మస్క్‌కు మరింత పవర్‌ ఇచ్చిన ట్రంప్‌.. ఉద్యోగులే టార్గెట్‌ | Trump Department Of Government Efficiency Executive Order Staff Cuts Elon Musk Son, More Details Inside | Sakshi
Sakshi News home page

మస్క్‌కు మరింత పవర్‌ ఇచ్చిన ట్రంప్‌.. ఉద్యోగులే టార్గెట్‌

Published Wed, Feb 12 2025 9:21 AM | Last Updated on Wed, Feb 12 2025 10:13 AM

Trump Department of Government Efficiency Executive Order Staff Cuts elon Musk son

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌​ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేసే బాధ్యతను ఎలోన్‌ మస్క్‌ చేతికి అప్పగించారు. ఫెడరల్‌ వర్క్‌ ఫోర్స్‌ను మరింతగా కుదించేందుకు ఎలోన్ మస్క్ నేతృత్వంలోని ప్రభుత్వ సామర్థ్య శాఖ (డోజ్‌)కు అధికారాలు కల్పించారు. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు.  ఓవల్ కార్యాలయంలో టెక్ బిలియనీర్ ఎలోన్‌ మస్క్‌తో పాటు అతని నాలుగేళ్ల కుమారుని సమక్షంలో ఈ సంతకాల కార్యక్రమం జరిగింది.
 

వైట్ హౌస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ కార్యనిర్వాహక ఉత్తర్వు.. ఫెడరల్‌ వర్క్‌ ఫోర్స్‌ను పరిమితం చేసేందుకు ఉద్దేశించినది. ఈ విషయంలో డోజ్‌ ప్రభుత్వ ఉద్యోగులతో సంప్రదింపులు జరపాలని, పెద్ద ఎత్తున ఉద్యోగుల తగ్గింపునకు ప్రణాళికలు చేపట్టాలని, అవసరమైన స్థానాలలోని సిబ్బందిని మాత్రమే  పరిమితం చేయాలని దానిలో ఆదేశించారు.

ఈ  ఉత్తర్వులపై సంతకాలు చేసిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ డోజ్‌ పని తీరును ప్రశంసించారు. ఇది చట్టం పరిధిలో పనిచేస్తుందా లేదా అనే విషయంలో పలు విమర్శలు ఉన్నప్పటికీ టెస్లా సీఈఓ మస్క్‌ ప్రభుత్వానికి సంబంధించిన మరిన్ని పనులు చేయాలని తాను కోరుకుంటున్నానన్నారు. దేశాభివృద్ధికి బాధ్యత వహించే వ్యక్తి ,  తనకు అన్ని విషయాలు నివేదించే వ్యక్తి ఈ పని చేసేందుకు సమర్థులని భావిస్తున్నానని అన్నారు. అమెరికాను  అభివృద్ధి పథాన తీసుకువెళ్లేందుకే తాను ఎంపికయ్యాయని ఒక న్యాయమూర్తి చెప్పడం ఎన్నటికీ మరువలేనిదని ట్రంప్‌ పేర్కొన్నారు.

‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే అక్షరాలు కలిగిన టోపీని ధరించిన మస్క్ మాట్లాడుతూ ప్రభుత్వానికి స్వయంప్రతిపత్తి కలిగిన సమాఖ్య బ్యూరోక్రసీ  లేదని,  అందుకే ప్రజల తరపున ప్రతిస్పందించే వ్యక్తి అండగా ఉండాలన్నారు. ప్రజలచేత ఎన్నిక కాని అధికారిగా తన పాత్రను సమర్థించుకున్న మస్క్‌ అమెరికా ప్రభుత్వంలోని  వివిధ విభాగాలను తగ్గించే అధికారాన్ని అధ్యక్షుడు  తనకు మంజూరు చేశారన్నారు. బ్యూరోక్రసీలో లక్షల డాలర్ల జీతం కలిగిన సిబ్బంది ఉండటం వింతగా ఉందని మస్క్‌ వ్యాఖ్యానించారు.

తాను ట్రంప్‌తో దాదాపు ప్రతిరోజూ మాట్లాడుతుంటానని ప్రభుత్వంలోని అవినీతిని గుర్తించి, అనవసరఖర్చులకు తగ్గించేందుకు ప్రయత్నిస్తానన్నారు. కాగా మస్క్ విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో అతని కుమారుడు లిటిల్ ఎక్స్‌ తండ్రి చేయి పట్టుకుని, అతనికి కాస్త ఇబ్బంది కలిగించాడు. గతంలో లిటిల్ ఎక్స్‌కు సంబంధించిన పలు వీడియోలు వైరల్‌ అయ్యాయి. 

ఇది కూడా చదవండి: నేడు రాష్ట్రపతి భవన్‌లో తొలి పెళ్లి బాజాలు.. వివాహం ఎవరికంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement