soli sorabjee
-
డెల్టా కార్ప్ కథ కంచికేనా? జియా మోడీ మేజిక్ చేస్తారా? అసలెవరీ మోడీ?
Delta Corp-Zia Mody: గత కొన్ని రోజులు డెల్టా కార్ప్ లిమిటెడ్ వార్తల్లో నిలుస్తోంది.ముఖ్యంగా GST ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ (DG) నుండి ఇటీవల రూ. 16,822 కోట్ల పన్ను నోటీసుల నేపథ్యంలో స్టాక్మార్కెట్లో భారీ నష్టాలను నమోదు చేసింది. దీనికి తోడు ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా కంపెనీలో సగటు ధరకు 15,00,000 షేర్లను విక్రయించడం మార్కెట్లో ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. ఫలితంగా రెండు రోజుల్లో ఏకంగా 24 శాతం కుప్పకూలింది. సెప్టెంబర్ 25న ఎన్ఎస్ఈలో స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి రూ.140.35కి పడిపోయింది. అయితే బుధవారం నాటి మార్కెట్లో లాభాలతో కొనసాగుతోంది. భారతదేశంలో క్యాసినో కంపెనీలకు వేల కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలతో జీఎస్టీ అధికారులు పలు కంపెనీలకు షాక్ ఇచ్చింది. భవిష్యత్‌లో మరింతమందికి నోటీసులిచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ నోటీసులపై ఇప్పటికే డ్రీమ్ 11ను కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో డెల్టా కార్ప్ న్యాయపోరాటం చేస్తుందా? చేస్తే ఫలితం ఎలా ఉండబోతోంది? అసలు డెల్టాకార్ప్ ఎవరిది అనే విషయాలను ఒక సారి చూద్దాం. (నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం) డెల్టాకార్ప్ ఓనర్ ఎవరో తెలుసా డెల్టా కార్ప్ ప్రముఖ న్యాయవాది జియా మోడీ భర్త జయదేవ్ మోడీకి చెందినది. జియా ప్రముఖ కార్పొరేట్ లాయర్. పాపులర్ మహిళా వ్యాపారవేత్త. అంతేకాదు భారత మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ కుమార్తె. జియా మోడీ ప్రముఖ లా సంస్థ AZB & పార్టనర్స్ కి సహ వ్యవస్థాపరాలు మేనేజింగ్ భాగస్వామిగా ఉన్నారు. మూడు నెలల క్రితం క్యాసినోల కోసం స్థూల పందెం విలువపై 28 శాతం GST విధించాలని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆన్లైన్ కంపెనీలు గందరగోళం పడ్డాయి. డెల్టా కార్పొ, డ్రీమ్ 11 సమా పలు కీలక కంపెనీలకు వేల కోట్ల పన్ను ఎగవేత నోటీసులందాయి. నెల రోజుల క్రితం డెల్టా కార్పొ ముఖ్య ఆర్థిక అధికారి రాజీనామా చేశారు. రెండు నెలల క్రితం కంపెనీ తన ఆన్లైన్ గేమింగ్ బిజినెస్కంపెనీ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ను నిలిపివేసినట్లు సమాచారం. 16,822 కోట్ల పన్ను నోటీసు మీడియం-టర్మ్‌లో ప్రతికూలమని ఎనలిస్టుల అంచనా. (వేల కోట్ల జీఎస్టీ ఎగవేత: అధికారుల షాక్..కోర్టుకెక్కిన డ్రీమ్11) ఎలాంటి కేసునైనా..ఇట్టే! RSG ఇండియా నివేదిక ప్రకారం, భారతదేశంలో, ఆసియాలోనే అతిపెద్ద కార్పొరేట్ అటార్నీలలో ఒకరైన జియా ఎలాంటి క్లిష్ట సమస్యనైనా ఈజీగా పరిష్కరించే చాకచక్యం సొంతమని ఆమె క్లయింట్లు నమ్ముతారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ పన్ను నోటీసు వివాదంనుంచి విజయవంతంగాగా బయపడుతుందా అనే చర్చ జోరుగా నడుస్తోంది. గత ఐదేళ్లలో కంపెనీ అమ్మకాలు 11 శాతం, నికర లాభం 13 శాతం పెరిగాయి. కంపెనీపై పెట్టుబడిదారుల నమ్మకంతోపాటు, టాక్స్‌ల కు సంబంధించిన కొన్ని టెక్నికల్ సమస్యల రీత్యా డెల్టాకార్ప్‌కు లాంగ్ టర్మ్‌లో పెద్దగా ఇబ్బంది లేదనేది ఇండస్ట్రీ వర్గాల అంచనా. డెల్టా కార్ప్ పని అయిపోయినట్టేనా? భారతీయ కాసినో పరిశ్రమలో ఆధిపత్యం, బలమైన బ్రాండ్ నమ్మకమైన కస్టమర్ బేస్ కారణంగా డెల్టా కార్ప్ దీర్ఘకాలిక దృక్పథం ఆశాజనకంగా కనిపిస్తుంది. సవాళ్లను నావిగేట్ చేయగల కంపెనీ సామర్థ్యాన్ని నమ్మే పెట్టుబడిదారులు, ప్రస్తుత స్టాక్ ధర తగ్గుదల కొనుగోలు అవకాశమని రైట్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు, క్వాంట్-బేస్డ్ PMS ఫండ్ మేనేజర్ సోనమ్ శ్రీవాస్తవ అన్నారు. పన్ను ఎగవేత ఆరోపణలమొత్తం జూలై 2017-మార్చి 2022 వరకు ఉన్న లాభాలపై, అయితే కొత్త జీఎస్టీ అక్టోబర్ 2023 నుండి మాత్రమే అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో విజయం డెల్టా కార్ప్దే అని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా దివంగత బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా భార్య రేఖ ఒకప్పుడు క్యాసినో ఆపరేటర్లో వాటాదారులుగా ఉన్నారు. అయితే 2022లో తమ వాటాలను విక్రయించారు. డెల్టా కార్ప్‌లో 1 శాతం కంటే ఎక్కువ వాటా ఉన్న వాటాదారులెవరూ లేరు. -
మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ కరోనాతో మృతి
-
మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ కరోనాతో మృతి
న్యూఢిల్లీ: భారత మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ శుక్రవారం ఉదయం కోవిడ్‌తో మరణించారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. దేశంలోనే సీనియర్ న్యాయవాది మాత్రమే కాక అత్యుత్తమ న్యాయవాదులలో సోలి సొరాబ్జీ ఒకరు. ఆయన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2002లో ఆయనను పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఇటీవల సొరాబ్జీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారు. ఆయన పూర్తి పేరు సోలి జెహంగీర్ సొరాబ్జీ. 1930 ముంబైలో జన్మించారు. 1953 లో ముంబై హైకోర్టులో తన న్యాయవాద ప్రాక్టీసును ప్రారంభించారు. 1971 లో ఆయన సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. సొరాబ్జీ మొదట సారిగా 1989 లో భారతదేశానికి అటార్నీ జనరల్ నియమితులయ్యారు. ఆ తరువాత రెండో సారి 1998 నుంచి 2004 వరకు సేవలు అందించారు. మానవ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన న్యాయవాది సొరాబ్జీ. హక్కుల రక్షణకై యూఎన్ ఉప కమిషన్‌లో ఆయన పని చేశారు. 1998 నుంచి 2004 వరకు దానికి ఛైర్మన్‌గా ఉన్నారు. వివక్ష, మైనారిటీల రక్షణపై యూఎన్‌లో ఉప కమిషన్ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. 2002 లో, సొరాబ్జీ భారత రాజ్యాంగం సమీక్షించే కమీషన్లో సభ్యుడిగా కూడా పని చేశారు. ఆయన 1997 లో నైజీరియాలో యూఎన్ ప్రత్యేక రిపోర్టర్‌గా పని చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రముఖ న్యాయవాది, భారత మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సొరాబ్జీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సొరాబ్జీ వాదనలు మానవ హక్కుల పరిరక్షణపై తీవ్ర ప్రభావం చూపాయని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేశారు. ( చదవండి: నెగటివ్: కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధానమంత్రి ) -
సోలి సొరాబ్జీ (మాజీ అటార్నీ) రాయని డైరీ
దేశానికి ఒక జాతీయ గీతం, ఒక జాతీయ జెండా ఉండాల్సిందే. ఏ కాలానికి ఆ కాలంలో ఒక జాతీయ నేత ఎలాగూ ఉంటాడు. అలాగని ప్రతి పౌరుడూ ఒక జాతీయ పౌరుడిలా ఉండాలని కోర్టులు ఆదేశించవచ్చా అన్న విషయమై నేనేమీ ఆలోచించలేక పోతున్నాను. బహుశా ఇది నా న్యాయవాద వృత్తికి, నా వివేచనా శక్తికి మించిన ఆలోచనైతే కాదు కదా!! జాతీయ గీతాన్ని చదివే గుర్తు పట్టక్కర్లేదు. జాతీయ గీతాన్ని వినే గుర్తు పట్టక్కర్లేదు. నిరంతరం లేచి నిలబడి పాడుతూ ఉంటేనే జాతీయ గీతం గుర్తుంటుందని లేదు. అది మన బ్లడ్! లోపల ప్రవహిస్తూ ఉంటుంది. గుండె జనగణమన అని కొట్టుకుంటూ ఉంటుంది. నిలుచున్నా, కూర్చున్నా, పడుకుని ఉన్నా, ప్రయాణిస్తూ ఉన్నా కూడా. జెండా కూడా అంతే. కళ్ల ముందు రెపరెపలాడుతుంటేనే, మనం వెళ్లి సెల్యూట్ కొడుతుంటేనే గుర్తుకొస్తుందనేమీ లేదు. దేశం లోపల ఎన్ని రంగులు ఉన్నా, దేశంలోని మనుషుల లోపల ఉండేవి ఆ మూడు రంగులే. మన కొత్త జాతీయ నేత మాత్రం? ఏ రోజైనా ఆయన్ని గుర్తుపట్టకుండా ఉన్నామా? ఆయన దేశంలో ఉన్నా లేకున్నా మనం గుర్తుపట్టడం లేదా? ఆయన పార్లమెంటుకు వస్తున్నా రాకున్నా మనం గుర్తుపట్టడం లేదా? నోట్లపై ఉన్న జాతిపిత మనకెంత గుర్తో, నోట్లు రద్దు చేసిన జాతీయ నేత అంతే గుర్తు. పౌరుల్ని గుర్తుపట్టడానికి పాస్‌పోర్ట్‌లు ఉండాలి. మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు ఉండాలి. గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి. జిరాక్స్ కాపీలు ఉండాలి. ఆధార్ కార్డులు ఉండాలి. పాన్ కార్డులు ఉండాలి. రేషన్ కార్డులు ఉండాలి. జన్‌ధన్ ఖాతాలు ఉండాలి. గ్యాస్ రిసీట్ ఉండాలి. నీటి బిల్లు ఉండాలి. కరెంటు బిల్లు ఉండాలి. ఐటీ రిటర్న్స్ ఉండాలి. జాతీయ గీతానికీ, జాతీయ జెండాకు, జాతీయ నేతకు ఇవేవీ అక్కర్లేదు. దేశభక్తులకు, దేశభక్తికి కూడా అక్కర్లేదు. జాతీయ గీతాన్ని భక్తిగా ఆలపించమని, జాతీయ గీతాన్ని శ్రద్ధగా ఆలకించమని ఆదేశించడమంటే.. దేశభక్తికి ఐడీ కార్డు చూపించమని అడగడమే! భక్తిని శంకిస్తే భక్తుడు సహించడు. ‘ముందు నీ ఐడీ కార్డు చూపించు’ అంటాడు. ‘నీ భక్తిని గానీ, నా భక్తిని గానీ నిరూపించుకోవలసింది దేశానికే గానీ.. నేను నీకు, నువ్వు నాకు కాదు’ అంటాడు. ‘నేను సినిమా హాల్లో జాతీయ గీతం పాడి నా దేశభక్తిని ప్రదర్శించుకుంటాను. నువ్వు కోర్టు హాల్లో జాతీయ గీతం పాడి నీ దేశభక్తిని చాటుకోగలవా యువర్ ఆనర్’ అని అడుగుతాడు. భావప్రకటన స్వేచ్ఛ అంటే మాట్లాడే స్వేచ్ఛ అని మాత్రమే కాదు. మాట్లాడకుండా ఉండే స్వేచ్ఛ కూడా. బలవంతంగా మాట మాట్లాడించినా, బలవంతంగా పాట పాడించినా ఆ స్వేచ్ఛను హరించినట్టే. -మాధవ్ శింగరాజు