లింగసముద్రం: ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని రాళ్లవాగు జలాశయానికి భారీగా వరదనీరు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం ఉదయం ఐదు గేట్లను అడుగు మేర పైకి ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేయడం ప్రారంభించారు. ఇన్‌ఫ్లో 2,300 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో భారీగా ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తతో ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.