Dhavalesvaram
-
ఎల్లో మీడియా డ్రామా.. తుస్సుమనిపించిన అధికారులు
తూర్పుగోదావరి, సాక్షి: ధవళేశ్వరంలో పొలవరం ఆర్ అండ్ ఆర్ కార్యాలయం వద్ద ఫైల్స్ దగ్ధం అంటూ ఉద్దేశపూర్వక కథనాలతో ఎల్లో మీడియా హడావిడి చేసింది. అయితే దీనిపై అధికారులు వివరణ ఇచ్చి గాలి తీసేశారు. అవి ఫైల్స్ కావని, పనికిరాని కాగితాలని, వాటి మీద వచ్చిన కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికారులు వివరణ ఇచ్చారు.‘‘పోలవరం ఎల్ఎంసీ కార్యాలయంలో బీరువాల్లో నిరుపయోగమైన కాగితాలను మాత్రమే బయటపడేశాం. ఈ పేపర్లు ఆర్ అండ్ ఆర్ కు ఏ మాత్రం సంబంధించినవి కావు. సిబ్బంది తగలబెట్టిన కాగితాలు ఉపయోగం లేనివి మాత్రమే. అని ఆర్ అండ్ ఆర్ స్పెషల్ కలెక్టర్ సరళ తెలిపారు. అయితే పనికి రానివే అయినా అలా తగలబెట్టడం కరెక్ట్ కాదని ఆర్డీవో కేఎన్ జ్యోతి అంటున్నారు. ‘‘అవి ముమ్మాటికీ నిరుపయోగమైనవే. అవి ఫైల్స్ కావు. అన్ని సైన్ లేని జిరాక్స్ కాపీలు మాత్రమే. కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్నాయని బయటపడేసి దహనం చేశారు. అయితే అలా నిరుపయోగమైన కాగితాలను సైతం బహిరంగంగా కాల్చకూడదు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని ఆర్డీవో జ్యోతి తెలిపారు.అనుమానాస్పద రీతిలో కాలి బూడిదైన ఫైల్స్ అంటూ.. సగం కాలిన పేపర్ల ఫొటోలతో ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కూటమి అనుకూల మీడియా ఛానెల్స్ కథనాలు ఇచ్చాయి. అవి పోలవరం ఎడమ కాలువ భూ పరిహారం ఫైల్స్ అంటూ అందులో రాసుకొచ్చాయి. అధికారులు విషయం బయటకు చెప్పట్లేదని.. పోలీసులు వచ్చారంటూ ఊదరగొట్టాయి. ఈలోపు.. మీడియా ముందుకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్‌కు భద్రత లేకుండా పోయిందని.. వైఎస్సార్సీపీ హయాంలోని ఫైల్సే తగలబడి పోతున్నాయంటూ అసలు విషయం తెలియకుండా ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు. చివరకు అధికారుల వివరణతో ఎల్లో మీడియా డ్రామా అంతా ఉత్తదేనని తేలింది. -
అఖండ గోదావరి!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నది ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ బ్యారేజీ నుంచి తెలంగాణ మీదుగా దిగువన ఏపీలోని ధవళేశ్వరం దాకా నిండుగా ప్రవహిస్తుండటం.. మొత్తం అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో.. అఖండ గోదావరిగా మారింది. బాబ్లీ బ్యారేజీ నుంచి 2,92,889 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తేసి 2.74 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండటంతో 2,40,196 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ వరదకు స్థానిక ప్రవాహాలు చేరి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఏకంగా 7,40,951 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక్కడ 7,12,294 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీటికి దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, ఇతర ఉపనదులు, వాగులు తోడై.. గోదావరిలో 12 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది. సరస్వతి (అన్నారం), లక్ష్మి (మేడిగడ్డ), సమ్మక్క (తుపాకులగూడెం), సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం) బ్యారేజీలకు వస్తున్న నీటిని వచ్చినట్టు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద అప్రమత్తం భద్రాచలం వద్ద గురువారం ఉదయం నీటి మట్టం 50.5 అడుగులకు పెరగడంతో ఆందోళన వ్యక్తమంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తర్వాత వరద తగ్గి.. రాత్రి 9 గంటలకు 11,77,133 క్యూసెక్కుల వరదతో 48.70 అడుగుల నీటిమట్టం నమోదైంది. అయితే ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో నీటి మట్టం శుక్రవారం సాయంత్రానికి భారీగా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా నదికి జలకళ మహారాష్ట్ర, కర్ణాటకలలో విస్తారంగా వానలతో కృష్ణానది జలకళ సంతరించుకుంది. ఎగువన ఆల్మట్టి డ్యామ్ నుంచి 1.75 లక్షల క్యూసెక్కులను, నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.18 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరద జూరాల ప్రాజెక్టుకు చేరుతుండటంతో ఈ సీజన్లో తొలిసారి ఏడు గేట్లు ఎత్తారు. దీంతోపాటు విద్యుదుత్పత్తి కూడా చేస్తూ.. మొత్తం 70,422 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి స్థానిక ప్రవాహం కలసి శ్రీశైలం ప్రాజెక్టులోకి 71 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం వస్తోంది. ఇక్కడ నీటి నిల్వ 39.2 టీఎంసీలకు చేరింది. దిగువన మూసీ నుంచి వరదతో పులిచింతలలో నీటి నిల్వ 21.88 టీఎంసీలకు చేరుకుంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర డ్యామ్‌కు 1,11,566 క్యూసెక్కుల వరద వస్తోంది. కాళేశ్వరం వద్ద టెన్షన్ టెన్షన్! గురువారం అర్ధరాత్రి కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 11 లక్షల క్యూసెక్కులతో, 105.1 మీటర్లకు పెరగడం ఆందోళన రేపుతోంది. శుక్రవారం ఉదయానికి నీటి మట్టం మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేశారు. గత ఏడాది జూలై మూడో వారంలో గోదావరికి భారీ వరదలు వచ్చి.. కాళేశ్వరం వద్ద నీటి మట్టం 108.19 మీటర్లకు పెరిగింది. మేడిగడ్డ, అన్నారం పంపుహౌజ్‌లు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పట్లో మేడిగడ్డకు ఏకంగా 26,79,260 క్యూసెక్కుల అతిభారీ వరద వచ్చి బ్యారేజీ గేట్లపై నుంచి పొంగిపొర్లింది. -
వరద ఉధృతి: మొదటి ప్రమాద హెచ్చరిక
సాక్షి, తూర్పుగోదావరి: గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఇరిగేషన్ శాఖ అధికారులు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు అధికం కావడంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వస్తున్న మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 11.75 అడుగుల నీటిమట్టం నమోదు కావడంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న గోదావరి వరద నీటిని సుమారు పది లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలాగే తూర్పు డెల్టా కాలువలకు 2,500 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు మూడు వేల క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 7,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలావుంటే భద్రాచలం వద్ద 45.10 అడుగుల నీటిమట్టం నమోదు అయ్యింది. గోదావరి ఎగువ ప్రాంతంలోని కాలేశ్వరం వద్ద 9.17 మీటర్లు, పేరూరు వద్ద 11.70, దుమ్ముగూడెం వద్ద 12.52, భద్రాచలం వద్ద 45.10 అడుగులు, కూనవరం వద్ద 18.30 మీటర్లు, కుంట వద్ద 12.94 మీటర్లు, కొయిదా వద్ద 23.15మీటర్లు, పోలవరం వద్ద 12.94, రాజమహేంద్రవరం రైల్వే హేక్ బ్రిడ్జి వద్ద 16.23 మీటర్ల తో వరద గోదావరి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో ఉన్న గోదావరి ఉప నదుల నుంచి నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి నీటి ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. -
తగ్గని గోదా'వడి'
సాక్షి, అమరావతి/నెట్వర్క్: గోదావరిలో వరద ప్రవాహ తీవ్రత కొనసాగుతోంది. సోమవారం వేకువజామున 5 గంటలకు ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 13.70 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. క్రమేపీ తగ్గుతూ రాత్రి 7 గంటలకు 12.50 అడుగులకు చేరుకుంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 100 టీఎంసీలను సముద్రంలోకి వదిలారు. గడచిన ఐదు రోజుల్లో 500 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ధవళేశ్వరం, దాని దిగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గినా.. ఎగువన భద్రాచలం వద్ద పెరుగుతుండటంతో మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీని ప్రభావంతో మంగళవారం ధవళేశ్వరం వద్ద వరద తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి గోదావరి జిల్లాల ప్రజలను కలవరపెడుతోంది. ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు గోదావరిలోకి ఉప్పొంగి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6.40 గంటలకు భద్రాచలంలో నీటిమట్టం 43 అడుగులకు చేరింది. తూర్పు గోదావరి జిల్లా చింతూరు వద్ద 37.6 మీటర్లు, కూనవరం వద్ద 37.32 మీటర్లు, పోలవరం వద్ద 27.2 మీటర్లకు చేరింది. పోలవరం కాఫర్ డాŠయ్‌మ్ వద్ద వరద నీటి మట్టం 27.2 మీటర్లకు చేరడంతో.. స్పిల్‌వే మీదుగా రెండు మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 18 మండలాల పరిధిలోని 202 గ్రామాలను వరద ముంచెత్తింది. ఆ జిల్లాలో 87,850 మంది వరద వల్ల ఇబ్బందులు పడుతుండగా.. ఇప్పటివరకు 18,809 మందిని 85 పునరావాస కేంద్రాలకు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 22 మండలాల్లోని 218 గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. 26,047 మందికి సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. తూర్పు ఏజెన్సీ, కోనసీమ లంక గ్రామాలు నాలుగు రోజులుగా ముంపులోనే ఉండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మామిడికుదురు, పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం మండలాల పరిధిలో సుమారు 15 లంక గ్రామాలకు సైతం బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎమ్మెల్యే, అధికారులకు తప్పిన ప్రమాదం పోలవరం మండలంలోని ముంపు గ్రామాల ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేందుకు వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు, అధికారులకు తృటిలో ప్రమాదం తప్పింది. వారు పోశమ్మగండి నుంచి టూరిజం బోటులో వెళ్తుండగా.. మూలపాడు వద్ద కొండపక్క వరద ప్రవాహంలో చిక్కుకున్న బోటు ఒక్కసారిగా ఊగిపోతూ నదిలో కిందకు దిగిపోయింది. బోటును నది మధ్య నుంచి వాడపల్లి వైపు మళ్లించటంతో ప్రమాదం తప్పింది. కమీషన్ల కక్కుర్తే కొంప ముంచింది పోలవరం ప్రాజెక్ట్‌లో కమీషన్ల కోసం కక్కుర్తిపడి నిర్వాసితులను గాలికొదిలేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల్లో వరదలకు కారణమయ్యారని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆక్షేపించారు. చంద్రబాబు పాపాలకు ప్రతిఫలమే ఈ వరదలన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్లే వరదలు వచ్చిపడ్డాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ముంపుబారిన పడిన గిరిజన గ్రామాల్లో సోమవారం మంత్రుల బృందం పర్యటించింది. జల దిగ్బంధంలో చిక్కుకున్న వీరవరం గ్రామానికి ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నాగులాపల్లి ధనలక్ష్మి, యువజన అధ్యక్షుడు అనంతబాబు, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం అస్మి ట్రాక్టర్లపై వెళ్లి పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. మరోవైపు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆచంట మండలంలో ముంపుబారిన పడిన అనగారలంక, పెదమల్లంలంక, పల్లిపాలెం, అయోధ్యలంక, పుచ్చలంక, రాయిలంకల్లో అధికారులతో కలిసి పర్యటించారు. 1,684 కుటుంబాల వారికి ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కందిçపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పామాయిల్ పంపిణీ చేశారు. శ్రీశైలం వద్ద పెరిగిన ప్రవాహం శ్రీశైలం జలాశయంలోకి సోమవారం వరద ప్రవాహం మరింత పెరిగింది. సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 2,36,331 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 42,378 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హంద్రీ–నీవా ద్వారా 1,200 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 863.8 అడుగుల మేర 118.05 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా విడుదల చేస్తున్న జలాల్లో 42,378 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌లోకి చేరుతున్నాయి. ప్రస్తుతం సాగర్‌లో 506.8 అడుగులతో 126.30 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మహాబలేశ్వర్ పర్వతాల్లో 38 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. దీంతో మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించిన నేపథ్యంలో.. కర్ణాటక సర్కార్ ముందు జాగ్రత్తగా ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో నీటి నిల్వలను ఖాళీ చేస్తూ భారీగా జలాలను దిగువకు విడుదల చేస్తోంది. కృష్ణా ప్రధాన ఉప నదులలో ఒకటైన బీమా ఉప్పొంగుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 1.60 లక్షల క్యూసెక్కుల వరద ఉజ్జయిని ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. ఉజ్జయిని గేట్లు అర్ధరాత్రి దాటాక ఎత్తే అవకాశం ఉంది. -
గోష్పాద క్షేత్రంలోకి ప్రవేశించిన వరద
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం మధ్యాహ్నానికి ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 13.20 అడుగులకు చేరటంతో 12లక్షల ఏడు వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. గోష్పాదక్షేత్రంలోకి వరదనీరు ప్రవేశించింది. ఇప్పటికే స్నానఘట్టాలు నీట మునిగాయి. -
ఏజెన్సీలో భారీ వర్షం - పొంగుతున్న కొండవాగులు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు పొంగి పొర్లు తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు డెల్టాకు 4800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 7.42 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో 7.38గా ఉంది. బ్యారేజీ వద్ద వరద నీరు 9.3 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
పెరుగుతున్న గోదావరి వరద
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండంతో.. ఆదివారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉదృతి పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 5,81, 000 క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 5,80,000 క్యూసెక్కులు ఉంది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. అధికారులు డెల్టాకు నీటిని విడుదల చేశారు. బ్యారేజీ వద్ద నుంచి 6,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని తెలిపారు. -
సకాలంలో స్పందించిన యంత్రాంగం
రాజమండ్రి రూరల్ : ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 22 మందిని బలిగొన్న దుర్ఘటనపై అధికార యంత్రాంగం సకాలంలో స్పందించింది. ప్రమాదం గురించి తెలియగానే అర్బన్ జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని చర్యలు చేపట్టారు. ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ శివాజీరాజు, ఎస్సైలు, సిబ్బంది బ్యారే జ్ కిందకు దిగి తుఫాన్ వ్యాన్‌లో చిక్కుకున్న మృతదేహాలను స్థానిక మత్స్యకారుల సహకారంతో బయటకు తీశారు. తుఫాన్ వ్యాన్ ఏపీ 31టీసీ3178 నెంబరు ఆధారంగా విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మోసయ్యపేట ప్రాంతానికి చెందిన ఈగల అప్పారావు కుటుంబ సభ్యులుగా గుర్తించి వెంటనే విశాఖపట్నం పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆదేశాల మేరకు రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయరామరాజు ఆధ్వర్యంలో రూరల్ తహాశీల్దార్ జి.భీమారావు, రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని వివరాలను సేకరించి, విశాఖ జిల్లా రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అంతేకాక ఉదయం 05.30 గంటలకు సంఘటన గురించి తెలియగానే మృతదేహాలకు సంబంధించిన బంగారు ఆభరణాల వివరాలు, ఇతరాల నమోదును పూర్తిచేసి రాజమండ్రిప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసు సిబ్బంది మృతదేహాలను చేతులతో ఎత్తుకుని బయటకు బ్యారేజ్ దిగువ నుంచి తీసుకువచ్చారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం సమయంలో కూడా అర్బన్ జిల్లా పోలీస్ సిబ్బంది, రాజమండ్రి డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్వోలు శవ పంచనామాలు వేగంగా పూర్తిచేసి త్వరితగతిన మృతదేహాలను బంధువులకు అప్పగించగలిగారు. జరిగిన విషాదం ఎవరూ సరిచేయగలిగింది కాకపోరుునా.. అవసరమైన చర్యలను సకాలంలో, సమర్థంగా నిర్వర్తించిన పోలీసు, రెవెన్యూ శాఖలు, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సిబ్బందిని మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. కేసు నమోదు ధవళేశ్వరం : బ్యారేజ్‌పై జరిగిన ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసినట్టు ధవళేశ్వరం సీఐ శివాజీరాజు తెలిపారు. ధవళేశ్వరం వీఆర్ఓ కర్రి భానుజ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రెండేళ్ల బాలికపై లైంగికదాడికి యత్నం
ధవళేశ్వరం : రెండేళ్ల బాలికపై లైంగికదాడికి యత్నించిన ఘటన ధవళేశ్వరంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ముస్లింవీధిలోని ఓ రెండేళ్ల బాలిక శనివారం ఇంటిబయట ఆడుకుంటుండగా, సమీపంలో నివసిస్తున్న కుంది అప్పారావు ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నించాడు. పాపకు స్నానం చేయించేందుకు ఆమె తల్లి చూడగా కనిపించకపోవడంతో చుట్టుపక్కల ఆరా తీశారు. అప్పారావు బాలికను తీసుకువెళ్లినట్టు మరో యువకుడు చెప్పడంతో అక్కడకు వెళ్లిన తల్లికి అప్పారావు లైంగిక దాడికి యత్నించడం కనిపించింది. దీంతో అతని వద్ద నుంచి బాలికను లాక్కుని తీసుకొచ్చేసి పోలీసులకు ఫిర్యాదుచేశారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధవళేశ్వరం సీఐ శివాజీరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.