
జెట్ ఎయిర్‌వేస్‌లో డెల్టాకు వాటాల విక్రయం!
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ .. అమెరికాకు చెందిన ఎయిర్‌లైన్స్ కంపెనీ డెల్టాకు 24 శాతం దాకా వాటాలు విక్రయించనున్నట్లు సమాచారం. కొత్తగా షేర్ల జారీ ద్వారా ఈ డీల్ ఉండగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాటాల విక్రయం ద్వారా జెట్ ఎయిర్‌వేస్ సుమారు రూ. 2,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోన్నట్లు తెలుస్తోంది.
ఈ ఒప్పందం సాకారం కావాలంటే ఎతిహాద్ నుంచి కుడా జెట్ ఎయిర్‌వేస్ ఆమోదముద్ర పొందాల్సి ఉంటుంది. డీల్ పూర్తయితే ఎతిహాద్ తన 24 శాతం వాటాను స్థిరంగా కొనసాగించుకునేందుకు మరిన్ని నిధులు సమకూర్చాల్సి ఉండనుండటమే ఇందుకు కారణం. వాటా విక్రయం వార్తల నేపథ్యంలో సోమవారం బీఎస్‌ఈలో జెట్ ఎయిర్‌వేస్ సుమారు షేరు 3 శాతం పెరిగి దాదాపు రూ. 583 వద్ద ముగిసింది.