సాక్షి, అమరావతి: గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటల సాగు కోసం జూన్ 15 నుంచి నీటిని విడుదల చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగకుండా గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు చింతా అనురాధ, మార్గాని భరత్, ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో గురువారం ఆయన వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు.
చదవండి: కేంద్రం ఇవ్వట్లేదు.. మేమే కొంటున్నాం
యాస్ బలహీనం: తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు వర్షాలే
Comments
Please login to add a commentAdd a comment