రూ.248 కోట్ల ట్యాక్స్‌ డిమాండ్‌ నోటీసులు | Colgate Palmolive India Ltd received tax demand notice of Rs 248 crore | Sakshi
Sakshi News home page

రూ.248 కోట్ల ట్యాక్స్‌ డిమాండ్‌ నోటీసులు

Published Mon, Jul 29 2024 12:29 PM | Last Updated on Mon, Jul 29 2024 1:22 PM

Colgate Palmolive India Ltd received tax demand notice of Rs 248 crore

కోల్‌గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.248.74 కోట్ల ట్యాక్స్‌ డిమాండ్ నోటీసును అందుకుంది. ధరల బదిలీలో సమస్యల కారణంగా జులై 26న ఈ నోటీసులు అందినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ఈ ఆదాయ పన్ను నోటీసుల వల్ల కంపెనీ ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఫైలింగ్‌లో పేర్కొంది. ‘ఆదాయ పన్ను శాఖ నుంచి కంపెనీకు జులై 26న నోటీసులు అందాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.248,74,78,511 కోట్ల ట్యాక్స్‌ చెల్లించాలని ఉంది. దానికి వడ్డీ రూ.79.63 కోట్లుగా నిర్ణయించారు. ధరల బదిలీలో సమస్యల కారణంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. దీనికి సంబంధించి అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేస్తాం. ట్యాక్స్‌ డిమాండ్‌ నోటీసుల ద్వారా కంపెనీ ఆర్థిక వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండదు’ అని తెలిపింది.

ఇదీ చదవండి: అప్పు చెల్లించని వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌!

కోల్‌గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ ఓరల్ కేర్, పర్సనల్ కేర్‌లో ఉత్పత్తులు తయారుచేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.5,644 కోట్ల విలువైన నికర విక్రయాలు నమోదు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement