పశ్చిమ డెల్టాకు 4 వేల క్యూసెక్కులు
కొవ్వూరు : పశ్చిమ డెల్టా కాలువకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గోదావరి ఇన్‌ఫ్లో కనిష్టస్థాయికి పడిపోయింది. సోమవారం 14,129 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుంటే ఉభయ గోదావరి జిల్లాలోని మూడు డెల్టాలకు 6,700 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. మిగిలిన 7,429 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఏలూరు కాలువకు 695, ఉండి కాలువకు 1,149, నరసాపురం కాలువకు 1,604, జీ అండ్ వీకి 332, అత్తిలి కాలువకి 284 క్యూసెక్కుల చొప్పున సాగునీరు సరఫరా చేస్తున్నారు.