
సాక్షి, అనంతపురం : చిత్రావతి రిజర్వాయర్ ముంపు బాధితులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని, 240 కోట్ల రూపాయల పరిహారం అందించి ముఖ్యమంత్రి వారికి న్యాయం చేశారని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి పరిటాల సునీత కుట్ర రాజకీయాలు మానుకోవాలని, టీడీపీ హయాంలో ముంపు బాధితులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదని ప్రశ్నించారు. చిత్రావతి ముంపు బాధితులందరికీ పరిహారం ఇచ్చామని తెలిపారు. ( రేపు రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలు )
కేవలం 23 ఇళ్ల విషయంలో మాత్రమే వివాదం నడుస్తోందని, దీనిపై పరిటాల సునీత కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా లోకేష్ ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. ‘ గతంలో మంత్రి దేవినేని ఇదే గ్రామానికి వచ్చారు. ఏం న్యాయం చేశారు? 30 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను తీరుస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment