పాకిస్థాన్‌కు చావుదెబ్బ.. 214 మంది సైనికులు హతం | Baloch Rebels Blame Pakistan Govt Over 214 Army Hostages Over Jaffar Train Hijack Incident, More Details Inside | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌కు చావుదెబ్బ.. 214 మంది సైనికులు హతం

Published Sat, Mar 15 2025 11:24 AM | Last Updated on Sat, Mar 15 2025 12:46 PM

Baloch rebels blame Pakistan Govt Over 214 Army Hostages

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైజాక్‌ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో 214 మంది పాక్‌ సైనికులను చంపేసినట్టు బలోచ్‌ తిరుగుబాటుదారులు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. తమ డిమాండ్‌కు ప్రభుత్వ స్పందించని కారణంగానే తాము వారిని చంపేసినట్టు ప్రకటించారు.

బలోచ్‌స్థాన్‌లో ప్రధాన వేర్పాటువాద సంస్థగా ఎదిగిన బీఎల్‌ఏ.. సామాన్య పౌరులు సహా భద్రతా దళాలు, చైనా జాతీయులు, బలోచిస్థాన్‌లో పనిచేస్తున్న ఇతర ప్రావిన్సుల వారిపై దాడులకు పాల్పడుతోంది. ఆ ప్రావిన్సులో 18 భారీ దాడులు చేసింది. ఇక, తాజాగా జరిగిన రైలు (Jaffar Express) ఘటన సంచలనంగా మారింది. ఈ హైజాక్‌పై తాజాగా బలోచ్‌ లబరేషన్‌ ఆర్మీ స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ సందర్బంగా బీఎల్‌ఏ..‘రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని విధించిన 48 గంటల గడువు ముగిసింది. ప్రభుత్వం స్పందించని కారణంగా జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది సైనికులను చంపేశాం. జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైజాక్‌ ఘటనలో మా ఆపరేషన్‌ ముగిసింది. ప్రభుత్వం మొండితనంగా వ్యవహరించిన కారణంగానే మా చేతులకు పని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పుకొచ్చారు. దీంతో, పాకిస్ఠాన్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఇదిలా ఉండగా.. పాకిస్థాన్‌లో 500 మంది ప్రయాణికులతో వెళుతున్న రైలు హైజాక్‌ (Train Hijack)కు గురైన ఘటనలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా బందీల్లో 80 మందిని సురక్షితంగా విడిపించాయి. వీరిలో 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 33 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు పాక్‌ ప్రభుత్వ అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement