సాక్షి, ధర్మవరం: పాఠశాల అంటే వివేకానందుని సూక్తులో.. గాంధీజీ చెప్పిన మాటలో గోడలపై రాస్తారు.. మేము క్యాష్‌తోపాటు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ కూడా అంగీకరిస్తామని బోర్డులు పెడతారా.. ఏందిది..? మీరు నడుపుతుండేది స్కూలా..? లేక బ్యాంకా..? అంటూ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కార్పొరేట్ పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ పాఠశాలల ఆకస్మిక తనిఖీలో భాగంగా ఆయన ధర్మవరంలోని రవీంద్రభారతి ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు వెళ్లారు.
క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన ప్రధానోపాధ్యాయురాలి గదిలో ఫీజులు క్యాష్‌లెస్ ద్వారా తీసుకుంటామన్న బోర్డును చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బే పరమావధిలా మీ పాఠశాల పనిచేస్తుందనడానికి ఈ బోర్డు ఒక్కటే చాలంటూ మండిపడ్డారు. తల్లిదండ్రుల బలహీనతను ఆసారా చేసుకుని దందా నడుపుతారా అంటూ నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment