june 1st
-
విమానాలపై లాక్డౌన్ ఎఫెక్ట్
-
ప్రయాణీకులకు షాక్: విమాన ఛార్జీలు పెంపు
సాక్షి, హైదరాబాద్: విమానయాన ధరలు జూన్ 1వ తేదీ నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. సంస్థలు తమ ఛార్జీల పట్టికలో మార్పులు చేస్తున్నాయి. విమానయాన కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెరుగుతున్నాయి. 40 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2,300 నుంచి రూ.2,600కు ఉండనుంది. 60 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2,900 నుంచి రూ.3,300కు పెరగనుంది. కరోనా రెండో దశ విజృంభణతో విమానయాన రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే విమానయాన రంగానికి ఊతమిచ్చేలా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్.. ఈ ఏడాది మార్చి నుంచి విమానయాన సేవలు అంతంత మాత్రమే కొనసాగాయి. అంతర్జాతీయంగా కూడా ప్రతికూల వాతావరణం ఉండడంతో విమానయాన రంగం తీవ్రంగా నష్టపోయింది. ఛార్జీల పెంపు ఇలా.. కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెంపు 40 నిమిషాల ప్రయాణం: రూ.2,600కు పెంపు..అత్యధిక ధర రూ.7,800 60 నిమిషాల ప్రయాణం: రూ.3,300కు పెంపు... అత్యధిక ధర రూ.9,800 -
రైతులు సెలవు పెట్టారు...
కర్షకుడికి కడుపు మండి కన్నెర్ర చేస్తున్నాడు. తాను చేస్తున్న పని నుంచి ‘సెలవు’ (లీవ్) తీసుకోవడంతో పాటు మార్కెట్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు. అంతే కాదు వచ్చే జూన్నెలలో పదిరోజుల పాటు ఆహారధాన్యాలు, కూరగాయలు, పాల వంటి నిత్యావసరాలను వినియోగదారులకు అమ్మకూడదని తీర్మానించారు. ఎందుకు ? రుణమాఫీతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలంటూ దేశవ్యాప్తంగా రైతులు రొడ్డెక్కుతున్నారు. ఈ డిమాండ్లపై గత నెల 23న దేశరాజధాని ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించాలనే రైతుసంఘాల ప్రయత్నం ఫలించలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్త ఉద్యమాన్ని చేపట్టడంలో భాగంగా జూన్ 1 నుంచి మార్కెట్లలో పాలతో సహా కూరగాయలు, ఆహారధాన్యాలేవీ అమ్మకూడదని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా రైతుసంఘాలు ఈ మేరకు ఆందోళనలు నిర్వహించనున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని రైతుసంఘాలకు భిన్నంగా హరియాణా రైతులు రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ నాయకత్వంలో ‘సెలవుపై రైతులు’ (కిసాన్ అవ్కాశ్) చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిరసనల్లో భాగంగా తమ తమ గ్రామాల్లో ధర్నాలు చేపట్టడంతో పాటు మార్కెట్లో ఏ వస్తువు కూడా అమ్మకూడదని, ఏదీ కొనకూడదనే నిర్ణయానికి వచ్చారు. ఏకగ్రీవ నిర్ణయం... రైతుసంఘాల భేటీలో ‘కిసాన్ అవ్కాశ్’పై ఏకగ్రీవ నిర్ణయాన్ని తీసుకున్నారు. కనీసం పదిరోజుల పాటు నిరసనలు కొనసాగించి, పొడిగింపుపై నిర్ణయిస్తారు.. మహాసంఘ్లోని ఏడు రైతు సంఘాల్లోని సభ్యులతో పాటు ఇతర రైతులు ఈ ఆందోళనల్లో పాల్గొంటారు. శాంతియుత పద్ధతుల్లో నిరసనల ద్వారా తమ ఐకమత్యాన్ని నిరూపించాలని భావిస్తున్నారు. -
జూన్ 1 నుంచి ‘కియో’ పనులు
పెనుకొండ రూరల్ : దక్షిణ కొరియాకు చెందిన కియో కార్ల కంపెనీ జూన్ 1 నుంచి పనులు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. బుధవారం ఆయన మండలంలోని అమ్మవారుపల్లి సమీపంలో పరిశ్రమలకు చెందిన 599.38 ఎకరాల భూములను కియో ప్రతినిధులు కిమ్, హవాన్, జిన్, లీ తో కలిసి పరిశీలించారు. దుద్దేబండ క్రాస్ సమీపంలోని టూరిజం గెస్ట్‌హౌస్‌ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడ త్వరలో పనులు ప్రారంభించనున్నామని, విద్యుత్, నీటి సమస్య, ఇంజనీర్లు ఉండేందుకు గదులను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో రామమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరిజవహర్‌లాల్ నాయక్, ఇరిగేషన్ ఎస్ఈ సుబ్బరాయుడు, డీపీఓ జగదీశ్వరమ్మ ఉన్నారు. -
డెల్టాకు జూన్ 1 కి నీరు విడుదల
అమలాపురం : గోదావరి డెల్టా కాలువలకు జూన్ 1 నుంచి సాగునీరు విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మే 15 నాటికి సాగునీరు ఇస్తే ప్రకృతి వైపరీత్యాల నుంచి గట్టెక్కవచ్చని... అపరాలు పండించుకునే అవకాశం దక్కుతుందని రైతులు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఈ నెల 6వ తేదీన ‘ఖరీఫ్‌పై నీలి నీడలు’ శీర్షికన సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో కనీసం జూన్ 1 నాటికైనా సాగునీరు విడుదల చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్రిటీష్ హయాంలో మే 15 నాటికి సాగునీరు విడుదల చేసేవారు. తరువాత రెండు పంటల విధానం రావడంతో నీటి విడుదల జూ¯ŒS 15 తరువాతకు మారింది. ఈ విధానం వల్ల ఖరీఫ్ పంట కోతల సమయంలో భారీ వర్షాలు, తుపాన్ల తో రైతులు రూ.కోట్ల పంటను కోల్పోతున్నారు. అడ్డంకులు ఇవే జూన్ 1 నాటికి నీరు విడుదల చేస్తే జూలై 1 నాటికి నాట్లు పడతాయి. ఈ సమయంలో తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు కనీసం 9 వేల క్యూసెక్కులు విడుదల చేయాలి. నైరుతి ఆలస్యమై వర్షాలు పడకుంటే నీటి ఎద్దడి ఏర్పడుతుంది. 2010 ఖరీఫ్ ఆరంభంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో సçహజ జలాలు 2 వేల క్యూసెక్కులు మించి ఉండవు. సీలేరు నుంచి వచ్చే అవకాశం తక్కువ. ∙కాలువలు మూసిన తరువాత పట్టిసీమ ద్వారా నీరు తోడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జూన్ 1 నాటికి నీరు విడుదల చేయాల్సి వస్తే ఆ సమయంలో వర్షాలు ఉండనందున పట్టిసీమ నిలిపివేయాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నీరు విడుదలకు అంగీకరిస్తుందా? అనేది చూడాల్సి ఉంది. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం డెల్టాలో మూడు పంటలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో జూన్ 1 నాటికి నీరు విడుదల చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చిన వెంటనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. – రాంబాబు, ఎస్ఈ, ధవళేశ్వరం -
సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు
హైదరాబాద్ : వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా.. సికింద్రాబాద్ నుంచి కాకినాడకు మరో ప్రత్యేక రైలును జూన్ 1, 2వ తేదీలలో నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. 07201 నెంబర్ గల రైలు కాకినాడలో జూన్ 1వ తేదీ రాత్రి 11 గంటలకు బయలుదేరి గుంటూరు మీదుగా ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి జూన్ 2న (07202) సికింద్రాబాద్‌లో రాత్రి 9.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు కాకినాడ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన జారీ చేసింది. -
జూన్ 1 నుంచి 'అటల్ పింఛన్ యోజన'
న్యూఢిల్లీ: పింఛన్‌దారుల కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ పింఛన్ యోజన పథకాన్ని జూన్ 1 నుంచి ప్రారంభించనుంది. గత యూపీఏ హయాంలో స్వావలంభన్ యోజనగా ఉన్న ఈ పథకం పేరును ఎన్డీఏ ప్రభుత్వం అటల్ యోజనగా మార్చింది. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికుల కోసం దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న కార్మికులు దీనికి అర్హులని ఆర్థిక సేవల కార్యదర్శి హస్ముఖ్ అథియా తెలిపారు. 60 ఏళ్లు దాటిన తరువాత నెలకు రూ.1000 నుంచి 5000 వరకు పింఛన్ లభిస్తుందని ఆయన తెలిపారు. ప్రతీ కార్మికుడు పింఛన్‌కు చెల్లించే సంవత్సర మొత్తంలో సగం లేదా రూ.1000 ఏదీ తక్కువైతే అది ప్రభుత్వం వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు.