కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో.. ఫలించిన సీఎం జగన్‌ కృషి | YS Jagan Mohan Reddy: kendra jal shakti focus nagarjuna sagar project water shares | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో.. ఫలించిన సీఎం జగన్‌ కృషి

Published Thu, Jan 18 2024 3:42 AM | Last Updated on Thu, Jan 18 2024 3:42 AM

YS Jagan Mohan Reddy: kendra jal shakti focus nagarjuna sagar project water shares - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగున్నరేళ్లుగా చేస్తున్న పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్రం నిర్ణయిం చింది. దాంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వ అక్రమ నీటి వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది. దీనివల్ల మన రాష్ట్రానికే కాదు.. తెలంగాణకూ ప్రయోజనమే. రెండు రాష్ట్రాల హక్కులకు విఘాతం కలగదు. కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్‌ జగన్‌ చూపిన చొరవ, పట్టుదలను నీటి పారుదల రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఆనాడు ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, రెండు కళ్ల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు తాకట్టు పెట్టారని, నేడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  పరిరక్షించారని నిపుణులు కొనియాడుతున్నారు.

హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు
రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చేసేందుకు విభజన చట్టం ద్వారా 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసే­దాకా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వ­హించాలని నిర్దేశించింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్‌ను 2014–15లో పూర్తిగా ఆదీనంలోకి తీసుకుంది.

శ్రీశైలంలో మాత్రం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం తెలంగాణలో ఉందనే సాకు చూపి దాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అదే సాకు చూపి పులిచింతల వి­ద్యుత్‌ కేంద్రాన్ని కూడా ఆధీనంలోకి తీసుకుంది. అయినా సరే.. ఆనాటి ఏపీ సీఎం చంద్ర­బాబు రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం కనీస ప్రయత్నం చేయలేదు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, తెలంగాణలోనూ టీడీపీ­ని బతికించుకోవా­లన్న స్వార్ధంతో రాష్ట్ర ప్రయో­జనాలను తెలంగాణకు తాకట్టు పెట్టేశారు.

► శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డి­పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని రాయల­సీమ, నెల్లూరు జిల్లాలకు తరలించవచ్చు. నీటి మట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే ఆరేడు వేల క్యూసెక్కులే తరలించడానికి సా­ధ్యమవు­తుంది. అంతకంటే నీటి మట్టం తగ్గి­తే శ్రీశైలంలో నీటి కోటా ఉన్నా సరే సీమ అవ­స­రాలకు నీ­టి­ని వినియోగించలేని దుస్థితి. శ్రీశైలం ప్రాజెక్టు­లో 796 అడుగుల నుంచే రో­జు­కు 4 టీఎంసీల­ను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. తెలం­గాణకు దిగువన నీటి అవ­సరాలు లేకపో­యినా కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యు­దు­త్పత్తి చేస్తూ శ్రీశైలంలో నీ­టిమట్టం తగ్గేలా ఆ ప్రభు­త్వం చేస్తోంది. తద్వా­రా శ్రీశైలంలో ఏపీ  వాటా జలాలు  వినియోగించుకోకుండా చేస్తోంది.

► 2015లో ఇదే రీతిలో శ్రీశైలం నుంచి సాగర్‌కు తెలంగాణ తరలించిన నీటిని.. కుడి కాలువ కింద సాగు అవసరాల కోసం విడుదల చేయాలని అప్పటి రాష్ట్ర జలవ­నరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆది­త్యనాథ్‌ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ తోసి­పుచ్చింది. దాంతో రాష్ట్ర భూభాగంలోని సా­గర్‌ స్పిల్‌ వేలో 13 గేట్లతోపాటు కుడి కాలు­వ హెడ్‌ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకుని, రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి 2015, ఫిబ్రవరి 13న పోలీసులతో కలిసి ఆదిత్య­నాథ్‌ దాస్‌ నాగార్జునసాగర్‌కు వచ్చారు. అయితే ఆనాటి సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయంగా లబ్ధి పొందాలనే లక్ష్యంతో.. వాటిని స్వాధీనం చేసు­కోకుండా తక్షణమే వెనక్కి రావాలని ఆదిత్య­నాథ్‌ను ఆదేశించారు. తద్వారా కృష్ణా జ­లా­లపై రాష్ట్రం హక్కులు కోల్పోయేలా చేశారు.

► శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు, డిండి ఎత్తిపోతలతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచి.. సుంకేశుల బ్యారేజ్‌ జల విస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల, భక్తరామదాస ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్‌ అక్రమంగా చేపట్టింది. వీటి ద్వారా  కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ హరించివేస్తు­న్నా ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు.

హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్‌ రాజీలేని పోరాటం
వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చడానికి తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌లోకి రోజుకు 3 టీ­ఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథ­కాన్ని చేపట్టారు.

దీనిపై ఇరు రాష్ట్రాల  మధ్య వివా­దం తలెత్తింది. దీన్ని పరిష్కరించడానికి  2020 అక్టోబర్‌ 6న కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వ­హించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని విని­యోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపో­తలను చేపట్టామని సీఎం జగన్‌ చెప్పారు. తెలంగాణ చేప­ట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివే­యాలని డిమాండ్‌ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపివేసేలా తెలంగాణను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

► 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలిస్తోంది. ఇలా శ్రీ­శైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కు­లను హరిస్తుండటంతో సీఎం వైఎస్‌ జగన్‌ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

దాంతో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్‌ శక్తి శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డు­కు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమై­నా, తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్‌ స్పిల్‌ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను రాష్ట్రానికి అప్పగించాలని,  లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు.

► శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్‌ 6న కృష్ణా బోర్డు ఏపీకి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగా­ర్జున­సాగర్‌కు తెలంగాణ తరలించింది. ఆ 17 టీ­ఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు సాగర్‌ కుడి కాలువ ద్వారా విడుదల చేయా­లని రాష్ట్ర అధికారుల విజ్ఞప్తులను తెలంగాణ పట్టించుకో­లేదు.

ఇదే అంశాన్ని సీఎం జగన్‌కు రాష్ట్ర జలవన­రుల శాఖ అధికారులు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్ప­గిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమ గట్టు వి­ద్యు­త్కేంద్రాన్ని తెలంగాణ తన ఆ­ధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూ­భా­గం­లో ఉన్న నాగార్జు­న­సాగర్‌ స్పిల్‌ వే 13 గేట్లతోసహా కుడి కాలువ హెడ్‌ రెగ్యు­లేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయా­లని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు.

దాంతో నవంబర్‌ 30 తెల్లవారుజామున సీఈ మురళీనాథ్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవ­న­రుల అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్‌ స్పిల్‌ వేలో సగాన్ని, కుడి కా­లు­వ హెడ్‌ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసు­కున్నారు. తాగు­నీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసె­క్కులు విడుదల చేశారు. దీనిపై సర్కారు కేం­ద్రానికి ఫిర్యా­దు చేసింది. దాంతో సీఎం జగన్‌ ఆది నుంచి చేస్తు­న్న డిమాండ్‌ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement