
సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి: గుత్తా
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఏఎంఆర్పీ కింద సాగవుతున్న రైతులకు రబీకి వెంటనే నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఏఎంఆర్పీ (ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్) కింద సాగవుతున్న రైతులకు రబీకి వెంటనే నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నీటి విడుదలపై ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ, కృష్ణా ట్రిబ్యునల్ లతో మాట్లాడి రైతులకు వెంటనే విడుదల చేయడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.