ravindra bharathi school
-
మీరు నడిపేది బ్యాంకా.. స్కూలా..?
సాక్షి, ధర్మవరం: పాఠశాల అంటే వివేకానందుని సూక్తులో.. గాంధీజీ చెప్పిన మాటలో గోడలపై రాస్తారు.. మేము క్యాష్‌తోపాటు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా అంగీకరిస్తామని బోర్డులు పెడతారా.. ఏందిది..? మీరు నడుపుతుండేది స్కూలా..? లేక బ్యాంకా..? అంటూ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కార్పొరేట్ పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ పాఠశాలల ఆకస్మిక తనిఖీలో భాగంగా ఆయన ధర్మవరంలోని రవీంద్రభారతి ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు వెళ్లారు. క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన ప్రధానోపాధ్యాయురాలి గదిలో ఫీజులు క్యాష్‌లెస్ ద్వారా తీసుకుంటామన్న బోర్డును చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బే పరమావధిలా మీ పాఠశాల పనిచేస్తుందనడానికి ఈ బోర్డు ఒక్కటే చాలంటూ మండిపడ్డారు. తల్లిదండ్రుల బలహీనతను ఆసారా చేసుకుని దందా నడుపుతారా అంటూ నిప్పులు చెరిగారు. -
రవీంద్రభారతి స్కూల్లో అగ్ని ప్రమాదం
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడ సత్యనారాయణపురంలోని రవీంద్ర భారతీ స్కూల్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్కూల్లోని నాలుగో అంతస్తులో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. దీనితో స్టోర్ రూంలో వుంచిన పుస్తకాలు, ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. మంటలను గమనించిన టీచర్లు, విద్యార్థులు కిందికి పరుగులు తీశారు. రెండు ఫైర్ ఇంజన్లు సకాలంలో సంఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు వాడాల్సిన కనీస పరికరాలు కూడా పాఠశాలలో లేవని అధికారులు గుర్తించారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై విచారణ జరుపుతున్నారు. -
విద్యార్థుల మృతి కేసులో తీర్పు వెల్లడి
కంచికచర్ల : మునేరు నదిలో స్నానానికెళ్లి 15 మంది విద్యార్థులు మృతిచెందిన కేసులో నందిగామ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 2005వ సంవత్సరం నవంబర్ నెలలో కృష్ణా జిల్లా కీసర గ్రామంలోని మునేరు సమీపంలో ఉన్న మామిడితోటలో వనసమారాధనకు వచ్చిన విజయవాడ రవీంద్రభారతి పాఠశాల విద్యార్థులు 15 మంది మునేరు నదిలో స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం పాఠశాల కరస్పాండెంట్ వీరమాచినేని వెంకటేశ్వరరావుతో మరో ఏడుగురికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. దాంతో పాటు ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ నందిగామ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్‌రావు తీర్పు వెలువరించారు. -
స్కూల్ భవనంపై నుంచి పడి..
-
స్కూల్ భవనంపై నుంచి పడి..
గాంధీనగర్: చిత్తూరు జిల్లా తిరుపతి నగరం బైరాగిపట్టెడ ప్రాంతంలోని రవీంద్రభారతి స్కూల్ భవనంపై నుంచి పడి ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలివీ... పద్మావతి పురం ప్రాంతానికి చెందిన మునిస్వామిరెడ్డి, మహేశ్వరి దంపతుల కుమారుడు హరికృష్ణారెడ్డి (14) స్థానిక రవీంద్రభారతి స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం పాఠశాల భవనం ఐదో అంతస్తు నుంచి హరికృష్ఱ కిందికి పడిపోయాడు. సమాచారం అందుకున్న విద్యార్థి తల్లిదండ్రులు హుటాహుటిన అతనిని రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే సంఘటనపై విద్యార్థి తల్లి దండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న విద్యార్థి ని పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి రిమ్స్‌కు తరలించారు.