water release
-
కృష్ణమ్మ పరవళ్లు
శ్రీశైలంప్రాజెక్ట్/ విజయపురిసౌత్/సత్రశాల (రెంటచింతల)/తాడేపల్లి రూరల్ : ఆయా ప్రాజెక్టుల నుంచి శుక్రవారం నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో పరీవాహక ప్రాంతాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయం గత మూడురోజులుగా గరిష్టస్థాయి 885 అడుగుల వద్ద ఉంది. ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి వస్తున్న నీటి ప్రవాహాన్ని బట్టి దిగువ ప్రాజెక్ట్‌లకు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,26, 281 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. 2గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు 55, 782 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం నీటిమట్టం 884.60 అడుగులకు చేరుకుంది. సాగర్ 12 క్రస్ట్‌గేట్ల ద్వారా..నాగార్జునసాగర్ నుంచి 12 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ జలాశయం 12 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 96,324 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 589.30 అడుగుల వద్ద ఉండగా, ఇది 309.9534 టీఎంసీలకు సమానం. పులిచింతల నుంచి..నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ద్వారా 1,93,966 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేశారు. ప్రాజెక్టు రిజర్వాయర్‌లో గరిష్ట నీటి సామర్థ్యం 7.080 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 6.860 టీఎంసీలు నిల్వ ఉంది.ప్రకాశం బ్యారేజ్ నుంచి..ప్రకాశం బ్యారేజ్ వద్దకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రావడంతో ప్రాజెక్టు 70 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 2 లక్షల 20 వేల 500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్ట్, ఇతర వాగుల నుంచి 2 లక్షల 36 వేల 158 క్యూసెక్కుల వరదనీరు ప్రకాశం బ్యారేజ్‌కు వచ్చి చేరుతోంది. బ్యారేజీ రిజర్వాయర్‌లో 12 అడుగుల నీటిమట్టం కొనసాగుతుండగా.. తూర్పు డెల్టా కాలువకు 8 వేల 632 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 7 వేల 26 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. -
కృష్ణమ్మ పరవళ్లు
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/సత్రశాల (రెంటచింతల)/తాడేపల్లిరూరల్/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. శుక్రవారం వరదనీరు భారీగా వచ్చి చేరడంతో 10 గేట్లను 10 అడుగులకు తెరిచి నాగార్జునసాగర్‌కు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 213.88 టిఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 884.70 అడుగులకు చేరుకుంది.నాగార్జున సాగర్ 26 గేట్ల నుంచి స్పిల్‌వే మీదుగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00అడుగులుగా ఉంది. 26 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని దిగువ కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ క్రస్ట్‌గేట్లు ద్వారా 2,85,222 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేయగా.. ప్రాజెక్టు 12 క్రస్ట్‌గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్ల నుంచి 3 లక్షల 22 వేల 606 క్యూసెక్కుల వరద నీటిని కిందకు విడుదల చేశారు. -
తుమ్మిళ్ల లిఫ్టు వద్ద ఉద్రిక్తత
రాజోళి/ శాంతిగనర్: జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసే క్రమంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్కి చెందిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఏఐసీసీ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మధ్య వివాదం ఏర్పడి పోటాపోటీగా ఆందోళనకు దిగారు. జిల్లాలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరందించేందుకు తుంగభద్ర నదిపై నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ప్రస్తుతం నీరు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఉదయం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తుమ్మిళ్లకు వెళ్లి మోటార్లు ఆన్ చేసి, పూజలు చేసేందుకు డీ–23 కెనాల్ వద్దకు వెళ్లారు. అనంతరం ఏఐసీసీ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తుమ్మిళ్ల వద్దకు వచ్చారు.అయితే తాను మోటార్ ఆన్ చేసినప్పటికీ కెనాల్లో నీరు విడుదల కాలేదని, దీనికి సంపత్‌కుమారే కారణమని ఎమ్మెల్యే విజయుడు ఆరోపించి, ఆందోళన చేస్తూ బైఠాయించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎమ్మెల్యేగా తాను ప్రోటోకాల్ ప్రకారమే నీటిని విడుదల చేసేందుకు వచ్చానని, తాను ఆన్ చేసిన తర్వాత మళ్లీ ఆయన ఏ హోదాలో ఆఫ్ చేస్తారని, వెంటనే సంపత్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నీటిని విడుదల చేసేదాకా అక్కడి నుంచి వెళ్లనని తేలి్చచెప్పారు. పోలీసులు ఎంతసర్ది చెప్పినా వినలేదు.మరోవైపు తుమ్మిళ్ల నుంచి డీ–23కి కాంగ్రెస్ కార్యకర్తలతో బయలుదేరిన సంపత్ కుమార్‌ను పోలీసులు పచ్చర్లలోనే నిలిపేశారు. దీంతో ఆయన పోలీసులపై మండిపడ్డారు. కాగా.. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన పోలీసులు ఎమ్మెల్యే విజయుడిని అరెస్టు చేశారు. కాగా.. తనపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటిలో వాస్తవం లేదని నిరూపించుకునేందుకు నీటి విడుదల తన ఆధ్వర్యంలోనే చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆర్డీఎస్ కెనాల్ వద్ద సంపత్‌కుమార్ నిరసనకు దిగారు. చివరికి నాటకీయ పరిణామాల మధ్య ఉదయం విడుదల కావాల్సిన నీరు సాయంత్రం 4.15 గంటలకు అధికారులే విడుదల చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి పోటాపోటీగా సాగునీరు విడుదల
-
ఆన్.. ఆఫ్.. ఆన్!
సాక్షి ప్రతినిధి కర్నూలు: హంద్రీ–నీవా నీటి విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. సకాలంలో నీళ్లివ్వకుండా రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందకుండా చేస్తోంది. కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిని ‘సాక్షి’ రెండు రోజులుగా ఎండగట్టడంతో గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత హంద్రీ–నీవా ఎస్ఈ రామగోపాల్ మల్యాల పంప్‌హౌస్ వద్ద పూజలు చేసి రెండు పంపులు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. మొత్తం 12 పైపులకుగానూ కేవలం రెండు పంప్‌లు మాత్రమే ఆన్ చేయడం గమనార్హం. అయితే గంటలోపే స్విచ్ ఆఫ్ చేసి నీటి విడుదలను నిలిపివేశారు. మల్యాల నుంచి నీళ్లు బ్రాహ్మణకొట్కూరు సమీపంలోకి రాగానే పంపులు స్విచ్ ఆఫ్ చేశారు. మళ్లీ రాత్రి ఏడున్నర గంటల సమయంలో హడావుడిగా ఒక్క పంపు ఆన్ చేసి 337.6 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటిస్తుండటంతో కొత్త అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి కాకపోయినా నీటిని విడుదల చేశారు. పాత అప్రోచ్ రోడ్డును జేసీబీలతో తొలగించారు. 500 క్యూసెక్కులు కూడా కష్టమే!కొత్తగా నిర్మించిన అప్రోచ్ రోడ్డులో 13 చిన్న సైజు సిమెంట్ పైపులను అమర్చారు. కాలువలో పూర్తిస్థాయి నీటి మట్టం ఉన్నప్పుడు 2,200–2,500 క్యూసెక్కులు ప్రవహించే సామర్థ్యం ఉంది. ఇప్పుడు అమర్చిన చిన్న పైపులతో 500 క్యూసెక్కులు కూడా ప్రవహించడం కష్టమేనని తెలుస్తోంది. పాత అప్రోచ్ రోడ్డు నిర్మాణ సమయంలో నీరు ప్రవహించేందుకు వీలుగా పుట్టా సంస్థ పైపులు వేయకపోవడమే ఈ దుస్థితికి కారణం. రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో 45 చోట్ల టీడీపీ కూటమి ఎమ్మెల్యేలే గెలిచినా సీమ రైతన్నల ప్రయోజనాలను కాపాడేందుకు గొంతు విప్పకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
సాగర్‌కు పోటెత్తిన కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట: నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు నాగార్జునసాగర్‌లోకి 2,18,622 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 526.8 అడుగుల వద్ద 161.97 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నిండాలంటే ఇంకా 151 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో మరో ఐదారు రోజుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,62,411 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. ఎనిమిది గేట్లు పది అడుగుల మేర ఎత్తి.. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 2,83,360 క్యూసెక్కుల నీటి ని దిగువకు వదిలేస్తున్నారు.ఆ జలాలు నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా ప్రధాన పాయతోపాటు మలప్రభ, ఘటప్రభలు వరదెత్తుతున్నాయి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 3.42 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 3.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 3.35 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 3.22 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.జూరాల ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 2.81 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగ, భద్ర, ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటం.. భద్ర డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో గురువారం ఉదయం 9 గంటల నుంచి తుంగభద్రలో ప్రవాహం రెండు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని డ్యామ్ అధికారులను సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) అప్రమత్తం చేసింది. ఆ మేరకు దిగువకు వరదను విడుదల చేస్తామని తుంగభద్ర బోర్డు అధికారులు ఏపీ, తెలంగాణ అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణా, తుంగభద్రల్లో వరద పెరిగిన నేపథ్యంలో గురువారం నుంచి శ్రీశైలానికి చేరే వరద మరింత పెరగనుంది. మిడ్‌మానేరుకు జలకళ బోయినపల్లి(చొప్పదండి): నిన్నటిదాకా వెలవెలబోయిన మిడ్‌మానేరు ప్రాజెక్టుకు ప్రస్తుతం జలకళ సంతరించుకుంది. సీజన్ ప్రారంభమై రెండు నెలలైనా శించిన మేర వర్షాలు కురవకపోవడంతో మిడ్‌మానేరుకు పెద్దగా వరద చేరలేదు. దీంతో పంటల సాగుపై రైతులు ఆందోళన చెందారు. ఈక్రమంలో కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదనీరు భారీగా చేరడంతో జూలై 27న గాయత్రి పంప్‌హౌస్ నుంచి వరదకాల్వ ద్వారా మిడ్‌మానేరుకు నీటి విడుదల ప్రారంభించారు.మిడ్‌మానేరు ప్రాజెక్టులో ఐదు రోజుల క్రితం 5.90 టీఎంసీల నీటినిల్వ మాత్రమే ఉంది. రోజుకు15 వేల క్యూసెక్కుల చొప్పున ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల జరగడంతో బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు ప్రాజెక్టులో 10.55 టీఎంసీల మేర నీటినిల్వ ఉంది. ప్రాజెక్టులోకి నీరు చేరడంతో సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పరిధిలోని గంగాధర, రామడుగు, బోయినపల్లి మండలాలకు చెందిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
నిండుగా కృష్ణమ్మ ప్రవాహం
సాక్షి,హైదరాబాద్/నాగర్‌కర్నూల్/ధరూర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతోంది. గురు వారం జూరాల ప్రాజెక్టుతోపాటు తుంగ భద్ర నుంచి కలిపి 2.54 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులో వచ్చి చేరింది. జూరాల లో విద్యుదుత్పత్తితోపాటు ప్రాజెక్టు 46 క్రస్టుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఆల్మట్టి నుంచి 2,75,000 క్యూసెక్కులు, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 2,50,120 క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది.శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 885 అడుగులు కాగా, వరదనీటితో 855.20 అడుగులకు చేరింది. కృష్ణానదిలో వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో వారంరోజుల్లో శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయిలో నిండుతుంది.2021లో జూలై నెలలోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయగా, రెండేళ్లుగా నీటి ప్రవాహం లేక ప్రాజెక్టు నిండలేదు. సాగర్ ఎడమకాల్వకు నీటి నిలిపివేత నాగార్జునసాగర్: సాగర్ ఎడమకాల్వకు గురువారం ఉదయం నీటిని నిలిపి వేశారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ పరిధిలోని గ్రామాలకు తాగునీటిని అందించడం కోసం వా రం రోజుల పాటు 1.5 టీఎంసీల నీటిని విడుదల చేశారు.మళ్లీ పెరుగుతున్న గోదావరి భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి మళ్లీ పెరిగింది. రెండు రోజుల క్రితం 51.2 అడుగుల నీటిమట్టం ఉండగా, క్రమంగా తగ్గుతూ బుధవారం రాత్రి 45 అడుగులకు చేరుకుంది. అయితే మళ్లీ గురువారం ఉదయం నుంచి వరద పెరుగుతూ ఒంటిగంటకు 48 అడుగులకు చేరడంతో కలెక్టర్ జితే‹Ù.వి.పాటిల్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరుగులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణానది వరద ఉధృతికి కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్‌లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఆ రాష్ట్ర అధికారులు బుధవారం డ్యామ్ గేట్లు 9 ఎత్తి దిగువకు 37,260 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు తీస్తూ వస్తోంది. జూరాల ప్రాజెక్టులో నీటినిల్వ ఇప్పటికే 7.66 టీఎంసీలు ఉన్న నేపథ్యంలో..ఒక్క రోజులోనే ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. ఆ తర్వాత జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటికి విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద చేరే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధానపాయ, ఉపనదుల్లో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి డ్యామ్‌లోకి 92,836 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరింది. దీంతో ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తి 65 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఆ జలాలు నారాయణపూర్ డ్యామ్‌లోకి చేరుతున్నాయి. కృష్ణా ప్రధానపాయలో వరద మరో నాలుగైదు రోజులు ఇదే రీతిలో కొనసాగే అవకాశముందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 49,522 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 39.72 మీటర్లకు చేరుకుంది. సాగర్ కుడి కాలువకు నీటి విడుదల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీ 4.5 టీఎంసీలు.. తెలంగాణకు 5.414 టీఎంసీల నీటిని కేటాయిస్తూ మంగళవారం కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సాగర్‌లో నీటిమట్టం కనీస స్థాయికి దిగువన ఉన్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 5.705 టీఎంసీలను విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా ఏపీ 15,800, ఎడమ కేంద్రం ద్వారా తెలంగాణ 6,357 వెరసి 22,157 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో నీటినిల్వ 33.24 టీఎంసీలకు తగ్గింది. సాగర్‌లోకి 21,481 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 122.69 టీఎంసీలకు చేరుకుంది. తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు బుధవారం 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.వరద గోదావరిభద్రాచలం వద్ద బుధవారం రాత్రి 21 అడుగులకు చేరే అవకాశంభద్రాచలం అర్బన్: గోదావరి నిండుకుండను తలపిస్తోంది. భద్రాచలం వద్ద ఈ నెల 13వ తేదీ నుంచి 13 అడుగుల మేర నీటిమట్టం నిలకడగా ఉంది. రెండు,మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద వచ్చి చేరుతుండడంతో మంగళవారం రాత్రి 14.5 అడుగులకు చేరింది. ఆపై అంతకంతకూ పెరుగుతూ బుధవారం సాయంత్రం 5 గంటలకల్లా 18.1 అడుగులకు చేరుకుంది. కాగా, బుధవారం రాత్రి మరో మూడు అడుగుల మేర పెరిగి 21 అడుగులకు చేరే అవకాశముందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు నదిలోకి దిగొద్దని హెచ్చరిస్తున్నారు.‘తాలిపేరు’కు పోటెత్తుతున్న వరదచర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండ లంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిలాల్లో కురు స్తున్న భారీ వర్షాలతో బుధవారం ఉదయం ప్రాజెక్టు 25 గేట్లలో 12 గేట్లు అడుగు మేర ఎత్తి 16,698 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అయినా వరద ఉధృతి ఆగ లేదు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు 22 గేట్లు అడుగు మేర ఎత్తి ద్వారా 63 వేల క్యూ సెక్కుల నీటిని విడుదల చేశారు. సాయంత్రానికి వరద మరింతగా పెరగగా, 20 గేట్లను రెండేసి అడుగుల మేర, మిగతా ఐదు గేట్లను పూర్తిగా ఎత్తి 70,750 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. -
నాగార్జున సాగర్ కుడి కాలువ..నీటి విడుదల చేసిన ఏపీ సర్కార్ !
-
స్తబ్దుగా గోదావరి
సాక్షి, అమలాపురం: గలగలా గోదావరి... స్తబ్దుగా ఉంది. ‘నైరుతి’ ముఖం చాటేయడంతో ఈ ఏడాది గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో పెద్దగా వర్షాలు పడలేదు. ఆ ప్రభావం ఇన్‌ఫ్లోపై పడింది. నైరుతి ముగియడం, వరదల సీజన్ కూడా అయిపోవడంతో జలాల రాక క్రమేణా తగ్గిపోయి ఇన్‌ఫ్లో తక్కువ స్థాయిలో నమోదవుతోంది. గడచిన రెండురోజులుగా బ్యారేజ్ నుంచి దిగువునకు నీటి విడుదల ఆగిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభావం వచ్చే రబీపై పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆశాజనకం గతేడాది జూలైలో చరిత్రలో రెండో అతి పెద్ద వరద రాగా, ఆగస్టు, సెప్టెంబరుల్లో కూడా అది కొనసాగింది. అక్టోబరు ఇదే సమయానికి బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 6,231 టీఎంసీలు నమోదవ్వగా, ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు విస్తృతంగా పడే ఆగస్టు, సెప్టెంబరుల్లో కూడా వరద జాడ లేదు. గతంలో అంటే... 2016లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆ ఏడాది బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 2,750.944 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. రబీ మొత్తం ఆయకట్టుకు అనుమతి ఇచ్చినా తరువాత కొంత అనధికారికంగా కోత విధించాల్సి వచ్చింది. తగ్గిన ఇన్‌ఫ్లో ధవళేళ్వరం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో గణనీయంగా పడిపోవడంతో రెండు రోజులుగా గేట్లు మూసివేసి సముద్రంలోకి నీటి విడుదల నిలిపివేశారు. ప్రస్తుత ఇన్‌ఫ్లో 14,700 క్యూసెక్కులు మాత్రమే ఉంది. దీనిలో సీలేరు పవర్ జనరేషన్ నుంచి వచ్చింది 3,765 క్యూసెక్కులు. అంటే సహజ జలాలు కేవలం 10,935 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. ఈ నీటిని తూర్పు డెల్టాకు 4,900, మధ్యడెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు 7,200 చొప్పున మొత్తం 14,700 క్యూసెక్కులు వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదిలేస్తున్నారు. -
Anantapur: చూపరులను కట్టిపడేస్తోన్న.. జలసోయగం
కూడేరు/ గార్లదిన్నె/ శింగనమల(అనంతపురం జిల్లా): కనీవినీ ఎరుగని రీతిలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు, నదులు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల వద్ద గేట్లు ఎత్తడంతో నురగలు కక్కుతూ దూకుతున్న జలసోయగం చూపరులను కట్టిపడేస్తోంది. కూడేరు మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) చరిత్రలో పది రోజుల వ్యవధిలో పలుమార్లు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం ఇదే ప్రథమం. మంగళవారం కురిసిన వర్షాలకు పీఏబీఆర్‌కు 15వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. 5.38 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జేఈఈ లక్ష్మిదేవి తెలిపారు. ఉన్న ఏడు గేట్లలో ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. గార్లదిన్నె మండలం పెనకచెర్ల వద్దనున్న మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) నిండుకుండను తలపిస్తోంది. పీఏబీఆర్ నుంచి తుంగభద్రజలాలు రోజుకు 17వేల క్యూసెక్కులు ఎంపీఆర్‌లోకి వస్తున్నాయి. ఈ డ్యాంలో 4.09 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ముందస్తు జాగ్రత్తగా రెండోసారి బుధవారం తొమ్మిది గేట్లు ఎత్తి 17వేల క్యూసెక్కులు పెన్నానది దిగువకు వదిలినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఇక జిల్లాలోనే పెద్దచెరువుల్లో ఒక్కటైన శింగనమల రంగరాయలచెరువు ఉధృతంగా మరవ పారుతోంది. దీంతో బుధవారం శింగనమల వద్ద రాకపోకలు బంద్ అయ్యాయి. అత్యవసర పనులున్న వారిని బోటు ద్వారా అవతలికి తీసుకెళ్లారు. భైరవానితిప్ప ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో బెళుగుప్ప, కణేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లో వేదావతి హగరి నది ఉగ్రరూపం దాల్చింది. -
పెన్నా నది పరవళ్లు.. సువర్ణముఖి చిందులు
సాక్షి, రామగిరి(శ్రీ సత్యసాయి జిల్లా): ఎగువ ప్రాంతం కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నమ్మ పరవళ్లు తొక్కుతూ పేరూరు చేరింది. దీంతో డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇప్పటి వరకూ ఒకటిన్నర టీఎంసీ దిగువకు వదిలినా పేరూరు డ్యాంకు ఇన్‌ఫ్లో ఏమాత్రం తగ్గలేదని, అందుకే నీటిని ఏకధాటిగా వదలుతున్నట్లు డీఈ వెంకటరమణ తెలిపారు. భారీ వర్షాలతో మూడు దశాబ్దాల తర్వాత పేరూరు డ్యాం నిండుకుండను తలపించగా... గత నెలలో తొలిసారి పేరూరు డ్యాం గేట్లు ఎత్తారు. తాజాగా సోమవారం మరోసారి గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతుండగా.. ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పలు గ్రామాల ప్రజలు డ్యాం వద్దకు వస్తున్నారు. సువర్ణముఖి చిందులు నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి మరువ పారిన చెరువులు అగళి: 20 రోజులుగా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి సువర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు అగళి మండలంలోని మధూడి, ఇరిగేపల్లి, కోడిపల్లి, రావుడి, వడగుంటనపల్లి చెరువుల్లో చేరడంతో నాలుగు దశాబ్దాల తర్వాత అవన్నీ మరువ పారాయి. దీంతో స్థానికులు తండోపతండాలుగా వచ్చి మరువపారుతున్న ప్రాంతాల్లో జలకాలాటలు ఆడారు. (క్లిక్: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!) -
హిమాయత్ సాగర్ : మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
-
ఏపీ: జూన్ 15 నుంచి గోదావరి డెల్టాకు నీటి విడుదల
సాక్షి, అమరావతి: గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటల సాగు కోసం జూన్ 15 నుంచి నీటిని విడుదల చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగకుండా గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు చింతా అనురాధ, మార్గాని భరత్, ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో గురువారం ఆయన వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. చదవండి: కేంద్రం ఇవ్వట్లేదు.. మేమే కొంటున్నాం యాస్ బలహీనం: తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు వర్షాలే -
సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల
నల్లగొండ: నాగార్జున సాగర్ జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నీటిని విడుదల చేశారు. సాగర్ ఆయకట్టు కింద ఎడమ కాల్వ ద్వారా నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. దీంతో పాటు ఎత్తిపోతల పథకాలైన లో లెవల్ కెనాల్, ఏఎమ్మార్పీ కాల్వలకు కూడా మంత్రులు సాగునీరు విడుదల చేశారు. శ్రీశైలం నుంచి వస్తున్న భారీ వరదతో నాగార్జున సాగర్ వేగంగా నిండుతోంది. శ్రీశైలం డ్యాంలోకి వరద ప్రవాహం భారీగా ఉండడంతో పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 7,86,752 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో కాలువలకు నీటిని విడుదల చేశారు. దీనిపై మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో వ్యవసాయానికి నీటి విడుదల చేశామని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలతో సహజ వనరుల పంపిణీకి ముఖ్యమంత్రి కేసీఆర్ అందరిని కలుపుకు పోతున్నారని అభిప్రాయపడ్డారు. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలకు మేలు చేకూరే విధంగా కేసీఆర్ నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. కేసీఆర్‌ను పెద్దన్నలా భావించి రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు చేకూరేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు పోతున్నారని పేర్కొన్నారు. రైతాంగాన్ని ఆదుకునే విధంగా పరస్పర సహకారంతో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమాంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
చెరువులకు నీరు చేరేలా..!
గుర్రంపోడు : ఏఎమ్మార్పీ పరిధిలో ఉండి.. ఇప్పటి వరకు నీరందని చెరువులను నింపేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కాల్వకు నీటిని విడుదల చేసిన సమయంలో వంద కిలోమీటర్ల ప్రధానకాల్వ పొడవునా గల 129 చెరువుల్లో వంద చెరువులకు ఏదో విధంగా ఎంతోకొంత నీరు చేరుతోంది. కాగా అసలే నీరు చేరని 29 చెరువులను గుర్తించి వాటికి మేజర్, మైనర్ కాల్వలపై తూములు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఏఎమ్మార్పీ డివిజన్ పరిధిలో 29 చెరువులు నింపేలా తూములకు 13 పనులకుగాను రూ.74 లక్షల వ్యయంతో టెండర్లు పిలిచారు. 45 రోజుల్లో పనులు పూర్తి చేసి ఖరీఫ్ నాటికి తూములు సిద్ధం చేయనున్నారు. తూముల నిర్మాణాలతో రైతుల ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. గతంలో ఇలా.. ఏఎమ్మార్పీ ద్వారా పంటలకు నీరందక.. ఇటు చెరువులూ నిండక వదిలిన నీరెటుపోతుందో అర్థంగాక రైతులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడేవారు. దీన్ని అధిగమించేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఏఎమ్మార్పీ కాల్వలను ఆరుతడికి పంటలకు మాత్రమే డిజైన్ చేసి తవ్వారు. ఏఎమ్మార్పీకి నీటి కేటాయింపులు సరిపడా లేనందున పూర్తి ఆయకట్టుకు కాల్వల ద్వారా నీరందించడం కష్టసాధ్యమవుతుంది. కనీసం చెరువులైనా నింపాలని ప్రజాప్రతినిధులు, రైతుల డిమాండ్ మేరకు అధికారులు నెల రోజులుగా ఆయకట్టు చెరువులన్నింటినీ పరిశీలించారు. ఏఎమ్మార్పీ కాల్వల నుంచి నీరు చేరని చెరువులను గుర్తించి ప్రత్యేకంగా తూముల నిర్మాణాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కొత్తగా తూములు నిర్మించనున్న ప్రాంతాలు ఇవే.. ఏఎమ్మార్పీ పరిధిలోని డి–23 కాల్వపైన చెరువులకు నీటి విడుదలకుగాను కొత్తగా తూములు నిర్మించి చామలోనిబావి, పెద్దబావి కుంట, తాటి చెరువు, డి–25 మేజర్‌పై ఆప్టేక్ గేట్ నిర్మించి కొప్పోలులోని చింతలచెరువు, కొత్తకుంట, నడికూడ చెరువులను నింపనున్నారు. డి–22 కాల్వలో కొత్తగా నిర్మించే తూము వల్ల పిట్టలగూడెం వద్ద గల బలుచకుంట, చవుటకుంట నింపడానికి వీలుంటుంది. ఇదే మేజర్‌పై మరో రెండు చోట్ల తూములు నిర్మించి ఆమలూరు, బొల్లారం, గుర్రంపోడు గ్రామాల కుంటలను నింపనున్నారు. డి–37లో 23వ కిలోమీటరు వద్ద తూము నిర్మాణంతో మావిండ్ల వారికుంట, మోదుగులకుంట, వేములచెరువు, ఇదే కాల్వపై 8వ కిలోమీటరు వద్ద తూముతో మంచినీళ్ల బావి, పెద్ద చెరువు, 11వ కిలోమీటరు వద్ద తూముతో తిమ్మరాజుకుంట, కొండయ్యకుంట, అన్నయ్యకుంట, ఊరకుంటలకు నీరు చేరనుంది. 3వ కిలోమీటరు వద్ద తూముతో ముత్యాలమ్మ కుంట, యాదయ్య చెరువులకు నీరు చేరునుంది. ఒక చెరువు కింద గల మిగతా చెరువులు కూడా ఈ తూముల వల్ల నిండి ప్రయెజనం చేకూరుతుంది. భూసేకరణ సమస్య లేని చోటే తూములు మొదటి దశలో ఎలాంటి సమస్య లేకుండా చెరువులకు నీరు చేరే వీలున్న ప్రాంతాలను గుర్తించి కాల్వలపై తూము ఏర్పాట్లకు టెండర్లు పిలిచాం. 45రోజుల్లో పనులు పూర్తి చేయించి ఈ సారి నీటిని విడుదల చేయగానే చెరువులకు నీరు చేరేలా సిద్ధం చేస్తాం. ఏఎమ్మార్పీ ఆయకట్టులో నీరు చేరని చెరువులను పరిశీలించి ఎలాంటి వివాదాలు, భూసేకరణ సమస్య లేకుండా తాము ఇక్కడి నుంచి నీటిని చెరువులకు, కుంటలకు మళ్లించుకుంటామని రైతులు కోరిన చోట్ల తూములు ఏర్పాటు చేస్తున్నాం. మిగతా విడతల్లో మరికొన్నింటిని పరిశీలిస్తాం. – అజయ్‌కుమార్, డివిజన్ ఈఈ -
రైతులకు ఊరట
అమరచింత: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మొత్తం 17 తాగునీటి పథకాలకు గాను 16 రక్షిత పథకాలకు తాగునీటి కష్టాలు తప్పనున్నాయి. ఆల్మట్టి నుంచి జూరాల ప్రాజెక్టుకు 2.5 టీఎంసీల నీరు వచ్చిచేరుతుండటంతో దీనిపై ఆధారపడిన రక్షిత పథకాలకు ఊరట కలిగింది. శుక్రవారం జూరాల ప్రాజెక్టు ఎడమకాల్వ నుంచి 150 క్యూసెక్కుల నీటిని రామన్‌పాడు రిజర్వాయర్‌కు పీజేపీ అధికారులు వదిలారు. ఇది వారంరోజుల పాటు కొనసాగుతుందని వారు తెలిపారు. జూరాల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌కు అనుసంధానంగా ఉన్న పస్పుల, పారేవుల, జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్న సత్యసాయి రక్షిత పథకాలకు నెలరోజుల క్రితం ఇంటేక్ వెల్‌కు అందకపోవడంతో మోటార్లు బిగించి ఆయా గ్రామాలకు తాగునీరు అందించారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో ఉన్న ఆల్మట్టి డ్యాం నుంచి 15రోజుల క్రితం 2.5 టీఎంసీల నీరు వదలడంతో నారాయణ్‌పూర్ డ్యాంకు చేరింది. అక్కడి నుంచి నాలుగు రోజులుగా ప్రియదన్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తోంది. ముఖ్యమంత్రి చొరవతో.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన తాగునీటి పథకాలకు ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కర్ణాటక సీఎం కుమారస్వామితో జరిపిన చర్చల కారణంగా ఆల్మట్టి నుంచి జూరాలకు 2.5 టీఎంసీల నీరు వచ్చి చేరుకుంటోంది. వాస్తవానికి సుమారు 400 గ్రామాలు రామన్‌పాడు, సత్యసాయి వాటర్ స్కీంలతో దాహార్తిని తీర్చుకుంటున్నాయి. వేసవిలో జూరాల డెడ్‌స్టోరేజీకి చేరుకోవడంతో సత్యసాయి రక్షిత పథకం కొన్నిరోజులు నిల్చిపోయింది. చివరకు జూరాలలో మోటార్లను దింపి సత్యసాయి రక్షిత పథకాలకు తాగునీటిని అధికారులు అందించగలుగుతున్నారు. పరిస్థితి ఇలాఉంటే వేసవిలో ప్రజలకు తాగునీరు అందించలేకపోతామని ఆర్డబ్ల్యూఎస్, పీజేపీ అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతీసుకోవడంతో జూరాలపై ఆధారపడిన రక్షిత పథకాలకు తాగునీటి కష్టాలు తీరినట్టేనని భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు జూరాల బ్యాక్‌వాటర్‌లో నీటిమట్టం అడుగంటగా.. నేడు ఆల్మట్టి నుంచి వచ్చి చేరుతున్న నీటితో జలాశయం కళకళలాడుతోంది. మోటార్ల తొలగింపు ఆత్మకూర్: జూరాల ప్రధాన ఎడమకాల్వ పరిధిలో 17కిలోమీటర్ల వరకు రైతులు ఏర్పాటుచేసుకున్న మోటార్లు, స్టాటర్లు, ఫ్యూజులను శుక్రవారం పీజేపీ ఏఈ వసంత, వర్క్ఇన్స్పెక్టర్లు లక్ష్మయ్యగౌడ్, వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో తొలగించారు. తాగునీటి అవసరాల నిమిత్తం రామన్‌పాడు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేస్తున్నందున రైతులు సంపూర్ణంగా సహకరించాలని వారు కోరారు. -
జూరాలకు 2.5 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఈ వేసవిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటక సీఎం కుమారస్వామికి కేసీఆర్ శుక్రవారం ఫోన్ చేసి కోరారు. కేసీఆర్ అభ్యర్థనపై అక్కడి అధికారులతో చర్చించిన కుమార స్వామి తెలంగాణకు నీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి కేసీఆర్‌కు తెలిపారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త అని కేసీఆర్ అన్నారు. ఆ జిల్లా ప్రజల తరఫున కుమారస్వామికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ, స్నేహ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. వారం రోజుల్లో జూరాలకు... నిజానికి జూరాల వాస్తవ నీటి నిల్వ సామర్ధ్యం 9.66 టీఎంసీ కాగా ప్రస్తుతం అందులో కేవలం 1.93 టీఎంసీల నీటి నిల్వే ఉంది. పూర్తిగా డెడ్‌స్టోరేజీకి నిల్వలు చేరడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ భగీరథ కింద తాగునీటి అవసరాలు తీరడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి నీటి విడుదల అవస్యం కావడంతో కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి నీటి విడుదలకు ఒప్పించారు. ప్రస్తుతం ఎగువ నారాయణపూర్‌లో 37.64 టీఎంసీలకు గానూ 18.64 టీఎంసీల నిల్వలున్నాయి. అయితే ఇక్కడ ఎండీడీఎల్ పరిధిలోనే నీరుండటంతో ఆల్మట్టిలో లభ్యతగా ఉన్న 31.58 టీఎంసీల నిల్వల నుంచి కర్ణాటక నారాయణపూర్‌కు నీటి విడుదల చేసి, అటు నుంచి జూరాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. శుక్రవారం అర్ధరాత్రి లేక శనివారం నీటి విడుదల మొదలు పెట్టినా, వారం రోజుల్లో నీరు జూరాలకు చేరుతుందన్నారు. ఒక టీఎంసీ నీరు జూరాలను చేరినా జూన్ మొదటి వారం వరకు మహబూబ్‌గనర్ జిల్లా తాగునీటి అవసరాలు తీరినట్టేనని పేర్కొంటున్నారు. -
ఎస్సారెస్పీ వద్ద భారీగా బలగాలు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద శనివారం భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేసే పరిస్థితులు లేవని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు హైదరాబాద్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో తేల్చి చెప్పడంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఐదారు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఉన్నతస్థాయి సమావేశంలో నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటారని, శనివారం వరకు ఓపిక పట్టాలని అధికారులు రైతులను సముదాయిస్తూ వచ్చారు. దీంతో వారు తాత్కాలికంగా ఆందోళన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. అయితే, ప్రాజెక్టు నుంచి నీరు విడుదల సాధ్యం కాదని మంత్రి ప్రకటించడంతో రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆదివారం ఆందోళనకు దిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. ముందస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం ప్రారంభానికి ముందు నుంచే ఎస్సారెస్పీలో పోలీసులు బలగాలను పెంచారు. నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల కమిషనర్లు, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల ఎస్పీలు ఉదయమే ఎస్సారెస్పీకి చేరుకున్నారు. కాకతీయ కాలువ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలకు పోలీసు బలగాలను బృందాలుగా పంపించారు. సుమారు వెయ్యి మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. పోలీసుల మోహరింపుతో గ్రామాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా నిఘా పెంచారు. ఎస్సారెస్పీ డ్యాంపై కంచె ఏర్పాటు చేసి బందోబస్తును పెంచారు. నీటిని విడుదల చేసే వరకు ఉద్యమాలు చేపడుతామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. ఆదివారం ప్రాజెక్టు కార్యాలయం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే గ్రామాల్లోనే నిరసన తెలుపుతామని ప్రకటించారు. -
జూరాల నుంచి భీమాకు నీటి విడుదల
సాక్షి, హైదరాబాద్: జూరాల నుండి భీమా రెండో దశకు నీరు విడుదల చేయడానికి సాగునీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు 15వేల ఎకరాల పంటకు ఆఖరు తడికోసం నీటిని ఇవ్వాలన్న మంత్రి జూపల్లి సూచన మేరకు అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మూడు రోజులపాటు నీటిని విడుదల చేయనున్నారు. సమావేశంలో జూపల్లితో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, నీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు, సీఈ ఖదేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు సర్వరాయసాగర్‌కు నీరు విడుదల
కమలాపురం: వైఎస్సార్ జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నుంచి సర్వరాయసాగర్‌కు ఎట్టకేలకు నీటిని విడుదల చేశారు. 150 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. గండికోట నుంచి సర్వరాయసాగర్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కమలాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాదయాత్ర చేపట్టిన విషయం విదితమే. ఆయన డిమాండ్‌కు స్పందించిన కలెక్టర్ గండికోట నుంచి సర్వరాయసాగర్‌కు నీటిని విడుదల చేయించారు. -
ఇది ప్రజా విజయం
కడప సెవెన్‌రోడ్స్ : గాలేరు–నగరిలో అంతర్భాగమైన సర్వరాయసాగర్‌కు ఈనెల 25 నుంచి నీరు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ప్రజా విజయమని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. నీటి విడుదల కోరుతూ సర్వరాయసాగర్ నుంచి ఆయన చేపట్టిన పాదయాత్ర సోమవారం ముగిసింది. వందలాది మంది రైతులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొన్నారు. గండికోటకు 4500 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండంతో సర్వరాయసాగర్‌కు నీరు విడుదల చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరామన్నారు. దీంతో తొలుత కలెక్టర్, ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు నీరు విడుదల చేశారన్నారు. అయితే కాంట్రాక్టర్ తనకు ఆరు కోట్ల రూపాయల మామూళ్లు ఇవ్వలేదనే దాంతో ఓ టీడీపీ నేత మంత్రి ద్వారా ఒత్తిడి చేయించి నీటి విడుదలను ఆపించారని ఆరోపించారు. దీంతో తాను పాదయాత్ర చేపట్టాల్సి వచ్చిందని, ప్రజల్లో వచ్చిన అపూర్వ స్పందనకు భయపడ్డ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చి నీటి విడుదలకు అంగీకరించిందని తెలిపారు. వీఎన్ పల్లె మండలంలో 1200 అడుగుల్లో భూగర్బజలం ఉందన్నారు. చీనీ చెట్లు ఎండిపోతున్నాయని చెప్పారు. రిజర్వాయర్‌లో నీరు నింపితే భూగర్బ జలాలు పెరిగి పంటలు రక్షించుకోవచ్చన్నారు. నీళ్లు వచ్చే వరకు ప్రభుత్వం మాటలు నమ్మాల్సిన పని లేదన్నారు. మాట తప్పితే కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తామని, జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు హోరెతిస్తామని హెచ్చరించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే గాలేరు–నగరి పూర్తి చేసి కమలాపురం నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కరువుకు నిలయమైన జిల్లాను కోస్తా లాగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో 250 కిలోమీటర్ల దూరంలోని కృష్ణా నీటిని వైఎస్ తీసుకొచ్చారన్నారు. గాలేరు–నగరికి రూ. 4800 కోట్లు కేటాయించి 85 శాతం పనులు పూర్తి చేయించిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ఆయన మృతి చెందాక ఈ పదేళ్ల కాలంలో ప్రభుత్వాలేవి ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేవలం ఉద్యోగుల జీతాల కోసం మాత్రమే చంద్రబాబు బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారని దుయ్యబట్టారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పోరాట పటిమ వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంత శాశ్వత సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఇదే ఉత్సాహంతో ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ సర్వరాయసాగర్‌కు నీరివ్వాలన్న కోరిక అసాధ్యమైనదేమి కాదన్నారు. నీరిస్తే ప్రజలకు వైఎస్ గుర్తొస్తాడనే ఉద్దేశంతోనే ఆపేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి తప్ప రైతులు పట్టడం లేదన్నారు. పోలవరం కాలువలను ఏనాడో పూర్తి చేసింది వైఎస్సారేనని అన్నారు. తాను, దివంగత మంత్రి బిజివేముల వీరారెడ్డి కలిసి తెలుగుగంగను పూర్తి చేయాలని కోరగా, నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు డబ్బులు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల పట్ల ఆయనకు ఏనాడూ చిత్తశుద్ధి లేదన్నారు. కడప ఎమ్మెల్యే అంజద్‌బాష మాట్లాడుతూ పాదయాత్రతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిందని, ఎట్టకేలకు దిగొచ్చి సర్వరాయసాగర్‌కు నీరిస్తామని ప్రకటించిందన్నారు. గండికోటలో పుష్కలంగా నీరున్నప్పటికీ సర్వరాయసాగర్ కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తంపట్నం రిజర్వాయర్లలో ముఖ్యమంత్రి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. పట్టిసీమ, పురుషోత్తంపట్నంపై ఖర్చు చేసిన డబ్బును పోలవరంపై చేసి ఉంటే రాయలసీమకు నీరొచ్చి ఉండేదని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన మేయర్ సురేష్‌బాబు మాట్లాడుతూ సీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం వైఎస్ ఎన్నో ఉద్యమాలు నిర్వహించారన్నారు. 2004లో అధికారంలోకి రాగానే జలయజ్ఞం చేపట్టారన్నారు. పుష్కలంగా నిధులు కేటాయించి పనులను పరుగులెత్తించారన్నారు. ప్రస్తుతం గండికోటలో 8 టీఎంసీలు నిల్వ ఉన్నప్పటికీ ఫేజ్–1లో ఉన్న సర్వరాయసాగర్‌కు నీరు ఇవ్వకపోవడం దారుణమన్నారు.పాదయాత్ర ఫలితంగానే ప్రభుత్వం నీటి విడుదలపై ప్రకటన చేసిందన్నారు. రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ బాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినప్పటికీ ప్రాజెక్టుల పనుల్లో ప్రగతి లేదన్నారు. వైఎస్ హయాంలో 85 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా 15 శాతం పనులు ఈ పదేళ్ల కాలంలో ప్రభుత్వాలు చేసిన పాపాన పోలేదని తూర్పారబట్టారు. వైఎస్సార్ సీపీకి పేరొస్తుందనే పుత్తా నరసింహారెడ్డి నీటి విడుదలను ఆపు చేయించారన్నారు. వైఎస్సార్ సీపీని విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. కలెక్టర్ ప్రకటించిన విధంగా నీరు విడుదల కాకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. నీటి విడుదల ఆగదు తాము ప్రకటించిన విధంగా ఈనెల 25వ తేది నుంచి సర్వరాయసాగర్‌కు 0.29 టీఎంసీల నీరు విడుదల చేస్తామని, ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగదని తనకు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ నాయకులకు కలెక్టర్ బాబూరావునాయుడు స్పష్టం చేశారు. సర్వరాయసాగర్ గేట్లు, ఇతర చిన్నచిన్న పనులు పెండింగ్‌లో ఉండడం, నాణ్యతపై కొన్ని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వాన్ని నివేదించామన్నారు. దీంతో నిపుణుల కమిటీని ప్రభుత్వం పంపిందన్నారు. కమిటీ ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు పరిశీలించి నీటి విడుదలకు ఆదేశించారన్నారు. కనుక నీటి విడుదల ఆగే ప్రశ్నే లేదన్నారు. ఇదే కాకుండా జిల్లాకు మరో 10 టీఎంసీల నీరు రానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, పార్టీ నాయకులు దేవుడు, సుధాకర్‌రెడ్డి, సునీల్‌కుమార్, వినోద్‌కుమార్, నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూసీ గేట్లు ఎత్తివేత
నల్లగొండ: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నల్లగొండ జిల్లాలోని కేతపల్లి మండలం మూసి ప్రాజెక్టు నిండుకుండలామారింది. ప్రాజెక్టు నీటిమట్టం 645 అడుగులకు(గరిష్ట స్థాయికి) చేరడంతో పాటు ప్రాజెక్ట్‌లోకి ఇంకా ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ రోజు ప్రాజెక్ట్ రెండు గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 1300 టీఎంసీల నీటిని కిందకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో పెరిగితే గేట్లను మరో ఫీట్ ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్ట్ ఏఈ తెలిపారు. -
హెచ్చెల్సీకి నీటి విడుదల
బొమ్మనహాళ్/హోస్పేట: జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ కాలువకు బుధవారం తుంగభద్ర మండలి అధికారులు నీటిని వదిలారు. హెచ్చెల్సీ కాలువకు సంబంధించిన రెండు గేట్లకు తుంగభద్ర మండలి కార్యదర్శి డి.రంగారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.లక్ష్మప్ప, అసిస్టెంట్ కార్యదర్శి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గేట్లకు సంబంధించిన స్విచ్ ఆన్ చేసి కాలువకు నీటిని విడుదల చేశారు. ప్రారంభంలో వంద క్యూసెక్కుల వరకు నీటిని వదిలారు. గంట గంటకు వంద క్యూసెక్కుల వరకు నీటి సామర్థ్యాన్ని పెంచుతూ మొత్తం 500 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా మండలి అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తుంగభద్ర మండలి ఇంజినీర్ శ్రీనివాస నాయక్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎగువ ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయాలి
కేంద్ర మంత్రికి శ్రీవాస్తవ లేఖ సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు భారీగా పడిపోయాయని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీవాస్తవ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ రాశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటినిల్వలు పూర్తిగా పడి పోయాయని, దీంతో ఆయా రాష్ట్రాల్లో తాగు నీటికి, సాగునీటికి కటకట ఏర్పడిందన్నారు. ఇటీవల నిర్వహించిన ఇరు రాష్ట్రాల సమా వేశాల్లో ప్రతినిధులు నీటి అవసరాలను వివరించారని, ఎగువన ఉన్న కర్ణాటక, మహా రాష్ట్రల్లోని ఆల్మట్టి, నారాయణ్‌పూర్, ఉజ్జయిని ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయని... దిగువ రాష్ట్రాలకు నీటిని విడుదల చేస్తే తక్షణ పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల్లోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షపాతం సైతం అంతంతమాత్రంగానే ఉందన్నారు. -
పీటముడి
హెచ్చెల్సీకి నీటి విడుదల సందిగ్ధం - నేడు టీబీ డ్యాం అధికారుల సమావేశం – జిల్లాలో పూర్తిగా అడుగంటిని తాగునీటి ప్రాజెక్టులు – ఎంపీఆర్, సీబీఆర్‌లో చుక్కనీరు కరువు – మరో 20 రోజుల్లో అడుగంటనున్న పీఏబీఆర్ – తీవ్రమవుతున్న తాగునీటి సమస్య సాక్షిప్రతినిధి, అనంతపురం: తాగునీటి ప్రాజెక్టులు అడుగంటినా ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదా? ఎంపీఆర్, సీబీఆర్ తరహాలో పీఏబీఆర్లోనూ నీరు అడుగంటనుందా? ఇదే జరిగితే ‘అనంత’ తాగునీటి సంక్షోభంలో చిక్కుకోనుందా? తాజా పరిణాలు నిశితంగా పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. సాగునీరు పక్కనపెడితే కనీసం తాగునీటి విషయంలోనూ ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరిస్తోంది. తుంగభద్ర డ్యాంలో సరిపడా నీరున్నా కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నీటిని విడుదల చేయించడంలో ఘోరంగా విఫలమవడం విమర్శలకు తావిస్తోంది. హెచ్చెల్సీపై ఆధారపడి ‘సీమ’లోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 2.84లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే తుంగభద్ర బోర్డు మాత్రం 32.5టీఎంసీలలో ఏటా సగటున 22 టీఎంసీలు మాత్రమే కేటాయిస్తోంది. ఈ కేటాయింపులు కూడా సక్రమంగా అందడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. విడుదల చేసే నీరు తాగునీటి అవసరాలకు కూడా సరిపోని పరిస్థితి. ఈ క్రమంలో ‘అనంత’ సాగునీటి అవసరాలు తీర్చేందుకు టీబీడ్యాం నుంచి కేసీ కెనాల్(కర్నూలు–కడప కెనాల్)కు దక్కాల్సిన 10టీఎంసీలను హెచ్చెల్సీ ద్వారా మళ్లించేలా జీఓ జారీ చేశారు. దీంతో 42.5టీఎంసీలు హెచ్చెల్సీకి టీబీ బోర్డు కేటాయించాలి. ఈ కోటా నీళ్లు దక్కించుకునేలా ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది. అయితే కేటాయింపులు సంగతి పక్కనపెడితే తాగునీటి అవసరాలకు కూడా నీరు తెప్పించలేకపోతుండటం గమనార్హం. ప్రభుత్వ వైఫల్యంతోనే తాగునీటి సమస్య హెచ్చెల్సీపై ఆధారపడి పీఏబీఆర్, సీబీఆర్లతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి. ఏటా జూలైలో టీబీ డ్యాంకు హెచ్చెల్సీ నుంచి నీరు విడుదల చేస్తారు. ఈ ఏడాది ఆగస్టు ముగుస్తున్నా నీటి విడుదల ఊసే కరువయింది. దీంతో సీబీఆర్(చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)లో పూర్తిగా నీరు అడుగంటింది. ఎంపీఆర్(మిడ్పెన్నార్డ్యాం)లో అదే పరిస్థితి. పీఏబీఆర్‌లో ఒక టీఎంసీలోపే నీరుంది. మరో 20–30రోజుల్లో ఈ నీరు అడుగంటనుంది. ఇప్పటికే సీబీఆర్ పరిధిలో ధర్మవరం, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలకు తాగునీటి సమస్య ఉత్పన్నమైంది. గతేడాది కంటే సమృద్ధిగానే డ్యాంలో నీటి నిల్వ గతేడాది ఈ సమయానికి టీబీ డ్యాంలో 52.703 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూలైలో ఐఏబీ సమావేశం నిర్వహించి 23.1 టీఎంసీలు కేటాయించారు. ఇందులో 8.5టీఎంసీలు తాగునీటికి, 14.6టీఎంసీలు సాగుకు కేటాయించారు. ప్రస్తుతం డ్యాంలో 53.775 టీఎంసీలు ఉండగా.. 4300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా కనీసం తాగునీటికి కూడా నీటిని విడుదల చేయలేదు. మంత్రులు, జిల్లా యంత్రాంగం ఘోర వైఫల్యం ‘అనంత’కు తాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్, హెచ్చెల్సీ ఎస్ఈ టీబీ బోర్డుకు కొద్దిరోజుల కిందట విజ్ఞప్తి చేశారు. అయితే బోర్డు అధికారులు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆధారపడి విడుదల చేస్తామని చెప్పారు. ఇటీవల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య టీబీబోర్డు అధికారులతో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత కూడా నీరు విడుదల చేయలేదు. కర్ణాటకలో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఏడాది ఎలాగైనా కర్ణాటకలోని ఆయకట్టుకు నీరిచ్చి పంటలు పండించాలనే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. అనంత తాగునీటి అవసరాలకు నీరు విడుదల చేస్తే కర్ణాటక రైతులు చౌర్యానికి పాల్పడుతారని, అందుకే నీరు విడుదల చేయలేదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే సకాలంలో నీరు విడుదల చేయించడంలో ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు మంత్రులు కూడా ఘోర వైఫల్యం చెందారు. హెచ్చెల్సీపై ఆధారపడి 40వేల ఎకరాల్లో వరిసాగు చేస్తారు. ఇందులో సింహభాగం మంత్రి కాలవ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలోనే ఉంది. అయినప్పటికీ ఆయన స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ నెల 30న ఐఏబీ సమావేశం జరుగనుంది. ఆ సందర్భంగా నీటి విడుదల తేదీని ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా ఆదివారం టీబీ డ్యాం అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వచ్చే నెల 2న హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
హెచ్ఎల్సీ కాలువకు నీరు విడుదల
అనంతపురం రూరల్: తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీ కాలువకు నీటిని విడుదల చేయడానికి బళ్లారి కలెక్టర్ రాంమనోహర్ హామీ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం డ్యాంలో నీటి కొరత ఏర్పడడంతో జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఫొన్ ద్వారా బళ్లారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తాగునీటి అవసరాల కోసం నీటిని వదులుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈనెల 13న తుంగభద్ర ఇరిగేషన్ బోర్డు మీటింగ్ అనంతరం నీరు వదిలేందుకు చర్యలు తీసుకుంటామన్నారని ఆయన తెలిపారు. -
జూరాల నీటి విడుదలకు చర్యలు: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, పాలమూరు రైతాంగ అవసరాలకు అనుగుణంగా జూరాల నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. గురువారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, గద్వాల నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి కృష్ణమోహన్‌రెడ్డి, ఈఎన్సీ మురళీధర్‌రావు, జూరాల ఎస్ఈ రఘునాథ్‌లతో కలసి మంత్రి సమీక్షించారు. నారాయణపూర్, ఆల్మట్టి నుంచి వస్తున్న వరద నీటిపై చర్చించారు. జూరాల నుంచి భీమా ఫేజ్ 1, ఫేజ్ 2తోపాటు కోయిల్ సాగర్, నెట్టెంపాడులకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. ఎగువన ఉన్న కర్ణాటక నుంచి నీటి విడుదలకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు. -
కృష్ణా డెల్టాకు నీరు విడుదల
అమరావతి: ఎప్పుడూ లేని విధంగా కృష్ణా డెల్టాకు ముందుగా నీళ్లు ఇచ్చాము.. రైతులు పంటలు వేసుకునేందుకు సిద్ధం కావాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రకాశం బ్యారేజి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన కృష్ణా తూర్పు డెల్టాకు నీరు విడుదల చేశారు. పట్టిసీమ విషయంలో తనపై అనేక ఆరోపణలు చేశారని, వాటికి భయపడి తాను వెనకడుగు వేసి ఉంటే కృష్ణాకు తీవ్ర నష్టం జరిగేదని అన్నారు. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా 80 టీఎంసీలు కృష్ణాకు తీసుకొస్తామని, రాష్ట్రంలో పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని ఆయన చెప్పారు. రైతులకు పంటల కంటే ముందే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. ప్రకాశం బ్యారేజీ చుట్టూ విహార ప్రాంతంగా మారుస్తున్నామని చంద్రబాబు చెప్పారు. -
జూన్ 1నుంచి కాలువలకు నీరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలోని కాలువలకు జూన్ 1నుంచి నీరు విడుదల చేయనున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. ఖరీఫ్ పంటకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్ట్‌లకు అవసరమైన భూ సేకరణ తదితర అంశాలపై శనివారం ఆయన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 10లోగా నారుమడులు వేసుకోవాలని రైతులకు సూచించారు. ఇందుకు అనువుగా 7 నుంచి 10 టీఎంసీల వరకు సీలేరు జలాలను అదనంగా రప్పిస్తామని తెలిపారు. శివారు ప్రాంత భూములకు సమృద్ధిగా నీటిని అందించి జూన్ నెలాఖరు నాటికి జిల్లా అంతటా వరినాట్లు పూర్తయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. 15 నాటికి పనులు పూర్తి కావాలి చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాలు తప్ప మిగిలిన ఇరిగేషన్ పనులన్నిటినీ జూన్ 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాలు కురిస్తే డెల్టా ఆధునికీకరణ పనులు చేయడం కష్టమవుతుందని, ఈలోగా ఎర్రకాలువ, నందమూరు అక్విడెక్ట్, ఎస్‌కేకేవైఆర్ వంటి ఇరిగేషన్ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. తాడిపూడి ఎత్తిపోతల కోసం సేకరించిన భూమిలో పంటలు వేయకుండా చర్యలు తీసుకోవాలని, వేస్తే తొలగిస్తామనే విషయాన్ని రైతులకు చెప్పాలని అన్నారు. ఆ భూములను సాగుకు పనికిరాకుండా గుంతలు తవ్వాలన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. శేషావతారం చానల్ నుంచి జూన్ 15 నాటికి నీళ్లు ఇచ్చేలా పనులు పూర్తి చేయాలన్నారు. జూన్ 5 నాటికి పోణంగి పుంత పనులు పూర్తి చేయాలని కోరారు. లబ్బీపేట స్లూయిజ్ 19 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో పాతబడిన లాకుల షట్టర్లను తొలగించి కొత్తవి వేయాలని, వచ్చే మంగళవారం ప్రతి ప్రాంతానికి వెళ్లి తాను చూస్తానని అన్నారు. ఎక్కడైనా పాత షట్టర్లు కనిపించినా, పనులు కాకున్నా చర్యలు తప్పవని శెట్టిపేట డ్రెయినేజీ ఈఈ శ్రీనివాసరావును హెచ్చరించారు. హైవేను పొడిగించండి జాతీయ రహదారి–65ను కొవ్వూరు నుంచి నరసాపురం వరకు పొడిగించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ ఎస్ఈ నిర్మలను కలెక్టర్ ఆదేశించారు. దీనివల్ల జాతీయ రహదారులకు కనెక్టివిటీ వస్తుందన్నారు. -
డెల్టాకు జూన్ 1 కి నీరు విడుదల
అమలాపురం : గోదావరి డెల్టా కాలువలకు జూన్ 1 నుంచి సాగునీరు విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మే 15 నాటికి సాగునీరు ఇస్తే ప్రకృతి వైపరీత్యాల నుంచి గట్టెక్కవచ్చని... అపరాలు పండించుకునే అవకాశం దక్కుతుందని రైతులు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఈ నెల 6వ తేదీన ‘ఖరీఫ్‌పై నీలి నీడలు’ శీర్షికన సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో కనీసం జూన్ 1 నాటికైనా సాగునీరు విడుదల చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్రిటీష్ హయాంలో మే 15 నాటికి సాగునీరు విడుదల చేసేవారు. తరువాత రెండు పంటల విధానం రావడంతో నీటి విడుదల జూ¯ŒS 15 తరువాతకు మారింది. ఈ విధానం వల్ల ఖరీఫ్ పంట కోతల సమయంలో భారీ వర్షాలు, తుపాన్ల తో రైతులు రూ.కోట్ల పంటను కోల్పోతున్నారు. అడ్డంకులు ఇవే జూన్ 1 నాటికి నీరు విడుదల చేస్తే జూలై 1 నాటికి నాట్లు పడతాయి. ఈ సమయంలో తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు కనీసం 9 వేల క్యూసెక్కులు విడుదల చేయాలి. నైరుతి ఆలస్యమై వర్షాలు పడకుంటే నీటి ఎద్దడి ఏర్పడుతుంది. 2010 ఖరీఫ్ ఆరంభంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో సçహజ జలాలు 2 వేల క్యూసెక్కులు మించి ఉండవు. సీలేరు నుంచి వచ్చే అవకాశం తక్కువ. ∙కాలువలు మూసిన తరువాత పట్టిసీమ ద్వారా నీరు తోడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జూన్ 1 నాటికి నీరు విడుదల చేయాల్సి వస్తే ఆ సమయంలో వర్షాలు ఉండనందున పట్టిసీమ నిలిపివేయాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నీరు విడుదలకు అంగీకరిస్తుందా? అనేది చూడాల్సి ఉంది. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం డెల్టాలో మూడు పంటలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో జూన్ 1 నాటికి నీరు విడుదల చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చిన వెంటనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. – రాంబాబు, ఎస్ఈ, ధవళేశ్వరం -
డిండి ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల
డిండి : ఎంజీకేఎల్ఐ పథకం ద్వారా డిండి ప్రాజెక్ట్‌లోకి నీటిని ఇటివలే విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం నీటిమట్టం 13 అడుగులకు చేరింది. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నల్లగొండ జిల్లా డిండి మండల పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు దాని పరిధిలోని కుంటలను నింపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులు.. రాష్ట్ర æనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు సోమవారం మండల పరిధిలోని పలు కుంటలకు డిండి ప్రాజెక్ట్ నుంచి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈ రూప్లా నాయక్ మాట్లాతడుతూ బాపన్‌కుంట, ఎనకుంట, కాంట్రోన్ కుంట, నడివి కుంటలకు నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఎంపీటీసీ సభ్యులు పర్వతాలు, తిర్పతయ్య, విష్ణువర్దన్‌రెడ్డి, వీరకారి రాంకిరణ్, వెంకట్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, వెంకట్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు. కొన్ని గంటల్లోపే.. డిండి ప్రాజెక్ట్ నుంచి ఆయకట్లు కింద ఉన్న కుంటలను నింపడానికి నీటిని విడుదల చేసిన కొన్ని గంటల్లోపే నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు అడ్డుకున్నారు. 13 అడుగుల నీరు మాత్రమే ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేస్తే.. ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయి సమీప మండలాలైన వంగూర, ఉప్పునుంతల మండలాల్లో భూగర్బ జలాలు అడుగంటిపోతాయని ఆయన పేర్కొన్నారు. తాగు నీటి సమస్య జటిలమవుతుందన్న ప్రజల ఒత్తిడి మేరకే నీటి విడుదలను అడ్డుకున్నట్లు వెల్లడించారు. డిండి ప్రాజెక్ట్‌ను పూర్తి స్థాయిలో నింపిన తర్వాతనే మండల పరిధిలోని కుంటలకు నీటిని వదలాలని పేర్కొన్నారు. -
శ్రీశైలం నుంచి నీరు విడుదల
శ్రీశైలం: శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు శనివారం నుంచి ఆదివారం వరకు 5,657 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రెండు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 5,391 క్యూసెక్కులను విడుదల చేయగా, బ్యాక్‌వాటర్ నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి 266 క్యూసెక్కులను విడుదల చేశారు. పగటిపూట ఉష్ణోగ్రతల కారణంగా జలాశయంలో ఉన్న నీటిలో 284 క్యూసెక్కుల నీరు ఆవిరి అయినట్లు అధికారులు తెలిపారు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.728 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 0.708 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం జలాశయంలో 36.9800 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 814.40 అడుగులుగా నమోదైంది. -
ధర్మవరం కుడికాలువకు నీరు విడుదల
కూడేరు : మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం నుంచి ధర్మవరం కుడికాలువకు శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఈ నెల 1నే నీటిని విడుదల చేయగా... 5 రోజులు క్రితం ముకుందాపురం, రామచంద్రాపురం, ఆత్మకూరు మండలంలోని యాలేరు ప్రాంతాల వారు తమ ప్రాంతానికి నీటిని తీసుకెళ్ళేందుకు కుడికాలువకు గండ్లు కొట్టారు. గండ్ల మరమ్మత్తుల కోసం 4 రోజులు క్రితం నీటిని అధికారులు నిలిపివేశారు. మరమ్మతులు పూర్తి కావడంతో మళ్ళీ నీటిని విడుదల చేశారు. ఈ నీరు డ్యాం నుంచి ధర్మవరం వరకు 112 కిలో మీటర్ల వరకు ప్రవహిస్తుంది. -
నేడు పెన్నార్ డెల్టాకు నీరు విడుదల
సోమశిలలో 40.226 టీఎంసీల నీరు నిల్వ సోమశిల : సోమశిల జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు గురువారం నీరు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఈఈ శ్రీరామగిరి వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాన్ డెల్టా పరిధిలోని ఉత్తర, దక్షిణ కాలువలకు నీటి విడుదలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 40.226 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. పైతట్టు ప్రాంతాల నుంచి 2756 క్యూసెక్కుల వంతున నీటి ప్రవాహం వచ్చి చేరుతోందని తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 94.220 మీటర్లు, 309.12 అడుగుల మట్టం నమోదైంది. సగటున 152 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. -
పీఏబీఆర్ కుడి కాలువకు నీరు విడుదల
కూడేరు : కూడేరు మండల పరిధిలోని పెన్నహోబిâýæం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం) నుంచి ధర్మవరం కుడికాలువకు మంగâýæవారం నీటిని విడుదల చేశారు. మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్సీ కేశవ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై స్విచ్ ఆ¯ŒS చేసి నీటిని విడుదల చేశారు. అనంతరం వారు డ్యాంలో ప్రస్తుతం నీటి మట్టం ఎంత ఉంది ? ఇ¯ŒSప్లో, ఔట్ ప్లో, కుడికాలువకు ఎన్ని క్యూసెక్కులు నీటిని సరఫరా చేస్తారు తదితర అంశాలపై ఎస్ఈ శేషగిరిరావును అడిగి తెలుసుకున్నారు. డ్యాంలో 3.5 టీఎంసీల నీరు నిలువ ఉందని, జీడిపల్లి జలాశయం నుంచి 800 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి వస్తోందని ఎస్ఈ వివరించారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ తయారీకి, 3 తాగునీటి ప్రాజుక్టులకు సుమారు 800 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయడం జరుగుతోందన్నారు. కుడికాలువకు 2.5 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగిందని చెప్పారు. కుడి కాలువ ద్వారా నీటి విడుదల సందర్భంగా కాలువకు 200 క్యూసెక్కుల నీటిని వదిలి, బుధవారం ఉదయం నుంచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని ఆయన తెలిపారు. మొదటి విడతలో కుడికాలువకు ఇరువైపులా పక్కనే ఉన్న చెరువులకు నీటిని నింపేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ లెక్కన 39 చెరువులకు నీటిని నింపుతామన్నారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్సీ మాట్లాడుతు కాలువకు నీటిని విడుదల చేసి చెరువులకు నీరందించడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. -
గోదావరి జలాలతో మెట్ట పొలాలు సస్యశ్యామలం
పురుషోత్తపట్నం (సీతానగరం) : గోదావరి జలాలతో మెట్ట పంట పొలాలు సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమా మహేశ్వరావు అన్నారు. పురుషోత్తపట్నంలో కొత్తగా నెలకొల్పే ఎత్తిపోతల పథకం స్థల పరిశీలనకు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నుంచి బోట్‌పై పురుషోత్తపట్నం సోమవారం వచ్చారు. పోలవరం ప్రాజెక్టు నేవిగేషన్‌లాక్ వద్ద ఎత్తిపోతల పథకం స్థలాన్ని ఎంపిక చేశారు. ఆ స్థల పరిశీలన అనంతరం ఇంజినీరింగ్ చీఫ్ వెంకటేశ్వరావు, కార్యదర్శి శశిభూషణ్, కలెక్టర్ అరుణ్‌కుమార్, నీటి పారుదల శాఖ ఎస్సీ సుగుణాకరరావు, ఈఈ శ్రీనివాస్‌రెడ్డితో పథకం మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో 10.30 లక్షల ఎకరాలు పట్టిసీమ పథకం ద్వారా 26 నుంచి 27 టీఎంసీల గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతున్నాయని అన్నారు. ఇరిగేషన్ డీఈలు వెంకట్రావు, రవీంద్ర తదితరుల పాల్గొన్నారు -
ఎట్టకేలకు నీటి విడుదల
– ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి పేరుతో గత నెలలో ఎల్లెల్సీకి నీటిని బంద్ చేసిన టీబీ బోర్డు – రెండు సార్లు లేఖ రాసిన అధికారులు – సీడబ్ల్యూసీ చైర్మన్‌కు ఎంపీ బుట్టా రేణుక ఫిర్యాదు – ఇందుకు స్పందనగా నీరు విడుదల కర్నూలు సిటీ: టీబీ డ్యాంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయంటూ గత నెల 17న ఏపీ ప్రభుత్వ అనుమతి లేకుండానే నీటి విడుదలను నిలిపేసిన బోర్డు అధికారులు ఎట్టకేలకు ఆదివారం విడుదలను పునరుద్ధరించారు. ప్రాజెక్టు పవర్ కెనాల్ ద్వారా 1120 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గత నెల 27న నీటిని విడుదల చేయాల్సి ఉన్నా బోర్డు అధికారులు పట్టించుకోలేదు. దీంతో దిగువ కాలువ ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులున్నాయంటూ ఎస్ఏ ఎస్. చంద్రశేఖర్ రావు ఉన్నతాధికారులకు రెండుసార్లు లేఖలు రాశారు. ఇంజినీర్ ఇన్ చీఫ్‌తోపాటు మంత్రి దష్టికి తీసుకెళ్లినా వారిలో వారిలో స్పందన లేకపోయింది. గత నెల 20న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి టీబీ బోర్డు చైర్మన్ రంగారెడ్డి, మంత్రి దష్టికి తీసుకెళ్లగా రెండు రోజుల్లో నీరు ఇస్తామని చెప్పినా పట్టించుకోలేదు. ఇదే విషయంపై కర్నూలు ఎంపీ బుట్టారేణుక కేంద్ర జల సంఘం చైర్మన్ గుప్తాకు ఫిర్యాదు చేయడంతో బోర్డు అధికారుల్లో కదలిక వచ్చింది. ఆయకట్టుకు నీరందేనా? దిగువ కాలువ కింద జిల్లాలో 1.51 లక్షల ఎకరాల ఆయకట్టుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 90 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని జల వనరుల శాఖ ప్రణాళికలో తెలిపారు. ప్రస్తుతం 40 వేల ఎకరాల్లో పంటలుండగా 15 వేల ఎకరాల్లో వరి వేశారు. ఈ ఏడాది 24 టీఎంసీలకుగాను 17 టీఎంసీల నీటిని వాటాగా కేటాయించారు. ఇప్పటీ వరకు 2.87 టీఎంసీల నీటిని వాడుకున్నారు. డ్యాంలో నీరు తక్కువగా ఉందని, పంటను కాపాడుకునేందుకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన నీటిని ఇవ్వాలని కర్ణాటక నీటిపారుదల సలహా సమితి సూచించడంతో గత నెల 17న బోర్డు అధికారులు కాల్వకు నీటిని బంద్ చేశారు. తిరిగి అదే నెల 27న నీరు విడుదల చేయాల్సి ఉంది. కానీ బోర్డు అధికారులు కర్ణాటక ఆయకట్టును దష్టిలో పెట్టుకొని ఏపీ వాటాకు, ఆ రాష్ట్ర వాటా నీటిని కలిపి విడుదల చేశారు. మధ్యలోనే కాల్వలకు పైపులు, మోటార్లు వేసి నీటిని కాజేసేందుకే కొంత ఆలస్యంగా విడుదల చేసినట్లు తెలిసింది. దీనికితోడు కాల్వపై గస్తీ పెట్టి ఏపీ సరిహద్దులో 690 క్యుసెక్కుల నీటిని ఇవ్వలేమని, ఇప్పటీకే కర్ణాటక ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. ఇలాంటి సమయంలో విడుదల చేసిన నీరు జిల్లాకు ఏ మేరకు వస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎట్టకేలకు నీటి విడుదల
– ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి పేరుతో గత నెలలో ఎల్లెల్సీకి నీటిని బంద్ చేసిన టీబీ బోర్డు – రెండు సార్లు లేఖ రాసిన అధికారులు – సీడబ్ల్యూసీ చైర్మన్‌కు ఎంపీ బుట్టా రేణుక ఫిర్యాదు – ఇందుకు స్పందనగా నీరు విడుదల కర్నూలు సిటీ: టీబీ డ్యాంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయంటూ గత నెల 17న ఏపీ ప్రభుత్వ అనుమతి లేకుండానే నీటి విడుదలను నిలిపేసిన బోర్డు అధికారులు ఎట్టకేలకు ఆదివారం విడుదలను పునరుద్ధరించారు. ప్రాజెక్టు పవర్ కెనాల్ ద్వారా 1120 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గత నెల 27న నీటిని విడుదల చేయాల్సి ఉన్నా బోర్డు అధికారులు పట్టించుకోలేదు. దీంతో దిగువ కాలువ ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులున్నాయంటూ ఎస్ఏ ఎస్. చంద్రశేఖర్ రావు ఉన్నతాధికారులకు రెండుసార్లు లేఖలు రాశారు. ఇంజినీర్ ఇన్ చీఫ్‌తోపాటు మంత్రి దష్టికి తీసుకెళ్లినా వారిలో వారిలో స్పందన లేకపోయింది. గత నెల 20న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి టీబీ బోర్డు చైర్మన్ రంగారెడ్డి, మంత్రి దష్టికి తీసుకెళ్లగా రెండు రోజుల్లో నీరు ఇస్తామని చెప్పినా పట్టించుకోలేదు. ఇదే విషయంపై కర్నూలు ఎంపీ బుట్టారేణుక కేంద్ర జల సంఘం చైర్మన్ గుప్తాకు ఫిర్యాదు చేయడంతో బోర్డు అధికారుల్లో కదలిక వచ్చింది. ఆయకట్టుకు నీరందేనా? దిగువ కాలువ కింద జిల్లాలో 1.51 లక్షల ఎకరాల ఆయకట్టుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 90 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని జల వనరుల శాఖ ప్రణాళికలో తెలిపారు. ప్రస్తుతం 40 వేల ఎకరాల్లో పంటలుండగా 15 వేల ఎకరాల్లో వరి వేశారు. ఈ ఏడాది 24 టీఎంసీలకుగాను 17 టీఎంసీల నీటిని వాటాగా కేటాయించారు. ఇప్పటీ వరకు 2.87 టీఎంసీల నీటిని వాడుకున్నారు. డ్యాంలో నీరు తక్కువగా ఉందని, పంటను కాపాడుకునేందుకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన నీటిని ఇవ్వాలని కర్ణాటక నీటిపారుదల సలహా సమితి సూచించడంతో గత నెల 17న బోర్డు అధికారులు కాల్వకు నీటిని బంద్ చేశారు. తిరిగి అదే నెల 27న నీరు విడుదల చేయాల్సి ఉంది. కానీ బోర్డు అధికారులు కర్ణాటక ఆయకట్టును దష్టిలో పెట్టుకొని ఏపీ వాటాకు, ఆ రాష్ట్ర వాటా నీటిని కలిపి విడుదల చేశారు. మధ్యలోనే కాల్వలకు పైపులు, మోటార్లు వేసి నీటిని కాజేసేందుకే కొంత ఆలస్యంగా విడుదల చేసినట్లు తెలిసింది. దీనికితోడు కాల్వపై గస్తీ పెట్టి ఏపీ సరిహద్దులో 690 క్యుసెక్కుల నీటిని ఇవ్వలేమని, ఇప్పటీకే కర్ణాటక ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. ఇలాంటి సమయంలో విడుదల చేసిన నీరు జిల్లాకు ఏ మేరకు వస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
జలజగడం
ఆన్అండ్ఆఫ్లోనూ అన్యాయం చేస్తున్న టీబీ బోర్డు హెచ్ఎల్సీకి నీరు విడుదల వాయిదా కర్ణాటక రైతులకు అవసరం లేకపోవడమే కారణమట అనంతపురం సెంట్రల్ : తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి రావాల్సిన నీటిని విడుదల చేయడంలో టీబీ బోర్డు అధికారులు తీవ్ర వివక్షతను చూపిస్తున్నారు. జిల్లా రైతులతో పనిలేకుండా కేవలం కర్ణాటక రైతుల సంక్షేమాన్నే ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో వస్తున్న అరకొర నీటిని కూడా హెచ్చెల్సీకి విడుదల చేయకుండా వాయిదా వేయడమే ఇందుకు నిదర్శనం. తుంగభ్రద జలాశయంలోకి నీటి లభ్యత తక్కువుగా ఉందని ఈ ఏడాది హెచ్చెల్సీకి 10 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. ఇప్పటి వరకూ 7.25 టీఎంసీలు జిల్లాకు వచ్చాయి అయితే జలాశయంలో నీటినిల్వ వేగంగా పడిపోతోందనే ఉద్దేశంతో ఆన్‌అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈనెల 17వ తేదీ నుంచి హెచ్చెల్సీకి నీటిని నిలుపుదల చేశారు. తిరిగి సోమవారం(26) నుంచి విడుదల చేయాల్సి ఉంది. అయితే కర్ణాటకలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులకు ప్రస్తుతం నీటి అవసరం లేనందున హెచ్చెల్సీకి నీటి విడుదల వాయిదా వేసినట్లు టీబీ బోర్డు అధికారులు ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే కర్ణాటక అక్రమంగా జల చౌర్యానికి పాల్పడుతోందని చెప్పకనే చెప్పవచ్చు. ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతి అంటే పదిరోజులు కర్ణాటక రైతులు వాడుకుంటే మరో పది రోజులు జిల్లా రైతులు వాడుకోవాలి. కానీ మనకు రావాల్సిన సమయంలో వారికి అవసరం లేదనే కారణంతో వాయిదా వేయడం విమర్శలకు దారి తీస్తోంది. కనీసం జిల్లాలో హెచ్చెల్సీ ఆయకట్టు కింద రైతులు సాగు చేసిన పంటలకు నీరు అవసరమా లేదా అనే వివరాలను జిల్లా అధికారులను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో హైలెవల్ మెయిన్ కెనాల్ (హెచ్‌ఎల్‌ఎంసీ), గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పైగా మనకు నీళ్లు విడుదల సమయంలో కూడా కర్ణాటక రైతులు వాడుకునే ప్రమాదముంది. కానీ తుంగభద్ర జలాశయం వద్ద మాత్రం జిల్లాకు విడుదల చేసిన నీటిని లెక్కలు కడుతూనే ఉంటారు. . ఇప్పటికైనా కలెక్టర్, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఈ అంశంపై దృష్టి సారించి తుంగభద్ర నుంచి హెచ్చెల్సీకి రావాల్సిన నీటి విషయంపై ఉన్నతస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని ఆయకట్టు రైతులు విజ్జప్తి చేస్తున్నారు. ఈ విషయంపై హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావును వివరణ కోరగా... హెచ్చెల్సీకి నీటి విడుదల వాయిదా వేసిన విషయం నిజమే అని అంగీకరించారు. ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో హెచ్చెల్సీకి సోమవారం నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉన్నా వాయిదా వేసినట్లు బోర్డు అధికారులు తెలిపారన్నారు. కానీ జిల్లాలో హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలతో పాటు నీటి అవసరాలు ఎక్కువుగానే ఉన్నాయని వివరించారు. కానీ తమను సంప్రదించకుండానే బోర్డు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. -
రేపు హంద్రీ–నీవా–2కు నీరు విడుదల
అనంతపురం సెంట్రల్ : బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఈ నెల 24న హంద్రీ–నీవా రెండోవిడత కాలువకు నీరు విడుదల చేయనున్నట్లు చీఫ్ ఇంజనీర్ (సీఈ) జలంధర్ తెలిపారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఈ నెల 20న నీటిని వదలాలని తొలుత భావించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేసినట్లు చెప్పారు. శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవా ద్వారా వీలైనంత ఎక్కువ నీటిని తీసుకురావడానికి కషి చేస్తున్నామని వివరించారు. ఇప్పటివరకూ శ్రీశైలం డ్యాం వద్ద 7.09 టీఎంసీల నీరు విడుదలైందని, జీడిపల్లి జలాశయానికి నాలుగు టీఎంసీలు చేరిందని తెలిపారు. హంద్రీ–నీవా రెండోవిడత కాలువకు నీళ్లు విడుదల చేసిన అనంతరం మిగిలిన నీరంతా పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు పంపుతామని చెప్పారు. -
పోతిరెడ్డిపాడు వద్ద 873.10 అడుగుల నీటిమట్టం
పోతిరెడ్డిపాడు(జూపాడుబంగ్లా): పోతిరెడ్డిపాడు వద్ద 873.10అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ విష్ణు తెలిపారు. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి 16వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుండగా శ్రీశైలం జలాశయంలో 874.10 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఎస్సారెమ్సీ కాల్వలోకి 2,000క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా హంద్రీనీవా సుజలశ్రవంతి పథకం ద్వారా 1680క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 1,000క్యూసెక్కులు, కేసీ కాల్వకు 500, ఎస్సార్బీసీకి 500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు డీఈ శివరాంప్రసాద్ తెలిపారు. శ్రీశైలం విద్యుత్తు కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తిచేస్తూ 7,416 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు గేజింగ్ అధికారులు తెలిపారు. -
తగ్గుముఖం పట్టిన వరద
కొవ్వూరు : గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం సాయంత్రం 10.90 అడుగులకు చేరింది. దీంతో ఆనకట్టకి ఉన్న 175 గేట్లు మీటరు ఎత్తులేపి 4,69,190 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 11,300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువకి 5,500 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. దీనిలో ఏలూరు కాలువకి 1,093, ఉండి కాలువకి 1,046, నరసాపురం కాలువకి 1,808, జీ అండ్ వీ కాలువకి 664, అత్తిలి కాలువకి 601 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. -
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీరు విడుదల
-
ప్రకాశం బ్యారేజీ కుడికాల్వకు నీరు విడుదల
విజయవాడ: ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. కుడి కాలువకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో కలిదిండి, కైకలూరు, కృత్తివెన్ను ప్రాంతాలకు సాగునీరు విడుదల చేస్తున్నారు. నీరు విడుదల కావడంతో కుడి ప్రధాన కాల్వగట్టుతో పోలవరం కుడి కాల్వగట్టు, సమీప ప్రాంతాల్లోని కుడి ప్రధాన కాల్వగట్టు సమీప ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ అధికారులు సోమవారం హెచ్చరికలు జారీ చేశారు. -
తోటపల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల
విజయనగరం: ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం తోటపల్లి ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్ నుంచి లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కిమిడి మృణాళిని, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున మిగతా 20వేల ఎకరాలకు వచ్చే ఏడాది మార్చినాటికి నీరందిస్తామని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. -
ఏలేరు నీటిని ఎందుకు ఆపారు?
ఇరిగేషన్ అధికారుల తీరుపై పెండెం ఆగ్రహం పిఠాపురం : క్రమం తప్పకుండా నీటిని విడుదల చేయాల్సిన అధికారులు అర్ధాంతరంగా ఎందుకు ఆపారో చెప్పి, వెంటనే నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కన్వీనర్ పెండెం దొరబాబు హెచ్చరించారు. ఆయన గురువారం పిఠాపురం మండలంలో వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఏలేరు నీటిపై ఆధారపడి పిఠాపురం, గొల్లప్రోలు, ప్రత్తిపాడు, కిర్లంపూడి తదితర మండలాల్లో సుమారు 3,500 ఎకరాల్లో చెరకు, మిరప, బెండ, దొండ తదితర వాణిజ్య పంటలు సాగు చేశామని,15 రోజులకొకసారి వంతుల వారీగా నీరు విడుదల చేయాల్సి ఉందని చెప్పారు. దీంతో దొరబాబు ఏలేరు నీటిపారుదల శాఖాధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.కోట్ల విలువైన పంటలు ఎండిపోతుంటే పట్టించుకోపోవడం దారుణమన్నారు. పంటలు ఎండిపోతున్నా నీటి విడుదలను ఎందుకు ఆపారో సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలన్నారు. వెంటనే నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని పెండెం హెచ్చరించారు. -
కృష్ణా డెల్టాకు నీటి విడుదల
నాగార్జునసాగర్ : తాగు నీటి అవసరాల మేరకు నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి కృష్ణా డెల్టాకు శుక్రవారం నీటిని విడుదల చేశారు.విద్యుత్ ఉత్పాదక కేంద్రం ద్వారా 7 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేష్ రాష్ట్రానికి నాలుగున్నర టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా... ఈ నెల రెండు నుంచి నాలుగో తేదీవరకు రెండు టీఎంసీల నీరు విడుదల చేశారు. మిగిలిన రెండున్నర టీఎంసీలు పూర్తి అయ్యే వరకూ నీటి విడుదల కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
చిత్రావతి నుంచి 110 గ్రామాలకు సాగునీరు విడుదల
పులివెందుల: చిత్రావతి రిజర్వాయర్ నుంచి 110 గ్రామాలకు సాగునీటిని విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో సాగునీటిని అధికారులు విడుదల చేశారు. చిత్రావతి నుంచి సీడబ్ల్యూసీ స్కీంకు సాగునీరు విడుదల కాలేదంటూ పులివెందుల ప్రజలు వైఎస్ జగన్‌కు మెరపెట్టుకున్నారు. పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఈ విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకవెళ్లడంతో.. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ఆయన సాగునీరు విడుదల చేయకపోతే ధర్నా చేస్తామని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. దాంతో సాగునీరును అధికారులు విడుదల చేసినట్టు తెలిసింది. -
రాళ్లపాడు ప్రాజెక్ట్ ఐదు గేట్ల ఎత్తివేత
లింగసముద్రం: ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని రాళ్లవాగు జలాశయానికి భారీగా వరదనీరు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం ఉదయం ఐదు గేట్లను అడుగు మేర పైకి ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేయడం ప్రారంభించారు. ఇన్‌ఫ్లో 2,300 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో భారీగా ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తతో ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. -
‘కడెం’నీటి కోసం ఆందోళన
లక్సెట్టిపేట్: రబీ పంటల సాగుకు కడెం ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండలానికి చెందిన దాదాపు 50 మంది రైతులు రాస్తారోకో చేశారు. గురువారం మధ్యాహ్నం నిరసన సాగటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు. ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. -
నీటి విడుదల
కుడి కాలువకు విజయపురిసౌత్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు తాగునీటి అవసరాల నిమిత్తం ఆదివారం అధికారులు నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టు ఏఈ నిమ్మగడ్డ వెంకటేశ్వరావు ఉదయం 10గంటలకు ఐదో గేటు నాలుగున్నర అడుగుల మేర ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని కుడికాలువకు విడుదల చేశారు. 5, 7వ గేట్ల ద్వారా మధ్యాహ్నం 3గంటల నుంచి గంటకు 500 క్యూసెక్కుల చొప్పున 2,036 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తాగునీటి అవసరాలకు కుడికాలువకు నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తాగునీటి అవసరాల నిమిత్తం నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవటంతో ఎట్టకేలకు కుడికాలువకు నీరు విడుదలైంది. తాగునీటి అవసరాల నిమిత్తం ఈ ఏడాది కృష్ణా రివర్‌బోర్డు నిర్ణయం మేరకు మొదటి విడత ఆగస్టు 26న 1.41టీఎంసీలు, రెండో విడత సెప్టెంబర్ 15న 2.39టీఎంసీల నీటిని కుడికాలువకు విడుదల చేశారు. సోమవారం కుడికాలువకు నీటిని పెంపుదల చేసే అవకాశం ఉందని సాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. సాగర్ జలాశయం నీటిమట్టం ప్రస్తుతం 510.20 అడుగుల వద్ద ఉంది. ఇది 132.0098 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 2,036, ఎడమ కాలువకు 5,961, ఎస్ఎల్బీసీకి 900, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 9,671 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
‘కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేయాలి’
రాజుపాలెం: కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన చే స్తున్నారు. వైఎస్సార్‌కడప జిల్లా రాజుపాలెం మండలానికి చెందిన రైతులు వైఎస్సార్సీపీ నాయకులు గత కొన్ని రోజులుగా నీటి కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కేసీ కాలువకు నీరు విడుదల చేయాలని లేకపోతే పంటలు నాశనం అవుతాయని నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. -
హంద్రీనీవా నుంచి నీటి విడుదల
పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండలోని హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి పందికోన రిజర్వాయర్‌కు శుక్రవారం ఉదయం నీటిని విడుదల చేశారు. 300 క్యూసెక్కుల నీటిని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కలెక్టర్ మోహన్ విడుదల చేశారు. హంద్రీనీవా కాలువ ద్వారా నీరు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పందికోన రిజర్వాయర్‌కు చేరనుంది. దీంతో కోడుమూరు, దేవరకొండ, గోనెగండ్ల, ఢోన్ తదితర ప్రాంత ప్రజలకు తాగు నీటిని అందించడానికి వీలవుతుంది. -
సుంకేశుల నాలుగు గేట్లు ఎత్తివేత
మహబూబ్‌నగర్: సుంకేశుల జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 15 వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో బ్యారేజి పూర్తి స్థాయి నీటిమట్టం 1.2 టీఎంసీలు నిండిపోవడంతో అధికారులు నాలుగు గేట్లు ఒక మీటరు మేరా ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఔట్‌ఫ్లో 16 వేల క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
సాగర్ కుడి కాలువకు నీటి విడుదల నిలిపివేత
గుంటూరు: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు నీటి విడుదలను ఆదివారం నిలుపుదల చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 4.3 టీఎంసీలు విడుదల చేయాలని కృష్టా నదీ బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో రోజుకు 5వేల క్యూసెక్కుల చొప్పున పది రోజల పాటు మొత్తం 4.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ మేరకు గత నెల 28 నుంచి సాగర్ జలాశయానికి నీటి విడుదల కొనసాగింది. కుడికాలువ ఆయకట్టు పరిధిలోని గ్రామాలకు సాగునీటి అవసరాల నిమిత్తం బుగ్గవాగు రిజర్వాయర్‌కు 2.15 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1.4 టీఎంసీలు మాత్రమే విడుదల చేశారు. ప్రస్తుతం బుగ్గవాగు రిజర్వాయర్‌లో 0.3 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇంకా 1.4 టీఎంసీలు రావాల్సి ఉండగా బోర్డు అధికారులు నీటిని కుడికాలువకు నిలుపుదల చేశారు. మరో ఎనిమిది రోజుల పాటు రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున 16 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తేనే బుగ్గవాగు రిజర్వాయర్‌కు 1.4టీఎంసీలు నీరు చేరుతుంది. -
శ్రీశైలం డ్యాం నుంచి నీటి విడుదల
కర్నూలు : శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటి విడుదల బుధవారం ఉదయం ప్రారంభమైంది. తాగునీటి అవసరాల కోసం రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు విడుదల చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. దీంతో బుధవారం ఉదయం 7.30 గంటలకు నీటి విడుదల ప్రారంభించారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో రెండు జనరేటర్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. -
శ్రీశైలంలో నీటి విడుదల నేటి నుంచే
⇒ 4.3 టీఎంసీలు విడుదల ⇒ ఏపీ, తెలంగాణకు చెరో 2 టీఎంసీలు ⇒ నిర్ణయం తీసుకున్న కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూప్ హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలం నుంచి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వర్కింగ్ గ్రూప్ సమావేశం నిర్ణయించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని మంగళవారం నుంచే విడుదల చేయాలని, పది రోజులపాటు కొనసాగించాలని నిర్ణయించారు. 4.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని, ఈ నీటిని ఇరు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని, ఆ తర్వాత అవసరాల మేరకు మరోసారి నిర్ణయానికి రావాలన్న కృష్ణా బోర్డు సూచనకు ఏపీ, తెలంగాణ అంగీ కారం తెలిపాయి. దీంతో 2 రాష్ట్రాల్లో తాగునీటి సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం లభించినట్లయ్యింది. కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూపు సోమవారం కేంద్ర జల సంఘం కార్యాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి బోర్డు చైర్మన్ ఎస్.కె.జి.పండిట్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ చీఫ్ ఇంజనీర్(ఇంటర్‌స్టేట్) రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోకి వచ్చిన నీరు, వినియోగం, ప్రాజెక్టుల్లో నిల్వలపై చర్చించారు. సాగర్ కుడి కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీలు కావాలని ఏపీ కోరింది. పట్టణాలు, గ్రామాల్లో నీటిఎద్దడి తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది. తమ తాగునీటి అవసరాలకూ తక్షణమే 5 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. జంట నగరాలు, నల్లగొండ జిల్లాలో ప్రజలు తాగునీరు దొరక్క అల్లాడుతున్నారని వెల్లడించింది. ఆవిరి, సరఫరా నష్టాలు.. 2.3 టీఎంసీలు ఇరు రాష్ట్రాల అవసరాలను విన్న బోర్డు శ్రీశైలంలో 785 అడుగుల మట్టం వరకు తాగునీటి అవసరాల కోసం నీటిని తీసుకోవచ్చని తెలి పింది. కేవలం 8 టీఎంసీలే తాగునీటికి వాడుకోవచ్చని వివరించింది. నీటినంతా ఒకేసారి పంచలేమని స్పష్టం చేసింది. తొలివిడతగా 4.3 టీఎంసీల నీటిని విడుదల చేద్దామని ప్రతిపాదించింది. ఇందులో 0.3 టీఎంసీల నీటిలో ఆవిరి, సరఫరా నష్టాలున్నా, మిగతా 4 టీఎంసీల్లో ఒక్కో రాష్ట్రానికి 2 టీఎంసీల చొప్పున సాగర్ నుంచి తీసుకోవాలని సూచిం చింది. దీనిపై ఏపీ తొలుత కొంత తటపటాయించినా.. తర్వాత అంగీకరించింది. -
25న శ్రీశైలం నీటి విడుదల!
24న జరిగే వర్కింగ్ గ్రూప్ సమావేశంలో తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నీటి విడుదలకు సమయం దాదాపు ఖరారైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల అవసరాల మేరకు తొలి విడతగా ఈ నెల 25న శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేయాలని ఇరు రాష్ట్రాల అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై 24న జరిగే కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూప్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. వర్షాభావం కారణంగా కృష్ణా బేసిన్ పరిధిలోని శ్రీశైలం, సాగర్‌లో నిల్వలు గణనీయంగా పడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టం కనీసస్థాయి కంటే దిగువన 509.8 అడుగులకు పడిపోయింది. గత ఏడాది ఆగస్టు 20న 537.8 అడుగుల మట్టం వద్ద సుమారు 183.77టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఇక శ్రీశైలంలో నీటిమట్టం ప్రస్తుతం 802 అడుగులకు పడిపోయింది. ఇక్కడ గత ఏడాది ఇదే రోజున 173.47 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉండగా... ప్రస్తుతం ఉన్న నీళ్లు 30.27 టీఎంసీలే. శ్రీశైలంలో 785 అడుగుల మట్టం వరకు నీటిని వాడుకోవచ్చు. ఈ లెక్కన ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు 8 టీఎంసీల వరకు ఉంటుందని అధికారుల అంచనా. ఈ నీటినే ఇరు రాష్ట్రాలు వాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు తాగు అవసరాల కోసం చెరో 3టీఎంసీల మేర నీటిని విడుదల చేయాలంటూ బోర్డుకు లేఖలు రాశాయి. దీనిపై బోర్డు ఓ నిర్ణయం తీసుకుంటే నీటి విడుదలకు అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో 24న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు ఇరు రాష్ట్రాలకు లేఖలు పంపింది. -
తాలిపేరు ప్రాజెక్టు 9గేట్లు ఎత్తివేత
చర్ల: చత్తీస్‌గడ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా చర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 9 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. దాదాపు 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతంలో నీటి మట్టం పెరగనుంది. -
ఇక ఎక్కిళ్లే!
పల్నాడు ప్రాంతంలోని పట్టణాలకు తాగునీటిఎద్దడి పొంచి ఉంది. సాగర్ కుడికాలువ నుంచి ఎప్పుడు నీరు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆయా పట్టణాల్లో రిజర్వాయర్లలో నీరు కేవలం 15 రోజులకు మాత్రమే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. తర్వాత పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. నరసరావుపేట వెస్ట్: సకాలంలో వర్షాలు లేకపోవడంతో సాగునీటిపై రైతులు ఆశలు వదులుకున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయం డెడ్స్టోరే జీకి చేరువలో ఉంది. మరోవైపు తాగునీరు కూడా విడుదల చేసే పరిస్థితి కన్పించడంలేదు. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా సాగర్‌కు 3 టీఎంసీల నీటిని తీసుకుంటేనే కుడికాలువకు నీటి విడుదల సాధ్యమవుతుందని ఎన్ఎస్పీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి నీరు విడుదల చేసే విషయంలో నోరు మెదపలేదు. ఎప్పుడు నీరు విడుదలవుతుందోననే చెప్పలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. రోజురోజుకు రిజర్వాయర్లు ఖాళీ అవుతుండటంతో ఆందోళన మొదలైంది. వర్షాలు లేక.. ఈ ఏడాది ఇప్పటివరకు వర్షాలు సక్రమంగా కురవపోవటంతో సాగర్‌కు వరదనీరు చేరలేదు. గురువారం నాటికి శ్రీశైలం డ్యామ్‌లో 802.9 అడుగులు ఉండగా సాగర్‌లో 510.1 అడుగుల నీరు మాత్రమే ఉంది. గతేడాది ఇదే రోజుల్లో శ్రీశైలం డ్యామ్‌కు వరదనీరు చేరింది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీంతో రై తులు ఖరీఫ్‌పై ఆశలు వదులుకున్నారు. పట్టణ ప్ర జానీకానికి కావాల్సిన తాగునీటికోసమైనా సాగర్ నుంచి నీరు వదలాలని జిల్లా పరిషత్ సమావేశం తీ ర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. ఆగస్టు 15 నుం చి నీరు విడుదలవుతుందనే ఆశతో ప్రజలు ఉన్నారు. మినరల్ వాటర్‌పై ఆధారం.. సుమారు 1.20లక్షలమంది జనాభా ఉన్న నరసరావుపేట పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాలకు రిజర్వాయర్‌లోని నీరు మరో 15రోజులకు మించిరాదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఒకపూట మాత్రమే మంచినీరు సరఫరా చేస్తుండటంతో ప్రజలు మినరల్ వాటర్‌పై ఆధారపడుతున్నారు. సాగర్ కాలువలకు మరో 20రోజులపాటు నీరు విడుదల చేయకపోతే ఇబ్బందేనని నరసరావుపేట ప్రజారోగ్యశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.నాగమల్లేశ్వరరావు చెప్పారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి పట్టణాల్లోని ప్రజలకు రోజుమార్చి రోజు నీరు విడుదల చేస్తున్నామన్నారు. ఇదికూడా 15రోజులు మాత్రమేనని తెలిపారు. వినుకొండకు దొండపాడుచెరువు నుంచి నీరు తీసుకునే అవకాశం ఉండటంతో రెండునెలల వరకు ఇబ్బంది లేదని పేర్కొన్నారు. -
సాగునీరు అసాధ్యం
- వచ్చేది 11 టీఎంసీలు మాత్రమే - అధిక ప్రాధాన్యతగా తాగునీటికి 8.5 టీఎంసీలు - వరిని రైతులెవ్వరూ సాగు చేయకూడదు - అక్రమ ఆయకట్టుదారులపై కఠినంగా వ్యవహరించాలి - ఐఏబీ సమావేశంలో తీర్మానం అనంతపురం అర్బన్/ ఇరిగేషన్ : ‘తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీకి 22.689 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని చెప్పారు. నెల రోజుల్లో పరిస్థితి మారిపోయింది. ఎగువ నుంచి నీరు రాకపోవడంతో 11 టీఎంసీలు మాత్రమే ఇస్తామని టీబీ డ్యాం అధికారులు చెబుతున్నారు. ఇందులో అధిక ప్రాధాన్యతగా తాగునీటికి 8.5 టీంఎసీలు ఇవ్వాలి. మిగిలిన నీటిని ఏమి చేయాలనేది తరువాత నిర్ణయిద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో వరి ఏ ఒక్క రైతూ సాగు చేయకుండా చూడాలి. అలాగే అక్రమ ఆయకట్టుదారుల పట్ల కఠినంగా వ్యవహరించాల’ని నీటి పారుదల సలహా మండలి(ఐఏబీ) సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం కమిటీ చైర్మన్, కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సమావేశం నిర్వహించారు. జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్‌రెడ్డి, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినిబాల, జెడ్పీ చైర్మన్ చమన్, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ ఆవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, జేసీ ప్రభాకర్‌రెడ్డి, వరదాపురం సూరి, హనుమంతరాయచౌదరి, ప్రభాకర్‌చౌదరి, ఈరన్న, జితేంద్రగౌడ్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే జయరామప్ప, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, పయ్యావుల కే శవ్, శమంతకమణి హాజరయ్యారు. నీటి విడుదలకు సంబంధించి వాస్తవ పరిస్థితిని సభ్యులకు కలెక్టర్ వివరించారు. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమస్య తీవ్రంగా మారిందన్నారు. గత ఏడాది ఇదే సమయంలో టీబీ డ్యాంలో ఇన్‌ఫ్లో 1.22 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఇప్పుడు ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే ఉందన్నారు. గత ఏడాది ఈ సమయానికి డ్యాంలోకి 113 టీఎంసీల నీరొస్తే, ఇప్పుడు 12 టీఎంసీలు మాత్రమే వచ్చిందన్నారు. అటు శ్రీశైలం డ్యాంలోనూ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోయిందన్నారు. హెచ్చెల్సీ ద్వారా అనంతపురం జిల్లాలో 1.47 లక్షల ఎకరాలు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలు కలిపి 69 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యం కాదన్నారు. హామీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో సలహా మండలి సమావేశం వద్దనుకున్నామని, అయితే వాస్తవాలను సభ్యుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని వివరిం చారు. దీంతో సభ్యులు తొలి ప్రాధాన్యత తాగునీటికి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. -
వరికి ఉరి
- సాగునీరివ్వలేం.. రైతులెవ్వరూ వరి సాగు చేయకూడదు - టీబీ డ్యాం నుంచి వచ్చేది 11 టీఎంసీలు మాత్రమే - అధిక ప్రాధాన్యతగా తాగునీటికి 8.5 టీఎంసీలు - అక్రమ ఆయకట్టుదారులపై కఠినంగా వ్యవహరించాలి - ఐఏబీ సమావేశంలో తీర్మానం అనంతపురం అర్బన్/ ఇరిగేషన్ : ‘తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీకి 22.689 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని చెప్పారు. నెల రోజుల్లో పరిస్థితి మారిపోయింది. ఎగువ నుంచి నీరు రాకపోవడంతో 11 టీఎంసీలు మాత్రమే ఇస్తామని టీబీ డ్యాం అధికారులు వరికి ఉరి చెబుతున్నారు. ఇందులో అధిక ప్రాధాన్యతగా తాగునీటికి 8.5 టీంఎసీలు ఇవ్వాలి. మిగిలిన నీటిని ఏమి చేయాలనేది తరువాత నిర్ణయిద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో ఏ ఒక్క రైతూ వరి సాగు చేయకుండా చూడాలి. అక్రమ ఆయకట్టుదారుల పట్ల కఠినంగా వ్యవహరించాల’ని నీటి పారుదల సలహా మండలి(ఐఏబీ) సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం కమిటీ చైర్మన్, అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సమావేశం నిర్వహించారు. జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్‌రెడ్డి, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినిబాల, జెడ్పీ చైర్మన్ చమన్, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ ఆవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, జేసీ ప్రభాకర్‌రెడ్డి, వరదాపురం సూరి, హనుమంతరాయచౌదరి, ప్రభాకర్ చౌదరి, ఈరన్న, జితేంద్రగౌడ్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే జయరామప్ప, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, పయ్యావుల కే శవ్, శమంతకమణి హాజరయ్యారు. నీటి విడుదలకు సంబంధించి వాస్తవ పరిస్థితిని సభ్యులకు కలెక్టర్ వివరించారు. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమస్య తీవ్రంగా మారిందన్నారు. గత ఏడాది ఇదే సమయంలో టీబీ డ్యాంలో ఇన్‌ఫ్లో 1.22 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఇప్పుడు ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే ఉందన్నారు. గత ఏడాది ఈ సమయానికి డ్యాంలోకి 113 టీఎంసీల నీరొస్తే, ఇప్పుడు 12 టీఎంసీలు మాత్రమే వచ్చిందన్నారు. అటు శ్రీశైలం డ్యాంలోనూ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోయిందన్నారు. హెచ్చెల్సీ ద్వారా అనంతపురం జిల్లాలో 1.47 లక్షల ఎకరాలు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలు కలిపి 69 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యం కాదన్నారు. హామీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో సలహా మండలి సమావేశం వద్దనుకున్నామని, అయితే వాస్తవాలను సభ్యుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని వివరించారు. దీంతో సభ్యులు తొలి ప్రాధాన్యత తాగునీటికి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. భవిష్యత్‌లో డ్యాంలలో నీటిమట్టం పెరిగితే సాగునీటి అవసరాల కోసం చర్చించడానికి ఆగస్టు చివరి వారంలో మరోసారి సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. మైలవరం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను మొదటి నుంచి నిర్లక్ష్యం చేస్తున్నారని వైఎస్సార్ జిల్లా ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. వృథా అరికట్టాలి : సతీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ స్పీకర్ చిత్రావ తి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు కేటాయించిన నీళ్లు ఎప్పుడూ చేరలేదు. చాలా వరకు వృథా అవుతున్నాయి. దీనిని అరికట్టకపోతే తాగునీటికి కూడా చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది. కేటాయించిన నీరు సీబీఆర్‌కు చేరాలంటే ఎక్కువ నీటిని విడుదల చేస్తేనే సాధ్యం. మూడేళ్లుగా మైలవరానికి నీళ్లు లేవు : ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే మూడేళ్లుగా మైలవరం ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరుగుతున్నా, ఏ ఏడాదీ ఒక చుక్క రావడం లేదు. మా ప్రాంతంలో 1500 నుంచి 2000 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీళ్లు పడటం లేదు. పరిస్థితి భయానకంగా ఉంది. ఈ ఏడాది కేటాయించిన నీటిని విడుదల చేస్తేకానీ మా ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడదు. మా గురించి ఆలోచించే తీరిక లేదా? : వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎంపీ గత ఐఏబీ సమావేశంలో కూడా మా ప్రాంతానికి నీళ్లు రావడం లేదని వివరించా. అయినప్పటికీ గత ఏడాది మాకు తీవ్ర అన్యాయం జరిగింది. సీబీఆర్‌కు రెండు టీఎంసీలు కేటాయించినా, రిజర్వాయర్‌లోకి ఒక్క టీఎంసీ నీరు కూడా రావడం లేదు. తుంపెర వద్ద నీటి ప్రవాహం సూచించే గేజ్ ఏటవాలుగా ఉంది. దానితో రిజర్వాయర్‌లోకి ఎక్కువ నీరు వచ్చినట్లు అధికారులు ఊహించుకుంటున్నారు. తక్షణమే హెచ్చెల్సీ ఆధునికీకరణ పూర్తి చేసి సీబీఆర్‌కు నాలుగు టీఎంసీలివ్వాలి. -
డెల్టా రైతులకు సాగు నీరు ఇవ్వాలి
హనుమాన్ జంక్షన్ : కృష్ణా డెల్టా రైతులకు సాగు నీరు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నాయకులు శుక్రవారం కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్లో డిమాండ్ చేశారు. సాగు నీరు విడుదల చేయాలని కోరుతూ జాతీయ రహదారిపై మాజీ మంత్రి కొలుసు పార్థ సారధి, రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు రామచంద్రరావు, రైతు విభాగం జిల్లా నాయకుడు కొల్లి రాజశేఖర్, మహిళా నాయకురాలు జ్ఞానమణిలు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. అనంతరం కృష్ణా - ఏలూరు కాల్వను పరిశీలించారు. -
నెలాఖరుకు కోటపల్లి కాలువ నీళ్లు
బాడంగి: ఈ నెలాఖరుకు కోటపల్లి కాలువ ద్వారా సాగుకోసం నీళ్లు అందిస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం వేగావతి నదిపై ఉన్న కోటపల్లికాలువ ఎక్యూడేట్ను విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లు పరిశీలించారు. వీరితో పాటు పలువురు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటపల్లి కాలువ 37.75 కిలోమీటర్ల మైలురాయి వద్ద వేగావతి నదిపై నిర్మించిన ఎక్యూడేట్లో ఏర్పడిన లీకేజీలను కలెక్టర్లు పరిశీలించారు. ఎక్యూడేట్ నాణ్యతను పరిశీలించి, వెంటనే లీకేజీలను పూడ్చివేయాలని ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్లు ఆదేశించారు. ఈ సందర్భంగా ఈ నెల చివరి కల్లా జిల్లాకు సాగునీటిని అందిస్తామని విజయనగరం కలెక్టరు తెలిపారు. -
ఏజెన్సీలో ఆగని వర్షం
- డొంకరాయి గేట్లు ఎత్తివేత - 26 క్యూసెక్కుల నీరు విడుదల - ముంచంగిపుట్టులో 126.2 మి.మీటర్లు సీలేరు : ఏజెన్సీలో ఆదివారం కూడా భారీ వర్షం పడింది. మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా పడుతుండడంతో అక్కడక్కడ లోత ట్టు ప్రాంతాల్లోని వరినారుమడులు దెబ్బతిన్నాయి. కొండగెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సీలేరు, దారకొండలో జరిగిన వారపుసంతలకు భారీ వర్షం అడ్డంకిగా మారింది. దారాలమ్మ ఘాట్‌లో నాలుగు భారీ చెట్లు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ముంచంగిపుట్టులో 126.2 మిల్లీమీటర్లు, పెదబయలు 102.6, హుకుంపేట 48.8, డుంబ్రిగుడ 68.2, అరకులో 31.4, అనంతగిరిలో 11.6, పాడేరులో 29.2, జి.మాడుగులలో 26.4, చింతపల్లిలో 28.2, జి.మాడుగులలో 32.4, కొయ్యూరు 31 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లోని డొంకరాయి జలాశయంలో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరింది. రిజర్వాయర్‌లో పూర్తి నీటి మట్టం 1037 అడుగులు. జలాశయం ఎగువన ఉన్న పాలగెడ్డ, మంగంపాడు, వలసగెడ్డల నుంచి భారీగా వరదనీరు వచ్చిపడడంతో శనివారం రాత్రి ఒంటిగంటకు పూర్తిగా నిండిపోవడంతో జెన్కో అధికారులు ఎకాయెకిన నాలుగు గేట్లు ఎత్తి సుమారు 26వేల క్యూసెక్కుల నీటిని ఆదివారం ఉదయం 6 గంటల వరకు విడుదల చేశారు. అడుగు నీరు తగ్గడంతో మరో రెండు గేట్లు మూసివేసి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 6 వేలు క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం పరీవాహక ప్రాంతంలో భారీగా వర్షాలు పడుతున్నందున జెన్కో అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. డుడుమ నుంచి నీరు విడుదల ముంచంగిపుట్టు: ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ(డైవర్షన్) డ్యాంలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ఆదివారం డుడుమ డ్యాం గేట్లు ఎత్తి దిగువనున బలిమెల రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. 8వ నంబరు గేటు ద్వారా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 2690 అడుగులు. ప్రస్తుతం 2588 అడుగుల నీరు నిల్వ ఉంది. జోలాపుట్టులో ప్రధాన రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 2750 అడుగులు. ప్రస్తుతం 2722 అడుగుల నీటి మట్టం నమోదైంది. మైదానంలో తెరిపిచ్చిన వాన! సాక్షి, విశాఖపట్నం : నాలుగు రోజుల పాటు కుమ్మరించిన వాన ఆదివారం నాటికి తెరిపిచ్చింది. అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తొలుత రెండు రోజులు భారీ వర్షం కురిసింది. తర్వాత అది బలపడి వాయుగుండంగా మారడంతో శుక్ర, శనివారాల్లో ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ కుంభవృష్టి కురిసింది. శ నివారం ఉదయం వరకు విశాఖ నగరంలో 17 సెం.మీల భారీ వర్షపాతం నమోదయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగర రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గెడ్డలు పొంగిపొర్లాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. అదేపనిగా కురిసిన జడివానలకు జడిసి జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే ఇబ్బందిపడ్డారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఉపాధి పొందే చిరువ్యాపారులకు వ్యాపారాలు సాగలేదు. జిల్లాలోను, ఏజెన్సీలోనూ వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవ హించాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు జలాశయాల్లోకి భారీగా వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వాయుగుండం తీరం దాటింది. ఫలితంగా ఉదయం నుంచి వాతావరణంలో మార్పు వచ్చింది. ఉదయమే సూర్యుడు మబ్బుల మాటు నుంచి బయటకు వచ్చాడు. రోజంతా వాన కురవలేదు. ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. దీంతో ఊపిరి పీల్చుకున్న జనం యధావిధిగా తమ కార్యకలాపాలకు సాగించుకున్నారు. -
ఎస్సారెస్పీ నీటి విడుదల వాయిదా
సారంగాపూర్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో తాగునీటి అవసరాలను తీర్చే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల వాయిదా పడింది. ఈ మూడు పట్టణాల్లోని చెరువులను నింపటానికి అర టీఎంసీ నీటిని గురు, శుక్రవారాల్లో వదలాల్సి ఉంది. అనివార్య కారణాలతో ఈ కార్యక్రమం నాలుగు రోజులకు వాయిదా పడిందని ఎస్సారెస్పీ డీఈ చక్రునాయక్ తెలిపారు. అలాగే, వరంగల్ నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నీటిని ఈనెల 28వ తేదీ బదులు 29వ తేదీన విడుదల చేయనున్నట్లు డ్యాం అధికారులు పేర్కొన్నారు. -
'నీళ్లు విడుదల చేయాలి'
కరీంనగర్ (సుల్తానాబాద్): పంటకు నీళ్లందించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తకుండా ఉందని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు విజయరామారావు బుధవారం ఆరోపించారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో బుధవారం పార్టీ కార్యకర్తలు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీ86 కెనాల్‌కు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. -
'కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలనడం దౌర్జన్యం'
హైదరాబాద్: నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపులకు మించి ఇప్పటికే 50 టీఎంసీల నీటిని అధికంగా వాడుకుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఇంకా ఏపీ ప్రభుత్వం కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని దౌర్జన్యం చేయడం సరికాదని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హితవు పలికారు. చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేయనంటూనే, విద్యుత్, పోలవరం ముంపు మండలాలు మొదలైన విషయాల్లో అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణపై ఆయనది కపటప్రేమ అని ఆయన అన్నారు. సమస్యలపై మాట్లాడుకుందామన్న చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం తగదని హితవు పలికారు. ఈ అంశంపై కృష్ణా వాటర్ బోర్డు జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. -
సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి: గుత్తా
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఏఎంఆర్పీ (ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్) కింద సాగవుతున్న రైతులకు రబీకి వెంటనే నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటి విడుదలపై ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ, కృష్ణా ట్రిబ్యునల్ లతో మాట్లాడి రైతులకు వెంటనే విడుదల చేయడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. -
పీబీసీకి నీరు విడుదల
కడప: తాగునీటి అవసరాల కోసం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పులివెందుల బ్రాంచి కెనాల్(పీబీసీ)కు గురువారం నీటిని విడుదల చేశారు. ఈ ఎడాది పీబీసీకి కేటాయించిన 1.2 టీఎంసీల నీటిని నెలరోజులుగా తుంగభద్ర జలాశయం నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తరలించి నిల్వ ఉంచారు. నిల్వ ఉంచిన నీటిని చిత్రావతి కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లను ఎత్తి పీబీసీకాలువకు కడప ఎంపీ వైఎస్అవినాష్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి,మాజీమంత్రి వివేకానంద రెడ్డి పాల్గొన్నారు. -
చివరికి నీరేది..!
హాలియా :‘అంగట్లో అన్నీ ఉన్నా...అల్లుడి నోట్లో శని ఉన్నట్లు’ ఉంది నాగార్జునసాగర్ ఆయకట్టు చివరి భూముల రైతుల దుస్థితి. సాగర్ జలాశయంలో సమృద్ధిగా నీరు ఉన్నా చివరిభూములకు నీరందని పరిస్థితి నెలకొంది. ఆయకట్టులో నాట్లు తుదిదశకు చేరుకుం టున్న తరుణంలో ఎడమకాల్వపై ఉన్న విద్యుదుత్పాదక కేంద్రంలోకి ఈ నెల 18వ తేదీ సాయంత్రం ఒక్కసారిగా నీరు చేరింది. దీంతో అదేరోజు నుంచి శనివారం దాకా ఎడమకాల్వకు నీటివిడుదలను నిలిపివేశారు. టర్బైన్ల మరమ్మతులు ఇంకా పూర్తికాకపోవడంతో రెండురోజులుగా నీటివిడుదలను కుదించారు. సగటున 10 వేల క్యూసెక్కుల దాకా విడుదలయ్యే నీరు 2వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో కాల్వల చివరకు నీరెక్కడం లేదు. దీంతో రైతులు నాట్లు వేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎడమకాల్వ పరిధిలో నల్లగొండ జిల్లాలో స్థిరీకరించిన ఆయకట్టు 2.99 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి దాకా 2.35 ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. ఎత్తిపోతల పరిధిలోని 80 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, 40 వేల ఎకరాల్లో నాటు వేశారు. ఎడమ కాల్వకు నీటి విడుదల పెంచాలి జల విద్యుత్ కేంద్రంలోనికి నీరు చేరిందంటూ ఎన్ఎస్పి అధికారులు మూడు రోజులుగా ఎడమ కాల్వకు నీటి విడుదల తగ్గించారు. ఇప్పుడు చివరి కాల్వలకు నీరెక్కలేని పరిస్థితి నాట్లుఎలా వేయాలో అర్థం కావడం లేదు. వెంటనే నీటివిడుదలను పెంచాలి. - అలుగుల రమణారెడ్డి, రైతు, కొత్తపల్లి నాటు ఆగింది ఎడమ కాల్వకు నీటి విడుదల తగ్గించడం వల్ల వరినాటు ఆగిపోయింది. కాల్వ చివరి భూముల రైతుల్లో ఇప్పుడే వరినాట్లు వేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఎడమ కాల్వకు నీటివిడుదల తగ్గించడం రైతులకు ఇబ్బందే. విద్యుత్ ఉత్పాదక కేంద్రానికి వెంటనే మరమ్మతులు చేయాలి. - అల్లి పెద్దిరాజు, రైతు, బోయగూడెం -
సందిగ్ధంలో సాగర్ రైతాంగం
►ఒక పంటకైనా నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ ►541.10 అడుగులకు చేరిన సాగర్ నీటి మట్టం మాచర్లటౌన్: సాగర్ నీటి విడుదలపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో కుడికాలువ రైతులు సందిగ్ధంలో పడ్డారు. జలాశయ నీటి మట్టం కనిష్ట స్థాయిని మించి 30 అడుగులు వుండడంతో ఒక పంటకైనా అవకాశం కల్పించాలని రైతాంగం కోరుతోంది. ►పది రోజుల కిందట తాగు నీటి అవసరాల కోసం ప్రభుత్వం కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేసింది. ప్రతి రోజు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ►గురువారం నాటికి సాగర్ జలాశయ నీటిమట్టం 541.10 అడుగు లకు చేరింది. అంటేఇది కనిష్ట స్థాయి కన్నా 30 అడుగులు ఎక్కువ. నీటి మట్టం 510 అడుగుల వరకు మాత్రమే ఉంటే కాలువలకు నీరు విడుదల చేసే అవకాశం ఉండదు. ►ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 75 వేల క్యూసెక్కుల నీరు సాగర్‌కు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ రోజురోజుకు కొద్ది కొద్దిగా పెరుగుతోంది. ►ఓ వైపున శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద నీరు నిలిచిపోవటంతో జలాశయ నీటిమట్టం గురువారం 875.70 అడుగుల వద్ద ఉంది. ఇది 167 టీఎంసీలకు సమానం. ►సాగర్ రిజర్వాయర్‌లో కూడా 188 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తాగు నీటి విడుదల నిమిత్తం కుడి కాలువకు 6,500 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 5,108 క్యూసెక్కులు, కృష్ణాడెల్టాకు సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నుంచి 4,158 క్యూసెక్కులు, శ్రీశైలం ఎడమ గట్టు కాలువకు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ►సాగర్ నుంచి ఔట్‌ఫ్లోగా 17,266 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా 75 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. రెండు రిజర్వాయర్లలో నీటి నిల్వల దృష్ట్యా సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఒక పంటకు నీటిని విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ►ప్రస్తుతానికి వర్షాలు లేక కృష్ణాపరివాహక ప్రాంతంలో ఇన్‌ఫ్లో నిలిచి పోయినా రెండు రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఉండటం, సెప్టెంబరు నెలలో వర్షాలు వచ్చే అవకాశాలు ఉంటాయని భావిస్తున్న సాగర్ ప్రాజెక్టు అధికారులు నీటి విడుదలపై ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ►ప్రస్తుతం ఉన్న నిల్వలతో చెరువులు నింపడంతోపాటు, ఒక పంటకు నీళ్లు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికైనా నీటి విడుదల పై ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సి వుంది. -
కృష్ణా డెల్డాకు తక్షణం నీరు విడుదల
హైదరాబాద్: నల్గొండ, కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల కోసం తక్షణం నీటిని విడుదల చేయాలని కృష్ణా వాటర్ బోర్డ్ సమావేశం నిర్ణయించింది. బోర్డ్ చైర్మన్ పాండ్య అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసింది. గత పదేళ్ల కృష్ణా జలాల విడుదలపై నివేదిక ఇవ్వాలని పాండ్య అధికారులను ఆదేశించారు. తాగునీటి జలాల విడుదల పై పది రోజుల తర్వాత మరో సారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. -
కృష్ణా డెల్టాకు నీటి విడుదలను వ్యతిరేకిస్తాం: హరీష్‌రావు
హైదరాబాద్: కృష్ణా డెల్టాకు నీటి విడుదలను వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ సాగునీటిశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. తాగునీరు ముసుగులో సాగునీటిని తీసుకెళ్తే సహించమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అక్రమాలను ఇప్పటికే కేంద్ర జలవనరుల సంఘానికి నివేదించామని హరీశ్ తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు వల్ల విడుదలైన నీరు ఆంధ్రకు చేరడంలో ఆలస్యమవుతోందన్నారు. కేంద్ర జలవనరుల సంఘానికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబునాయుడు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందన్నారు. నల్లగొండ జిల్లాలోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని 3 టీఎంసీల నీటిని ఏఎంఆర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేయాలని కేంద్ర జలవనరుల సంఘాన్ని కోరుతామని మంత్రి హరీష్‌రావు మీడియాకు వెల్లడించారు.