
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ను ఏప్రిల్ 11న పునర్ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుత కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. గురువారం మంత్రులంతా తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
'సీఎం జగన్‌కు సైనికుడిగా పనిచేయడమే తనకు అత్యంత ఇష్టమని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. అందరం సమిష్టిగా పనిచేసి 2024లో మళ్లీ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుదని చెప్పారు. అందులో భాగంగానే నేడు మంత్రులంతా చాలా సంతోషంగా రాజీనామాలు చేశామని మంత్రి అనిల్ కుమార్ అన్నారు.
చదవండి: (మంత్రి పదవికి రాజీనామా అనంతరం బొత్స కీలక వ్యాఖ్యలు)
రాజీనామాలపై మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. 'మంత్రులందరూ రాజీనామాలు చేశాం. మరికొందరికి మంత్రులుగా అవకాశం లభిస్తుంది. ఇక పార్టీ కోసం పనిచేసే గొప్ప అవకాశాన్ని సీఎం మాకు కల్పిస్తున్నారు. ఇదో గొప్ప అరుదైన క్షణమని' మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.