న్యూఢిల్లీ: దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి ఢిల్లీ-ఎన్‌సీఆర్ రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లోకి పెద్ద మొత్తంలో వరదనీరు వచ్చి చేరింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు హస్తినాను స్తంభింపజేశాయి.
చాలా కాలనీల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రాకపోకలపై ప్రతికూల ప్రభావం చూపింది. చాలా విమాన సర్వీసుల్లో జాప్యం చోటుచేసుకొంది. మరో వారం రోజులపాటు ఇక్కడ వాతావరణం మేఘావృతమై ఉంటుందని అధికారులు వెల్లడించారు. జూన్ 30వ తేదీన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
అయితే సాధారణ పౌరులతో పాటు రాజకీయ నేతలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపపథ్యంలో ఢిల్లీలో ఉన్న పలువురు ఎంపీల నివాసాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇంటి చుట్టుపక్కల నీరు నిలిచిపోయింది.
కాగా తన ఇల్లంతా వర్షపు నీటితో నిండిపోయినట్లు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు. ఇంట్లో అడుగు ఎత్తు నీరు చేరిపోయిందని. ప్రతి గదిలో కార్పెట్‌లు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయని చెప్పారు. చుట్టుపక్కలా ఉన్న కాలువలు అన్నీ మూసుకుపోయాయని, నీరు వెళ్లడానికి స్థలం లేదని అన్నారు. అంతేగాక కరెంట్ షాక్ వస్తుందనే ఉద్ధేశంతో ఉదయం 6 గంటల నుంచి అధికారులు విద్యుత్‌ను నిలిపివేసినట్లు తెలిపారు. అయితే, రోడ్లపై నుంచి నీటిని తొలగిస్తున్నారని, తాను సకాలంలో పార్లమెంటుకు చేరుకోగలిగానని థరూర్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
This is the corner just outside my home in Lutyens’ Delhi. Woke up to find my entire home under a foot of water — every room. Carpets and furniture, indeed anything on the ground, ruined. Apparently the storm water drains in the neighbourhood are all clogged so the water had no… pic.twitter.com/mublEqiGqG
— Shashi Tharoor (@ShashiTharoor) June 28, 2024
మరోవైపు భారీ వర్షాలతో లోధి ఎస్టేట్ ప్రాంతంలోని తన బంగ్లా వెలుపల రహదారి జలమయం కావడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటిముంందు ఉన్న నీటిలో నుంచి కారు వద్దకు సిబ్బంది తనను సిబ్బంది ఎత్తుకొని తీసుకువచ్చారు. తన బంగ్లా మొత్తం జలమయమైందని ఎంపీ తెలిపారు. రెండు రోజుల క్రితమే ఫ్లోరింగ్ పూర్తి చేశాం.. లక్షల్లో నష్టం వాటిల్లిందని తెలిపారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
#WATCH | Delhi: SP MP Ram Gopal Yadav being helped by members of his staff and others to his car as the area around his residence is completely inundated.
Visuals from Lodhi Estate area. pic.twitter.com/ytWE7MGbfY— ANI (@ANI) June 28, 2024
ఢిల్లీ జల మంత్రి అతిషి నివాసం కూడా నీట మునిగింది. ఇటీవల ఢిల్లీలో నీటి కొరత నేపథ్యంలో నిరాహార దీక్ష చేసిన ఆప్ నేత నివాసం వెలుపల తీవ్ర వరదలు పోటెత్తిన దృశ్యాలు దర్శనిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment