తలు రావడం ఆందోళనకరం. కాగా, దేశంలోని కేస్లోడ్లో 25 శాతం కేరళ నుంచేనట. కేరళ సహా కొన్నిచోట్ల నైట్ కర్ఫ్యూ పెట్టేశారు. ముంబయ్‌లో 144 సెక్షన్ విధించారు. రోజు రోజుకూ కేసులు పెరుగుతున్న తెలంగాణలో సైతం ఆరోగ్యాధికారులు రెండో ప్రమాద హెచ్చరిక చేశారు. రానున్న 2 నుంచి 4 వారాలు అత్యంత కీలకమనీ, జాగ్రత్తలు అవసరమనీ పదేపదే గుర్తుచేస్తు్తన్నారు. పరిస్థితులు ఇలా ఉంటే, వచ్చే ఏడాది మొదట్లో 15 కోట్ల మంది ఓటర్లు పాల్గొనే యూపీ సహా వివిధ రాష్ట్రాల ఎన్నికలు, ర్యాలీలు యథావిధిగా జరగనున్నాయి. గురువారం ఎన్నికల సంఘం ఆ సంగతి తేల్చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలనీ, గుంపులకూ, ఉత్సవాలకూ దూరంగా ఉండాలనీ చెబుతున్న పాలకులు, పార్టీ నేతలు ఎన్నికల వేళ తాము ఆ పని చేయడం లేదు. ముఖానికి మాస్కు, భౌతిక దూరం లేని జనప్రదర్శనలతో అన్ని పార్టీలదీ అదే తీరు. రాత్రి వేళ కర్ఫ్యూలు, పగటిపూట ర్యాలీలు– ఇదీ నేటి ద్వంద్వ నీతి. ఢిల్లీలో రెండు రోజుల క్రితమే ఎల్లో అలర్ట్ జారీ చేసి, స్కూళ్ళు, సినిమా హాళ్ళు మూసేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికల ర్యాలీలు మాత్రం మానుకోదలిచినట్టు లేరు. చండీగఢ్‌లో ఆయన తాజా విజయోత్సవ ర్యాలీయే అందుకు నిదర్శనం. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మొదలు ప్రధాని, హోమ్ మంత్రి పాల్గొంటున్న ఉత్తరాది రాష్ట్రాల ర్యాలీలు సరేసరి. కుంభమేళాకు లేని అభ్యంతరం ఇప్పుడు బెంగాల్లో గంగా సాగర్ మేళాకు ఎందుకన్నది మమతా బెనర్జీ ప్రశ్న. ఇలాంటి చర్యలు సరైనవేనా అన్నది నాయకులే ఆత్మపరి శీలన చేసుకోవాలి. ప్రజారోగ్యం కన్నా పార్టీల ఎన్నికల ప్రయోజనాలే ఎక్కువ కావడం సరైనదా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే, ఈ ఏడు ఇలాగే తమిళనాడు, కేరళ, బెంగాల్ తదితర రాష్ట్రాల ఎన్నికల ర్యాలీలతో ఎన్ని రెట్లు కేసులు పెరిగాయో తెలిసిందే. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది. పైపెచ్చు, డిసెంబర్ మొదట్లో రోజూ 80 లక్షల డోసులు వేస్తే, ఇప్పుడది 60 లక్షలకు పడి పోవడం పాలకుల లోపమే. కొత్తగా రెండు కొత్త వ్యాక్సిన్లు (కోవోవ్యాక్స్, కోర్బెవ్యాక్స్) – ఓ మాత్ర (మాల్నూపిరవర్)కు అనుమతిచ్చినా, వృద్ధులకు బూస్టర్లు – టీనేజర్లకు టీకాలేస్తామంటున్నా, నేటికీ వయోజనుల్లో 63 శాతానికే 2 డోసులూ పూర్తయ్యాయని మర్చిపోతే కష్టం. -
Covid-19: తొలగని థర్డ్ వేవ్ ముప్పు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిపై ప్రజల్లో భయాందోళనలు పూర్తి తొలగిపోయే పరిస్థితి కనిపించట్లేదు. డెల్టా వేరియంట్లో ఇప్పటివరకు 25 మ్యాటేషన్లను నిపుణులు గుర్తించారు. భారత్‌లోనే కాకుండా, అమెరికా, యూరప్‌తో సహా అనేక దేశాలలో ఈ మ్యూటేషన్ పరివర్తన కొనసాగుతోంది. దీని కారణంగా వైరస్‌లో మరిన్ని మార్పులు సంభవిస్తాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. భారతదేశంలో డెల్టా–4 అనే కరోనా వేరియంట్‌తో థర్డ్ వేవ్ ప్రమాదం ఇంకా తొలగిపోలేదని బయో టెక్నాలజీ విభాగం శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాస్తవానికి దేశంలో డెల్టా–4 వేరియంట్ వ్యాప్తి పెరుగుతోంది. దీనికి సంబంధించి శాస్త్రవేత్తల బృందం హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ నుంచి డెల్టా వేరియంట్లో మ్యూటేషన్లు జరుగుతూనే ఉన్నాయని , ఈ నెల 13వ తేదీన బయోటెక్నాలజీ విభాగం బృందం కేంద్ర ప్రభుత్వానికి అందించిన ఒక నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వేరియంట్లలో మ్యూటేషన్లను గుర్తించేందుకు ఇప్పటివరకు 90,115 నమూనాల జన్యు శ్రేణి పూర్తయిందని, అందులో 62.9 శాతం నమూనాల్లో వైరస్‌కు సంబంధించిన తీవ్రమైన వేరియంట్స్‌ని గుర్తించామని నివేదికలో పేర్కొన్నారు. వీటిలో డెల్టా, ఆల్ఫా, గామా, బీటా, కప్ప వంటి వేరియంట్లు కోవిడ్–19కు సంబంధించిన ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా సోకుతాయని గుర్తించారు. దేశంలో మ్యూటేషన్ సి.1.2 అనే వేరియంట్ కేసు ఇప్పటివరకు గుర్తించలేదని నివేదిక స్పష్టంగా పేర్కొంది. అయితే కరోనా వైరస్‌కు సంబంధించిన డెల్టా, డెల్టాకు సంబంధం ఉన్న ఇతర మ్యూటేషన్లు నిరంతరం జరుగుతున్నాయని తెలిపారు. దీని కారణంగా మహమ్మారి విషయంలో పరిస్థితి ఆందోళనకరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పరీక్షిస్తున్న అనేక నమూనాల్లో డెల్టా–4 మ్యూటేషన్‌ను గుర్తిస్తున్నారు. డెల్టా–1 నుంచి డెల్టా–25 వరకు గుర్తించిన అన్ని మ్యూటేషన్లలో డెల్టా–4 అనే మ్యూటేషన్ చాలా వేగంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం అదే డెల్టా–4 మ్యూటేషన్ మహారాష్ట్ర, కేరళలలో వ్యాపిస్తోంది. రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ వస్తే అందులో డెల్టాలో జరుగుతున్న ఈ మ్యూటేషన్లు కీలకంగా మారుతాయనే ఆందోళనన నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) ప్రకారం, గత నెలలో మహారాష్ట్రలో 44 శాతం మంది, కేరళలో సుమారు 30 శాతం మంది రోగులలో డెల్టా–4 వేరియంట్ కనుగొన్నారు. ప్రస్తుతం డెల్టా –4 వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళనకరమైనదిగా వర్గీకరించింది. అయితే వైరస్‌కు సంబంధించిన ఈ కొత్త మ్యూటేషన్లు కొత్త అంటు వ్యాధులకు కారణం అవుతాయని నిపుణులు భావిస్తున్నారు. యాక్టివ్ కేసులు 0.95% మాత్రమే దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కేంద్రం సోమవారం విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 80.85 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లను అందించారు. దేశంలో గతేడాది మార్చిలో కోవిడ్ కేసులు ప్రారంభమైన తర్వాత మొత్తం పాజిటివ్ కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 0.95 శాతంతో అత్యల్పంగా ఉన్నాయి. దేశంలో గత 183 రోజుల్లో అతి తక్కువగా యాక్టివ్ కేసులు 3,18,181 కు చేరుకున్నాయి. కాగా గత 24 గంటల్లో 30,256 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 295 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,45,133కు చేరుకుంది. -
రాష్ట్రంలో ఐదు రకాల డెల్టా వేరియంట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రెండో వేవ్‌లో నమోదైన కేసుల్లో డెల్టా వేరియంట్‌కు చెందిన ఐదు ఉప రకాలు వ్యాప్తి చెందినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు కరోనా బారినపడ్డ వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. తాజాగా ‘గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా డేటా (జీఐఎస్ఏఐడీ)’లో ఈ వివరాలను పొందుపరిచారు. రాష్ట్రంలో జూలై నాటికి నమోదైన కేసుల్లో 95 శాతం డెల్టా వేరియంట్‌వేనని ఇప్పటికే ప్రకటించగా.. అందులో ఉప రకాల డేటాను ప్రస్తుతం వెల్లడించారు. దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్లో ఏకంగా 13 ఉప రకాలు ఉన్నాయని.. అందులో తెలంగాణలో ఐదు రకాలు ఉన్నాయని గుర్తించినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కువగా ‘ఏవై–12’ వ్యాప్తి జూలైలో నమోదైన కరోనా కేసుల్లో దేశవ్యాప్తంగా అసలైన డెల్టా రకం కేసులు ఎక్కువశాతం ఉండగా.. రాష్ట్రంలో మాత్రం డెల్టా ఉప రకం ‘ఏవై–12’కేసులు అధికంగా నమోదైనట్టు తేలింది. రాష్ట్రంలో ఈ ఉపరకం కేసులు 48 శాతం ఉండగా.. అసలైన డెల్టా కేసులు 31 శాతమే నమోదయ్యాయి. ►తర్వాత నాలుగో రకం (ఏవై–4) డెల్టా కేసు లు 10%, ఆరో రకం 3 శాతం, ఐదో రకం ఒక శాతం, మిగతా అన్ని వేరియంట్లు/ఉప రకాలు కలిపి ఏడు శాతం కేసులు వచ్చాయి. ►హైదరాబాద్‌లో ఒరిజినల్ డెల్టా 45 శాతం, 12వ రకం డెల్టా కేసులు 41 శాతం ఉన్నాయి. ►హైదరాబాద్, గద్వాలలో నాలుగు రకాల డెల్టా ఉప రకాలు ఉండగా.. జగిత్యాల, మహబూబ్‌బాబాద్ జిల్లాల్లో 3 రకాలు వ్యాప్తి చెందాయి. ►జగిత్యాల, జనగాం, గద్వాల, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్‌కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువ శాతం ‘ఏవై–12’రకం కేసులు నమోదయ్యాయి. ►ఒరిజినల్ డెల్టా కేసులు అత్యధికంగా హైదరాబాద్, జగిత్యాల, మేడ్చల్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వచ్చాయి. ►వనపర్తి జిల్లాలో నాలుగో రకం డెల్టా వైరస్ ఉందని తేలింది. రెండు మ్యూటేషన్లతో.. రాష్ట్రంలో అధికంగా వ్యాప్తిలో ఉన్న ‘ఏవై–12’ఉప రకంలో రెండు మ్యూటేషన్లు జరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒరిజినల్ డెల్టాతో పోలిస్తే టీ–33ఆర్, పీ–1162ఏ ప్రొటీన్లు మ్యూటేషన్ చెందాయని వెల్లడించారు. అయితే ఇవి ఏ మేరకు ప్రమాదకరం అన్నదానిపై స్పష్టత లేదని.. పూర్తిస్థాయిలో పరిశోధన చేస్తే, దాని వ్యాప్తి సామర్థ్యం, ప్రమాద తీవ్రత తెలుస్తుందని పేర్కొన్నారు. -
తెలంగాణలో ‘డెల్టా’ కేసులే ఎక్కువ..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా డెల్టా వేరియంట్ రకానివే ఉన్నట్లు తేలింది. క్రమంగా ఈ వేరియంటే స్థిరపడిపోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వేరియంట్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో రోజురోజుకూ డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసుల శాంపిళ్లను శాస్త్రవేత్తలు జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. ఆ వివరాలు తాజాగా గ్లోబల్ ఇన్షియేటివ్ ఆన్ షేరింగ్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా డేటా (జీఐఎస్ఏఐడీ)లో పొందుపరిచారు. అన్ని దేశాల జీనోమ్ సీక్వెన్సింగ్ డేటాను ఇందులోనే అధికారికంగా పొందుపరుస్తారు. ఇందులో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో డెల్టా వేరియంట్ ఏ స్థాయిలో ఉందో ప్రస్తావించడం గమనార్హం. జూలైలో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 95 శాతం డెల్టా వేరియంట్‌వేనని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో జగిత్యాల, జనగాం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, ములుగు, నాగర్‌కర్నూలు, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, వరంగల్ వంటి 14 జిల్లాల్లో నమోదైన కేసులన్నీ డెల్టా వేరియంట్‌వేనని నిర్ధారించారు. హైదరాబాద్‌లో నమోదైన వాటిల్లో 94 శాతం, గద్వాల జిల్లాలో 93%, సూర్యాపేట జిల్లాలో 86% కేసులు డెల్టా రకానివని కనుగొన్నారు. నెలనెలా పెరుగుతున్న తీవ్రత ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో సెకండ్ వేవ్ తీవ్రత పెరిగిన విషయం విదితమే. డెల్టా వేరియంట్ రకం వైరస్ సోకిన రోగులకు తీవ్ర లక్షణాలు కనిపించాయి. దీంతో వారికి రెమిడెసివిర్, స్టెరాయిడ్స్ ఎక్కించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే మరణాలు కూడా అధికంగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 33 శాతం డెల్టా రకానివి ఉండగా, అవి మే నెలలో ఏకంగా 84 శాతానికి పెరిగాయి. జూన్‌లో 86 శాతానికి చేరగా, జూలైలో అదికాస్తా 95 శాతానికి చేరడం గమనార్హం. ఆగస్టులో ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో డెల్టా ప్లస్ కేసులు రెండు నమోదయ్యాయి. డెల్టా రకంతో పోలిస్తే ఇది ప్రమాదకరమా కాదా అన్నదానిపై స్పష్టత లేదు. మహారాష్ట్ర, కేరళలో డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్నాయి. మున్ముందు ఇది మరింత విస్తరించే ప్రమాదముందని హెచ్చరికలు వస్తున్నాయి. థర్డ్‌వేవ్‌లో ఏ రకం వైరస్ విజృంభిస్తుందో ఇంకా స్పష్టత రావడం లేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. టీకానే పరిష్కారం: డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు కరోనాకు సంబంధించి ఎలాంటి వేరియంట్ వచ్చినా జాగ్రత్తలతోనే తిప్పికొట్టాలి. మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవడంతోనే వైరస్‌ను ఎదుర్కోవచ్చు. వీటితోపాటు వ్యాక్సిన్ వేసుకుంటేనే అన్ని రకాల వైరస్‌లకు చెక్ పెట్టొచ్చు. కాబట్టి ప్రజలు టీకా వేయించుకునేందుకు ముందుకురావాలి. రాష్ట్రంలో 12 లక్షల టీకాలు అందుబాటులో ఉన్నాయి. రెండ్రోజులకోసారి రెండు లక్షల టీకా డోసులను కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. కాబట్టి టీకాకు ఎక్కడా కొరతలేదు. -
ఆరువారాల లాక్డౌన్, అయినా లొంగని డెల్టా వేరియంట్
సిడ్నీ: ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టడం లేదు. ముఖ్యంగా శరవేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్‌తో సిడ్ని నగరం విలవిలలాడుతోంది. ఆరు వారాల కఠిన లాక్డౌన్ తర్వాత కూడా రికార్డు స్థాయిల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని అతిపెద్ద నగరం సిడ్నీలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 291కి పెరిగింది. అంతేకాదు పరిస్థితి మరింత దిగజారవచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుత ధోరణి ప్రకారం రోజువారీ కేసు సంఖ్య మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉందని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రీమియర్ గ్లాడిస్ బెరెజిక్లియన్ శుక్రవారం ప్రకటించారు. ఆస్ట్రేలియాలోని మూడు అతిపెద్ద నగరాలతో సహాఇతర ప్రాంతాల్లో కూడా కరోనా మహమ్మారి విధ్వంసం కారణంగా దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మంది లాక్డౌన్లో ఉన్నారు. ఉత్తరాన ఉన్న క్వీన్స్‌ల్యాండ్, పశ్చిమ ఆస్ట్రేలియాలలో కూడా డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా క్వీన్స్‌లాండ్‌లో10, మెల్బోర్న్లో విక్టోరియాలో 6 కొత్త కేసులు నమోదయ్యాయి. సిడ్నీ, మెల్బోర్న్, బ్నిస్బేన్ నగరాల్లో లాక్డౌన్ అమల్లో ఉంది. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆగస్టు 28 వరకు సిడ్నీ లాక్డౌన్ అమల్లో ఉండనుంది. ఒక్క సిడ్నీ నగరంలోనే దాదాపు 50లక్షల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. -
కోవిడ్ మహమ్మారి మళ్లీ విశ్వవిజృంభణ
-
డెల్టా వేరియంట్‌పై షాకింగ్ అధ్యయనం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మూడో వేవ్ ముంచుకొస్తోందన్న ఆందోళన కొనసాగుతున్న తరుణంలో ‘డెల్టా వేరియంట్’ పై తాజా నివేదిక మరింత ఆందోళన పుట్టిస్తోంది. ఇది ఇతర వేరియంట్ల కంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్ను కలిగిస్తుందని, అత్యంత ప్రమాదకరమైన చికెన్‌పాక్స్ కంటే సులభంగా వ్యాప్తి చెందుతుందని యూఎస్ హెల్త్ అథారిటీని ఉటంకిస్తూ అక్కడి మీడియా నివేదించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇంకా ప్రచురితం కాని డేటా ప్రకారం భారతదేశంలో ముందుగా గుర్తించిన డెల్టా వేరియంట్ రెండు డోసులు తీసుకున్న వ్యక్తుల నుంచి బాగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ కథనాలను ప్రచురించాయి. డెల్టా సోకిన వ్యక్తిలో వైరస్ లోడ్ మూములు దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అని తాజా అధ్యయనం తెలిపింది. దీనిపై శుక్రవారం సీడీసి అదనపు డేటాను ఏజెన్సీ ప్రచురిస్తుందని భావిస్తున్నారు. కరోనా వైరస్‌కు చెందిన డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరంగా విస్తరిస్తోందని, వ్యాక్సిన్ల రక్షణ వలయం కూడా దీన్ని అడ్డుకోలేదని, మరింత విధ్వంసకరంగా విజృంభించే ప్రమాదముందని సీడీసీ వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి డెల్టా వేరియంట్ సోకితే, వారి ముక్కు, గొంతులో ఎంత వైరస్ ఉంటుందో, వ్యాక్సిన్ తీసుకోని వారిలో కూడా అంతే వైరల్ లోడ్ ఉంటుందని సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ పీ వాలెన్స్కీ వెల్లడించారు. వైరస్ లోడ్ మూములు దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువనీ, మెర్స్, సార్స్, ఎబోలా, కామన్ కోల్డ్, సీజనల్ ఫ్లూ, స్మాల్ పాక్స్ వైరస్ల కన్నా డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. అలాగే డెల్టా వేరియంట్‌తో చాలా తీవ్రమైన ముప్పు అని వస్తున్న డేటాతో ఆందోళన రేపుతోందని, దీనిపై తక్షణమే గట్టి చర్యలు అవసరమని పేర్కొన్నారు. అందుకే అందరూ ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, సిబ్బంది ఇతరులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వాలెన్స్కీ చెప్పారు. కాగా అమెరికాలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారితో వైరస్ వ్యాప్తి అవుతున్నట్లు తాజాగా తేలింది. దీంతో అందరూ మాస్క్ ధరించాలని సీడీసీ మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. టీకా వైరస్ తీవ్రతను 90 శాతం అడ్డుకున్నప్పటికీ ఇన్ఫెక్షన్ లేదా ట్రాన్స్‌మిషన్‌ను నివారించడంలో తక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చు అని తెలిపింది. డెల్టా వేరియంట్ సోకిన వారిలో ఇతర కేసులతో పోలిస్తే వైరల్ లోడ్ అధికంగా ఉందనీ, ఆల్ఫా వేరియంట్ సోకినవారు గాలిలోకి వదిలే లోడ్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్‌తో గాలిలోకి విడుదలయ్యే వైరల్ లోడ్ పది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు సీడీసీ అంచనా వేసింది. -
జాన్సన్ వ్యాక్సిన్‌కు మరోషాక్ : షాకింగ్ స్టడీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్‌కు సంబంధించి జాన్సన్ అండ్ జాన్సన్‌కు మరో భారీ షాక్ తగిలింది. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ డెల్టా వేరియంట్, ఇతర వేరియంట్లపై సరిగా పనిచేయడంలేదని తాజా నివేదికలో తేలింది ప్రస్తుతం అమెరికాలో మళ్లీ విస్తరిస్తున్న కేసులకు కారణమైందని న్యూయార్క్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం అమెరికాలో ఆమోదించిన మూడు కరోనా వ్యాక్సిన్లను తీసుకున్న వ్యక్తుల నుండి తీసుకున్న రక్త నమూనాలపై నిర్వహించిన పరీక్షల ఆధారంగా ఈ అధ్యయనాన్నినిర్వహించారు ఈ సందర్బంగా జాన్సన్ టీకా సమర్థత 29 శాతం మాత్రమేనని తేల్చారు. ఈ క్రమంలో ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారికి బూస్టర్ డోస్‌లు అవసరమవుతాయని అధ్యయనవేత్తలు సూచించారు. డెల్టా వేరియంట్‌పై ఆస్ట్రాజెనెకా టీకా సింగిల్ డెస్ పనితీరు 33 శాతం సమర్ధతతో పనిచేస్తుంది. రెండు డోసులకు గాను 60 శాతం సమర్ధతతను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో రెండో డోస్ కావాలని అధ్యయనం అంచనా వేసింది. వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ మాట్లాడుతూ, బూస్టర్ షాట్లు అవసరమా అనేదానిపై పరిశోధకులు ఇంకా అంచనా వేస్తున్నారన్నారు. మరోవైపు ఈ వాదనను జే అండ్ జే ప్రతినిధి సీమా కుమార్ తోసి పుచ్చారు. ఇతర కొత్త వేరియంట్లపై తమ టీకా ప్రభావవంతంగా ఉంటుందని స్పష్టం చేశారు. క్లినికల్ ట్రయల్స్‌లో సింగిల్ షాట్ జాన్సన్ వ్యాక్సిన్ మొదటి కరోనా వైరస్‌పై 66శాతం, రెండు-షాట్ల ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు 90శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని తేలాయి. సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ వాలెన్స్కీ మంగళవారం అందించిన సమాచారం అమెరికాలో మొత్తం కేసుల్లో 83 శాతం డెల్టా వేరియంట్ కేసులే. అలాగే అమెరికాలో 13 మిలియన్లకు పైగా జాన్సన్ టీకాను తీసుకున్నారు. కాగా ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన కరోనా వ్యాక్సిన్ పలు విమర్శలొచ్చాయి. జాన్సన్ వ్యాక్సిన్ ఫిబ్రవరిలో ఆమోదం పొందినప్పటి నుండి అనేక సమస్యపై నివేదికలు వెలువడ్డాయి. తీవ్రమైన రక్తం గడ్డకట్టేసమస్యల వివాదంతో ఏప్రిల్‌లో 10 రోజుల విరామాన్ని ప్రకటించింది. ఆ తరువాత ఈ టీకా తీసుకున్న వారిలో అరుదైన నాడీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, గుల్లెయిన్-బారే సిండ్రోమ్ అనే న్యూరోలాజికల్ డిజార్డర్ ప్రమాదం ఉందని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే పాజిటివ్ కేసులు భారీగా పెరిగే ప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 80 శాతానికి పైగా డెల్టా వేరియంట్ (బి.1.617.2) వేనని ఇండియన్ సార్స్–కోవ్–2 జినోమిక్స్ కన్సార్టియం సభ్యుడు డాక్టర్ ఎన్.కె.అరోరా చెప్పారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి డెల్టా వేరియంట్ కారణమని తెలిపారు. మరింత తీవ్రత కలిగిన కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే పాజిటివ్ కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. డెల్టా కంటే ముందు ఆల్ఫా రకం కరోనా పురుడు పోసుకుంది. ఆల్ఫా కంటే డెల్టాకు 40–60 శాతం వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. డెల్టా ఇప్పటికే ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. యూకే, అమెరికా, సింగపూర్ తదితర 100కు పైగా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ఇక డెల్టా ప్లస్ ప్రభావం కూడా భారత్‌లో మొదలయ్యింది. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 55–60 డెల్టా ప్లస్ (ఏవై1. ఏవై.2) వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ఈ రకం కరోనా వ్యాప్తి తీరు, తీవ్రత, వ్యాక్సిన్ నిరోధకతపై అధ్యయనం చేస్తున్నట్లు డాక్టర్ అరోరా వెల్లడించారు. డెల్టా వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌లో మార్పులు (మ్యుటేషన్స్) జరుగుతున్నాయని, తద్వారా వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని సంతరించుకుంటోందని, అంతేకాకుండా మనిషి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతోందన్నారు. -
కరోనా నెమ్మదించలేదు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి నియంత్రణలోకి వస్తోందన్న భావన వద్దని, మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయమిదని డబ్ల్యూహెచ్‌వో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదవుతుండటం, లాక్డౌన్ నిబంధనల సడలింపు, టీకాల కార్యక్రమం మందగమనం, ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం.. ఈ నాలుగు అంశాలు దీనికి కారణమని తెలిపారు. కరోనా పరిస్థితిపై బ్లూమ్‌బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు కీలక అంశాలను వెల్లడించారు. డెల్టా వేరియంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయని, వ్యాధి ఇప్పటికీ వ్యాపిస్తూనే ఉందనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నా యని ఆమె వివరించారు. ‘‘శుక్రవారం ఒక్కరోజే దాదాపు ఐదు లక్షల కొత్త కేసులు నమోదు కాగా.. 9,300 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే మహమ్మారి తగ్గుముఖం పడుతోందని అనే అవకాశమే లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా వర్గీకరించుకున్న ఆరు ప్రాంతాల్లో కనీసం ఐదింటిలో కేసుల సంఖ్య ఎక్కువైంది. ఆఫ్రికా దేశాల్లో అయితే మరణాల రేటు 30–40 శాతం పెరిగింది. డెల్టా వేరియంట్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. కొత్త కేసుల పెరుగుదలలో బ్రెజిల్, ఇండోనేషియా, అమెరికా, యూకేలు ముందు వరసలో ఉన్నాయి. యూరప్‌లో గత వారం రోజుల్లో 32.2 శాతం, తూర్పు మధ్యధరా ప్రాంతంలో 21.2 శాతం, ఆఫ్రికాలో 18.2 శాతం కేసులు పెరిగాయి..’’అని సౌమ్యా స్వామినాథన్ వివరించారు. టీకా ఉత్పత్తి పెంచాలి ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాల కార్యక్రమం మందగిస్తోందని, లాక్డౌన్ నిబంధనల సడలింపు కూడా తోడు కావడంతో సమస్య జటిలమవుతోందని సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ‘‘బ్రిటన్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి కోవిడ్ నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇతర యూరోపియన్ దేశాల్లోనూ దశలవారీగా నిబంధనల ఎత్తివేత కొనసాగుతోంది. ఇది వైరస్ విస్తరణ పెరిగేందుకు కారణమవుతుంది. ప్రపంచ దేశాలు టీకాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాలను ఉచితంగా అందుబాటులో ఉంచడం, స్వచ్ఛందంగా కంపెనీలకు లైసెన్సులు ఇవ్వాలి. ట్రిప్స్ ఒప్పందంలోని కొన్ని అంశాలను అనుకూలంగా మార్చుకుని మేధోహక్కుల రాయితీలివ్వడం వంటి చర్యలు చేపట్టాలి. తద్వారా ఎక్కువ సంఖ్యలో టీకాలు ఉత్పత్తి చేయవచ్చు’’అని సూచించారు. దేశాలు స్థానికంగానే టీకాలు తయారు చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ప్రాణాలు కోల్పోయారు. అంటే మహమ్మారి తగ్గుముఖం పడుతోందని అనే అవకాశమే లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా వర్గీకరించుకున్న ఆరు ప్రాంతాల్లో కనీసం ఐదింటిలో కేసుల సంఖ్య ఎక్కువైంది. ఆఫ్రికా దేశాల్లో అయితే మరణాల రేటు 30–40 శాతం పెరిగింది. డెల్టా వేరియంట్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. కొత్త కేసుల పెరుగుదలలో బ్రెజిల్, ఇండోనేషియా, అమెరికా, యూకేలు ముం దు వరసలో ఉన్నాయి. యూరప్‌లో గత వారం రోజుల్లో 32.2%, తూర్పు మధ్యధరా ప్రాంతంలో 21.2%, ఆఫ్రికాలో 18.2% కేసులు పెరిగాయి..’’అని సౌమ్యా స్వామినాథన్ వివరించారు. టీకా ఉత్పత్తి పెంచాలి ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాల కార్యక్రమం మందగిస్తోందని, లాక్డౌన్ నిబంధనల సడలింపు కూడా తోడు కావడంతో సమస్య జటిలమవుతోందని సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ‘‘బ్రిటన్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి కోవిడ్ నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇతర యూరోపియన్ దేశాల్లోనూ దశలవారీగా నిబంధనల ఎత్తివేత కొనసాగుతోంది. ఇది వైరస్ విస్తరణ పెరిగేందుకు కారణమవుతుంది. ప్రపంచ దేశాలు టీకాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాలను ఉచితంగా అందుబాటులో ఉంచడం, స్వచ్ఛందంగా కంపెనీలకు లైసెన్సులు ఇవ్వాలి. ట్రిప్స్ ఒప్పందంలోని కొన్ని అంశాలను అనుకూలంగా మార్చుకుని మేధోహక్కుల రాయితీలివ్వడం వంటి చర్యలు చేపట్టాలి. తద్వారా ఎక్కువ సంఖ్యలో టీకాలు ఉత్పత్తి చేయవచ్చు’’అని సూచించారు. దేశాలు స్థానికంగానే టీకాలు తయారు చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. -
ప్రపంచంలో కోవిడ్ మరణాలు 40 లక్షలు
వాషింగ్టన్: భారత్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా డెల్టా వేరియెంట్ వివిధ దేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 మరణాలు 40 లక్షలు దాటడం ఆందోళన పెంచుతోంది. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం ప్రపంచ దేశాల్లో కరోనా మృతుల సంఖ్య బుధవారం నాటికి 40 లక్షలు దాటింది. ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి కంటే ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువ. 1982 నుంచి ఇప్పటివరకు జరిగిన యుద్ధాల్లో మరణించిన వారితో ఈ మృతుల సంఖ్య సరిసమానమని ఓస్లోలోని పీస్ రీసెర్చ్ యూనివర్సిటీ అంచనా వేసింది. జనవరి నెలలో రోజుకి ప్రపంచ దేశాల్లో 18 వేలుగా ఉన్న కరోనా మరణాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరమైన తర్వాత 7,900కి తగ్గింది. అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో వ్యాక్సినేషన్ ఉధృతంగా జరిగి కరోనా నుంచి ఉపశమనం లభించిందని భావిస్తున్న తరుణంలో డెల్టా వేరియెంట్ మళ్లీ ఆయా దేశాల్లో విజృంభిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోనే కోవిడ్–19 మరణాలు అధికంగా నమోదయ్యాయి. ప్రతీ ఏడుగురు కరోనా రోగుల్లో ఒకరు మరణించారు. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 6 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత స్థానం బ్రెజిల్‌ది. ఆ దేశంలో 5 లక్షలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. అయితే ఆ దేశం మరణాల సంఖ్యని దాస్తోందన్న ఆరోపణలైతే ఉన్నాయి. కరోనాతో 40 లక్షల మంది మరణించారని రికార్డులు చెబుతున్నప్పటికీ లెక్కల్లోకి రాని వి మరిన్ని ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయాసస్ అన్నారు. వ్యాక్సినేషన్ పెరిగితే మరణాల సంఖ్యని అరికట్టవచ్చునని చెప్పారు. వివిధ దేశాలు లాక్డౌన్ ఎత్తేస్తున్నాయని, ఇది అత్యంత ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నిరుపేద దేశాలకు అండగా ధనిక దేశాలు నిలవాలని విజ్ఞప్తి చేశారు. -
డెల్టా ఉంది.. ల్యామ్డా వచ్చేసింది?
కొత్తా దేవుడండి.. కొంగొత్తా దేవుడండి... అప్పుడెప్పుడో వచ్చిన తెలుగు సినిమా పాట పల్లవిది! ఇప్పుడు తరచూ దీన్ని మార్చి పాడుకోవాల్సిన పరిస్థితి! ఎందుకంటారా? ఏముందీ.. ఇంకో కొత్త కరోనా రూపాంతరితం అవతరించిందట! ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్‌లు ఎక్కడికీ పోలేదు కానీ... పాతికకుపైగా దేశాల్లో ఇప్పుడు ల్యామ్డా కలకలం మొదలైంది! కంగారేమీ లేదు లెండి.. ప్రస్తుతానికి దీంతో ముప్పు తక్కువే. దేశంలో రెండో దశ కరోనాలో విధ్వంసం సృష్టించిన డెల్టా రూపాంతరితం ఇప్పుడు ఇతర దేశాల్లో విజృంభిస్తూంటే.. కొన్ని దేశాల్లో ల్యామ్డా ఆందోళన రేకెత్తిస్తోంది. నిజానికి ఇది కొత్తగా కనుక్కున్న రూపాంతరితం ఏమీ కాదు. గత ఏడాది ఆగస్టులోనే దక్షిణ అమెరికా దేశమైన పెరూలో దీన్ని గుర్తించారు. ఆ తరువాత అది సుమారు 30 దేశాలకు విస్తరిం చింది కూడా. కానీ ఇప్పటివరకూ భారత్‌లో ఈ కొత్త రూపాంతరిత వైరస్ సోకిన వారు ఎవరూ లేరు. గత నెల 14న ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్‌గా ప్రకటించింది. అప్పటివరకూ దీనికున్న సాంకేతిక నామం సి.37. కరోనా వచ్చిన తరువాత గుర్తించిన ఏడవ వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఇది. మనకేమైనా ప్రమాదమా? భారత్‌తోపాటు, మన ఇరుగుపొరగు దేశాల్లోనూ ఇప్పటివరకూ ల్యామ్డా రూపాంతరితాన్ని గుర్తించలేదు. ఆసియా మొత్తమ్మీద ఒక్క ఇజ్రాయెల్‌లోనే దీన్ని గుర్తించారు. అయితే యూరోపియన్ దేశాలు కొన్నింటిలో ఈ వైరస్ ఉన్న కారణంగా, ఆ దేశాల నుంచి భారత్‌కు రాకపోకలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్న నేపథ్యంలో ల్యామ్డాపై కొంచెం జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాక్సీన్లు వేసుకున్న వారికీ ఈ వైరస్ సోకే అవకాశం ఉండటం కొంత ఆందోళన కలిగించే విషయమే. మూక నిరోధకతకు దగ్గరగా ఉన్న యూరోపియన్ దేశాల్లో కూడా మళ్లీ మళ్లీ కేసులు ఎక్కువ అవుతూండటం గమనించాల్సిన అంశం. లక్షణాలేమిటి? ల్యామ్డాను ఇప్పటివరకూ 30 దేశాల్లో గుర్తించారు. డెల్టా రూపాంతరితం మాదిరిగానే వేగంగా వ్యాపిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని రూఢీ చేసేందుకు ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఈ అధ్యయనాలు జరుగుతున్నాయి. పెరూతోపాటు దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో నమోదైన కేసుల్లో ల్యామ్డావే ఎక్కువ. ఒక దశలో పెరూలో నమోదైన కేసుల్లో 80 శాతం ఈ రూపాంతరితానివే కావడం గమనార్హం. ఇటీవలే యునైటెడ్ కింగ్డమ్లో అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ఆరుగురికి ఈ వైరస్ సోకింది. ఫ్రాన్స్, జర్మ నీ, ఇటలీ వంటి యూరోపియన్ దేశాలతోపాటు ఆస్ట్రేలియాలోనూ దీని ఉనికిని గుర్తించారు. జన్యుమార్పులేమిటి? వైరస్ పరిణామ క్రమంలో మ్యుటేషన్లు (జన్యుమార్పులు) సహజం. అయితే ఈ మ్యుటేషన్లు అన్నీ ప్రమాదకరం కాదు. ల్యామ్డా విషయానికి వస్తే దీని కొమ్ము ప్రొటీన్‌లో ఏడు ముఖ్యమైన జన్యుమార్పులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. డెల్టాలో ఈ సంఖ్య మూడు మాత్రమే. కొమ్ము ప్రొటీన్‌లో కీలకమైన మార్పులు జరిగాయి కాబట్టి ఈ వైరస్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుందని, యాంటీబాడీలను (సహజంగా పుట్టేవైనా.. వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఉత్పత్తి అయ్యేవైనా) నిరోధించగలదని కొంతమంది అంచనా వేస్తున్నారు. చిలీలో ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ల్యామ్డా రూపాంతరితం యూకే, బ్రెజిల్‌లలో ముందుగా గుర్తించిన ఆల్ఫా కంటే ఎక్కువ నిరోధకత (యాంటీబాడీలకు) కలిగి ఉన్నట్లు తెలిసింది. చైనా వ్యాక్సిన్ సైనోవ్యాక్కు ల్యామ్డా స్పందించడం లేదని కూడా స్పష్టమైంది. అయితే పూర్తిస్థాయి అంచనాకు వచ్చేందుకు మరింత విస్తృత స్థాయిలో ఈ రూపాంతరితం తాలూకూ జన్యుక్రమాలను నమోదు చేసి పరిశీలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘డెల్టా’పై టీకాల ప్రభావం అంతంతే!
న్యూఢిల్లీ: డెల్టా వేరియంట్ (బి.1.617.2).. ఇప్పుడు ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తున్న కరోనా మహమ్మారిలోని కొత్తరకం ఇది. మరోవైపు కరోనా నియంత్రణ కోసం టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, ఈ టీకాలు చైనాలోని వూహాన్లో పుట్టిన ఒరిజినల్ వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా 8 రెట్లు తక్కువ ప్రభావం చూపుతున్నట్లు ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయన్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిరక్షకాలు కరోనా దాడిని అడ్డుకుంటాయి. డెల్టా వేరియంట్‌పై టీకాల వల్ల ఉత్పత్తి అయిన యాంటీబాడీలు 8 రెట్లు తక్కువగా స్పందిస్తున్నట్లు గుర్తించారు. సర్ గంగారాం హాస్పిటల్ సహా దేశంలో మూడు కేంద్రాల్లో వంద మందికిపైగా హెల్త్‌కేర్ వర్కర్లపై ఈ అధ్యయనం నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలోనూ డెల్టా వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు గమనించారు. అంటే కరోనా టీకాలు డెల్టాపై పెద్దగా ప్రభావం చూపడం లేదన్నమాట. డెల్టా రకం కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళనకరమైన వేరియంట్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. నాన్–డెల్టా ఇన్ఫెక్షన్లతో పోలిస్తే డెల్టాలో వైరల్ లోడ్ అధికం. వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉంది. ఇది డామినెంట్ (ఆధిపత్య) వేరియంట్‌గా డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించింది. -
బైడెన్ అట్టర్ ఫ్లాప్!
వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే పాలనాపరమైన దూకుడును ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై.. ఇప్పుడు విమర్శలు మొదలయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో టార్గెట్ మిస్ అయ్యాడంటూ బైడెన్‌ను ఉతికి ఆరేస్తున్నారు ప్రత్యర్థులు. వాషింగ్టన్: ఎన్నికల వాగ్ధానాల్లో.. అధ్యక్షుడిగా అధికారంలోకి రాగానే బైడెన్ చేసిన కీలక ప్రకటన.. అమెరికన్లకు వ్యాక్సిన్ డోసులు అందించడం. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 70 శాతం అమెరికన్లను(పెద్దలకు..27 ఏళ్లు పైబడిన వాళ్లు) వ్యాక్సిన్ డోసులు అందిస్తానని ప్రమాణం చేశాడు. అందుకే తగ్గట్లే తొలినాళ్లలో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లతో డ్రైవ్ జోరు మాములుగా కనిపించలేదు. అయితే.. ఈ ప్రణాళికలో బైడెన్ టార్గెట్‌ను చేరుకోలేదని తెలుస్తోంది. జులై 3 నాటి ఫాక్స్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. 67 శాతం పెద్దలకు మాత్రమే ఇప్పటిదాకా వ్యాక్సిన్ అందినట్లు సమాచారం. అయితే అమెరికాకే చెందిన మరో రెండు ప్రముఖ దినపత్రికలు మాత్రం అది 60 శాతం లోపే ఉందని కథనాలు వెలువరించడం విశేషం. ఇక దాదాపు 35 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో.. 15.7 కోట్ల మందికి పూర్తి డోసులు, 18.2 కోట్ల మందికి ఒక్క డోసైన అంది ఉంటుందని మీడియా గణాంకాలు చెప్తున్నాయి. మరోవైపు.. ఇతర దేశస్తులకు వ్యాక్సిన్లు డోసులు అందినప్పటికీ, వాటిలో చాలావరకు లెక్కలకు తీసుకోకపోవడం.. ఈ కారణం వల్లే అమెరికన్లను డోసులు పూర్తిగా అందలేదని, పైగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లెక్కల్లో గందరగోళం నెలకొందని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రా నుంచి పూర్తి స్థాయిలో నివేదికలు అందలేదన్న వైట్‌హౌజ్ ప్రతినిధి వ్యాఖ్యలతో మీడియా కథనాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. కరోనా యుద్ధం ముగియలేదు నన్ను తప్పుగా అనుకోకండి.. కరోనాతో యుద్ధం ఇంకా ముగియలేదు. డెల్టా లాంటి రకరకాల వేరియెంట్లు పుట్టుకొస్తున్నాయి అని అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించాడు. వెయ్యి మంది అతిథుల మధ్య వైట్ హౌజ్‌లోని జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘245 ఏళ్ల క్రితం బ్రిటిష్‌చెర నుంచి స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం. అలాగే ఇవాళ ప్రమాదకరమైన కరోనా వైరస్ నుంచి విముక్తి కోసం పోరాటంలో చివరి దశకు చేరుకున్నాం. పోరాటం ఆపొద్దు. వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలి’’ అని జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు బైడెన్. మరోవైపు అమెరికా వ్యాప్తంగా సంబురాలు మాత్రం అంబురాన్ని అంటాయి. మాస్క్‌లు లేకుండా గుంపులుగా జనాలు వేడుకలు చేసుకున్నారు. పబ్‌లలో, బీచ్‌లలో కోలాహలం కనిపించింది. ఇక భారత ప్రధాని మోదీ సహా పలు దేశాల అధినేతలు అమెరికన్లను శుభాకాంక్షలు తెలియజేశారు. Warm felicitations and greetings to @POTUS @JoeBiden and the people of the USA on their 245th Independence Day. As vibrant democracies, India and USA share values of freedom and liberty. Our strategic partnership has a truly global significance. — Narendra Modi (@narendramodi) July 4, 2021 -
డెల్టాపై కోవాగ్జిన్ ప్రభావం 65%
హైదరాబాద్: కోవిడ్ 19 వైరస్ వేరియంట్లపై భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ చూపే ప్రభావం మదింపు గణాంకాలను కంపెనీ వెల్లడించింది. ఫేజ్ 3 ప్రయోగాల విశ్లేషణ అనంతరం కోవాగ్జిన్ టీకా సింప్టమాటిక్ కోవిడ్– 19కు వ్యతిరేకంగా 77.8 శాతం, డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా 65.2 శాతం రక్షణ కల్పిస్తుందని తెలిపింది. ఈ టీకా తీసుకున్న 12 శాతం మందిలో సాధారణ సైడ్ ఎఫెక్టులు, 0.5 శాతం మందిలో సీరియస్ సైడ్ ఎఫెక్టులు సేఫ్టీ అనాలసిస్ తెలియజేసిందని కంపెనీ వెల్లడించింది. లక్షణాల్లేని కోవిడ్‌కు వ్యతిరేకంగా టీకా 63.6 శాతం రక్షణనిస్తుందని తెలిపింది. సెకండ్ డోస్ ఇచ్చిన రెండువారాల పాటు దాదాపు 25 నగరాల్లో ఫేజ్ 3 ట్రయల్స్‌ను నిర్వహించారు. టీకా ట్రయల్స్‌తో నూతన ఆవిష్కరణలో ఇండియా సత్తా వెల్లడయిందని కంపెనీ సీఎండీ కృష్ణ ఎల్లా చెప్పారు. ఐసీఎంఆర్ సహకారంతో కంపెనీ ఈ టీకా తయారు చేసింది. టీకా ట్రయల్స్ ఫలితాలపై ఐసీఎంఆర్ సంతృప్తిని వ్యక్తం చేసింది. అన్ని రకాల వేరియంట్లపై కోవాగ్జిన్ ప్రభావం చూపుతుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ భార్గవ చెప్పారు. ప్రపంచ టీకా ఉత్పత్తి రంగంలో భారత స్థానాన్ని కోవాగ్జిన్ మరింత బలోపేతం చేసిందన్నారు. వ్యాక్సిన్ డోసులు @ 34.46 కోట్లు సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోస్‌ల సంఖ్య 34.46 కోట్లు దాటింది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 45,60,088 శిబిరాల ద్వారా 34,46,11,291 డోసుల పంపిణీ జరిగింది. గత 24 గంటల్లో 43,99,298 వ్యాక్సిన్ డోస్‌లను అందించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 44,111 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 6 రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 50వేలలోపు నిర్ధారణయ్యాయి. కోవిడ్ బారినపడి ఒక్క రోజులోనే మరో 738 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 4,01,050కు పెరిగాయి. అదే సమయంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కరోనా రోగుల సంఖ్య 4,95,533కు చేరింది. 97 రోజుల తరువాత ఈ సంఖ్య 5 లక్షల లోపుకు పడిపోయింది. గత 24 గంటల్లోనే కరోనా చికిత్సలో ఉన్న వారి సంఖ్య 14,104కు తగ్గింది. మరోవైపు కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 51 రోజులుగా కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటివరకూ కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు 2,96,05,779 మంది కాగా, గత 24 గంటల్లో 57,477 మంది కోలుకున్నారు. అంతకు ముందురోజు కంటే 13,366 మంది అదనంగా కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి శాతం 97.06కు పెరిగింది. -
కరోనా వేరియంట్లపై ‘డెల్టా’దే ఆధిపత్యం
ఐరాస/జెనీవా: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల్లో కోవిడ్–19 వైరస్ డెల్టా వేరియంట్ వ్యాప్తిలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలియజేసింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఈ వేరియంట్ రాబోయే రోజుల్లో ఆధిపత్య (డామినెంట్) వేరియంట్‌గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2021 జూన్ 29 నాటికి 96 దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు బయటపడ్డాయని తెలిపింది. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని పేర్కొంది. కరోనా వేరియంట్లను గుర్తించేందుకు అవసరమైన సీక్వెన్సింగ్ కెపాసిటీ చాలా దేశాల్లో పరిమితంగానే ఉందని వివరించింది. డెల్టా రకం కరోనా వల్ల పాజిటివ్ కేసులతోపాటు ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య పెరుగుతోందని వివరించింది. డెల్టా వ్యాప్తి తీరును గమనిస్తే ఇది రాబోయే కొన్ని నెలల్లో ఇతర అన్ని కరోనా వేరియంట్లను అధిగమించే పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణ విషయంలో ప్రస్తుతం పాటిస్తున్న జాగ్రత్తలు, అమలు చేస్తున్న చర్యలు డెల్టాతో సహా ఆందోళనకరమైన వేరియంట్ల(వీఓసీ) నియంత్రణకు సైతం చక్కగా ఉపయోగపడుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్ల డించింది. ఆందోళనకరమైన వేరియంట్ల వ్యాప్తి పెరుగుతోందంటే అర్థం నియంత్రణ చర్యలను దీర్ఘకాలం కొనసాగించడమేనని తేల్చిచెప్పింది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించింది. నియంత్రణ చర్యలను గాలికొదిలేయడం వల్లే.. ఇప్పటివరకు గుర్తించిన కరోనా వేరియంట్లలో డెల్టా రకం వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్‌గా గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అడానోమ్ ఘెబ్రెయెసుస్ గతవారమే ప్రకటించారు. కరోనా వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతున్న దేశాల్లో ఇది అమిత వేగంతో వ్యాప్తి చెందుతోందని చెప్పారు. ఈ పరిణామం పట్ల ప్రపంచ దేశాలతోపాటు తాము కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. కొన్ని దేశాలను కరోనా ఆంక్షలను సడలించాయని, నియంత్రణ చర్యలను గాలికొదిలేశాయని, దీనివల్లే ప్రమాదకర వేరియంట్లు పంజా విసురుతున్నాయని పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం.. అల్ఫా వేరియంట్ కేసులు 172 దేశాల్లో బయటపడ్డాయి. బీటా వేరియంట్ ఉనికి 120 దేశాల్లో వెలుగు చూసింది. ఇక గామా వేరియంట్ 72 దేశాల్లో, డెల్టా వేరియంట్ 96 దేశాల్లో వ్యాప్తి చెందుతున్నాయి.