జూరాల, సుంకేసుల నుంచి ప్రాజెక్ట్‌లోకి 1,89,328 క్యూసెక్కుల వరద
20 క్రస్ట్ గేట్ల ద్వారా సాగర్ నుంచి దిగువకు నీటి విడుదల
శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్/తాడేపల్లిరూరల్: శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు పెరుగుతుండటంతో గురువారం 4 రేడియల్ క్రస్ట్‌గేట్లను తెరచి 1,12,300 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. గురువారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,89,328 క్యూసెక్కుల వరద శ్రీశైలంకు వచ్చి చేరుతోంది.
బుధవారం నుండి గురువారం వరకు బుధవారం నుండి గురువారం వరకు ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి శ్రీశైలంకు 1,27,093 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. కుడిగట్టు కేంద్రంలో 15.213 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.744 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 215.8070 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం పూర్తిస్థాయి 885 అడుగులకు చేరుకుంది.
సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు
ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగటంతో నాగార్జున సాగర్ జలాశయం నుంచి గురువారం 20 రేడియల్ క్రస్ట్‌గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి 2,10,149 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా అంతే నీటిని విడుదల చేస్తున్నారు.
సాగర్‌లో 20 క్రస్ట్‌గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 1,62,000 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 28,826 క్యూసెక్కులు మొత్తం 1,90,826 క్యూసెక్కులు దిగువకి విడుదల చేస్తున్నారు. కుడి,ఎడమ కాలువలు, ఎస్‌ఎల్‌బీసీ, వరద కాలువల ద్వారా 19,323క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాగా ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో బ్యారేజి రిజర్వాయర్‌లో 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ 30 గేట్లను 1 అడుగు మేర ఎత్తి దిగువకు 21 వేల 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment