న్యూఢిల్లీ: కొత్తగా వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ కోవిడ్ టీకాల ప్రభావాన్ని తగ్గిస్తుందనిగానీ, అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందనిగానీ చెప్పేందుకు శాస్త్రీయ గణాంకాలేవీ లేవని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ చెప్పారు. కరోనా వైరస్ ధోరణిని అంచనా వేయడం కష్టం కాబట్టి ఫలానా ఫస్ట్ వేవ్ ఇప్పుడని, సెకండ్ వేవ్ అప్పుడని చెప్పలేమన్నారు. కరోనా నుంచి దేశం బయటపడాలంటే క్రమశిక్షణతో కూడిన ప్రభావవంతమైన ప్రవర్తన అవసరమన్నారు. కరోనా వేవ్స్ రావడం, రాకపోవడం మన చేతలపై ఆధారపడి ఉందని గుర్తు చేశారు. సెకండ్ వేవ్‌లో రోజుకు 4 లక్షల వరకు నమోదైన కేసులు కొన్ని రోజులుగా రోజుకు 50వేల దిగువకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. డెల్టా వేరియంట్‌లో జరిగిన ఉత్పరివర్తనాలతో డెల్టాప్లస్ ఉద్భవించిందని, దీని గురించిన సైంటిఫిక్ డేటా తక్కువగా ఉందని చెప్పారు.
డెల్టాపై టీకాలు ఓకే
ఐసీఎంఆర్ విశ్లేషణ ప్రకారం కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు డెల్టా వేరియంట్‌పై మంచి ప్రభావాన్ని చూపాయని పాల్ తెలిపారు. ఫైజర్, మోడెర్నా టీకాలకు ప్రభుత్వ అనుమతి అనేక అంశాలపై ఆధారపడి ఉందని, అందువల్ల ఎప్పటికల్లా ఇవి అందుబాటులోకి వస్తాయనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఈ వ్యాక్సిన్ల అనుమతి ప్రక్రియకు కంపెనీలకు, ప్రభుత్వానికి మధ్య నష్టపరిహార అంశంపై చర్చలు కొలిక్కిరాలేదు. డబ్ల్యూహెచ్‌ఓ నుంచి కోవాగ్జిన్‌కు త్వరలో అనుమతి రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో టీకా ఉత్పత్తిదారులకు సామర్ధ్య విస్తరణ కోసం వివిధ గ్రాంట్ల రూపంలో కేంద్రం రూ. 670 కోట్ల సాయం అందించిందన్నారు. దీనికి మించి ప్రభుత్వ సైన్సు సంస్థలు ఎంతో విలువైన సాంకేతిక సాయాన్ని సైతం టీకా ఉత్పత్తిదారులకు అందించాయన్నారు.
Covid Vaccine: టీకా ప్రభావాన్ని డెల్టా ప్లస్ తగ్గించలేదు!
Published Tue, Jun 29 2021 4:18 AM | Last Updated on Tue, Jun 29 2021 6:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment