kethireddy venkataramireddy
-
ఓర్వలేకే కుట్రపూరిత రాతలు
ధర్మవరం: అబద్ధాల పునాదులపై నిలబడ్డ ఈనాడు దినపత్రిక అవాస్తవాలు ప్రచురిస్తూ, అమాయకుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేస్తున్న కుట్రలు చూస్తుంటే అసహ్యం వేస్తోందని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరాభిమానాలను చులకన చేసి, రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే విధంగా నిరాధార కథనాలు రాస్తున్న ఈనాడు అంతు చూస్తానని, పరువు నష్టం దావా వేసి చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. బుధవారం ధర్మవరం మండలం దర్శినమల గ్రామంలో వెంకటరామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈనాడు కథనంలో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలంటూ ఆధారాలతో సహా వివరించారు. ప్రతిరోజూ ‘గుడ్‌మార్నింగ్ ధర్మవరం’ పేరిట తాను నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారిలో ఒకడిగా మమేకం అవుతున్నానని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని 2008 సంవత్సరం నుంచి తాను నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నప్పటి నుంచి చేస్తున్నానన్నారు. దీన్ని ఓర్వలేక స్థలాలు, భూములు కబ్జా చేసేందుకు తిరుగుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అలాగైతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన నారా లోకేశ్, నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో చెప్పాలన్నారు. తనపై ఏఒక్క బాధితుడైనా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబును గద్దె ఎక్కించేందుకు రామోజీరావు ఎంతటి నీచానికైనా దిగజారుతారని విమర్శించారు. గతంలోనూ తాను ఈనాడులో రాసిన కథనాలు తప్పుడు రాతలని కోర్టులో నిరూపించానన్నారు. పదేపదే తప్పుడు రాతలతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలని చూస్తే సహించేది లేదని, తగిన బుద్ధి చెబుతానని ఆయన హెచ్చరించారు. మా పాఠశాలంటే ప్రభుత్వ పాఠశాల ధర్మవరం పట్టణంలోని కార్పొరేట్ స్కూళ్లపై ఫిర్యాదులు రాగా.. నిబంధనల ప్రకారం నడుచుకునేందుకు తొమ్మిది నెలల సమయం ఇచ్చామని ఎమ్మెల్యే చెప్పారు. అప్పటికీ వారి తీరు మారకపోవడంతో కార్పొరేట్ పాఠశాలలు మూసివేయడం జరిగిందన్నారు. అంతేతప్ప టీడీపీ వాళ్లలాగా ఏ ఒక్కరితోనూ లాలూచీ పడలేదన్నారు. తాను ‘గుడ్‌మారి్నంగ్ ధర్మవరం’లో తిరుగుతున్నప్పుడు విద్యార్థులు ఎదురైతే ‘మా స్కూల్లో చదవండి’ అని చెబుతానని, మా స్కూల్ అంటే ప్రభుత్వ పాఠశాల అని వివరించారు. దీంతో తనకేవో పాఠశాలలున్నాయంటూ ఈనాడు తప్పుడు కథనాలు రాసిందన్నారు. అలాగైతే శ్రీరాం, సూరి రూ. 200 కోట్ల పనులు చేసేవారా? తన క్వారీలోనే కంకర కొనాలని ప్రజలను బెదిరిస్తున్నారనడం అవాస్తవమన్నారు. అదే నిజమైతే తన నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్‌కు చెందిన సిద్ధార్థ కంపెనీ, బీజేపీ నేత సూరికి చెందిన నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీ రూ. 200 కోట్ల వరకూ విలువైన రైల్వే, బైపాస్‌రోడ్డు పనులు చేసేవా అని ప్రశ్నించారు. ఏ ఒక్కరైనా తన వద్ద కంకర కొనడం గానీ, పర్సంటేజీలు గానీ ఇచ్చారా అని ఆయన నిలదీశారు. కబ్జా చేసినట్లు ఒక్క ఆధారమైనా ఉందా? నియోజకవర్గంలో ఎక్కడైనా తాను సెంటు భూమి కబ్జా చేసినట్లు ఒక్కరైనా ఆరోపించారా అని వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. తాను రైతుల నుంచి భూమి కొనుగోలు చేసి తుంపర్తి వద్ద ఫాంహౌస్ కట్టుకున్నానని తెలిపారు. దాన్ని కూడా వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తన ఫాంహౌస్‌లో ఆక్రమణలు లేవంటూ రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఇచ్చిన రిపోర్టును ఆయన ఈ సందర్భంగా చూపించారు. నియోజకవర్గంలో ఇసుకను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటే ఇందులో ఎమ్మెల్యేకు ఏం సంబంధముందని ప్రశ్నించారు. గతంలో గరుడంపల్లి వద్ద సోలార్ కంపెనీని ఏర్పాటు చేయడానికి ఢిల్లీకి చెందిన వారు వస్తే.. అప్పటి ఎమ్మెల్యే వరదాపురం సూరి డబ్బులు భారీగా డిమాండ్ చేయడంతో ఆ కంపెనీ ఏర్పాటు చేయకుండానే వారు పారిపోయారన్నారు. ఆ తర్వాత వేరే ప్రైవేట్ కంపెనీ ఢిల్లీ వారి నుంచి భూములు కొనుగోలు చేసిందని, ఏడాది తర్వాత తాను మార్కెట్ ధర చెల్లించి ఆ భూములు కొన్నానని వివరించారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. -
అవినీతి చేస్తే తప్పేంటి అనే ఎల్లో మీడియాను ఏమనాలి?
-
బాబుకు రాజకీయ సమాధే
ధర్మవరం: అద్దె ఇంట్లో అవస్థలు పడుతూ దుర్భర జీవితం అనుభవించే నిరుపేదలను అపహాస్యం చేస్తూ సమాధులతో పోల్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ధర్మవరం పట్టణంలో వేల సంఖ్యలో ఇళ్లను పేదలకు కేటాయించి ఊళ్లను నిర్మిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంఘీభావం తెలుపుతూ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులు సోమవారం భారీ ర్యాలీ చేపట్టారు. శివానగర్లోని బచ్చునాగంపల్లి కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివానగర్ నుంచి దిమ్మిల సెంటర్ మీదుగా తేరుబజార్, అంజుమన్ సర్కిల్, పీఆర్టీ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్ మీదుగా వేలాది మంది లబ్ధిదారులతో కలసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాలేజ్ సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 30 లక్షలకు పైగా ఇంటిస్థలాలను కేటాయించి ఇళ్లను కాకుండా ఏకంగా ఊళ్లను నిర్మిస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు కోర్టులకు వెళ్లి అడ్డుపడినా దృఢ సంకల్పంతో వారి కుట్రలను తిప్పి కొట్టారన్నారు. ఇటీవల రాజధాని ప్రాంతంలో నిరుపేదల కోసం 1,400 ఎకరాల్లో 50 వేల పట్టాలను ఒకేసారి పంపిణీ చేసి రికార్డు సృష్టించారన్నారు. చేనేతలు, నిరుపేదలు అత్యధిక సంఖ్యలో నివసించే ధర్మవరం నియోజకవర్గంలో 13 వేలకు పైగా ఇంటిపట్టాలను పంపిణీ చేసి అన్ని సదుపాయాలతో లేఅవుట్లు వేశామన్నారు. తాము అధికారంలోకి వస్తే లాక్కుంటామని ఎల్లో మీడియాలో ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. పేదల ఇంటి పట్టాలను లాక్కునేంత దమ్ముందా అని సవాల్ విసిరారు. తమది పేదలకు మంచి చేసే ప్రభుత్వమని, వారిది ప్రజలను ముందే మనస్తత్వమన్నారు. నిరుపేదలు బాగుపడితే టీడీపీ నేతలు ఓర్వలేరన్నారు. సీఎం జగన్ నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజా మద్దతుతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం అవుతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కురుబ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కోటి సూర్యప్రకాష్‌బాబు, మున్సిపల్ ఇన్చార్జ్ చైర్పర్సన్ ఎర్రగుంట భాగ్యలక్ష్మి, వైస్ చైర్మన్ పెణుజూరు నాగరాజు, పట్టణ సచివాలయాల కన్వీనర్లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్‌లతో పాటు 40వార్డుల కౌన్సిలర్లు, ఇన్‌చార్జ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ధర్మవరంలో ఇకపై తాగునీటి సమస్య ఉండదు : ఎమ్మెల్యే కేతిరెడ్డి
-
ఊర్మిళ జీవితంలో ‘గుడ్ మార్నింగ్’
‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతోంది. ఇంకెందరి జీవితాల్లోనో మార్పు తీసుకొస్తోంది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అప్పటికప్పుడే సమస్యలు పరిష్కారం అవుతుండగా.. జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా విద్యుదాఘాతంతో రెండు చేతులు కోల్పోయిన ఓ యువతి పరిస్థితికి చలించిన కేతిరెడ్డి.. ఆమెను విద్యావలంటీర్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. ధర్మవరం టౌన్: ధర్మవరం పట్టణంలోని పార్థసారధినగర్‌లో నివసిస్తున్న విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకటరాముడు, నాగలక్ష్మిల మూడో సంతానం ఊర్మిళ. 11 ఏళ్ల క్రితం ఉద్యోగ రీత్యా వెంకటరాముడు అనంతపురంలో ఉంటుండగా.. ఓ రోజు ఊర్మిళ ఇంటిపై నుంచి ఇనుపకడ్డీని కిందకు తెచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు ఇనుపకడ్డీ తాకడంతో విద్యుదాఘాతానికి గురై రెండుచేతులు కోల్పోయింది. అయినా కుంగిపోని ఊర్మిళ చదువుపై దృష్టి సారించింది. రెండు చేతులు లేకున్నా చేతికి రబ్బరు బ్యాండులు వేసుకుని వాటి మధ్యలో పెన్ను పెట్టుకుని రాస్తూ చదువు కొనసాగింది. ఉర్మిళ పరిస్థితి తెలుసుకున్న ధర్మవరం లయోలా పాఠశాల కరస్పాండెంట్ శంకర్‌నాయుడు పదో తరగతి వరకూ ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించారు. దీంతో పదో తరగతిలో 9.7 పాయింట్లు సాధించిన ఊరి్మళ... అనంతరం ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీలో 856 మార్కులు సాధించింది. ఆ తర్వాత డైట్‌సెట్‌లో ర్యాంకు సాధించి ధర్మవరంలోని శ్రీసాయికృప డీఎడ్ కళాశాలలో టీటీసీ పూర్తి చేసింది. ఉద్యోగ ప్రయత్నం కొనసాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా ఎమ్మెల్యేను కలుసుకుని తన బాధ చెప్పుకోవాలని భావించింది. కలిసొచ్చిన ‘గుడ్‌మార్నింగ్’ గుడ్‌మార్నింగ్ ధర్మవరం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మూడు రోజుల క్రితం ఊర్మిళ ఉంటున్న పార్థసారథి కాలనీకి వెళ్లగా ఆమె పరుగున వెళ్లి ఎమ్మెల్యేను కలిసింది. తనకు రెండు చేతులు లేవని తన తండ్రి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పింఛను కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తాను టీటీసీ పూర్తి చేశానని ఉద్యోగం ఇప్పిస్తే తన కాళ్లపై తాను నిలబడతానని కోరింది. స్పందించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అక్కడే ఉన్న కమిషనర్ మల్లికార్జునకు చెప్పి విద్యా వలంటీర్‌గా ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఈ విషయంపై ఒకటి రెండు సార్లు అధికారులతో మాట్లాడారు. సోమవారం ధర్మవరం క్రీడా మైదానంలో దివ్యాంగురాలైన ఊర్మిళకు పట్టణంలోని నెహ్రునగర్ మున్సిపల్ పాఠశాలలో విద్యా వలంటీర్‌గా ఉద్యోగం ఇస్తూ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నియామక పత్రాన్ని అందించారు. ఎంత మందిని కలిసి తన సమస్య చెప్పుకున్నా.. ఎవరూ ఆదుకోలేదని, తన సమస్యను విని వెంటనే స్పందించి విద్యా వలంటీర్ ఉద్యోగం ఇప్పించినందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని ఊర్మిళ భావోద్వేగంతో చెప్పారు. చదవండి: టీడీపీ కార్యకర్తల అరాచకం పట్టణాలు, నగరాల్లో.. త్వరలో సొంతిల్లు -
సునీత కుట్ర రాజకీయాలు చేస్తున్నారు
సాక్షి, అనంతపురం : చిత్రావతి రిజర్వాయర్ ముంపు బాధితులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని, 240 కోట్ల రూపాయల పరిహారం అందించి ముఖ్యమంత్రి వారికి న్యాయం చేశారని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి పరిటాల సునీత కుట్ర రాజకీయాలు మానుకోవాలని, టీడీపీ హయాంలో ముంపు బాధితులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదని ప్రశ్నించారు. చిత్రావతి ముంపు బాధితులందరికీ పరిహారం ఇచ్చామని తెలిపారు. ( రేపు రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలు ) కేవలం 23 ఇళ్ల విషయంలో మాత్రమే వివాదం నడుస్తోందని, దీనిపై పరిటాల సునీత కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా లోకేష్ ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. ‘ గతంలో మంత్రి దేవినేని ఇదే గ్రామానికి వచ్చారు. ఏం న్యాయం చేశారు? 30 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను తీరుస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సీఎం జగన్ పేదల పక్షపాతి
-
మీరు నడిపేది బ్యాంకా.. స్కూలా..?
సాక్షి, ధర్మవరం: పాఠశాల అంటే వివేకానందుని సూక్తులో.. గాంధీజీ చెప్పిన మాటలో గోడలపై రాస్తారు.. మేము క్యాష్‌తోపాటు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా అంగీకరిస్తామని బోర్డులు పెడతారా.. ఏందిది..? మీరు నడుపుతుండేది స్కూలా..? లేక బ్యాంకా..? అంటూ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కార్పొరేట్ పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ పాఠశాలల ఆకస్మిక తనిఖీలో భాగంగా ఆయన ధర్మవరంలోని రవీంద్రభారతి ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు వెళ్లారు. క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన ప్రధానోపాధ్యాయురాలి గదిలో ఫీజులు క్యాష్‌లెస్ ద్వారా తీసుకుంటామన్న బోర్డును చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బే పరమావధిలా మీ పాఠశాల పనిచేస్తుందనడానికి ఈ బోర్డు ఒక్కటే చాలంటూ మండిపడ్డారు. తల్లిదండ్రుల బలహీనతను ఆసారా చేసుకుని దందా నడుపుతారా అంటూ నిప్పులు చెరిగారు. -
‘చంద్రబాబు-జనసేన పొత్తు.. వెయ్యికోట్ల ఒప్పందం’
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, పవన్ కళ్యాణ్ జనసేనకు మధ్య పొత్తు కుదిరిందని వైఎస్సార్ సీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. టీడీపీ నేత లింగమనేని వారిద్దరికి మధ్యవర్తిత్వం వహించారని, టీడీపీకి పరోక్షంగా సహకరించేందుకు పవన్ కళ్యాణ్ వెయ్యి కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ఓట్లను చీల్చటమే చంద్రబాబు వ్యూహమని తెలపారు. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ ఇచ్చిన హామీలపై పవన్ కల్యాణ్‌కు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. జనసేన ప్రజారాజ్యం-2గా మారటం ఖాయమన్నారు. -
‘నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేయడానికే వచ్చా’
అమరావతి: అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో నకిలీ ఓట్ల చేర్పులపై ఫిర్యాదు చేయడానికే అమరావతి వచ్చానని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాం రెడ్డి తెలిపారు. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గోపాల కృష్ణ ద్వివేదిని కలిసి నకిలీ ఓట్ల వ్యవహారాన్ని ఆయనకు వివరించారు. అనంతరం కేతిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాను 22 సార్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మార్పులు, చేర్పులు కనిపించడం లేదని వ్యాక్యానించారు. ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి) నిన్న తనపై ఫిర్యాదు చేశారని ప్రస్తావించారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు తెలియకుండా ఒక్క పెన్షన్ కూడా రాదు.. అలాంటిది తాను ధర్మవరం నియోజకవర్గంలో 20 వేల ఓట్లు తీసేయించాను అని ప్రచారం చేస్తున్నారు..అందులో అసలు వాస్తవం ఉందా అని సూటిగా అడిగారు. పక్కా ఆధారాలతో చెబుతున్నా మా నియోజకవర్గంలో 6 వేల 73 నకిలీ ఓట్లను చేర్చారని ఆరోపించారు. ఈ ఓట్లు నకిలీవి కాదని నిరూపిస్తే తనపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చునని సవాల్ విసిరారు. టీడీపీ దొంగ ఓట్లతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోందని ఆరోపించారు. ఒక్కసారైనా తప్పుల తడక లేకుండా ఓటరు లిస్టు ప్రచురితం చేయాలని వేడుకుంటున్నట్లు చెప్పారు. ఎలక్షన్ కమిషనర్ పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. -
దొంగ ఓట్లు అరికట్టండి
అనంతపురం ,ధర్మవరం అర్బన్: ‘ఎమ్మెల్యే సూరి భార్య నిర్మలాదేవి పేరుపై వరదాపురం గ్రామ బూత్ నంబర్ 134లో 620 సీరియల్ నంబర్ మీద ఒక ఓటు, ధర్మవరంలోని బూత్ నంబర్ 230లో 552 సీరియల్ నంబర్ కింద మరో ఓటు హక్కు ఉంది. అలాగే న్యాయవాది సుబ్బరావు పేరుపై మూడు ప్రాంతాల్లో ఓటు హక్కు కల్పించారు. ఈ పరిస్థితి ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉంది. టీడీపీ నాయకులు నిరంతం దొంగ ఓట్లు నమోదు చేయించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. వైఎస్సార్సీపీ ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోండి’ అంటూ జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్‌కు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన కలెక్టర్‌కు ఆయన అందజేశారు. అనంతరం విలేకరులతో కేతిరెడ్డి మాట్లాడుతూ.. చింతలపల్లిలో ఉన్న నారా తిప్పానాయుడు, నారా విశాలకు అనంతపురం అర్బన్ 108 బూత్‌లో, మహేశ్వరమ్మ, శంకర్‌నాయుడుకు 105 బూత్‌లో డబుల్ ఎంట్రీలు ఉన్నాయన్నారు. దొంగ ఓట్లు నమోదు చేయించుకున్న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ధర్మవరంలోని సీసీకొత్తకోట గ్రామంలో ఓట్లను బీఎల్ఓలు తొలగించారన్నారు. మల్కాపురం గ్రామంలో తాము స్థిరంగా ఉన్నామంటూ ఆధారాలు ఇచ్చినా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల 25 మంది ఓట్లు తొలగించారన్నారు. ధర్మవరంలోని 184వ బూత్‌లో 34 ఓట్లు డబుల్ ఎంట్రీతో ఉన్నాయన్నారు. వీటిని ఎందుకు తొలగించలేకపోతున్నారని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాలుగా బత్తలపల్లి డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న సురేష్.. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీ సానుభూతి పరులను ఓటరు జాబితాలో ఎక్కించకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. ధర్మవరం కార్యాలయంలో శ్రీనాథ్ అనే వ్యక్తి బీఎల్ఓలను ఆర్డీవో కార్యాలయంలో కూర్చోబెట్టి గూడూపుఠాని నడిపించారన్నారు. ఈ అక్రమాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఎన్నికల కమిషన్‌కూ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. తెలిసి చేసినా, తెలియకుండా చేసినా సెక్షన్ 31 కింద ఎమ్మెల్యే భార్య నిర్మలాదేవి నేరస్తురాలిగా శిక్ష అనుభవించకతప్పదన్నారు. సెక్షన్ 32 ప్రకారం అధికారులకూ రెండేళ్లపాటు శిక్ష పడే అవకాశముందన్నారు. -
కాంగ్రెస్‌తో పొత్తు..నీచ రాజకీయాలకు నిదర్శనం
అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం నీచ రాజకీయాలకు నిదర్శనమని అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. వైఎస్ జగన్ 3 వేల కిలోమీటర్ల పాదయాత్రకు సంఘీభావంగా ధర్మవరం నుంచి గరిసెనపల్లి దాకా కేతిరెడ్డి పాదయాత్ర చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ప్రజలకు ద్రోహం చేయటమే అవుతుందని ఈ సందర్భంగా కేతిరెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని, ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైన పంచాయతీ రాజ్ శాఖా మంత్రి నారా లోక్ష్, ఆ శాఖకు మంత్రిగా అనర్హుడని ధ్వజమెత్తారు. -
తాడిపత్రిలో రాక్షస పాలన
అనంతపురం: తాడిపత్రిలో రాక్షసపాలన సాగుతోందని, జేసీ బ్రదర్స్ రాజకీయ హింసను ప్రోత్సహిస్తున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. జేసీ సోదరులకు పోలీసులు తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. జేసీ వర్గీయుల దౌర్జన్యంపై ప్రశ్నించిన తాడిపత్రి సమన్వయకర్త పెద్దారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. పోస్టింగుల కోసం పోలీసు అధికారుల అరాచకాలను ప్రోత్సహించటం తగదన్నారు. -
ప్రజారోగ్యంతో చెలగాటం
తాగునీటిలో బల్లులు, పురుగులు శుద్ధి చేయకుండానే ప్రజలకు సరఫరా డయేరియా, చర్మవ్యాధులతో జనం సతమతం అస్తవ్యస్తంగా తాగునీటి పథకం ప్లాంట్ నిర్వహణ మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం: కలుషితమైన తాగునీటిని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని మునిసిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ధర్మవరం పట్టణ ప్రజల దాహార్తి తీర్చాలన్న ఉద్దేశ్యంతో కోట్లరూపాయలు వెచ్చించి తన హయాంలో వాటర్‌ప్లాంటు నిర్మించి ఇస్తే.. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కనీసం నిర్వహణ కూడా సక్రమంగా చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన పట్టణంలోని తిక్కస్వామినగర్లో ఉన్న ‘కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి తాగునీటి పథకం’ నిర్వహణ తీరును పరిశీలించారు. వాటర్‌ప్లాంట్‌లో నీటి శుద్ధి ఎలా జరుగుతోందో స్వయంగా చూసి తెలుసుకున్నారు. నీటి తొట్టెల్లో బల్లుల కళేబరాలు, క్రిమికీటకాలు తేలుతుండటం గమనించారు. తాగునీరు ప్రవహించే కాలువలను శుభ్రం చేయకపోవడంతో పాచిపట్టి ఉండటాన్ని, నీటిని శుద్ధి చేసేందుకు రసాయనాలను, ఆలంను వినియోగించకుండా క్లోరిన్ మాత్రమే కలిపి నీటిని సరఫరా చేస్తున్నానట్లు గుర్తించారు. నీటి తొట్టెలను ఎన్నిరోజులకొకసారి శుభ్రం చేస్తారని అక్కడున్న వాటర్సప్లై సిబ్బందిని ప్రశ్నించగా.. ప్రతి రోజూ శుభ్రం చేస్తున్నామని చెప్పడంతో మరి బల్లులు, పురుగులు ఎలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తాగేనీరు ఇంత అధ్వానంగా ఉంటే ఎలా. ఈ నీటిని మీరు తాగుతారా.? అన్ని ప్రశ్నించారు. ప్లాంటులో నీటిని శుభ్రం చేయకుండా చిత్రావతి నది నుంచి వచ్చిన నీటిని అలాగే వాటర్బెడ్లలోకి పంపి నేరుగా ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నీటిని ప్రజలు ఒకటి రెండు రోజులు నిల్వ ఉంచితే పురుగులు పడుతున్నాయన్నారు. తాగునీరు మురుగునీటి కన్నా అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటిని తాగడంతో చాలామంది డయేరియా, చర్మవ్యాధుల బారినపడ్డారన్నారు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, నాయకులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కమీషన్ల కోసం కరెంట్ బిల్లుల పెండింగ్ ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో రూ. 9.74 కోట్లు కరెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు ఏం చేస్తున్నారని కేతిరెడ్డి ప్రశ్నించారు. 2015–16 సంవత్సరానికి గాను ధర్మవరం మున్సిపాలిటీకి వివిధ పన్నుల రూపంలో రూ.20.53 కోట్లు వస్తే ఆ నిధులన్నింటినీ కమీషన్ల కోసం, వివిధ పనులకు ఖర్చుచేశారన్నారు. ప్రతి పనికీ 5 శాతం అధికంగా టెండర్లను పిలిచి ప్రజాధనాన్ని అధికారపార్టీ నాయకులు దోచుకుంటునారని విమర్శించారు. వాస్తవానికి 2009 సంవత్సరంలో మున్సిపాలిటీ పరిధిలో వసూలయ్యే పన్నుల మొత్తాన్ని కరెంట్బిల్లులు, కార్మికుల వేతనాలకు మాత్రమే ఖర్చుచేయాలని జీఓ జారీ చేసిందన్నారు. అయితే కరెంట్ బిల్లులు చెల్లిస్తే తమకు కమీషన్లు రావన్న ఉద్దేశంతో అధికారపార్టీనాయకులు, ఇక్కడి అధికారులతో కుమ్మక్కై ఆ మొత్తాన్ని జనరల్ ఫండ్కింద ఖర్చుచేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.9.74 కోట్ల కరెంట్ బిల్లులు బకాయిల్లో రూ.4.84 కోట్లు అపరాధరుసుమే ఉందంటే వీరు ప్రజాధనాన్ని ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారో ఇట్టే అర్థమవుతుందన్నారు. మున్సిపాలిటీ పాలకవర్గానికి కానీ, ఇక్కడి ప్రజాప్రతిధులకు కానీ ప్రజల ఆరోగ్యంపై ఏమాత్రం చిత్తశుద్ధిలేదని, ఇంత మంది రోగాల బారిన పడతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. -
రైతులకు న్యాయం జరక్కపోతే కోర్టుకెళ్తాం
- సీఎం మోసపూరిత నిర్ణయంతో అన్యాయం - ఇన్పుట్ సబ్సిడీ, బీమా వేర్వేరుగా ఇవ్వాలి – మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం టౌన్ : వాతావరణ బీమా పరిహారాన్ని ఇన్పుట్ సబ్సిడీకి జత చేసి రైతులకు అందిస్తానని చెప్పడం సీఎం చంద్రబాబు చేస్తున్న మరో మోసానికి నిదర్శనం. ఈ విషయంలో రైతులకు అన్యాయం జరిగితే కోర్టుకు వెళతామని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ మూడేళ్ల పాలనలో తీవ్ర వర్షాభావంతో రైతాంగం కుదేలైందన్నారు. ప్రతి సంవత్సరం జిల్లాకు రావడం.. రైతులకు పంట నష్ట పరిహారం అందిస్తానని చెప్పడం..అనంతరం మొహం చాటేయడం సీఎంకు అలవాటైందన్నారు. గత ఏడాది జిల్లావ్యాప్తంగా 15.15 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశనగను సాగు చేశారన్నారు. మరో నాలుగు లక్షల ఎకరాల్లో కంది, ఆముదం తదితర పంటలను రైతులు సాగు చేశారన్నారు. ప్రభుత్వం గత ఏడాది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరాకు రూ.19,500గా నిర్ణయించిందని.. రైతులు ఆ నిబంధన ప్రకారం వాతావరణ బీమా ప్రీమియాన్ని ఎకరాకు రూ.500 చొప్పున మొత్తం రూ.350 కోట్లు బీమా కంపెనీకి చెల్లించారన్నారు. అయితే తీవ్ర వర్షాభావం కారణంగా పంట దారుణంగా దెబ్బతిందన్నారు. దీంతో 63 మండలాలలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. జిల్లాలో 15.15 లక్షల ఎకరాలకు గానూ రూ.3,500 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందజేస్తే.. బీమా కంపెనీ నష్ట పరిహారాన్ని కేవలం రూ.419 కోట్లు విడుదల చేసిందన్నారు. ఏదో ప్రభుత్వం అన్నా రైతులను ఆదుకుంటుందని భావిస్తే రూ.1032.69 కోట్లు విడుదల చేస్తుందని ప్రకటన చేసిందన్నారు. నయా మోసానికి తెర.. ప్రస్తుతం ఆ పరిహారం కూడా వాతావారణ బీమాకు అనుస«ంధానం చేసి ఆనిధులతో పాటు రైతులకు చెల్లించేలా ప్రభుత్వం మరో మోసానికి తెరలేపడం దారుణమన్నారు. ఇన్పుట్ సబ్సిడీ అనేది కేంద్రం సగ భాగం, రాష్ట్రం సగభాగం భరించాలి. అయితే పంట నష్ట పరిహారాన్ని రాష్ట్రం తమ వాటా విడుదల చేయకుండా బీమా కంపెనీ విడుదల చేసిన నిధులు, కేంద్రం విడుదల చేసిన నిధులు, ఫసల్ బీమా ద్వారా వచ్చిన పంట నష్ట పరిహారం రూ.37 కోట్లకు కేవలం రూ.67 కోట్లు నిధులను జత చేసి రైతులకు అందించాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారన్నారు. దేశ చరిత్రలో ఇలా రైతాంగాన్ని మోసం చేయాలనే ప్లాన్ ఇంత వరకు ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. బీమా పరిహారం అనేది రైతులు చెల్లించిన ప్రీమియం కంపెనీ ఇచ్చే పరిహారం అది ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఇలా చేయడం చట్ట విరుద్ధమన్నారు. అంతేకాక ప్రభుత్వం బీమా కంపెనీ విడుదల చేసిన నిధులను రైతుల ఖాతాలో జమ చేయకుండా అడ్డుకోవడం మరో మోసమన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లోనే రైతుల ఖాతాలో బీమా పరిహారం నిధులు విడుదల చేయాల్సి ఉన్నా.. ప్రభుత్వ వైఖరి కారణంగానే జాప్యం జరిగిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసం కారణంగా అటు వ్యవసాయశాఖ అధికారులు, ఇటు బీమా కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అందరూ చట్టపరిధిలో శిక్షార్హులే అవుతారన్నారు. నేడు ఏరువాకకు జిల్లా పర్యటనకు వస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా ఈ మోసపూరిత నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఇన్పుట్ సబ్సిడీ నిధులను కేంద్రం, రాష్ట్రం వాటాలతో మాత్రమే అందించాలన్నారు. లేని పక్షంలో తాము కోర్టుకు వెళ్లి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. రైతాంగాన్ని మోసం చేసే ఇలాంటి పనులు ప్రభుత్వం ఇప్పటికైనా మానుకోవాలని లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. -
సమరానికి సన్నద్ధం కండి
- టీడీపీని సాగనంపుదాం - సీఎం నుంచి జన్మభూమి కమిటీ సభ్యుల వరకు దోచుకో..దాచుకో సిద్ధాంతమే - ధర్మవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ప్లీనరీలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధ్వజం - రాష్ట్రంలో దొంగలు పడ్డారు : ఎమ్మెల్సీ వెన్నపూస - అవినీతికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ : శంకనారాయణ ధర్మవరం : ‘టీడీపీని సాగనంపే సమయం ఆసన్నమైంది. నాయకులు, కార్యకర్తలు సమరానికి సిద్ధంకండి’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ నాయకుల వేధింపులకు గురైన వారిని నేరుగా కలిసి..వారి బాధలను తెలుసుకోండి.. ఒక్కో కార్యకర్త వంద ఓట్లు వేయించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ధర్మవరంలోని పరమేశ్వరి పంక్షన్హాల్లో నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ ముఖ్య అథితులుగా హాజరయ్యారు. సమావేశం ఆరంభం కాగానే ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, చేనేత కార్మికులు, ప్రత్యర్థుల చేతిలో చనిపోయిన కర్నూల్ జిల్లా వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి, గుండెపోటుతో మరణించిన వైఎస్సార్‌టీఎఫ్ ముదిగుబ్బ మండల అధ్యక్షుడు సుధాకరరెడ్డికి సంతాపం తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు పంచభూతాల్ని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి నుంచి జన్మభూమి కమిటీ సభ్యుడి వరకు ’దోచుకో– దాచుకో.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’ అన్న సిద్ధాంతం ప్రకారం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. జిల్లాలో రైతాంగం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాది ఆగస్టు నెలలో ధర్మవరం మండలానికి వచ్చిన ముఖ్యమంత్రి పంట నష్టపరిహారం, వాతావరణ బీమా ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికే ఎనిమిది నెలలవుతున్నా..వాటి ఊసేలేదన్నారు. దీంతో కుటుంబాల్ని ఎలా పోషించుకోవాలో దిక్కుతెలియక రైతులు కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్లారన్నారు. రైతు కంట కన్నీరు తెప్పించిన ఏ నాయకుడికీ భవిష్యత్తు ఉండదని, వారి హయాంలో రాజ్యం బాగుపడిన దాఖలాలు లేవన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ఒక్క జగన్మోనరెడ్డితోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్‌ని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పని చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక నుంచి మట్టి వరకు అన్నీ అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు నిద్రలేస్తే అబద్ధాలు చెప్పడం అలవాటుగా మార్చుకున్నారన్నారు. ఆయన కుమారుడు లోకేష్‌బాబు సూట్ కేస్బాబుగా మారిపోయారన్నారు. రాజధాని అంటూ.. రైతుల భూములు లాక్కుంటున్నారు.. సింగపూర్ అంటూ కోట్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌ను అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు తాకట్టుపెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో సుపరిపాలన రావాలంటే జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ మాట్లాడుతూ రైతులు కరువుతో ఇబ్బందులు పడుతున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అయినా ఈ ప్రభుత్వానికి ఇవేవీ పట్టడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అరాచాకాలకు చెక్‌పెట్టాలంటే అది ఒక్క వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు. -
రైతు ద్వేషి చంద్రబాబు
- ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వ్యవసాయ సంక్షోభం - నేడు రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ధర్నా - మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం టౌన్ : వ్యవసాయమన్నా, రైతులన్నా చంద్రబాబుకు గిట్టదని, ఆయన రైతు ద్వేషి అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. బాబు పాలనలో నిర్లక్ష్యం వల్లే వ్యవసాయ సంక్షోభం తీవ్రతరమైందన్నారు. ఆదివారం స్థానిక ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17వ తేదీ సోమవారం వైఎస్సార్సీపీ «ఆధ్వర్యంలో బత్తలపల్లి మండలం నుంచి ధర్మవరం వరకు ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ధర్మవరం ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. పార్టీ శ్రేణులతోపాటు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వరుస కరువులతో రైతులు అల్లాడిపోతున్నారని, గ్రామాల్లో పనులు దొరక్క రైతులు కుటుంబాలతో సహా కేరళ, బెంగళూర్ వంటి ప్రాంతాలకు వెళ్లి కూలీలుగా దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారని కేతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దయనీయమైన పరిస్థితులు ఉంటే సీఎం చంద్రబాబు మాత్రం కనీసం ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం అందించకుండా రెయిన్గన్ల పేరుతో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఆరునెలల క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు వెంటనే పంట నష్ట పరిహారం అందిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు అది అమలుకు నోచుకోకపోవడం చూస్తే రైతుల విషయంలో ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోందన్నారు. రుణమాఫీ హామీ అమలుకాకపోవడంతో రైతులు పంట రుణాల వడ్డీలు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చుకున్నారని, అధిక వడ్డీలు భరించలేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని విచారం వెలిబుచ్చారు. ఈ పాలకులు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేసి రైతన్నలకు తీరని అన్యాయం చేశారని, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపడుతున్న ఆందోళన కార్యక్రమానికి అందరూ మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. -
చేనేతను నిర్వీర్యం చేశారు
ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపాటు – 30న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్మవరంలో చేనేత ధర్నా ధర్మవరం టౌన్ : పెరిగిన ముడి సరుకు ధరలతో చేనేతల నష్టాల పాలై దుర్భర పరిస్థితులను అనుభవిస్తుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. ముడిపట్టు రాయితీ బకాయిని వెంటనే విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈనెల 30న ధర్మవరం సెరికల్చర్ కార్యాలయం ఎదురుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేనేత ధర్నాను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం ఆయన పట్టణంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 32 నెలల కాలంలో చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. ప్రధానంగా ముడిపట్టు రాయితీ, చేనేత ఆరోగ్యబీమా, ఆర్టిసాన్ క్రెడిట్ ద్వారా రాయితీ రుణాలు, ఎన్‌హెచ్‌డీసీ తదితర పథకాలను నిర్వీర్యం చేసి, చేనేతలకు ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. చేనేత సంక్షోభానికి పెరిగిన ముడిపట్టు ధరలే కారణమని, ముడిపట్టు గతంలో కిలో రూ.2 వేలు ఉంటే ప్రస్తుతం రూ.4 వేలుకు చేరుకుందన్నారు. దీంతో చేనేత కార్మికులకు రోజు కూలీ రావడం కూడా కష్టమైందన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేనేత ముడిపట్టు రాయితీ పథకాన్ని కూడా అటకెక్కించిందన్నారు. ఫలితంగా నేతన్నలకు 15 నెలల ముడిపట్టు రాయితీ పెండింగ్‌లో ఉందన్నారు. రాయితీని రూ.1000కి పెంచుతామని టీడీపీ ప్రభుత్వం మరో నాటకానికి తెరలేపిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినతర్వాత కేవలం 17 నెలలు మాత్రమే రాయితీని పంపిణీ చేసిందన్నారు. అదీ కూడా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తాము గతేడాది జూలై నెలలో సంతకాల సేకరణ చేపట్టి, జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేసిన ఫలితమేనన్నారు. గత ఏడాది ఆగస్టులో సీఎం చంద్రబాబు ధర్మవరంలో చేనేతల సమావేశం నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లిస్తామని, రాయితీని వెయ్యికి పెంచుతున్నామని హామీ ఇచ్చి వెళ్లిపోయారన్నారు. సీఎం హామీ ఇచ్చి ఐదు నెలలైనా అమలు కాకపోవడం దారుణమన్నారు. చేనేతలకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌ససీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. వైఎస్సార్సీపీ చేనేత ధర్నాకు మద్దతు తెలిపిన అఖిల పక్ష పార్టీలకు , అన్ని చేనేత సంఘాల నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చేనేత ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని చేనేతలకు ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చేనేత సంఘం నాయకులు కుమారస్వామి, కంబగిరి, పాలబావి శ్రీన, తేజ, శివశంకర్, కడపల రంగస్వామి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ కార్యాలయాలుగా పోలీస్ స్టేషన్లు
- కానిస్టేబుళ్లపై దాడి హేయమైన చర్య – ధర్మవరంలో నానాటికీ దిగజారుతున్న శాంతి భద్రతలు – బాధిత పోలీసులకు న్యాయం చేసి నిందితులను శిక్షించాలి – మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డిమాండ్ ధర్మవరం టౌన్ : టీడీపీ అధికారంలోకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లు అధికారపార్టీ కార్యాలయాలుగా మారాయని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసులపై అధికార పార్టీ నాయకుల దాడులు అధికమయ్యాయని, పోలీసులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. మంగళవారం పట్టణంలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేతిరెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలు నానాటికీ దిగజారుతున్నాయన్నారు. అధికార పార్టీ నాయకులు ఏకంగా పోలీసులపైకి దాడులకు దిగుతున్నా ఉన్నతాధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. నిందితులకు వత్తాసుపలికేలా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. ఇటీవల ముదిగుబ్బ మండలంలోని రాళ్ల అనంతపురంలో అందరూ చూస్తుండగానే హరిలాల్‌నాయక్ అనే కానిస్టేబుల్‌పై ఇద్దరు టీడీపీ నాయకులు దాడి చేశారన్నారు. ఇది మరువకనే ఆదివారం ధర్మవరం పట్టణంలో పోలీస్ స్టేషన్ ఎదురుగానే రవి అనే కానిస్టేబుల్‌పై టీడీపీ నాయకుడు భౌతిక దాడికి దిగడాన్ని బట్టి చూస్తే అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఎంత మేరకు ఉన్నాయో అర్థమవుతుందన్నారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ముదిగుబ్బలో ఓ పోలీస్ అధికారి పంచాయితీ చేసి, రాజీ కుదుర్చేందుకు యత్నించారన్నారు. ధర్మవరంలో కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితుడిపై చర్యలు తీసుకోకుండా పోలీస్ ఉన్నతాధికారి మిన్నకుండిపోవడాన్ని చూస్తుంటే పోలీసు వ్యవస్థపైన ప్రజలకు నమ్మకం కోల్పోయినట్లయ్యిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లను పంచాయితీలు, సెటిల్మెంట్లు చేసుకునేందుకు వేదికలుగా మార్చారన్నారు. బాధితులు అన్యాయానికి గురై పోలీస్ స్టేషన్‌కు వెళితే కౌంటర్ కేసులు కడుతూ రాజీ కావాలని నిందితులతో పంచాయితీలు కుదుర్చడం పరిపాటిగా మారిందన్నారు. కేవలం అధికారపార్టీల నేతల ప్రచార ఫ్లెక్సీలకు కాపలా కాయడం, పదుల సంఖ్యలో పోలీసులు కాపలా ఉండటం సిగ్గుచేటన్నారు. ఫ్లెక్సీల వివాదం కోసం 144 సెక్షన్ అమలు చేసే నీచ స్థితికి పోలీస్ వ్యవస్థ దిగజారడం దారుణమన్నారు. పోలీస్ వ్యవస్థ అంటే తమకు ఎంతో నమ్మకం ఉందని తక్షణం ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు కానిస్టేబుళ్లపై దాడులు చేసిన నిందితులను కఠినంగా శి„క్షించాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. ìబాధిత పోలీసుల పక్షాన వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. -
ప్రతి పల్లె కన్నీరు పెడుతోంది..
– కరువు..చంద్రబాబు .. కవల పిల్లలు – రైతు సమస్యలపై జగన్‌తో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తాం – మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం అర్బన్ : వర్షాభావంతో రైతులు వేరుశనగ పంట పండక ప్రతి పల్లెలోనూ రైతులు కన్నీరు పెడుతోంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ప్రతి రైతు పొలాలను రెయిన్గన్లతో తడిపామని ప్రకటనలు చేయడం బాధాకరమని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. పట్టణంలోని ఆయన స్వగహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరులతో కేతిరెడ్డి మాట్లాడారు. కరువు, చంద్రబాబు ఇద్దరూ కవల పిల్లలు అన్నారు. రాబోయే రోజుల్లో కవలలను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రైతులను కల్లిబొల్లి మాటలతో పంటలను తడిపామంటూ మోసం చేయడంలో విజయం సాధించిన చంద్రబాబు వారిని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో వేరుశనగ పంటలను రెయిన్ గన్లతో తడిపామని అబద్ధాలు చెప్పడం సిగ్గు చేటన్నారు. రైతాంగం బాధలో ఉంటే సీఎం మాత్రం బాగుందని చెప్పడం బాధాకరమన్నారు. వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ తర ఫున గ్రామాల్లో ప్రతి రైతునూ కలిసి, సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు చెప్పారు. రైతులకు రూ.20 వేలు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఇచ్చే వరకు ఊరుకునేదిలేదని, తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి దష్టికి సమస్య తీసుకెళ్లి, అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీఎత్తున ధర్నా చేపడుతామని హెచ్చరించారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవో కార్యాలయాలను దిగ్బంధం చేస్తామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుందన్నారు. ప్రస్తుతం రైతులు వేసుకున్న కంది, ఆముదం పంటలకు సబ్సిడీతో ఎరువులు అందించి వారిని ఆదుకోవాలని హితవు పలికారు. -
మీడియా ముందు ముఖ్యమంత్రి డ్రామాలు
ధర్మవరం : ప్రత్యేక హోదా కావా లంటూ మీడియా ముందు డ్రామాలు ఆడుతున్నాడేకానీ.. ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా కేంద్రానికి లేఖ ఇచ్చిన దాఖలాలు లేవని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. మంగళవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాకోసం నిరసన చేస్తున్నవారిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పార్లమెంట్లో సమావేశాలు జరుగుతున్నాయి..ఇక్కడి ప్రజల మనోభావాలు అక్కడి వారికి తెలుస్తాయనే ఉద్దేశం కూడా లేకుండా ఏదో యుద్ధవాతావరణం ఏర్పడినట్లు ఎక్కడి వారినక్కడ అరెస్ట్ చేయించడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీని గట్టిగా నిలదీయలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నాడని దుయ్యబట్టాడు. రాష్ట్రం మీద ఏమాత్రం బాధ్యత ఉన్నా కేంద్రంలో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ మంత్రుల చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు వెనుకబడిన రాయలసీమకు కాకుండా, అమరావతికి పన్ను మినహాయింపు కోరిన మహానుభావుడన్నారు. ఆయన ఎప్పుడూ ప్రాంతాలమధ్య, కులాల మధ్య, వర్గాల మధ్య చిచ్చుపెడుతూనే ఉంటాడన్నారు. ఏదిఏమైనా.. ప్రభుత్వం ఎంత అణచివేయాలని చూసినా.. ప్రత్యేక హోదా కోసం చేయి కలిపిన ప్రతి ఒక్కరికీ తన ధన్యావాదాలన్నారు.