శ్రీశైలం ప్రాజెక్టుకు 2.54 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
ఇలాగే వరద కొనసాగితే వారం రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం
సాక్షి,హైదరాబాద్/నాగర్‌కర్నూల్/ధరూర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతోంది. గురు వారం జూరాల ప్రాజెక్టుతోపాటు తుంగ భద్ర నుంచి కలిపి 2.54 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులో వచ్చి చేరింది. జూరాల లో విద్యుదుత్పత్తితోపాటు ప్రాజెక్టు 46 క్రస్టుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఆల్మట్టి నుంచి 2,75,000 క్యూసెక్కులు, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 2,50,120 క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది.
శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 885 అడుగులు కాగా, వరదనీటితో 855.20 అడుగులకు చేరింది. కృష్ణానదిలో వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో వారంరోజుల్లో శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయిలో నిండుతుంది.2021లో జూలై నెలలోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయగా, రెండేళ్లుగా నీటి ప్రవాహం లేక ప్రాజెక్టు నిండలేదు.
సాగర్ ఎడమకాల్వకు నీటి నిలిపివేత
నాగార్జునసాగర్: సాగర్ ఎడమకాల్వకు గురువారం ఉదయం నీటిని నిలిపి వేశారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ పరిధిలోని గ్రామాలకు తాగునీటిని అందించడం కోసం వా రం రోజుల పాటు 1.5 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
మళ్లీ పెరుగుతున్న గోదావరి
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి మళ్లీ పెరిగింది. రెండు రోజుల క్రితం 51.2 అడుగుల నీటిమట్టం ఉండగా, క్రమంగా తగ్గుతూ బుధవారం రాత్రి 45 అడుగులకు చేరుకుంది. అయితే మళ్లీ గురువారం ఉదయం నుంచి వరద పెరుగుతూ ఒంటిగంటకు 48 అడుగులకు చేరడంతో కలెక్టర్ జితే‹Ù.వి.పాటిల్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment