గోదావరి డెల్టా కాలువలకు జూన్ 1 నుంచి సాగునీరు విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మే 15 నాటికి సాగునీరు ఇస్తే ప్రకృతి వైపరీత్యాల నుంచి గట్టెక్కవచ్చని... అపరాలు పండించుకునే అవకాశం దక్కుతుందని రైతులు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న
అమలాపురం :
గోదావరి డెల్టా కాలువలకు జూన్ 1 నుంచి సాగునీరు విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మే 15 నాటికి సాగునీరు ఇస్తే ప్రకృతి వైపరీత్యాల నుంచి గట్టెక్కవచ్చని... అపరాలు పండించుకునే అవకాశం దక్కుతుందని రైతులు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఈ నెల 6వ తేదీన ‘ఖరీఫ్‌పై నీలి నీడలు’ శీర్షికన సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో కనీసం జూన్ 1 నాటికైనా సాగునీరు విడుదల చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్రిటీష్ హయాంలో మే 15 నాటికి సాగునీరు విడుదల చేసేవారు. తరువాత రెండు పంటల విధానం రావడంతో నీటి విడుదల జూ¯ŒS 15 తరువాతకు మారింది. ఈ విధానం వల్ల ఖరీఫ్ పంట కోతల సమయంలో భారీ వర్షాలు, తుపాన్ల తో రైతులు రూ.కోట్ల పంటను కోల్పోతున్నారు.