కడప: తాగునీటి అవసరాల కోసం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పులివెందుల బ్రాంచి కెనాల్(పీబీసీ)కు గురువారం నీటిని విడుదల చేశారు. ఈ ఎడాది పీబీసీకి కేటాయించిన 1.2 టీఎంసీల నీటిని నెలరోజులుగా తుంగభద్ర జలాశయం నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తరలించి నిల్వ ఉంచారు.
నిల్వ ఉంచిన నీటిని చిత్రావతి కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లను ఎత్తి పీబీసీకాలువకు కడప ఎంపీ వైఎస్‌అవినాష్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి,మాజీమంత్రి వివేకానంద రెడ్డి పాల్గొన్నారు.