tax notices
-
రూ.248 కోట్ల ట్యాక్స్ డిమాండ్ నోటీసులు
కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.248.74 కోట్ల ట్యాక్స్ డిమాండ్ నోటీసును అందుకుంది. ధరల బదిలీలో సమస్యల కారణంగా జులై 26న ఈ నోటీసులు అందినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.ఈ ఆదాయ పన్ను నోటీసుల వల్ల కంపెనీ ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఫైలింగ్‌లో పేర్కొంది. ‘ఆదాయ పన్ను శాఖ నుంచి కంపెనీకు జులై 26న నోటీసులు అందాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.248,74,78,511 కోట్ల ట్యాక్స్ చెల్లించాలని ఉంది. దానికి వడ్డీ రూ.79.63 కోట్లుగా నిర్ణయించారు. ధరల బదిలీలో సమస్యల కారణంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. దీనికి సంబంధించి అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేస్తాం. ట్యాక్స్ డిమాండ్ నోటీసుల ద్వారా కంపెనీ ఆర్థిక వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండదు’ అని తెలిపింది.ఇదీ చదవండి: అప్పు చెల్లించని వైజాగ్ స్టీల్‌ప్లాంట్!కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ ఓరల్ కేర్, పర్సనల్ కేర్‌లో ఉత్పత్తులు తయారుచేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.5,644 కోట్ల విలువైన నికర విక్రయాలు నమోదు చేసింది. -
డెల్టా కార్ప్ కథ కంచికేనా? జియా మోడీ మేజిక్ చేస్తారా? అసలెవరీ మోడీ?
Delta Corp-Zia Mody: గత కొన్ని రోజులు డెల్టా కార్ప్ లిమిటెడ్ వార్తల్లో నిలుస్తోంది.ముఖ్యంగా GST ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ (DG) నుండి ఇటీవల రూ. 16,822 కోట్ల పన్ను నోటీసుల నేపథ్యంలో స్టాక్మార్కెట్లో భారీ నష్టాలను నమోదు చేసింది. దీనికి తోడు ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా కంపెనీలో సగటు ధరకు 15,00,000 షేర్లను విక్రయించడం మార్కెట్లో ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. ఫలితంగా రెండు రోజుల్లో ఏకంగా 24 శాతం కుప్పకూలింది. సెప్టెంబర్ 25న ఎన్ఎస్ఈలో స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి రూ.140.35కి పడిపోయింది. అయితే బుధవారం నాటి మార్కెట్లో లాభాలతో కొనసాగుతోంది. భారతదేశంలో క్యాసినో కంపెనీలకు వేల కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలతో జీఎస్టీ అధికారులు పలు కంపెనీలకు షాక్ ఇచ్చింది. భవిష్యత్‌లో మరింతమందికి నోటీసులిచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ నోటీసులపై ఇప్పటికే డ్రీమ్ 11ను కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో డెల్టా కార్ప్ న్యాయపోరాటం చేస్తుందా? చేస్తే ఫలితం ఎలా ఉండబోతోంది? అసలు డెల్టాకార్ప్ ఎవరిది అనే విషయాలను ఒక సారి చూద్దాం. (నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం) డెల్టాకార్ప్ ఓనర్ ఎవరో తెలుసా డెల్టా కార్ప్ ప్రముఖ న్యాయవాది జియా మోడీ భర్త జయదేవ్ మోడీకి చెందినది. జియా ప్రముఖ కార్పొరేట్ లాయర్. పాపులర్ మహిళా వ్యాపారవేత్త. అంతేకాదు భారత మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ కుమార్తె. జియా మోడీ ప్రముఖ లా సంస్థ AZB & పార్టనర్స్ కి సహ వ్యవస్థాపరాలు మేనేజింగ్ భాగస్వామిగా ఉన్నారు. మూడు నెలల క్రితం క్యాసినోల కోసం స్థూల పందెం విలువపై 28 శాతం GST విధించాలని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆన్లైన్ కంపెనీలు గందరగోళం పడ్డాయి. డెల్టా కార్పొ, డ్రీమ్ 11 సమా పలు కీలక కంపెనీలకు వేల కోట్ల పన్ను ఎగవేత నోటీసులందాయి. నెల రోజుల క్రితం డెల్టా కార్పొ ముఖ్య ఆర్థిక అధికారి రాజీనామా చేశారు. రెండు నెలల క్రితం కంపెనీ తన ఆన్లైన్ గేమింగ్ బిజినెస్కంపెనీ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ను నిలిపివేసినట్లు సమాచారం. 16,822 కోట్ల పన్ను నోటీసు మీడియం-టర్మ్‌లో ప్రతికూలమని ఎనలిస్టుల అంచనా. (వేల కోట్ల జీఎస్టీ ఎగవేత: అధికారుల షాక్..కోర్టుకెక్కిన డ్రీమ్11) ఎలాంటి కేసునైనా..ఇట్టే! RSG ఇండియా నివేదిక ప్రకారం, భారతదేశంలో, ఆసియాలోనే అతిపెద్ద కార్పొరేట్ అటార్నీలలో ఒకరైన జియా ఎలాంటి క్లిష్ట సమస్యనైనా ఈజీగా పరిష్కరించే చాకచక్యం సొంతమని ఆమె క్లయింట్లు నమ్ముతారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ పన్ను నోటీసు వివాదంనుంచి విజయవంతంగాగా బయపడుతుందా అనే చర్చ జోరుగా నడుస్తోంది. గత ఐదేళ్లలో కంపెనీ అమ్మకాలు 11 శాతం, నికర లాభం 13 శాతం పెరిగాయి. కంపెనీపై పెట్టుబడిదారుల నమ్మకంతోపాటు, టాక్స్‌ల కు సంబంధించిన కొన్ని టెక్నికల్ సమస్యల రీత్యా డెల్టాకార్ప్‌కు లాంగ్ టర్మ్‌లో పెద్దగా ఇబ్బంది లేదనేది ఇండస్ట్రీ వర్గాల అంచనా. డెల్టా కార్ప్ పని అయిపోయినట్టేనా? భారతీయ కాసినో పరిశ్రమలో ఆధిపత్యం, బలమైన బ్రాండ్ నమ్మకమైన కస్టమర్ బేస్ కారణంగా డెల్టా కార్ప్ దీర్ఘకాలిక దృక్పథం ఆశాజనకంగా కనిపిస్తుంది. సవాళ్లను నావిగేట్ చేయగల కంపెనీ సామర్థ్యాన్ని నమ్మే పెట్టుబడిదారులు, ప్రస్తుత స్టాక్ ధర తగ్గుదల కొనుగోలు అవకాశమని రైట్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు, క్వాంట్-బేస్డ్ PMS ఫండ్ మేనేజర్ సోనమ్ శ్రీవాస్తవ అన్నారు. పన్ను ఎగవేత ఆరోపణలమొత్తం జూలై 2017-మార్చి 2022 వరకు ఉన్న లాభాలపై, అయితే కొత్త జీఎస్టీ అక్టోబర్ 2023 నుండి మాత్రమే అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో విజయం డెల్టా కార్ప్దే అని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా దివంగత బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా భార్య రేఖ ఒకప్పుడు క్యాసినో ఆపరేటర్లో వాటాదారులుగా ఉన్నారు. అయితే 2022లో తమ వాటాలను విక్రయించారు. డెల్టా కార్ప్‌లో 1 శాతం కంటే ఎక్కువ వాటా ఉన్న వాటాదారులెవరూ లేరు. -
పన్ను నోటీసులా.. ఇక తప్పించుకోలేరు
తప్పుడు చిరునామాలు ఇచ్చి లేదా ఇళ్లు మారి ఆదాయపు పన్ను శాఖ జారీచేసే పన్ను నోటీసుల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? ఆ పప్పులేమీ ఇక ఉడకవట. ఆదాయపు పన్ను శాఖ తన నిబంధనలను సవరించింది. అసెసీలు ట్యాక్సీ నోటీసుల నుంచి తప్పించుకోకుండా.. ఒకవేళ తమకిచ్చిన అడ్రస్‌కు డిపార్ట్మెంట్ పంపిన నోటీసులు డెలివరీ కాకపోతే... అసెసీలు బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పోస్ట్ ఆఫీసులు వద్ద ఇచ్చిన అడ్రస్‌లకు పంపనున్నారు. ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం పోస్టు లేదా ఈ-మెయిల్ ద్వారా అసెసీలకు సమన్లు, నోటీసులు వంటి వాటిని పంపుతున్నామని, ఒకవేళ అందుబాటులో ఉన్న ఆ అడ్రస్‌కు నోటీసు, మరే ఇతర కమ్యూనికేషన్‌ను డెలివరీ కాని పక్షంలో... ఆదాయపు పన్ను నిబంధన రూల్ 127 ప్రకారం కింద ఉన్న అడ్రస్‌లకు కూడా నోటీసులు జారీచేయనున్నట్టు తెలిసింది.. బ్యాంకు వద్ద మీరిచ్చిన అడ్రస్ ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద ఇచ్చిన అడ్రస్ పోస్టు ఆఫీసు స్కీమ్‌ల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు పోస్టు ఆఫీసు వద్ద మీరు ఇచ్చిన అడ్రస్ ప్రభుత్వ రికార్డుల్లో అందుబాటులో ఉన్న అడ్రస్ స్థానిక అథారిటీల వద్ద అందుబాటులో ఉన్న అడ్రస్ నిబంధన 114డీ కింద ఆదాయపు పన్ను డిపార్ట్మెంట్ ఫామ్ 61 లో అసెసీ ఇచ్చిన అడ్రస్ నిబంధన 114ఈ కింద పన్ను డిపార్ట్మెంట్ వద్ద ఫామ్ 61లో ఇచ్చిన అడ్రస్‌కు ముందస్తు నిబంధనల ప్రకారం పోస్టు లేదా ఈ-మెయిల్ ద్వారా కింద ఇచ్చిన అడ్రస్‌లకు మాత్రమే నోటీసులు పంపేవారు. అవి.. పాన్ డేటాబేస్‌లోని అడ్రస్ ఐటీఆర్‌లో అందుబాటులో ఉన్న అడ్రస్ గతేడాది ఐటీఆర్‌లో ఉన్న అడ్రస్‌కు ఆదాయపు పన్ను అథారిటీ వద్ద ఉన్న ఈ-మెయిల్ అడ్రస్‌కు గతేడాది ఐటీఆర్‌లో అందుబాటులో ఉన్న ఈ-మెయిల్ అడ్రస్‌కు -
కెయిర్న్‌కు 1.6 బిలియన్ డాలర్ల పన్ను నోటీసులు
న్యూఢిల్లీ: దాదాపు రూ. 10,247 కోట్ల (1.6 బిలి యన్ డాలర్లు) పన్ను కట్టాలంటూ కెయిర్న్ ఎనర్జీకి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మంగళవార ం నోటీసులు జారీ చేసింది. 2006లో భారత్‌లోని వ్యాపారాలను కొత్త కంపెనీ కెయిర్న్ ఇండియాకు బదలాయిం చిన అంశంలో కెయిర్న్ ఎనర్జీకి రూ. 24,500 కోట్ల మేర క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయని, ఆ మొత్తంపై పన్నులు కట్టాలని ఈ నోటీసులు జారీ అయ్యాయి. రెట్రాస్పెక్టివ్ ట్యాక్సులు(గత కాలపు డీల్స్ తిరగదోడి పన్నుల విధింపు) దేశానికి చెడ్డపేరు తెస్తాయంటూ కేంద్రం చెబుతుండగా.. మరోవైపు పన్నుల శాఖ ఈ విధంగా నోటీసు లివ్వడం ఆశ్చర్యకరమని కెయిర్న్ పేర్కొంది. వీటిని సవాలు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. కెయిర్న్, పన్ను నోటీసులు,