
Delta Corp-Zia Mody: గత కొన్ని రోజులు డెల్టా కార్ప్ లిమిటెడ్ వార్తల్లో నిలుస్తోంది.ముఖ్యంగా GST ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ (DG) నుండి ఇటీవల రూ. 16,822 కోట్ల పన్ను నోటీసుల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లో భారీ నష్టాలను నమోదు చేసింది. దీనికి తోడు ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా కంపెనీలో సగటు ధరకు 15,00,000 షేర్లను విక్రయించడం మార్కెట్లో ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. ఫలితంగా రెండు రోజుల్లో ఏకంగా 24 శాతం కుప్పకూలింది. సెప్టెంబర్ 25న ఎన్‌ఎస్‌ఈలో స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి రూ.140.35కి పడిపోయింది. అయితే బుధవారం నాటి మార్కెట్లో లాభాలతో కొనసాగుతోంది.
భారతదేశంలో క్యాసినో కంపెనీలకు వేల కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలతో జీఎస్‌టీ అధికారులు పలు కంపెనీలకు షాక్ ఇచ్చింది. భవిష్యత్‌లో మరింతమందికి నోటీసులిచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ నోటీసులపై ఇప్పటికే డ్రీమ్ 11ను కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో డెల్టా కార్ప్ న్యాయపోరాటం చేస్తుందా? చేస్తే ఫలితం ఎలా ఉండబోతోంది? అసలు డెల్టాకార్ప్ ఎవరిది అనే విషయాలను ఒక సారి చూద్దాం. (నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం)
డెల్టాకార్ప్ ఓనర్ ఎవరో తెలుసా
డెల్టా కార్ప్ ప్రముఖ న్యాయవాది జియా మోడీ భర్త జయదేవ్ మోడీకి చెందినది. జియా ప్రముఖ కార్పొరేట్ లాయర్. పాపులర్ మహిళా వ్యాపారవేత్త. అంతేకాదు భారత మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ కుమార్తె. జియా మోడీ ప్రముఖ లా సంస్థ AZB & పార్టనర్స్ కి సహ వ్యవస్థాపరాలు మేనేజింగ్ భాగస్వామిగా ఉన్నారు.
మూడు నెలల క్రితం క్యాసినోల కోసం స్థూల పందెం విలువపై 28 శాతం GST విధించాలని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆన్‌లైన్ కంపెనీలు గందరగోళం పడ్డాయి. డెల్టా కార్పొ, డ్రీమ్ 11 సమా పలు కీలక కంపెనీలకు వేల కోట్ల పన్ను ఎగవేత నోటీసులందాయి. నెల రోజుల క్రితం డెల్టా కార్పొ ముఖ్య ఆర్థిక అధికారి రాజీనామా చేశారు. రెండు నెలల క్రితం కంపెనీ తన ఆన్‌లైన్ గేమింగ్ బిజినెస్‌కంపెనీ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ను నిలిపివేసినట్లు సమాచారం. 16,822 కోట్ల పన్ను నోటీసు మీడియం-టర్మ్‌లో ప్రతికూలమని ఎనలిస్టుల అంచనా. (వేల కోట్ల జీఎస్‌టీ ఎగవేత: అధికారుల షాక్..కోర్టుకెక్కిన డ్రీమ్11)
ఎలాంటి కేసునైనా..ఇట్టే!
RSG ఇండియా నివేదిక ప్రకారం, భారతదేశంలో, ఆసియాలోనే అతిపెద్ద కార్పొరేట్ అటార్నీలలో ఒకరైన జియా ఎలాంటి క్లిష్ట సమస్యనైనా ఈజీగా పరిష్కరించే చాకచక్యం సొంతమని ఆమె క్లయింట్లు నమ్ముతారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ పన్ను నోటీసు వివాదంనుంచి విజయవంతంగాగా బయపడుతుందా అనే చర్చ జోరుగా నడుస్తోంది. గత ఐదేళ్లలో కంపెనీ అమ్మకాలు 11 శాతం, నికర లాభం 13 శాతం పెరిగాయి. కంపెనీపై పెట్టుబడిదారుల నమ్మకంతోపాటు, టాక్స్‌ల కు సంబంధించిన కొన్ని టెక్నికల్ సమస్యల రీత్యా డెల్టాకార్ప్‌కు లాంగ్ టర్మ్‌లో పెద్దగా ఇబ్బంది లేదనేది ఇండస్ట్రీ వర్గాల అంచనా.
డెల్టా కార్ప్ పని అయిపోయినట్టేనా?
భారతీయ కాసినో పరిశ్రమలో ఆధిపత్యం, బలమైన బ్రాండ్ నమ్మకమైన కస్టమర్ బేస్ కారణంగా డెల్టా కార్ప్ దీర్ఘకాలిక దృక్పథం ఆశాజనకంగా కనిపిస్తుంది. సవాళ్లను నావిగేట్ చేయగల కంపెనీ సామర్థ్యాన్ని నమ్మే పెట్టుబడిదారులు, ప్రస్తుత స్టాక్ ధర తగ్గుదల కొనుగోలు అవకాశమని రైట్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు, క్వాంట్-బేస్డ్ PMS ఫండ్ మేనేజర్ సోనమ్ శ్రీవాస్తవ అన్నారు. పన్ను ఎగవేత ఆరోపణలమొత్తం జూలై 2017-మార్చి 2022 వరకు ఉన్న లాభాలపై, అయితే కొత్త జీఎస్‌టీ అక్టోబర్ 2023 నుండి మాత్రమే అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో విజయం డెల్టా కార్ప్‌దే అని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా దివంగత బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా భార్య రేఖ ఒకప్పుడు క్యాసినో ఆపరేటర్‌లో వాటాదారులుగా ఉన్నారు. అయితే 2022లో తమ వాటాలను విక్రయించారు. డెల్టా కార్ప్‌లో 1 శాతం కంటే ఎక్కువ వాటా ఉన్న వాటాదారులెవరూ లేరు.
Comments
Please login to add a commentAdd a comment