లింగాల : పులివెందుల బ్రాంచ్ కెనాల్ వెంట బుధవారం వైఎస్‌ఆర్ సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పర్యటించారు. పార్నపల్లె చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు విడుదలవుతున్న నీరు కొంత మేర కామసముద్రం చెరువకు చేరాయి. బండ్ దాటి నీరు ప్రవహించకపోవడంతో గాలి పైపులను అమర్చి నీటిని నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు చేరవేసే ప్రయత్నాలను సాగిస్తున్నారు. సుమారు 40గాలి పైపులను అమర్చి నీటిని తోడుతున్న దృశ్యాలను ఆయన పరిశీలించారు. రోజుకు 5క్యూసెక్కుల నీటినైనా ఎస్‌ఎస్ ట్యాంకుకు తరలించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు విడుదలవుతున్న నీటిని అక్కడకు వెళ్లి పరిశీలించారు. కామసముద్రం చెరువు నుంచి గురిజాల వరకు పీబీసీ వెంట పర్యటించారు. జేసీ సోదరులు పీబీసీ కాలువను ధ్వంసం చేయడంతో సోమవారం నుంచి సీబీఆర్ నుంచి నీటి విడుదలను ఆపేశారు. మంగళవారం మాజీ మంత్రి వైఎస్ వివేకా చేపట్టిన నిరసన కార్యక్రమాలతో అధికారులు స్పందించి పీబీసీ అధికారులు కాలువకు మరమ్మతులు చేసి నీటిని విడుదల చేశారు. అలా విడుదలైన నీరు బుధవారం మధ్యాహ్నానికి గురిజాలకు చేరాయి. ప్రస్తుతం విడుదల అవుతున్నా నీరు ఎంత సామర్థ్యంతో ప్రవహిస్తున్నాయని వైఎస్ అవినాష్‌రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో బుధవారం సీబీఆర్ నుంచి నీటి విడుదలను ఆపి వేయాలని అనంతపురం కలెక్టర్, పీబీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని.. దీంతో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుతో చర్చించి నీటి సరఫరాను ఆపివేయొద్దని కోరినట్లు తెలిపారు.
ఇందుకు ఆయన సానుకూలగా స్పందించి నీటి సరఫరా ఆపవద్దని అనంతపురం, కడప జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు హెచ్‌ఎల్‌సీ ఈఈ మక్బుల్ బాషా, పీబీసీ మాజీ ఈఈలు రాజశేఖర్, పులివెందుల మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డిలు ఎస్‌ఎస్ ట్యాంకును పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, కౌన్సిలర్లు, లింగాల ఎంపీపీ పీవీ సుబ్బారెడ్డి, కామసముద్రం సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, మున్సిపల్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
దౌర్జన్యకారులు ఎంతటివారైనా ఉపేక్షించం
లింగాల: దౌర్జన్యకారులు ఎంతటివారైనా సరే ఉపేక్షించేదిలేదని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పరిశీలించారు. అనంతరం పీబీసీ వెంట పర్యటించి కామసముద్రం చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.