దక్షిణ కొరియాకు చెందిన కియో కార్ల కంపెనీ జూన్ 1 నుంచి పనులు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.
పెనుకొండ రూరల్ : దక్షిణ కొరియాకు చెందిన కియో కార్ల కంపెనీ జూన్ 1 నుంచి పనులు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. బుధవారం ఆయన మండలంలోని అమ్మవారుపల్లి సమీపంలో పరిశ్రమలకు చెందిన 599.38 ఎకరాల భూములను కియో ప్రతినిధులు కిమ్, హవాన్, జిన్, లీ తో కలిసి పరిశీలించారు.
దుద్దేబండ క్రాస్ సమీపంలోని టూరిజం గెస్ట్‌హౌస్‌ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడ త్వరలో పనులు ప్రారంభించనున్నామని, విద్యుత్, నీటి సమస్య, ఇంజనీర్లు ఉండేందుకు గదులను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో రామమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ హరిజవహర్‌లాల్ నాయక్, ఇరిగేషన్ ఎస్‌ఈ సుబ్బరాయుడు, డీపీఓ జగదీశ్వరమ్మ ఉన్నారు.