కాంగ్రెస్‌తో పొత్తు..నీచ రాజకీయాలకు నిదర్శనం | KethiReddy Venkatarami Reddy Slams TDP In Dharmavaram | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తో పొత్తు..నీచ రాజకీయాలకు నిదర్శనం

Published Fri, Sep 28 2018 3:37 PM | Last Updated on Fri, Sep 28 2018 3:37 PM

KethiReddy Venkatarami Reddy Slams TDP In Dharmavaram  - Sakshi

అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడం నీచ రాజకీయాలకు నిదర్శనమని అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైఎ‍స్సార్‌సీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. వైఎస్‌ జగన్‌ 3 వేల కిలోమీటర్ల పాదయాత్రకు సంఘీభావంగా ధర్మవరం నుంచి గరిసెనపల్లి దాకా కేతిరెడ్డి పాదయాత్ర చేశారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ప్రజలకు ద్రోహం చేయటమే అవుతుందని ఈ సందర్భంగా కేతిరెడ్డి విమర్శించారు. వైఎస్‌ జగన్‌ విజన్‌ ఉన్న నాయకుడని, ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైన పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రి నారా లోక్‌ష్‌, ఆ శాఖకు మంత్రిగా అనర్హుడని ధ్వజమెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement