చిత్రావతి రిజర్వాయర్ నుంచి 110 గ్రామాలకు సాగునీటిని విడుదల చేశారు.
పులివెందుల: చిత్రావతి రిజర్వాయర్ నుంచి 110 గ్రామాలకు సాగునీటిని విడుదల చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో సాగునీటిని అధికారులు విడుదల చేశారు. చిత్రావతి నుంచి సీడబ్ల్యూసీ స్కీంకు సాగునీరు విడుదల కాలేదంటూ పులివెందుల ప్రజలు వైఎస్ జగన్‌కు మెరపెట్టుకున్నారు.
పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఈ విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకవెళ్లడంతో.. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ఆయన సాగునీరు విడుదల చేయకపోతే ధర్నా చేస్తామని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. దాంతో సాగునీరును అధికారులు విడుదల చేసినట్టు తెలిసింది.