department
-
అమ్మ.. మరో జన్మ ఉంటే నీ కడుపున పుడతా
నిర్మల్‌టౌన్: వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఆరేళ్లుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి.. తనకన్నా జూనియర్లు రెగ్యలర్ అయ్యారని, తనకు మాత్రం అన్యాయం జరిగిందని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో సోమవారం సాయంత్రం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగి వకులాభరణం భరత్ కుమార్ (37) ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు భరత్ రాసిన ఓ సూసైడ్ లేక అందరినీ కంటతడి పెట్టిస్తోంది.‘మా అమ్మానాన్నల కడుపులో పుట్టడం నా అదృష్టం. ఎంతో పెద్ద ఉద్యోగం వస్తుందని కలలు కన్నాను. 2018 లో ఆరోగ్యశాఖలో ఆర్ఎన్టీసీపీ విభాగంలో సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉద్యోగం పొందాను. జీవితంలో స్థిరపడతానని ఆశించాను. కానీ నాకన్నా హోదా తక్కువ ఉన్నవారికి ఇదే శాఖలో జీతం ఎక్కువగా రావడం.. నా జీతం మాత్రం పెరగకుండా కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉండిపోవడంతో తీవ్రంగా నిరాశ చెందాను. నాతోపాటు నాలాంటి వాళ్లను రెగ్యులర్ చేసే విషయంలో జీవో 510 అన్యాయం చేసింది. అప్పటి ప్రభుత్వంలో వచ్చిన ఈ జీవో వల్ల నష్టపోయాం. ఇటీవల జీవో 16 కూడా అమలు చేయవద్దని ఉత్తర్వులు వచ్చాయి. దీంతో మాకు తీరని అన్యాయం జరిగింది. ఉద్యోగం రెగ్యులర్ అవుతుందని ఎంతో ఆశతో ఎదురు చూశా. కానీ అది జరగక పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యా. నా భార్య పల్లవికి అన్యాయం చేస్తున్నా. కుమారుడు దేవాను వీడిపోతున్నా. మీ ఇద్దరినీ బాగా చూసుకుంటానని కలలు కన్నా. కానీ ఉద్యోగం రెగ్యులర్ కాకపోవడంతో మీకు చెప్పినట్లుగా ముందుకు వెళ్లలేకపోయా. ఇంతకాలం పనిచేసిన కాలంలో నాకు రావాల్సిన పీవోఎల్ బకాయిలు నా భార్యకు ఇవ్వండి. నా ఆత్మహత్యతో అయినా మిగతా వారికి న్యాయం జరగాలి. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయిలో తెలిసేలా చూడండి. సహచర ఉద్యోగులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అందరికీ రుణపడి ఉంటా. అమ్మా నాన్న సారీ..’ అంటూ సూసైడ్ నోట్ రాశాడు. భరత్ మృతి ఆరోగ్య శాఖ ఉద్యోగుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.కొడుకును చంపితే భార్య తిరిగొస్తుందని.. -
మీరు వెళ్లిపోండి.. లేదంటే..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కట్టబెట్టిన కాంట్రాక్టులను ఇప్పుడు తన అస్మదీయులకు కట్టబెట్టేందుకు సామదానభేద దండోపాయాలు ఉపయోగిస్తున్న టీడీపీ కూటమి సర్కారు బాగోతాల్లో మరొకటి వెలుగులోకి వచ్చి0ది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కాలపరిమితి ఉన్నప్పటికీ ఉన్నఫళంగా రద్దుచేసుకుని వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేస్తూ రాష్ట్రంలో కాంట్రాక్టు సంస్థలను బెంబేలెత్తిస్తోంది. పైగా.. నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా పొగపెడుతూ ‘మీ అంతట మీరు వెళ్లిపొండి’ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఉన్నతాధికారుల ద్వారా హెచ్చరిస్తోంది. 108 అంబులెన్సులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)ల నిర్వహణ విషయంలో ఇప్పుడిదే జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఈ రెండు సర్వీసుల నిర్వహణ కాంట్రాక్టును అరబిందో సంస్థ దక్కించుకుంది. 2027 వరకూ ఈ కాంట్రాక్టు కాలపరిమితి ఉంది. కానీ, ఉన్నఫళంగా ఎంఓయూను రద్దుచేసుకుని వెళ్లిపోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. పైసా విదల్చని ప్రభుత్వం.. 104, 108 వాహనాల నిర్వహణను తన అస్మదీయులకు కట్టబెట్టేందుకు ప్రస్తుత నిర్వహణ సంస్థ అరబిందోను రాష్ట్ర ప్రభుత్వం పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వైద్యశాఖ వర్గాల్లోనే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహణ సంస్థకు నయాపైసా చెల్లించలేదు. సాధారణంగా ప్రతి మూడునెలలకు ఒకసారి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ, ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య రెండు క్వార్టర్లకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఇప్పటివరకూ మంజూరు చేయలేదు. ‘సిబ్బందికి మూడునెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. పైగా.. వాహనాలను నడపాలంటే రోజుకు రూ.20 లక్షలు డీజిల్ కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. డీజిల్ కొనుగోలుకు కూడా ఇబ్బంది పడుతున్నాం’.. అని ప్రభుత్వానికి సంస్థ తెలియజేసినా చంద్రబాబు సర్కారు కనికరించడంలేదు. వీలైనంత త్వరగా రద్దుచేసుకోండి.. ప్రభుత్వం తమపట్ల విముఖత వ్యక్తపరుస్తుండటంతో చేసేదేమీ లేక మీరెలా చెబితే అలా చేస్తామని సంస్థ యాజమాన్యం తెలియజేసింది. ఎంఓయూలోని నిబంధనల ప్రకారం సబ్ కాంట్రాక్టు ఇచ్చి మీరు పక్కకు తప్పుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో.. ప్రభుత్వ పెద్దలు చెప్పిన జేవీ కంపెనీ ఆఫ్ ఎమర్జెంట్ మెడికల్ సర్వీసెస్, యునైటెడ్ హెల్త్‌కేర్ సంస్థలకు సబ్ కాంట్రాక్టు ఇవ్వాలని అరబిందో సంస్థ కూడా వైద్యశాఖకు ప్రతిపాదించింది.అయితే, ఆయా సంస్థలకు సబ్ కాంట్రాక్టు ఇచ్చినప్పటికీ అరబిందో సంస్థ పేరిటే కార్యకలాపాలన్నీ నడుస్తాయి కాబట్టి అరబిందో ప్రస్తావనే లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో సబ్ కాంట్రాక్టు ప్రస్తావనను ప్రభుత్వం విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఎంఓయూను మీరే రద్దుచేసుకుని వెళ్లిపోండని అరబిందోకు తేల్చిచెప్పినట్లు సమాచారం. ఎలాగైనా ఎంఓయూ రద్దుచేసి తీరాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటంతో వైద్యశాఖ ఉన్నతాధికారులు సైతం ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. వీలైనంత త్వరగా ఎంఓయూ రద్దు చేసుకోండని సంస్థ ప్రతినిధులతో ఇప్పటికే పలుమార్లు చర్చించారు. అంతేకాక.. ప్రభుత్వానికి విస్తృతమైన అధికారులున్నాయని, కాంట్రాక్టును రద్దుచెయ్యొచ్చని బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ‘యునైటెడ్ కింగ్డమ్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ (యూకే ఎన్హెచ్ఎస్) నిర్వహణ కాంట్రాక్టులో భాగస్వామిగా ఉందని.. ఇక్కడి పరిస్థితులపై సమాచారం ఇచ్చామని.. ఆ సంస్థ స్పందన ఆధారంగా ఎంఓయూ రద్దుపై తుది నిర్ణయం తెలియజేస్తాం’.. అని అరబిందో చెప్పినట్లు సమాచారం. సిబ్బందిలో ఆందోళన మరోవైపు.. ఇప్పటికే మూడు నెలలుగా వేతనాల్లేక 104, 108లో పనిచేసే 6,500 మంది సిబ్బంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దసరా, దీపావళి ఇలా పండుగలన్నీ పస్తులతోనే గడిపారు. ఈ పరిస్థితుల్లో నిర్వహణ సంస్థ మారుతోందంటూ ప్రభుత్వమే ఎల్లో మీడియాలో లీకులిచ్చి కథనాలు రాయిస్తుండడంతో సిబ్బంది కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. నిర్వహణ సంస్థ మారితే తమకు రావాల్సిన బెని్ఫట్స్ రాకుండా పోతాయేమోనని వారు ఆవేదన చెందుతున్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించండిరాష్ట్రవ్యాప్తంగా 104 సిబ్బంది నిరసనపెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలను తక్షణమే చెల్లించడంతో పాటు, ఉద్యోగ భద్రత సహా పలు డిమాండ్ల పరిష్కారం ఎజెండాగా 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) సిబ్బంది నిరసన బాట పట్టారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మండలాల్లో మెడికల్ ఆఫీసర్లకు తమ సమస్యలపై డీఈవోలు, డ్రైవర్లు వినతి పత్రాలు అందజేశారు. బుధవారం డీఎంహెచ్వోలు, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలోనూ నోడల్ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని ఏపీ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఫణికుమార్ తెలిపారు. 8వ తేదీ తహసీల్దార్లు, ఎంపీడీవోలకు, 10న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని వెల్లడించారు. 11న గ్రీవెన్స్‌లో వినతులిస్తామని, 14వ తేదీన డ్రైవర్లు, డీఈవోలు అధికారిక గ్రూప్‌ల నుంచి లెఫ్ట్ అయి పనులు నిలుపుదల చేస్తామన్నారు. నిరసన చేస్తున్నన్ని రోజులూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు. -
Polavaram: గడువులోగా పూర్తి చేయకపోతే ఆ సొమ్ము రుణమే
సాక్షి, అమరావతి : నిర్ధిష్ట గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన రూ.2,807.68 కోట్లను రుణంగా పరిగణిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇందులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకుగాను రూ.459.68 కోట్లను రీయింబర్స్ రూపంలో ఇచ్చి0ది. కేబినెట్ ఆమోదించిన సవరించిన షెడ్యూలు ప్రకారం ప్రాజెక్టును 2026 మార్చిలోగా పూర్తి చేయకపోతే అడ్వాన్సు, రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తున్న రూ.2,807.68 కోట్లను తిరిగి వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తేల్చి చెప్పింది.నిర్మాణ సమయంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే మరో ఏడాది అంటే 2027 మార్చి వరకు మాత్రమే గడువు పొడిగించే వెసులుబాటును మాత్రమే కలి్పస్తామని స్పషీ్టకరించింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రధాన (ఎర్త్ కం రాక్ ఫిల్) డ్యాం నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరదల ఉధృతికి కోతకు గురై విధ్వంసం చోటుచేసుకున్న ప్రాంతాన్ని యథా స్థితికి తెచ్చే పనులను సైతం పూర్తి చేసింది. అందువల్లే వరద తగ్గగానే అంటే నవంబర్‌లో ప్రధాన డ్యాం గ్యాప్–2 డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను ప్రారంభించి, జూలైలోగా పూర్తి చేయడానికి.. ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయడానికి మార్గం సుగమమైందని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం రెండేళ్ల గడువు విధించిందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 41.15 మీటర్ల కాంటూర్ వరకు రూ.30,436.95 కోట్లుగా ఆగస్టు 28న ఆమోదించిన కేంద్ర కేబినెట్.. ఇప్పటిదాకా చేసిన వ్యయంపోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ2,807.68 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనపై కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. దాంతో ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 9న కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.నిధుల వినియోగానికి మార్గదర్శకాలు ఇలా.. » రాష్ట్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరవాలి. ఆ ఖాతాలో ఈ నిధులను జమ చేయాలి. » కేంద్ర కేబినెట్ ఆమోదం మేరకు నిర్దేశించిన పనులకు మాత్రమే ఈ నిధులు వినియోగించాలి. » ప్రాజెక్టును నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయడానికి.. షెడ్యూలు ప్రకారం పనులు చేయడానికి సమన్వయ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. » విడుదల చేసిన నిధుల్లో 75 శాతం ఖర్చు చేసి, వాటిని ఒప్పందంలో నిర్దేశించిన పనులకు మాత్రమే ఖర్చు చేశామని వినియోగ ధ్రువీకరణపత్రాలు పంపితేనే మిగతా నిధులు ఇస్తాం. » ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేశారా లేదా అన్నది తనిఖీ చేయడానికి కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలి. -
తప్పుతున్న వాతావరణశాఖ అంచనాలు
ఒకవైపు వనరుల కొరత.. మరోవైపు అంచనాలలో లోపం.. ఇంకోవైపు ప్రకృతిలో మారుతున్న తీరుతెన్నులు.. ఇవన్నీ వాతావరణ శాఖ అధికారులను ఇబ్బందులకు గురిచేసి, రుతుపవనాలను సరిగ్గా అంచనావేయలేకపోయేలా చేస్తున్నాయా? ఈ సీజన్‌కు సంబంధించిన అంచనాల్లో అప్పుడప్పుడూ పొరపాట్లు తొణికిసలాడటం దీనికి ఉదాహరణగా నిలిచించిందా?వాతావరణశాఖ ఇటీవలి కాలంలో జారీచేసిన అలర్ట్‌లు అంచనాలకు విరుద్ధంగా ఉంటున్నాయి. దీంతో జనం వాతావరణశాఖపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ శాఖపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడుతున్నదనే వాదన వినిపిస్తోంది. జూన్ 28న దేశరాజధాని ఢిల్లీలో రుతుపవనాలు ప్రవేశించిన రోజున రికార్డుస్థాయి వర్షపాతం కురుస్తుందని వాతావరణశాఖ ముందుగా ప్రకటించింది. అయితే ఆ తరువాత ఆశాఖ అధికారులు వర్షపాతం అంచనాలు మార్చారు. ఇదేవిధంగా కొన్నిసార్లు గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసి, వాటిని తిరిగి మారుస్తున్న సందర్భాలున్నాయి.వాతావరణ శాఖ విడుదల చేసిన రుతుపవనాల అంచనాలు మునుపటి కంటే తక్కువ ఖచ్చితత్వంతో ఉన్నాయని గత గణాంకాలను చూస్తే స్పష్టమవుతుంది. 2011 నుండి 2024 వరకు అంటే గత 14 ఏళ్లలో రుతుపవనాల అంచనాలు 96 శాతం ఖచ్చితమైనవనిగా రుజువు చేసిన ఏకైక సంవత్సరం 2022. మిగిలిన ఏళ్లలో ఇది 77 శాతం వరకూ నిజమయ్యింది. రుతుపవనాల ట్రెండ్‌లో మార్పు కారణంగా ఒకే నగరంలో రెండు విభిన్న పోకడలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, కొన్ని చోట్ల తేలికపాటి వర్షం పడుతోంది.వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా భారతదేశంలాంటి ఉష్ణమండల ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. హిమాలయ పర్వతాలు ఆసియాలోని చల్లని గాలిని ఉత్తర భారతదేశ మైదానాలకు చేరుకోకుండా నిరోధిస్తాయి. రుతుపవనాలను కూడా ఆపుతాయి. ఇవి దేశానికి వర్షాలను తీసుకువస్తాయి. అయితే కొత్త మోడల్స్, రాడార్, రెయిన్ గేజ్‌ల సహాయంతో భవిష్యత్తులో వర్షాలు, రుతుపవనాల అంచనాలను మరింత ఖచ్చితంగా తెలుసుకునేందుకు వాతావరణశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. -
సచివాలయానికి ఉద్యోగులు ఆలస్యంగా రావడమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి గుండెకాయలాంటి సచివాలయానికి కొంత మంది ఉద్యోగులు ఆలస్యంగా రావడం భావ్యం కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసహనం వ్యక్తంచేశారు. మీరే ఇలా వస్తే జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు మీరిచ్చే సందేశం ఏంటని ప్రశ్నించారు. బుధవారం సచివాలయంలో ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన పేషీని, సెక్షన్లను మంత్రి తనిఖీ చేశారు. ఆ సమయంలో 50% ఉద్యోగులు కూడా ఆఫీసులకు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. గత పదేళ్లుగా మంత్రులను, ముఖ్యమంత్రులను కలిసే అవకాశం లేక ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. ప్రజలు మాకు ఎన్ని వినతులిచి్చనా, పరిష్కరించాల్సింది ఉద్యోగులేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, సచివాలయానికి ఉద్యోగులు ఇంత ఆలస్యంగా రావడం భావ్యం కాదని హెచ్చరించారు. సమయానికి ఆఫీసుకు వచ్చిన ఉద్యోగు ల కుర్చీల వద్దకు వెళ్లి అభినందించిన మంత్రి.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఒక రిద్దరు ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరి స్థితి బాగాలేద ని చెప్పగా.. వారితో కోమటిరెడ్డి మాట్లాడారు. మంత్రి తమ సెక్షన్‌కు రావడం మూలంగా సమస్యలు చెప్పుకునే అవకాశం దొరి కిందని ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేశారు. -
‘ఆపరేషన్’ సిజేరియన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించి, సహజ ప్రసవాలను పెంచేందుకు వైద్య శాఖ కృషి చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. కాగా, 2023–24లో రాష్ట్రంలో ఏడు లక్షలకు పైగా ప్రసవాలు జరగ్గా, వీటిలో 4.48 లక్షల ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేశారు. వీటిలో 50 శాతం మేర సిజేరియన్ ఆపరేషన్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అవసరం లేకపోయినా చేసిన సిజేరియన్ ఆపరేషన్లే. ఇలాంటి ప్రసవాలు చేసిన ఆస్పత్రులపై వైద్య శాఖ చర్యలకు ఉపక్రమించింది.ఇందులో భాగంగా వంద శాతం సిజేరియన్లు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోని 104 నెట్వర్క్ ఆస్పత్రులకు ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీటికి ఆ ఆస్పత్రుల యాజమాన్యాలు ఇప్పటికే వివరణ ఇచ్చాయి. సాధారణ ప్రసవం చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో గర్భిణులు ఆస్పత్రులకు రావడం వల్లే సిజేరియన్ ఆపరేషన్లు చేసినట్లు అన్ని ఆస్పత్రులు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అదే విధంగా తొలి కాన్పు సిజేరియన్ ఉండటం వల్ల రెండో కాన్పు కూడా సిజేరియన్ చేశామన్నారు. ఆస్పత్రులు ఇచ్చిన వివరణలను వైద్య శాఖ అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. కర్నూలులో అత్యధికంగా సిజేరియన్లు 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా 3.28 లక్షలు సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. సిజేరియన్ ఆపరేషన్లలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 23,500 సిజేరియన్లు జరగ్గా, వీటిలో 16,678 ప్రైవేటు ఆస్పత్రుల్లో చేశారు. 20,059 సిజేరియన్లతో పశి్చమ గోదావరి రెండో స్థానంలో, 19,855తో అనంతపురం మూడో స్థానంలో ఉన్నాయి.45 శాతం అనవసరమే సిజేరియన్ ప్రసవాలను నియంత్రించడంలో భాగంగా 2022 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మ«ధ్య రాష్ట్రవ్యాప్తంగా 62 ఆస్పత్రుల్లో 278 ఆపరేషన్లపై వైద్య శాఖ ఆడిట్ నిర్వహించింది. వీటిలో 155 సిజేరియన్లు ( 55 శాతం) గర్భిణుల ఆరోగ్య పరిస్థితి, ఇతర కారణాలతో అవసరం మేరకే చేసినట్లు తేలింది. మరో 72 కేసుల్లో (26 శాతం) అవసరం లేకపోయినా సిజేరియన్ ఆపరేషన్లు చేసినట్టు ఆధారాలతో తేలింది.. మిగిలిన 53 కేసుల్లో (19 శాతం) సిజేరియన్‌కు అవసరమైన ఆధారాలు ఏమీ లేనట్టు తేలింది. అంటే 45 శాతం సిజేరియన్లు అవసరం లేకుండానే చేసినట్లు తేలింది.⇒ ప్రైవేట్ ఆస్పత్రులు సిజేరియన్ల వైపు మొగ్గు చూపడానికి కారణాలు ⇒ సాధారణ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్‌కు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం ఇస్తున్న ఫీజు ఎక్కువగా ఉండటం ⇒ సాధారణ ప్రసవం చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో గర్భిణి, కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ ఉండాలి. ఇందుకోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిపుణులైన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండరు.⇒ సాధారణ ప్రసవానికి ప్రయతి్నస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో చిన్నపాటి నర్సింగ్ హోమ్‌లు, ఆస్పత్రులకు ప్రత్యేకంగా 24/7 ఆనస్తీíÙయా వైద్యుడు అందుబాటులో లేకపోవడం. ⇒ యువ వైద్యుల్లో సాధారణ ప్రసవాలు చేయడానికి తగినంత అనుభవం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. ⇒సిజేరియన్ ప్రసవం వల్ల కలిగే సమస్యలను వివరించి, సాధారణ ప్రసవానికి సిద్ధపడేలా గర్భిణి, కుటుంబ సభ్యులను కౌన్సెలింగ్ చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం. -
కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో.. ఫలించిన సీఎం జగన్ కృషి
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగున్నరేళ్లుగా చేస్తున్న పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్రం నిర్ణయిం చింది. దాంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వ అక్రమ నీటి వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది. దీనివల్ల మన రాష్ట్రానికే కాదు.. తెలంగాణకూ ప్రయోజనమే. రెండు రాష్ట్రాల హక్కులకు విఘాతం కలగదు. కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ చూపిన చొరవ, పట్టుదలను నీటి పారుదల రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఆనాడు ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, రెండు కళ్ల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు తాకట్టు పెట్టారని, నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పరిరక్షించారని నిపుణులు కొనియాడుతున్నారు. హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చేసేందుకు విభజన చట్టం ద్వారా 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసేదాకా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని నిర్దేశించింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్‌ను 2014–15లో పూర్తిగా ఆదీనంలోకి తీసుకుంది. శ్రీశైలంలో మాత్రం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తెలంగాణలో ఉందనే సాకు చూపి దాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అదే సాకు చూపి పులిచింతల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆధీనంలోకి తీసుకుంది. అయినా సరే.. ఆనాటి ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం కనీస ప్రయత్నం చేయలేదు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, తెలంగాణలోనూ టీడీపీని బతికించుకోవాలన్న స్వార్ధంతో రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. ► శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించవచ్చు. నీటి మట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే ఆరేడు వేల క్యూసెక్కులే తరలించడానికి సాధ్యమవుతుంది. అంతకంటే నీటి మట్టం తగ్గితే శ్రీశైలంలో నీటి కోటా ఉన్నా సరే సీమ అవసరాలకు నీటిని వినియోగించలేని దుస్థితి. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. తెలంగాణకు దిగువన నీటి అవసరాలు లేకపోయినా కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలంలో నీటిమట్టం తగ్గేలా ఆ ప్రభుత్వం చేస్తోంది. తద్వారా శ్రీశైలంలో ఏపీ వాటా జలాలు వినియోగించుకోకుండా చేస్తోంది. ► 2015లో ఇదే రీతిలో శ్రీశైలం నుంచి సాగర్‌కు తెలంగాణ తరలించిన నీటిని.. కుడి కాలువ కింద సాగు అవసరాల కోసం విడుదల చేయాలని అప్పటి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ తోసిపుచ్చింది. దాంతో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకుని, రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి 2015, ఫిబ్రవరి 13న పోలీసులతో కలిసి ఆదిత్యనాథ్ దాస్ నాగార్జునసాగర్‌కు వచ్చారు. అయితే ఆనాటి సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయంగా లబ్ధి పొందాలనే లక్ష్యంతో.. వాటిని స్వాధీనం చేసుకోకుండా తక్షణమే వెనక్కి రావాలని ఆదిత్యనాథ్‌ను ఆదేశించారు. తద్వారా కృష్ణా జలాలపై రాష్ట్రం హక్కులు కోల్పోయేలా చేశారు. ► శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు, డిండి ఎత్తిపోతలతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచి.. సుంకేశుల బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల, భక్తరామదాస ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. వీటి ద్వారా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ హరించివేస్తున్నా ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్ రాజీలేని పోరాటం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చడానికి తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. దీన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని సీఎం జగన్ చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపివేసేలా తెలంగాణను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ► 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలిస్తోంది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా, తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్రానికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ► శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణా బోర్డు ఏపీకి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని రాష్ట్ర అధికారుల విజ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. ఇదే అంశాన్ని సీఎం జగన్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ తన ఆధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. దాంతో నవంబర్ 30 తెల్లవారుజామున సీఈ మురళీనాథ్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దాంతో సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. -
నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి
సాక్షి, అమరావతి: కృష్ణా నదిపై ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు అంగీకరించారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏపీ భూభాగంలోని 6, తెలంగాణ భూభాగంలోని 9 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానం (హ్యాండింగ్ ఓవర్ ప్రోటోకాల్)ను వారంలోగా ఖరారు చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీకి దేబశ్రీ ముఖర్జీ చెప్పారు. త్రిసభ్య కమిటీ ఖరారు చేసిన విధానంపై 15 రోజుల్లోగా రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షించి, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈమేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఆదేశాల మేరకు కృష్ణా జలాల వివాదానికి తెరదించేందుకు దేబశ్రీ ముఖర్జీ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్, కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్విందర్‌సింగ్ వోరా తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు డిసెంబర్ 1 నుంచి సీఆరీ్పఎఫ్ పహారాలో సాగర్‌ను నిర్వహిస్తున్నామని, ఈ నెలలో కుడి కాలువ ద్వారా ఏపీకి 5 టీఎంసీలు విడుదల చేశామని కృష్ణా బోర్డు ఛైర్మన్ శివన్నందన్కుమార్ వివరించారు. వెనకడుగు కాదు.. ముందడుగే కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ శ్రీశైలం నిర్వహణను ఏపీకి, సాగర్ నిర్వహణను తమకు అప్పగించారని తెలంగాణ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పారు. ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను నవంబర్ 30న అక్రమంగా ఆ రాష్ట్ర అధికారులు స్వా«దీనం చేసుకున్నారని, సాగర్‌పై నవంబర్ 29 నాటికి ఉన్న యధాస్థితిని కొనసాగించాలని కోరారు. దీనిపై రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ నిర్వహణలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని 2014లో అధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి నవంబర్ 30 వరకూ తొమ్మిదేళ్లపాటు తెలంగాణ సర్కారు తమ హక్కులను కాలరాసిందని, హక్కుల పరిరక్షణ కోసమే మా భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి హెడ్ రెగ్యులేటర్‌ను స్వా«దీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ వెనకడుగు కాదు ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. తొలుత సాగర్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామని, ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం తీసుకుంటామంటూ చేసిన ప్రతిపాదనను ఏపీ అధికారులు సున్నితంగా తోసిపుచ్చారు. సాగర్‌ను మాత్రమే బోర్డుకు అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. సాగర్, శ్రీశైలంను ఒకేసారి కృష్ణా బోర్డుకు అప్పగిస్తేనే రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించవచ్చునని సూచించారు. ఇందుకు తెలంగాణ అధికారులు కూడా అంగీకరించారు. దాంతో శ్రీశైలం, సాగర్‌ను కృష్ణా బోర్డుకు ఒకే సారి అప్పగించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అంగీకరించారు. అప్పగింత తర్వాత నిర్వహణ నియమావళి కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రెండున్నరేళ్లైనా అమల్లోకి రాకపోవడంపై దేబశ్రీ ముఖర్జీ అసహనం వ్యక్తంచేశారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి, రెండు రాష్ట్రాల ఈఎన్సీల నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వారంలోగా శ్రీశైలం, సాగర్‌లలోని 15 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానాన్ని ఖరారు చేయాలని ఆదేశించారు. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనందున, ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి (ఆపరేషన్ ప్రోటోకాల్)ని ఖరారు చేయలేమని తెలంగాణ అధికారులు చెప్పారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చాక ఆపరేషన్ ప్రోటోకాల్‌ను ఖరారు చేయాలని వారు చేసిన సూచనను సీడబ్ల్యూసీ చైర్మన్ వ్యతిరేకించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కేటాయింపుల ఆధారంగానే 2015లో రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ తాత్కాలిక సర్దుబాటు చేశామని, వాటికి అనుగుణంగానే శ్రీశైలం, సాగర్ ఆపరేషన్ ప్రోటోకాల్ ముసాయిదా రూపొందించామని వివరించారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. ప్రాజెక్టుల అప్పగింత తర్వాత ఆపరేషన్ ప్రోటోకాల్ ఖరారుపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చిన రాష్ట్రం కృష్ణా బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నాయని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ వివరించారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ స్పందిస్తూ.. తెలంగాణకంటే తాము రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వాటా నిధులు ఇచ్చాకే తాము కూడా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తక్షణమే వాటా నిధులు విడుదల చేయాలని తెలంగాణ అధికారులను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. -
టీటీడీ ఈవో లేఖ.. ఎట్టకేలకు స్పందించిన పురావస్తుశాఖ
సాక్షి, తిరుపతి: అలిపిరి పాదాల మండపం శిథిలావస్థలో ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండపం వెనుకభాగం కూలిపోయింది. దీంతో ఇనుప రాడ్లుతో మండపానికి సపోర్ట్ ఇచ్చి తాత్కాలికంగా మరమ్మత్తులు చేశారు,.. కానీ ఏ సమయంలో కూలిపోతుందో తెలియని ఈ మండపం ద్వారా భక్తులకు ప్రాణహాని ఉందని.. టీటీడీ ఈ మండపాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోగా.. దీనిపై రాజకీయ రంగు పులిమి మండప నిర్మాణాన్ని అడ్డుకున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి రాసిన లేఖపై ఎట్టకేలకు పురావస్తుశాఖ స్పందించింది. ఢిల్లీ ఎఎస్ఏ నుంచి పురావస్తు బృందాన్ని పంపారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం అలిపిరి పాదాల మండపాన్ని పరిశీలించారు. బెంగుళూరు నుంచి జి.శ్రీనివాసులు, చెన్నై నుంచి ఏ. సత్యం, హైదరాబాద్ నుంచి కే.కృష్ణ చైతన్య బృందం మరిన్ని పురాతన మండపాలను పరిశీలించనున్నారు. శిథిలావస్థలో ఉన్న పాదాల మండపం మరమ్మత్తుపై ఆర్కియాలజీ బృందం నివేదిక సమర్పించనున్నారు. -
ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
దేశ రాజధాని న్యూఢిల్లీలో వరుసగా రెండో రోజు కనిష్ట ఉష్ణోగ్రత పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదైంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే మూడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉండవచ్చు. ఈ సమయంలో ఉదయం తేలికపాటి పొగమంచు కూడా ఉండనుంది. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి, ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. రెండు రోజుల తర్వాత అంటే రాబోయే సోమవారం నాడు ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం ఢిల్లీలోని లోధి రోడ్లో శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రత 9.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 26.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శనివారం ఉదయం అంటే ఈరోజు వాతావరణంలో పొగమంచు వ్యాపించింది. పగటిపూట తేలికపాటి సూర్యరశ్మి ఉండనుంది. ఇది కూడా చదవండి: రాజస్థాన్ ఎవరిదో! -
‘గాడ్ డిపార్ట్మెంట్’ అంటే ఏమిటి? యూదుల లేఖల్లో ఏముంటుంది?
ఇజ్రాయెల్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అక్కడి యూదుల జీవితాల్లో మతం, ఆధ్యాత్మికత అనేవి లోతుగా నాటుకుపోయాయి. దీనికి ఇజ్రాయెల్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ‘దేవుని ప్రత్యేక విభాగం’ ఉదాహరణగా నిలుస్తుంది. దీనినే ‘గాడ్ డిపార్ట్మెంట్’ అని అంటారు. ‘గాడ్ డిపార్ట్మెంట్’కి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో ఉత్తరాలు వస్తుంటాయి. ఇజ్రాయెట్ 21సీ. ఓఆర్జీ తెలిపిన వివరాల ప్రకారం ఈ దేవుని విభాగానికి ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా ఉత్తరాలు వస్తుంటాయి. ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉంటున్న యూదులు తమ ప్రార్థనలు, కోరికలు, బాధలు, సంతోషాలను ప్రస్తావిస్తూ దేవునికి లేఖలు పంపుతారు. వీటన్నింటికీ ఒకే చిరునామా ఉంటుంది. అదే.. కోటెల్ లేదా వెస్ట్రన్ వాల్. ఇజ్రాయెల్ పోస్టల్ డిపార్ట్మెంట్లోని ‘గాడ్ డిపార్ట్మెంట్’కు వచ్చే ఉత్తరాలన్నీ జెరూసలేంలొని ‘వెస్ట్రన్ వాల్’ రంధ్రాలలో ఉంచుతారు. ఇక్కడ పశ్చిమ గోడను కోటెల్ అని కూడా అంటారు. ఇది ‘వాల్ ఆఫ్ ది మౌంట్’లో ఒక భాగం. ఒకప్పుడు ఈ ప్రదేశంలోనే తమ పవిత్ర దేవాలయం ఉండేదని యూదులు గాఢంగా నమ్ముతారు. దీన్నే ‘హోలీ ఆఫ్ ది హోలీస్’ అని అంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది యూదులు తమ వారసత్వాన్ని గుర్తు చేసుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఇది కూడా చదవండి: ‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం! -
పథకాల అమలుపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందిస్తున్న తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడు పథకాల పంపిణీ ఎలా ఉండాలి? నిబంధనల అమలు ఎలా ఉంది? అనే కోణంలో పరిశీలన మొదలుపెట్టింది. దళితబంధు, రైతుబంధు, బీసీ బంధులాంటి పథకాలకు సంబంధించి ప్రస్తుత సమయంలో లబ్ధిదారులకు సాయం అందించే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకాల కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు నోటిఫికేషన్ వచ్చే నాటికి లబ్ధి చేకూర్చాలని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పంపిణీ చేస్తే ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని టీపీసీసీ ఎన్నికల సంఘానికి వివరించింది. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం.. సంబంధిత శాఖలను వివరణ కోరింది. తక్షణమే స్పందించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. నివేదికలు సిద్ధం సంక్షేమ పథకాల అమలుపై ఎన్నికల సంఘం నివేదిక కోరడంతో సంబంధిత శాఖలు వివరణ ఇచ్చేందుకు ఉపక్రమించాయి. పథకాల వారీగా శాఖలు ఇప్పటికే సమాచారాన్ని సిద్ధం చేసుకున్నాయి. దళితబంధు పథకం నియోజకవర్గం యూనిట్‌గా అమలు చేస్తున్న క్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గం మినహా మిగతా 118 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక జాబితాలు, నిర్వహించిన అవగాహన కార్యక్రమాలపై పూర్తిస్థాయి సమాచారంతో ఎస్సీ కార్పొరేషన్ సిద్ధమైంది. కాగా, రెండోవిడత దళితబంధు పథకం కింద నియోజకవర్గానికి ఐదు వందల మంది లబ్ధిదారులకు సాయం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల ద్వారా పలు సిఫార్సులు రావడంతో వాటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ పథకం కింద మొదటి విడతలో కూడా ఎంతమందికి లబ్ధి చేకూర్చారన్నది కూడా ఎన్నికల సంఘానికి వివరించనుంది. అదేవిధంగా రైతుబంధు పథకం కింద గత ఐదేళ్లుగా పంపిణీ చేసిన మొత్తంతో పాటు ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులు, వారికి ఇవ్వాల్సిన నిధులు తదితర సమాచారాన్ని సైతం వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. దీంతోపాటు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న బీసీబంధు పథకం కింద అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ పథకం కింద ఎంతమందికి ఆర్థిక సాయం అందించారనే అంశాలను కూడా నివేదిక రూపంలో తయారుచేసి పెట్టుకుంది. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ వివరాలను ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల సంఘానికి సమర్పించనున్నట్లు సమాచారం. -
బోధనాస్పత్రులపై స్పెషల్ ఫోకస్
సాక్షి, అమరావతి: ‘నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చివేసిన ప్రభుత్వం... రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రుల నిర్వహణపై కూడా దృష్టి పెట్టింది. కార్పొరేట్ హాస్పిటల్స్ తరహాలో ప్రభుత్వాస్పత్రుల్లోనూ నిర్వహణ బాధ్యతలను చూసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 11 పాత బోధనాస్పత్రులకు ప్రత్యేకంగా జాయింట్ డైరెక్టర్(జేడీ) స్థాయి అధికారులను వైద్యశాఖ నియమించనుంది. వీరికి సహాయకులుగా మరో 88 మందిని నియమిస్తుంది. ఈ మేరకు కొత్తగా 99 పోస్టులను ఇటీవల సృష్టించింది. ఎవరి బాధ్యతలు ఏమిటంటే... ♦ సాధారణంగా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యపరమైన (క్లినికల్) అంశాలను మెడికల్ సూపరింటెండెంట్ పర్యవేక్షిస్తారు. నాన్–క్లినికల్ (ఆస్పత్రి నిర్వహణకు సంబంధించిన అంశాలు) వ్యవహారాలపర్యవేక్షణకు సీఈవో/జీఎం ఆపరేషన్స్/అడ్మినిస్ట్రేటర్ హోదాలో మరొకరు ఉంటారు. ♦ ఇప్పటి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో క్లినికల్, నాన్ క్లినికల్ రెండింటి పర్యవేక్షణ బాధ్యత సూపరింటెండెంట్ చూస్తున్నారు. ♦ ఇకపై ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో మెడికల్ సూపరింటెండెంట్లను వైద్యపరమైన వ్యవహారాలకు పరిమితం చేస్తారు. ♦ పరిపాలన కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. జేడీ నేతృత్వంలో ముగ్గురు ఏడీలతోపాటు అసిస్టెంట్ ఇంజినీర్, ఫెసిలిటీ మేనేజర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిస్ట్ వంటి సహాయక సిబ్బంది పనిచేస్తారు. వీరు ఆస్పత్రిలో భవనాల నిర్వహణ, సెక్యూరిటీ, శానిటేషన్, డైట్, ఉద్యోగుల హాజరు, జీతభత్యాలు, ఇతర నాన్ క్లినికల్ అంశాలను చూస్తారు. ♦ సూపరింటెండెంట్లకు ఇప్పటివరకు ఉన్న ఆస్పత్రి నిర్వహణ భారం తొలగిపోయి రోగుల సంరక్షణకు ఎక్కువ సమయాన్ని కేటాయించే అవకాశం లభిస్తుంది. వైద్యుల హాజరు, ఐపీ, ఓపీ, సర్జరీ సేవలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతారు. ఎన్ఏబీహెచ్ గుర్తింపే లక్ష్యంగా... ప్రభుత్వాస్పత్రుల్లో ప్రమాణాలు పెంచి మంచి వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. ఈ క్రమంలో మన ఆస్పత్రులకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్, హెల్త్‌కేర్(ఎన్ఏబీహెచ్) గుర్తింపు పొందడమే లక్ష్యంగా వైద్యశాఖ అడుగులు వేస్తోంది. ఈ దశగా చేపట్టిన చర్యల ఫలితంగా ఇప్పటికే విశాఖపట్నంలోని ఛాతీ, మెంటల్ కేర్ ఆస్పత్రులకు ఎన్ఏబీహెచ్ గుర్తింపు లభించింది. మరోవైపు రాష్ట్రంలోని అత్యధిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్–క్వా‹Ù) గుర్తింపు పొందాయి. ఎన్–క్వాష్ గుర్తింపులో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇదే తరహాలో మిగిలిన ఆస్పత్రులను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించడానికి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. -
తుది దశకు డ్రోన్ సర్వే
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీ సర్వేలో కీలకమైన డ్రోన్ సర్వే (డ్రోన్లతో భూముల కొలత) తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 97 శాతం సర్వే పూర్తయింది. మిగిలిన 3 శాతాన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేయడానికి సర్వే, సెటిల్మెంట్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలోని 17,595 గ్రామాలకు గాను, డ్రోన్ సర్వే సాధ్యం కాని 4,135 గ్రామాలను మినహాయిస్తే 13,460 గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఈ గ్రామాల్లో డ్రోన్లు, విమానాల ద్వారా సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 13,075 గ్రామాల్లో దాదాపు 1.75 కోట్ల ఎకరాల్లో సర్వే పూర్తయింది. ఇంకా కేవలం 385 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి కావాల్సి ఉంది. వీటిలో శ్రీకాకుళం, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని ఎక్కువ గ్రామాల్లో సర్వే జరగాల్సి ఉంది. ఈ నెలాఖరుకు మొత్తం గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని సర్వే శాఖ అధికారులంటున్నారు. ఇది పూర్తయితే రీ సర్వేలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేసినట్లవుతుంది. మొత్తం 1.80 కోట్ల ఎకరాలను కొలిచినట్లవుతుంది. ఇది ఒక రికార్డుగా అధికారులు చెబుతున్నారు. వేగంగా పూర్తి చేసేందుకు... వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఏరియల్ సర్వే కోసం డ్రోన్లతోపాటు విమానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. సర్వే ఆఫ్ ఇండియాతోపాటు ప్రైవేట్ డ్రోన్ ఏజెన్సీలకు ఈ బాధ్యతను అప్పగించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 వేలమంది సర్వేయర్లను నియమించడంతోపాటు సొంతంగా 30 డ్రోన్లు కొనుగోలు చేసి సర్వేయర్లకు పైలెట్లుగా శిక్షణ ఇచ్చి సర్వే చేయిస్తోంది. దీంతో సర్వే అత్యంత వేగంగా పూర్తవుతోంది. -
వాహనాలు ఢీకొనకుండా ఆటోమేటిక్ బ్రేకులు
అమరావతి: రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. కార్లు, ఇతర వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టకుండా చేసేందుకు సరికొత్త టెక్నాలజీని వాడేందుకు నిర్ణయించింది. ‘వెహికల్ టు ఎవ్రీథింగ్ (వీ2ఎక్స్) అని పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీని ముందుగా కార్లలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ భద్రతా ప్యానల్ కేంద్రానికి నివేదించింది. భారత్ ఎన్‌క్యాప్ ప్రోగ్రాంలో స్థానం దేశం మొత్తమ్మీద 2021లో 4,12,000 రోడ్డు ప్రమాదాలు జరగ్గా వాటిల్లో దాదాపు 1,53,972 మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం రహదారి భద్రత కోసం వీ2ఎక్స్ టెక్నాలజీని వాడాలని నిర్ణయించింది. ‘న్యూ కార్ ఎసెస్మెంట్ ప్రోగ్రాం (ఎన్‌క్యాప్)లో చేర్చింది. అంటే ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేసే కార్లకు భద్రతా రేటింగ్స్ నిర్ణయించేటప్పుడు ఈ టెక్నాలజీని ప్రమాణికంగా తీసుకుంటారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ రహదారి భద్రతా ప్యానల్ 58 పేజీల నివేదికను సమర్పించింది. ఈ టెక్నాలజీని దేశంలో తయారు చేసే కార్లలో ప్రవేశపెట్టే అంశంపై కేంద్ర రవాణా, టెలీ కమ్యూనికేషన్ల శాఖల ఉన్న తాధికారుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది. వీ2ఎక్స్ ఎలా పని చేస్తుందంటే... కార్ల తయారీలో అంతర్భాగంగా ఈ టెక్నాలజీని అమలు చేస్తారు. ఇది వైఫై ఆధారంగా ఇది పనిచేస్తుంది. తగినంత దూరం నుంచే రహదారిపై ఎదురుగా, పక్కన, వెనుక ఉన్న వాహనాలను గుర్తించి డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది. రోడ్లపై రద్దీ, రోడ్డు పక్కన పాదచారుల విషయంలోనూ ఈ టెక్నాలజీ నిత్యం గమనిస్తూ వాహనదారులను హెచ్చరిస్తుంది. టోల్ గేట్లు, రోడ్డు మలుపులు, యూటర్న్లు, ప్రమాద హెచ్చరిక బోర్డుల గురించి ముందుగానే సమాచారమిస్తుంది. వాహనాలు ఒకదానికొకటి దగ్గరగా వస్తే ఆటోమేటెడ్ బ్రేకింగ్ వ్యవస్థ పనిచేసి ఆ వాహనాలు నిలిచిపోతాయి. ప్రస్తుతం కార్లు, ఎస్‌యూవీలలో ఉన్న భద్రతా ఫీచర్లు పూర్తిస్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదని నిపుణులు భావిస్తున్నారు. -
వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపికబురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో 2018కి ముందు కాంట్రాక్ట్ ప్రాతిపదికన శాంక్షన్ పోస్టుల్లో నియమితులైన సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, పారా మెడికల్ సిబ్బందికి వంద శాతం గ్రాస్ వేతనం (పే+హెచ్ఆర్ఏ+డీఏ) పునరుద్ధరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ హయాంలో వంద శాతం గ్రాస్ వేతనాన్ని రద్దు చేసి.. కన్సాలిడేట్ పేకి కుదించారు. ఈ నేపథ్యంలో వారంతా 2019కు ముందు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను తెలియజేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద శాతం గ్రాస్ వేతనం వర్తింపజేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేరుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2018 తర్వాత నియమించబడి అర్హత ఉన్న ఉద్యోగులకు ఈ వేతనాలు వర్తింపజేసేలా ప్రతిపాదనలు పంపించాల్సిందిగా విభాగాధిపతులను ఆదేశించారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వంద శాతం గ్రాస్ వేతనం వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. టీడీపీ హయాంలో వంద శాతం గ్రాస్ వేతనం రద్దు చేసి మాకు అన్యాయం చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 3,914 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. కేడర్‌ను బట్టి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ వేతనాలు పెరుగుతాయి. జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటాం. – రత్నాకర్, ప్రెసిడెంట్, ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ పారా మెడికల్, ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ -
నేడు 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది నుంచే కొత్తగా తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. శుక్ర వారం సీఎం కేసీఆర్ ఈ కాలేజీలను ప్రారంభించనున్నారు. ఇందులో కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్ర సొంత నిధులతో ఇలా పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీలను ప్రారంభించడం దేశంలో ఇదే ప్రథమమని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా.. సీఎం కేసీఆర్ గత తొమ్మిదేళ్లలోనే కొత్త 21 కాలేజీలను ఏర్పాటు చేశారని అంటున్నాయి. వచ్చే ఏడాది మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారని.. వాటితో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యం పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. -
బాబు కుంభకోణాలన్నీ బయటకొస్తాయి
కొవ్వూరు/ఆరిలోవ (విశాఖ తూర్పు): చంద్రబాబు అవినీతి కుంభకోణాలన్నీ బయటకొస్తాయని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. నేరం చేసి జైలుకు వెళ్లిన చంద్రబాబునాయుడుకి విధేయులుగా ఉన్న కొందరు చట్టాన్ని తప్పుపట్టటం సరికాదని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైన సాక్ష్యాదారాలున్నందునే న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించిందని చెప్పారు. చంద్రబాబు జైలుకెళ్లడం పట్ల ప్రజలు సంతోషంతో ఉన్నారని, అందుకే టీడీపీ చేపట్టిన బంద్‌లో ప్రజలు పాల్గొనలేదని తెలిపారు. విశాఖపట్నంలో సోమవారం ప్రారంభమైన జైళ్లశాఖ జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతోను, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ‘సాక్షి’తోను మాట్లాడారు. నేరం చేసినవారు ఎంతటివారైనా చట్టం దృష్టిలో సమానులేనని చెప్పారు. టీడీపీ నాయకులు, కొన్ని చానళ్లు, పత్రికలు చట్టాన్ని, న్యాయవ్యవస్థను తప్పుపట్టడం మంచిది కాదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.371 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తే, దాన్ని రాజకీయ వైరంగా చిత్రీకరించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. రాజధానికి వేలాది ఎకరాల భూముల సేకరణ విషయంలో బినామీల పేరుతో చంద్రబాబు రూ.వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. తెలంగాణలో ఓటుకి కోట్లు కేసులో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయాడన్నారు. రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వారి భూములను చంద్రబాబు, ఆయన మనుషులు దోచుకున్నారని చెప్పారు. ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుతో పాటు రామోజీ కొడుకు వియ్యంకుడు ఆర్.వి.ఆర్.రఘు కేంద్ర ఐటీశాఖ అధికారులకు దొరికిపోవడం వలన రాజధాని కుంభకోణాలు విచారించడానికి వీల్లేదని వాదిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఐటీశాఖ చంద్రబాబుకి అవినీతిపై నోటీసులిస్తే పచ్చమీడియా నోరు మెదపడం లేదన్నారు. రూ.2 వేలకోట్ల లావాదేవీలు చేశారని, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ప్రధాన నిందితుడని ఐటీశాఖ సాక్ష్యాధారాలతో నోటీసులిచి్చనా విచారణగానీ, అరెస్ట్గానీ చేయకూడదా.. అని ప్రశ్నించారు. ఇంతకాలం చంద్రబాబు దేశంలో వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ, స్టేలు తెచ్చుకుంటూ కాలం గడిపారని చెప్పారు. చంద్రబాబు వేలకోట్ల అవినీతికి పాల్పడుతూ దుష్టచతుష్టయానికి వాటాలు పంచుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్‌తో అవినీతి భాగస్వాముల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. అవినీతికి పాల్పడిన కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ప్రతీకారంతో చేశారంటూ టీడీపీ, జనసేన, పచ్చమీడియా ప్రజలను నమ్మించేందుకు అష్టకష్టాలు పడుతున్నట్లు ఎద్దేవా చేశారు. అవినీతి డొంక కదిలింది ఇంతకాలం చంద్రబాబు రాజకీయాలను వ్యాపారంగా మార్చుకుని అవినీతి సామ్రాజ్యాన్ని నడిపారని హోంమంత్రి వనిత అన్నారు. ఇప్పుడు చంద్రబాబు అవినీతి డొంక కదిలిందని, ఒక్కో కుంభకోణం బయటపడుతుందని చెప్పారు. ఈ వ్యవహారంలో లోకేశ్‌పైన కూడా అనుమానాలున్నాయని, సీఐడీ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజాజీవనానికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలో 144 సెక్షన్ విధించినట్లు చెప్పారు. దీనిపై పోలీసులు బాధ్యతాయుతంగా వ్యహరించారని ఆమె పేర్కొన్నారు. -
మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్ మేటి
సాక్షి, హైదరాబాద్: ఏ నగరమైనా వృద్ధిలోకి రావాలంటే అక్కడి మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, ఈ విషయంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నా రు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా శనివారం ఏర్పాటు చేసిన 2 రోజుల ‘టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్పో’ మూడవ ఎడిషన్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పల్లెలు సమగ్ర, సమీకృత, సమ తుల్య వృద్ధిలో కొనసాగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లోని మౌలిక సదుపాయాలు ఇక్కడి రియల్ రంగాన్ని ఉన్నతస్థాయిలో నిలుపుతూ, పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. అయితే విశ్వనగరంగా నిరూపించుకోవడానికి ఈ వృద్ధి సరిపోదని తెలిపారు. 31 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో పూర్తి చేయబోతున్నామని, రానున్న పదేళ్లలో ఓఆర్ఆర్ చుట్టూ దాదాపు 415 కిలో మీటర్ల మెట్రో కోసం ప్రణాళికలు చేపడుతు న్నామని వెల్లడించారు. ముంబై తరువాత అతిపెద్ద 2వ స్కై స్క్రీపర్ నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని, 57 అంతస్తులతో స్కై స్క్రీపర్స్ నిర్మించడానికి ఈ మధ్యనే హెచ్ఎండీఏ 12 అనుమతులను అందించిందని మంత్రి తెలిపారు. విశ్వనగరంగా మారాలంటే నగరం నలుమూలల్లో అభివృద్ధి జరగాలి. దీనికి రియల్ రంగం సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 40 నుంచి 45 శాతం హైదరాబాద్ నగరం నుంచే ఉత్పత్తి ఉంటుంది. అందుకే నగరాల వృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి ప్రత్యేకంగా కోరారు. టీఎస్, ఏపీ రెస్పాన్స్ హెడ్ కమల్ క్రిష్ణన్ మాట్లాడుతూ, టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పోకు విభిన్న వర్గాల నుంచి అనూహ్య స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. -
ఐటీ నోటీసులిస్తే మీకది వార్త కాదా?
సాక్షి, అమరావతి: ఎల్లో మీడియాగా గుర్తింపు పొందిన కొన్ని సంస్థలు జర్నలిజంపై గౌరవాన్ని పూర్తిగా దిగజారుస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఐటీ శాఖ నోటీసులిస్తే ఆ పత్రికల్లో కనీసం వార్త కూడా ప్రచురించకపోవటానికి మించి దుర్మార్గం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఎల్లో మీడియాలో మీకు నచ్చిందే రాస్తారా? అని నిలదీశారు. మంగళవారం సచివాలయం వద్ద మంత్రి సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. ‘ఐటీ శాఖ నోటీసులపై చంద్రబాబు నోరు విప్పకపోవటాన్ని బట్టి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు చాలాసార్లు తప్పించుకున్నారు. ఆయన అక్రమాల్లో ఐటీ శాఖ గుర్తించింది అవగింజంతే. ‘సీబీఐ, ఈడీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తక్షణం అదుపులోకి తీసుకోవాలి. చంద్రబాబు వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తారో అందరికీ తెలుసు. రాజధానిని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. రూ.ఐదు లక్షలు దాటిన పనులకు టెండర్లు నిర్వహించాల్సి ఉన్నా పోలవరంలో నామినేషన్‌పై రూ.వేల కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. సమాధానం చెప్పకుండా చంద్రబాబు ఎంతో కాలం తప్పించుకోలేరు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌లా జైలుకు వెళ్లక తప్పదు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాననే పవన్‌కళ్యాణ్ దీనిపై ఎందుకు స్పందించరు?’ అని మంత్రి సత్య నారాయణ నిలదీశారు. -
తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్‌స్టర్‌లే
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన స్కామ్.. సీమన్స్, అమరావతి భూకుంభకోణాల దారులన్నీ ఒకే చోటుకు చేరుతున్నాయని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. ఐటీ శాఖ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న వ్యక్తులే.. సీమన్స్, అమరావతి అసైన్డ్ భూకుంభకోణాల్లో ప్రధానపాత్ర పోషించారని సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. ఈ కుంభకోణాల మూలాలు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ల వద్దే ఉన్నాయని చెప్పారు. తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్‌స్టర్‌లేనన్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిలో ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములు చేతులు మార్చే క్రమంలో పెద్ద స్కామ్ జరిగిందని గతంలోనే సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. అమరావతి పేరుతో జరిగిన స్కామ్‌లన్నింటిలో డొల్ల కంపెనీలు పెట్టి, వాటిద్వారా తండ్రీకొడుకులు ముడుపులు పుచ్చుకున్న విషయాలు ఇప్పటికే సీఐడీ విచారణలో రట్టయిందని ఎత్తిచూపారు. డొల్ల కంపెనీలతో డబ్బును జేబులో వేసుకోవడం.. హవాలా ద్వారా తండ్రీకొడుకులకు చేరవేయడంలో ఈ మధ్య కూడా మరో స్కామ్ బయటకొచ్చిందని చెప్పారు. అమరావతిలో రాజధాని కడతానని, ప్రతి ఇటుకకు డబ్బులివ్వండని.. మనల్ని అందర్నీ తాకట్టు పెట్టి బాండ్స్ ఇష్యూచేసి చంద్రబాబు తెచ్చిన డబ్బులు ఆయా కంపెనీలకు ఇచ్చారని తెలిపారు. ఆ కంపెనీల ద్వారా నిధులు డొల్ల కంపెనీలకు మళ్లించారని, ఐటీ శాఖ నోటీసులు చూస్తే.. చంద్రబాబు మొత్తం రూ.160 కోట్ల రూపాయలు కొట్టేశారని తేలిందని చెప్పారు. లోకేశ్ మిత్రుడు రాజేశ్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా అమరావతి పేరుతో జనం సొమ్మును కొట్టేశారన్నారు. ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొన్న తరహాలోనే.. ఇప్పటికే సీఐడీ విచారణలో తేలిన స్కిల్ స్కాం, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం, కాంట్రాక్ట్ పనుల్లో అక్రమాలు, ఫైబర్‌నెట్ స్కామ్‌లలోను ఈ వ్యక్తుల ద్వారా ఇదే విధమైన రూటింగ్ జరిగిందని చెప్పారు. ఎంవీపీ, పీఏ శ్రీనివాస్, రాజేశ్ తదితరులు ఆ కుంభకోణాల్లోను ప్రధానపాత్ర పోషించారన్నారు. ఐదేళ్లలో రకరకాల స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లు చేసిన చంద్రబాబు వేలకోట్ల రూపాయలు దోచుకుని హైదరాబాద్‌లో దాచుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు. ప్రజాధనాన్ని దోచేసిన తండ్రీకొడుకులను వలేసి భలే పట్టుకున్నారని ఐటీ శాఖను ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం సిగ్గుచేటని చెప్పారు. తండ్రీకొడుకులు ఏయే పాపాలు చేశారని నాలుగేళ్లుగా చెబుతున్నామో అవన్నీ ఒక్కొక్కటిగా ఆధారాలతో దొరుకుతున్నాయని తెలిపారు. కచ్చితంగా చంద్రబాబు పాపం పండే రోజు వచ్చింది.. అవినీతి బట్టబయలైంది.. పరిహారం చెల్లించాల్సిన రోజు వస్తుంది.. అని పేర్ని నాని చెప్పారు. -
నోటీసులపై నోరు విప్పు
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులకు మాజీ సీఎం చంద్రబాబు తక్షణమే సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. విజనరీగా చెప్పుకునే ఆయన పొలిటికల్ స్కామ్‌స్టర్ అని ధ్వజమెత్తారు. కమీషన్లుగా దండుకున్న రూ.118.98 కోట్లపై నోరు మెదపకుండా నీతులు వల్లిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అక్రమార్జనలో ఇది చిన్న భాగం మాత్రమేనని, క్షుణ్నంగా విచారిస్తే భారీ కుంభకోణాలు బహిర్గతం కావడం ఖాయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కుంభకోణాలను అప్పట్లోనే తెహల్కా బయటపెట్టింది. అక్రమార్జనపై 17 కేసుల్లో చంద్రబాబు విచారణ ఎదుర్కోకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి స్టేలు తెచ్చుకున్నారు. ఢిల్లీలో రూ.700–రూ.800 కోట్లతో అత్యద్భుతమైన పార్లమెంట్ భవనాన్ని కేంద్రం నిర్మిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రూ.500 – రూ.600 కోట్లతో సచివాలయ భవనాన్ని నిర్మించింది. ఏసీ, ఇంటీరియర్స్ సహా చదరపు అడుగు నిర్మాణానికి రూ.2 వేల నుంచి రూ.మూడు వేలు వ్యయం అవుతుంది. చంద్రబాబు మాత్రం చదరపు అడుగుకు రూ.13 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు పెట్టి రేకుల షెడ్డు లాంటి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు. దీన్ని బట్టి చూస్తే షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి చదరపు అడుగుకు రూ.పది వేలకుపైగా ముడుపులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేరాయి. పోలవరంలో వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను నిర్మించకుండానే ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను చంద్రబాబు చేపట్టారు. దీంతో 2019–20లో గోదావరికి వచ్చిన భారీ వరదలు ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో డయాఫ్రమ్ వాల్ కోతకు గురైంది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలు ఏర్పడ్డాయి. వాటిని యధాస్థితికి తేవడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత నష్టానికి కారకుడు చంద్రబాబే. ఈ పాపానికి చంద్రబాబు పాల్పడకుంటే పోలవరం ఈ పాటికి ఎప్పుడో పూర్తయ్యేది. చంద్రబాబు పాపాలను సీఎం వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తూ ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని పూర్తి చేస్తున్నారు. తొలి దశ పూర్తికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్టంలో 2014–19 మధ్య పేదరికం 11.66 శాతం ఉండగా, సీఎం జగన్ సంక్షేమ పథకాల వల్ల 6 శాతానికి తగ్గింది. -
ప్రపంచ ఆర్థిక ప్రగతిలో ఐదో స్థానానికి భారత్
దొండపర్తి (విశాఖ దక్షిణ):ప్రపంచ ఆర్థిక ప్రగతిలో భారతదేశం ఐదో స్థానానికి చేరుకుందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ పేర్కొన్నారు. ఈ ఘనతను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామిగా ఉందని చెప్పారు. విశాఖ పోర్టులో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రూ.96 కోట్లతో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి సోమవారం ప్రారంభించారు పోర్టులో రూ.237 కోట్లతో పూర్తి చేసిన ట్రక్ పార్కింగ్ టెర్మినల్, కవర్డ్ స్టోరేజ్ షెడ్లతోపాటు ఓఆర్ బెర్తుల ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ 2015లో ప్రారంభించిన సాగరమాల కార్యక్రమం ద్వారా రూ.5.60 లక్షల పెట్టుబడులతో పోర్టుల ఆధునికీకరణను చేపట్టినట్టు వెల్లడించారు. ఫలితంగా ఆధునిక మౌలిక సదుపాయాలతో భారతీయ ఓడరేవులు ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారుతున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. విశాఖను క్రూయిజ్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ క్రూయిజ్ టెర్మినల్‌లో ఒకేసారి 2 వేల మంది ప్రయాణికులకు సేవలందించే అవకాశం ఉందన్నారు. కేంద్ర షిప్పింగ్, టూరిజం శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ వై.నాయక్ మాట్లాడుతూ విశాఖ క్రూయిజ్ టెర్మినల్‌ను దేశంలోనే ప్రముఖ క్రూయిజ్ టూరిజం డెస్టినేషన్‌గా తీరిదిద్దాలన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ పరిశ్రమ వివిధ రంగాల్లో ఉద్యోగాలను సృష్టిస్తోందని తెలిపారు. క్రూయిజ్ టెర్మినల్ విశాఖకు మైలురాయి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖ చరిత్రలో క్రూయిజ్ టెర్మినల్ ఒక మైలురాయిగా మిగిలిపోతుందన్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా గుర్తింపు పొందిన విశాఖలో పర్యాటకాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో పోర్టులు కీలక భూమిక పోషిస్తున్నాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త పోర్టులు, హార్బర్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, జీవీఎల్ నరసింహారావు, విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్మన్ దుబే, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గణబాబు పాల్గొన్నారు. -
విశాఖ తీరం..క్రూయిజ్ విహార కేంద్రం
అంతర్జాతీయ నగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ సిటీ సిగలో మరో ప్రతిష్టాత్మక పర్యాటక మణిహారం చేరుతోంది. అంతర్జాతీయ స్థాయి సముద్ర విహారానికి ఆసక్తి చూపే పర్యాటకుల కోసం విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ముస్తాబైంది. వివిధ దేశాల పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి మహా విశాఖ నగరంలో పర్యటించేలా ఈ టెర్మినల్‌లో వివిధ ఏర్పాట్లు చేశారు. పోర్టులోని గ్రీన్ చానల్ బెర్త్‌లో రూ.96.05 కోట్లతో నిర్మించిన ఈ సముద్ర విహార కేంద్రాన్ని క్రూయిజ్ షిప్స్‌తోపాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ క్రూయిజ్ టెర్మినల్‌ను సోమవారం కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రారంభించనున్నారు. అనంతరం ట్రయల్స్ నిర్వహించేందుకు పోర్టు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.– సాక్షి, విశాఖపట్నం ఏపీ టూరిజంతో కలిసి... ఈ టెర్మినల్ నిర్వహణలో ఏపీ టూరిజం, కేంద్ర టూరిజం శాఖలతో కలిసి విశాఖపట్నం పోర్టు పని చేయనుంది. భారత్‌లో క్రూయిజ్ టూరిజానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 7.1 యూఎస్ బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. రానున్న పదేళ్లలో 12.1 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్ రంగం 1.17 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. క్రూయిజ్ సేవలు ప్రారంభమైతే రాష్ట్రంలో ఇంటర్నేషనల్ టూరిజం గణనీయంగా పెరగనుంది. ఇవీ విశాఖ క్రూయిజ్ టెర్మినల్ ప్రత్యేకతల్లో కొన్ని... 2,500 చదరపు మీటర్లలో టెర్మినల్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, విదేశీ కరెన్సీ మార్పిడి కౌంటర్లు, గ్యాంగ్ వే, రెస్టారెంట్, స్పెషల్ లాంజ్, షాపింగ్, రెస్ట్ రూమ్స్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లు ఏర్పాటు చేసే విధంగా నిర్మాణాలు పూర్తిచేశారు. క్రూయిజ్‌లో వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల చెకింగ్ కోసం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ క్యాబిన్స్, పర్యాటకులు సేదతీరేందుకు టూరిస్ట్ లాంజ్ నిర్మించారు. టెర్మినల్ పార్కింగ్ ప్రాంతంలో 7 బస్సులు, 70 కార్లు, 40 బైక్‌లు నిలిపేలా ఏర్పాట్లు చేశారు. గంటకు 200 కి.మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా షోర్ ప్రొటెక్షన్ వాల్ కూడా ఇందులో నిర్మిస్తున్నారు. రెగ్యులర్ బెర్త్ 180 మీటర్ల పొడవు కాగా.. ఈ టెర్మినల్‌లో 330 మీటర్ల భారీ పొడవైన క్రూయిజ్ బెర్త్ నిర్మించారు. 15 మీటర్ల వెడల్పు, 9.50 మీటర్ల డ్రెడ్జ్ డెప్త్‌ని నిర్మించారు. తద్వారా క్రూయిజ్ రాని సమయంలో సరుకు రవాణా చేసే భారీ కార్గో నౌకలను కూడా ఈ బెర్త్‌లోకి అనుమతించేలా డిజైన్ చేశారు. స్థానికులకు ఉపాధి పెరుగుతుంది గరిష్టంగా 2,000 మంది టూరిస్టులకు సరిపడా సౌకర్యాలతో క్రూయిజ్ టెర్మినల్ భవనాన్ని సుందరంగా నిర్మించాం. ఈ టెర్మినల్ కేవలం పర్యాటకంగానే కాకుండా స్థానికులకు ఉపాధి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. క్రూయిజ్ షిప్స్‌లో వచ్చే టూరిస్టులు స్థానిక దుకాణాల్లో షాపింగ్స్ చేయడం, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడం... ఇలా ఎన్నో విధాలుగా మేలు కలగనుంది. సందర్శనీయ స్థలాల్లో పర్యటించడం వల్ల స్థానికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభించిన తర్వాత ట్రయల్ నిర్వహిస్తాం. ఇప్పటికే రెండు భారీ ఆపరేటర్ సంస్థలు పోర్టుతో సంప్రదింపులు జరుపుతున్నాయి. వింటర్ సీజన్లో కొత్త టెర్మినల్ నుంచి సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.– డాక్టర్ అంగముత్తు,విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్ -
2025 జూన్‌కు పోలవరం తొలి దశ పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలి దశను 2025 జూన్‌కి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదన అమలుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, కేంద్ర జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తదితరులతో పోలవరం పనులపై సమీక్షించారు. డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్ దెబ్బతినడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలపై మరింత లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాఫర్ డ్యామ్‌లలో లీకేజీలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి, వాటిని మరింత పటిష్టం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణులతో అధ్యయనం చేయించాలని సూచించారు. డిజైన్ల ప్రతిపాదన, ఆమోదం నుంచి పనులు చేపట్టడం వరకూ పీపీఏ పాత్ర మరింత పెరగాలన్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల మాత్రమే కొత్తగా డయాఫ్రమ్ వేస్తే సరిపోతుందా? అనే అంశంపై ఏం నిర్ణయం తీసుకున్నారని సీడబ్ల్యూసీని ప్రశ్నించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే మొగ్గుచూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని, దానిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్ వోరా చెప్పారు. కాఫర్ డ్యామ్‌లను మరింత పటిష్టం చేయడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో చర్చించి నాలుగైదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంకు పంకజ్‌కుమార్ సూచించారు. ఈ నివేదికల ఆధారంగా మరో సారి సమావేశమై కాఫర్ డ్యామ్‌ల పటిష్టత, డయాఫ్రమ్ వాల్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గోదావరిలో వరదలు తగ్గేలోగా వాటిపై తుది నిర్ణయం తీసుకంటే ఈ సీజన్లో పూర్తి స్థాయిలో పనులు చేపట్టవచ్చని, తద్వారా గడువులోగా ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుందని వివరించారు. ఇదీ చదవండి: దోచుకునే బుద్ధి మీది రామోజీ!