ప్రతి పల్లె కన్నీరు పెడుతోంది.. | kethireddy venkataramireddy statement on villages | Sakshi
Sakshi News home page

ప్రతి పల్లె కన్నీరు పెడుతోంది..

Published Fri, Sep 16 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

kethireddy venkataramireddy statement on villages

– కరువు..చంద్రబాబు .. కవల పిల్లలు
– రైతు సమస్యలపై జగన్‌తో కలిసి కలెక్టరేట్‌ ముట్టడిస్తాం
– మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి


ధర్మవరం అర్బన్‌ : వర్షాభావంతో రైతులు వేరుశనగ పంట పండక ప్రతి పల్లెలోనూ రైతులు కన్నీరు పెడుతోంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ప్రతి రైతు పొలాలను రెయిన్‌గన్‌లతో తడిపామని ప్రకటనలు చేయడం బాధాకరమని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. పట్టణంలోని ఆయన స్వగహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరులతో కేతిరెడ్డి మాట్లాడారు.

కరువు, చంద్రబాబు ఇద్దరూ కవల పిల్లలు అన్నారు. రాబోయే రోజుల్లో కవలలను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రైతులను కల్లిబొల్లి మాటలతో పంటలను తడిపామంటూ మోసం చేయడంలో విజయం సాధించిన చంద్రబాబు వారిని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో వేరుశనగ పంటలను రెయిన్‌ గన్‌లతో తడిపామని అబద్ధాలు చెప్పడం సిగ్గు చేటన్నారు. రైతాంగం బాధలో ఉంటే సీఎం మాత్రం బాగుందని చెప్పడం బాధాకరమన్నారు.

వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ తర ఫున గ్రామాల్లో ప్రతి రైతునూ కలిసి, సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు చెప్పారు. రైతులకు  రూ.20 వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా ఇచ్చే వరకు ఊరుకునేదిలేదని, తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దష్టికి సమస్య తీసుకెళ్లి, అనంతపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట భారీఎత్తున ధర్నా చేపడుతామని హెచ్చరించారు. డివిజన్‌ స్థాయిలో ఆర్డీవో కార్యాలయాలను దిగ్బంధం చేస్తామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతూనే ఉంటుందన్నారు. ప్రస్తుతం రైతులు వేసుకున్న కంది, ఆముదం పంటలకు సబ్సిడీతో ఎరువులు అందించి వారిని ఆదుకోవాలని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement