శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/సత్రశాల (రెంటచింతల)/తాడేపల్లిరూరల్/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. శుక్రవారం వరదనీరు భారీగా వచ్చి చేరడంతో 10 గేట్లను 10 అడుగులకు తెరిచి నాగార్జునసాగర్‌కు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 213.88 టిఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 884.70 అడుగులకు చేరుకుంది.నాగార్జున సాగర్ 26 గేట్ల నుంచి స్పిల్‌వే మీదుగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00అడుగులుగా ఉంది. 26 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని దిగువ కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ క్రస్ట్‌గేట్లు ద్వారా 2,85,222 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేయగా.. ప్రాజెక్టు 12 క్రస్ట్‌గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్ల నుంచి 3 లక్షల 22 వేల 606 క్యూసెక్కుల వరద నీటిని కిందకు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment