
'పులివెందుల బ్రాంచ్ కెనాల్‍కు నీరు ఇవ్వాలి'
అనంతపురం : పులివెందుల బ్రాంచ్ కెనాల్‍కు నీరు విడుదల చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పులివెందుల రైతులు మంగళవారం అనంతపురం హైలెవల్ కెనాల్ (హెచ్ఎల్‍సీ) ఎస్ఈ శేషగిరిరావును కలిశారు. కెనాల్‍కు వెంటనే నీరు విడుదల చేయాలని కోరుతూ అధికారులకు ఆయన వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ...ఐఏబీ సమావేశంలో 3.2 టీఎంసీల నీరు కేటాయిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుకు చేశారు. చిత్రావతి రిజర్వాయర్కు 1.8 టీఎంసీలు ఇచ్చామంటున్నారు. కానీ, చిత్రావతి రిజర్వాయర్కు 0.6 టీఎంసీల నీరు మాత్రమే వచ్చాయని మిగిలిన నీటికోటాను హంద్రీనీవా ద్వారా సర్దుబాటు చేయాలన్నారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్కు వెంటనే నీరు విడుదల చేయకపోతే సమస్య మరింత జఠిలమవుతుందని ఎంపీ చెప్పారు.