కృష్ణా డెల్టాకు నీటి విడుదలను వ్యతిరేకిస్తాం: హరీష్‌రావు
హైదరాబాద్: కృష్ణా డెల్టాకు నీటి విడుదలను వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ సాగునీటిశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. తాగునీరు ముసుగులో సాగునీటిని తీసుకెళ్తే సహించమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అక్రమాలను ఇప్పటికే కేంద్ర జలవనరుల సంఘానికి నివేదించామని హరీశ్ తెలిపారు.
పులిచింతల ప్రాజెక్టు వల్ల విడుదలైన నీరు ఆంధ్రకు చేరడంలో ఆలస్యమవుతోందన్నారు. కేంద్ర జలవనరుల సంఘానికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబునాయుడు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందన్నారు.
నల్లగొండ జిల్లాలోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని 3 టీఎంసీల నీటిని ఏఎంఆర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేయాలని కేంద్ర జలవనరుల సంఘాన్ని కోరుతామని మంత్రి హరీష్‌రావు మీడియాకు వెల్లడించారు.