కెయిర్న్‌కు 1.6 బిలియన్ డాలర్ల పన్ను నోటీసులు | 1.6 billion dollars tax notices for cares | Sakshi
Sakshi News home page

కెయిర్న్‌కు 1.6 బిలియన్ డాలర్ల పన్ను నోటీసులు

Published Wed, Mar 11 2015 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

కెయిర్న్‌కు 1.6 బిలియన్ డాలర్ల పన్ను నోటీసులు

కెయిర్న్‌కు 1.6 బిలియన్ డాలర్ల పన్ను నోటీసులు

న్యూఢిల్లీ: దాదాపు రూ. 10,247 కోట్ల (1.6 బిలి యన్ డాలర్లు) పన్ను కట్టాలంటూ  కెయిర్న్ ఎనర్జీకి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మంగళవార ం నోటీసులు జారీ చేసింది. 2006లో భారత్‌లోని వ్యాపారాలను కొత్త కంపెనీ కెయిర్న్ ఇండియాకు బదలాయిం చిన అంశంలో కెయిర్న్ ఎనర్జీకి రూ. 24,500 కోట్ల మేర క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయని, ఆ మొత్తంపై పన్నులు కట్టాలని ఈ నోటీసులు జారీ అయ్యాయి. రెట్రాస్పెక్టివ్ ట్యాక్సులు(గత కాలపు డీల్స్ తిరగదోడి పన్నుల విధింపు) దేశానికి చెడ్డపేరు తెస్తాయంటూ కేంద్రం చెబుతుండగా.. మరోవైపు పన్నుల శాఖ ఈ విధంగా నోటీసు లివ్వడం ఆశ్చర్యకరమని కెయిర్న్ పేర్కొంది. వీటిని సవాలు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

కెయిర్న్, పన్ను నోటీసులు,
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement