తప్పుడు చిరునామాలు ఇచ్చి లేదా ఇళ్లు మారి ఆదాయపు పన్ను శాఖ జారీచేసే పన్ను నోటీసుల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? ఆ పప్పులేమీ ఇక ఉడకవట. ఆదాయపు పన్ను శాఖ తన నిబంధనలను సవరించింది. అసెసీలు ట్యాక్సీ నోటీసుల నుంచి తప్పించుకోకుండా.. ఒకవేళ తమకిచ్చిన అడ్రస్‌కు డిపార్ట్‌మెంట్ పంపిన నోటీసులు డెలివరీ కాకపోతే... అసెసీలు బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పోస్ట్ ఆఫీసులు వద్ద ఇచ్చిన అడ్రస్‌లకు పంపనున్నారు. ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం పోస్టు లేదా ఈ-మెయిల్ ద్వారా అసెసీలకు సమన్లు, నోటీసులు వంటి వాటిని పంపుతున్నామని, ఒకవేళ అందుబాటులో ఉన్న ఆ అడ్రస్‌కు నోటీసు, మరే ఇతర కమ్యూనికేషన్‌ను డెలివరీ కాని పక్షంలో... ఆదాయపు పన్ను నిబంధన రూల్ 127 ప్రకారం కింద ఉన్న అడ్రస్‌లకు కూడా నోటీసులు జారీచేయనున్నట్టు తెలిసింది..
- బ్యాంకు వద్ద మీరిచ్చిన అడ్రస్
- ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద ఇచ్చిన అడ్రస్
- పోస్టు ఆఫీసు స్కీమ్‌ల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు పోస్టు ఆఫీసు వద్ద మీరు ఇచ్చిన అడ్రస్
- ప్రభుత్వ రికార్డుల్లో అందుబాటులో ఉన్న అడ్రస్
- స్థానిక అథారిటీల వద్ద అందుబాటులో ఉన్న అడ్రస్
- నిబంధన 114డీ కింద ఆదాయపు పన్ను డిపార్ట్‌మెంట్ ఫామ్ 61 లో అసెసీ ఇచ్చిన అడ్రస్
- నిబంధన 114ఈ కింద పన్ను డిపార్ట్‌మెంట్ వద్ద ఫామ్ 61లో ఇచ్చిన అడ్రస్‌కు
ముందస్తు నిబంధనల ప్రకారం పోస్టు లేదా ఈ-మెయిల్ ద్వారా కింద ఇచ్చిన అడ్రస్‌లకు మాత్రమే నోటీసులు పంపేవారు. అవి..
- పాన్ డేటాబేస్‌లోని అడ్రస్
- ఐటీఆర్‌లో అందుబాటులో ఉన్న అడ్రస్
- గతేడాది ఐటీఆర్‌లో ఉన్న అడ్రస్‌కు
- ఆదాయపు పన్ను అథారిటీ వద్ద ఉన్న ఈ-మెయిల్ అడ్రస్‌కు
- గతేడాది ఐటీఆర్‌లో అందుబాటులో ఉన్న ఈ-మెయిల్ అడ్రస్‌కు
Comments
Please login to add a commentAdd a comment