సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, పవన్ కళ్యాణ్ జనసేనకు మధ్య పొత్తు కుదిరిందని వైఎస్సార్ సీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. టీడీపీ నేత లింగమనేని వారిద్దరికి మధ్యవర్తిత్వం వహించారని, టీడీపీకి పరోక్షంగా సహకరించేందుకు పవన్ కళ్యాణ్ వెయ్యి కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం ఉందని తెలిపారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ఓట్లను చీల్చటమే చంద్రబాబు వ్యూహమని తెలపారు. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ ఇచ్చిన హామీలపై పవన్ కల్యాణ్‌కు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. జనసేన ప్రజారాజ్యం-2గా మారటం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment