సాక్షి, తాడేపల్లి: అమరావతి పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడారని, రూ.118 కోట్ల ముడుపులు ఎందుకు లెక్కల్లో చూపలేదని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘తన పీఏ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?. నేను సత్యహరిశ్చంద్రుడునని చెప్పే బాబు ఇప్పుడు ఏం చెబుతారు?’’ అంటూ దుయ్యబట్టారు.
‘‘ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?. ఎల్లో మీడియా నోటీసులపై ఎందుకు మాట్లాడదు?. చంద్రబాబు అవినీతిపై పవన్ ఎందుకు స్పందించడం లేదు? రూ.118 కోట్ల అవినీతి కనిపించడం లేదా?. చంద్రబాబు అవినీతిపై పవన్ కనీసం ట్వీట్ కూడా పెట్టలేదు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా వాటా ఉందా?. చంద్రబాబు అవినీతిపై వామపక్షాలు ఎందుకు మాట్లాడటం లేదు’’ అని అనిల్ మండిపడ్డారు.
‘‘చంద్రబాబుకు శక్తి, వయసు అయిపోయింది.. చేసిన పాపానికి పరిహారం చెల్లించాల్సిన సమయం మాత్రమే మిగిలి ఉంది. ఐటీ శాఖ ఇప్పటికే నాలుగు నోటీసులు ఇచ్చింది. షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ఇచ్చిన లంచాల వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంట్లో కూడా ఐటీ శాఖ రైడ్ చేసినప్పుడు రెండు వేల కోట్ల రూపాయల అక్రమ సొత్తు దొరికాయి. అమరావతి పేరుతో కొల్లకొట్టిన నిధుల్లో ఇది కొంత మాత్రమే. ఐటీ నోటీసులకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా కప్పను తిన్న పాములాగా కూర్చున్నారు’’ అంటూ అనిల్ ఎద్దేవా చేశారు.
చదవండి: నరం లేని నాలుక.. సీపీఐ మరీ దయనీయంగా..
రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులకు కూడా ఈ అవినీతి సొమ్ములో వాటాలు ఉన్నాయి. అందుకే వారు కూడా నోరెత్తటం లేదు. దత్తపుత్రుడికి కూడా ఈ లావాదేవీలలో ముడుపులు అందాయి. అందుకే ప్రశ్నిస్తానని చెప్పే దత్తపుత్రుడు సైలెంట్ అయ్యారు. పురంధేశ్వరి కూడా తన మరిదిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు, లోకేష్‌లకు దుబాయ్‌లో కూడా ముడుపులు అందాయి. అమరావతి అనే బొమ్మ వెనుక జరిగిన భారీ అక్రమాలలో ఇది ఒక మచ్చుతునక మాత్రమే. బీజేపీ పెద్దలను చంద్రబాబు కలవటం వెనుక కారణం కూడా ఈ ఐటీ కేసుల గురించే.. ఇంకా విచారణ జరిపితే భారీ అక్రమాలు బయటకు వస్తాయని చంద్రబాబు భయపడుతున్నారు. ఆయనను వెంటనే అరెస్టు చేయాలి ’’ అంటూ మాజీ మంత్రి అనిల్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment