ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు పొంగి పొర్లు తున్నాయి.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు పొంగి పొర్లు తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు డెల్టాకు 4800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 7.42 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో 7.38గా ఉంది. బ్యారేజీ వద్ద వరద నీరు 9.3 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.