Chitravati reserviour
-
చిత్రావతి నది వద్ద వైఎస్ఆర్ లేక్ వ్యూ రెస్టారెంటును ప్రారంభించిన సీఎం జగన్
-
సునీత కుట్ర రాజకీయాలు చేస్తున్నారు
సాక్షి, అనంతపురం : చిత్రావతి రిజర్వాయర్ ముంపు బాధితులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని, 240 కోట్ల రూపాయల పరిహారం అందించి ముఖ్యమంత్రి వారికి న్యాయం చేశారని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి పరిటాల సునీత కుట్ర రాజకీయాలు మానుకోవాలని, టీడీపీ హయాంలో ముంపు బాధితులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదని ప్రశ్నించారు. చిత్రావతి ముంపు బాధితులందరికీ పరిహారం ఇచ్చామని తెలిపారు. ( రేపు రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలు ) కేవలం 23 ఇళ్ల విషయంలో మాత్రమే వివాదం నడుస్తోందని, దీనిపై పరిటాల సునీత కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా లోకేష్ ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. ‘ గతంలో మంత్రి దేవినేని ఇదే గ్రామానికి వచ్చారు. ఏం న్యాయం చేశారు? 30 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను తీరుస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చంద్రబాబుకు అవినాష్ రెడ్డి లేఖ
సాక్షి, వైఎస్సార్ కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వైఎస్సార్ కడప జిల్లా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తుంగభద్ర డ్యాంలో ఉన్న నికర జలాలను చిత్రావతి జలాశయానికి తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఈ లేఖ రాశారు. తుంగభద్ర డ్యాం నుంచి నికర జలాలను తరలిస్తే పులివెందుల బ్రాంచ్ కెనాల్, లింగాల కుడి కాల్వకు నీరు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. కృష్ణా నది వరద జలాలను నమ్ముకుని తుంగభద్ర నికర జలాల హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. తుంగభద్ర నుంచే పులివెందుల, ధర్మవరం వంటి పట్టణాలకు 2 టీఎంసీల తాగునీరు ఇవ్వాలి. అవి పోను సాగు నీటికి ఏమి మిగలదన్నారు. తుంగభద్ర నికర జలాల హక్కులను ఎలా వదులుకోమంటారని ప్రశ్నించారు. చిత్రావతి కింద దుస్థితి చేసే దివంగత నేత వైఎస్సార్ ఆ ప్రాజెక్టును పూర్తి చేశారని లేఖలో పేర్కొన్నారు. మా నికర జలాలను కొల్లగొట్టే ప్రయత్నాన్ని కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. -
చిత్రావతి నుంచి 110 గ్రామాలకు సాగునీరు విడుదల
పులివెందుల: చిత్రావతి రిజర్వాయర్ నుంచి 110 గ్రామాలకు సాగునీటిని విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో సాగునీటిని అధికారులు విడుదల చేశారు. చిత్రావతి నుంచి సీడబ్ల్యూసీ స్కీంకు సాగునీరు విడుదల కాలేదంటూ పులివెందుల ప్రజలు వైఎస్ జగన్కు మెరపెట్టుకున్నారు. పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఈ విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకవెళ్లడంతో.. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ఆయన సాగునీరు విడుదల చేయకపోతే ధర్నా చేస్తామని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. దాంతో సాగునీరును అధికారులు విడుదల చేసినట్టు తెలిసింది.