
సాక్షి, అమరావతి: ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో సామాజిక న్యాయం జరిగిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వెనకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలుస్తున్నారని గుర్తుచేశారు. కేబినెట్‌లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పెద్ద మానవతావాది అని స్పీకర్ కొనియాడారు.
కేబినెట్‌లో అణగారిన వర్గాలకు సీఎం జగన్ గొప్ప అవకాశం కల్పించారని పేర్కొన్నారు. బీసీలకు దామాషా పద్దతిన పెద్ద ఎత్తున రాజాధికారం ఇచ్చారని తెలిపారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని లబ్దిదారుల ఇంటి వద్దకే చేరుస్తున్నారని తెలిపారు. టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారని అన్నారు. కేబినెట్‌లో అందరికీ సమాన న్యాయం జరిగిందని స్పీకర్ పేర్కొన్నారు.