hijak
-
పాకిస్థాన్‌కు చావుదెబ్బ.. 214 మంది సైనికులు హతం
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో 214 మంది పాక్ సైనికులను చంపేసినట్టు బలోచ్ తిరుగుబాటుదారులు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. తమ డిమాండ్‌కు ప్రభుత్వ స్పందించని కారణంగానే తాము వారిని చంపేసినట్టు ప్రకటించారు.బలోచ్స్థాన్లో ప్రధాన వేర్పాటువాద సంస్థగా ఎదిగిన బీఎల్ఏ.. సామాన్య పౌరులు సహా భద్రతా దళాలు, చైనా జాతీయులు, బలోచిస్థాన్‌లో పనిచేస్తున్న ఇతర ప్రావిన్సుల వారిపై దాడులకు పాల్పడుతోంది. ఆ ప్రావిన్సులో 18 భారీ దాడులు చేసింది. ఇక, తాజాగా జరిగిన రైలు (Jaffar Express) ఘటన సంచలనంగా మారింది. ఈ హైజాక్‌పై తాజాగా బలోచ్ లబరేషన్ ఆర్మీ స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ సందర్బంగా బీఎల్ఏ..‘రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని విధించిన 48 గంటల గడువు ముగిసింది. ప్రభుత్వం స్పందించని కారణంగా జాఫర్ ఎక్స్‌ప్రెస్ నుంచి బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది సైనికులను చంపేశాం. జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ ఘటనలో మా ఆపరేషన్ ముగిసింది. ప్రభుత్వం మొండితనంగా వ్యవహరించిన కారణంగానే మా చేతులకు పని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పుకొచ్చారు. దీంతో, పాకిస్ఠాన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఇదిలా ఉండగా.. పాకిస్థాన్‌లో 500 మంది ప్రయాణికులతో వెళుతున్న రైలు హైజాక్ (Train Hijack)కు గురైన ఘటనలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా బందీల్లో 80 మందిని సురక్షితంగా విడిపించాయి. వీరిలో 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 33 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు పాక్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.Baloch rebels claim execution of 214 hostages, blame Pakistan's 'stubbornness'The Baloch Liberation Army (BLA) has claimed responsibility for executing 214 hostages, blaming Pakistan’s refusal to negotiate. The group details ‘Operation Darra-e-Bolan,’ accusing Pakistan of…— Elena (@helen44767171) March 14, 2025 -
పాక్ రైలు హైజాక్.. కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్‌లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలు జాఫర్ ఎక్స్‌ప్రెస్(Jaffar Express)పై దాడికి దిగి, హైజాక్ చేశారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిని హతమార్చారు. అయితే రంగంలోకి దిగిన పాక్ భద్రతా బలగాలు.. కౌంటర్ ఆపరేషన్‌లో మిలిటెంట్లను మట్టు పెట్టాయి. తాజా సమాచారం ప్రకారం.. సైన్యం జరిపిన కాల్పుల్లో 16 మంది రెబల్స్ మరణించారు. ప్రయాణికుల్లో 104 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సైనిక హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాంబు దాడులతో పాక్ సైన్యం ఈ ఆపరేషన్ నిర్వహిస్తోంది. మిగిలిన ప్రయాణీకులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్లో బలూచీ వేర్పాటువాదులు మంగళవారం ఏకంగా ఒక ప్రయాణికుల రైలునే హైజాక్ చేసేశారు. ఇది తమ పనేనని నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించుకుంది. ‘500 మంది ప్రయాణికుల్లో కనీసం 30 మందిని కాల్చి చంపేశామని, 215 మందిని బందీలుగా పట్టుకున్నాం. మృతులతో పాటు బందీల్లో దాదాపుగా అంతా సైనికులే’ అని పేర్కొంది. దీంతో, బందీలను విడిపించేందుకు సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది.🚨 TRAIN HIJACK IN PAKISTAN.Jaffar Express from Quetta to Peshawar HIJACKED after IED blast by Baloch rebels pic.twitter.com/d9HWcmP2PO— akhilesh kumar (@akumar92) March 12, 2025ఘటనా స్థలిని సైనిక హెలికాప్టర్లు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టి బాంబు దాడులకు దిగాయి. దాంతో బీఎల్ఏ మండిపడింది. సైనిక చర్యను తక్షణం నిలిపేయకపోతే బందీలందరినీ చంపేస్తామంటూ పాక్ సర్కారును తీవ్రంగా హెచ్చరించింది. రాజకీయ ఖైదీలుగా నిర్బంధించిన బలూచీ నేతలు, కార్యకర్తలందరినీ 48 గంటల్లోపు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. దాంతో సైనిక చర్యకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తాత్కాలికంగా విరామం ప్రకటించింది.బలూచిస్తాన్‌తో పాటు పరిసర ప్రావిన్సుల్లో ఎమర్జెన్సీ విధించారు. ఘటనను కవర్ చేయకుండా మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు చెబుతున్నారు. ముష్కరులతో ఎలాంటి సంప్రదింపులూ ఉండబోవని అంతర్గత శాఖ మంత్రి మొహసిన్ నక్వీ ప్రకటించారు. బందీల్లో దాదాపు 80 మందిని విడిపించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య 35 దాటిందన్నారు.#TrainHijack Jaffer Express hijack in Pakistan 🇵🇰 The Train 🚂 was on its way from Quetta to Peshawar when it was attached by the Beloch rebels about 150 passengers & 6 military 🎖️ personnel were made hostages #TrainHijack #TRAIN #Balochistan #PakistanTrainHijack #TrainHijack pic.twitter.com/h4rbGREMQT— X highlight*️⃣ (@Abu_officl) March 12, 2025గ్రేటర్ బలోచిస్థాన్ ఏర్పాటే లక్ష్యంపాకిస్థాన్‌లోని దాదాపు 44 శాతం భూభాగం తన సొంతమైన బలోచిస్థాన్ ప్రావిన్సులో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానా నింపుతోంది. కోటిన్నర జనాభా గల ఈ పర్వత రాష్ట్రంలో మాత్రం అత్యధిక పేదరికం ఉంది. 1947 నాటికి ఈ ప్రాంతం పలువురు స్థానిక పాలకుల అధీనంలో ఉండేది. వీరిలో శక్తిమంతుడైన అహ్మద్ యార్ ఖాన్ స్వతంత్ర బలోచ్ రాష్ట్రం కావాలని పట్టుబట్టారు. అలా చేస్తే బలోచిస్థాన్‌లో సోవియట్ యూనియన్ (రష్యా) తిష్ఠ వేస్తుందని బ్రిటిషర్లు ఆందోళన చెందారు. పాకిస్థాన్ సైన్యం బలోచ్ భూభాగంలోకి ప్రవేశించి ఒత్తిడి తీసుకురావడంతో 1948 మార్చి 27న అహ్మద్ యార్ ఖాన్ విలీనపత్రంపై బలవంతంగా సంతకం చేయాల్సి వచ్చింది. నాటి నుంచీ ఈ ప్రాంతంలో రగులుతున్న అసంతృప్తి నేటికీ చల్లారలేదు. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో పుట్టిందే ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీ’ (బీఎల్ఏ). సహజ వనరులను కాపాడుకొని, గ్రేటర్ బలోచిస్థాన్ ఏర్పాటు చేసుకోవడమన్నదే వీరి లక్ష్యం. గత అయిదేళ్లుగా ఈ పోరాటం తన పంథా మార్చుకొని మిలిటెన్సీ బాట పట్టింది. సాయుధ పోరాటాలు చేస్తున్న వివిధ దళాలు ఏకమై ‘బలోచ్ నేషనల్ ఆర్మీ’ ఏర్పాటు చేశాయి. పాక్‌తోపాటు అమెరికా, బ్రిటన్ బీఎల్ఏను ఉగ్రసంస్థగా ప్రకటించాయి.ఇలా జరిగింది..దాదాపు 500 మంది ప్రయాణికులతో కూడిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఉదయం 9 గంటలకు బలూచిస్తాన్‌లోని క్వెట్టా నుంచి పెషావర్‌కు బయల్దేరింది. బొలాన్ జిల్లాలో కొండ ప్రాంతంలో కనుమ సమీపంలో గుదలార్, పెరో కున్రీ ప్రాంతాల మధ్య 8వ నంబర్ టన్నెల్ సమీపంలో బీఎల్ఏ సాయుధులు అప్పటికే రైలు పట్టాలను పేల్చేసి మాటు వేశారు. అక్కడికి చేరుకుని అతి నెమ్మదిగా వెళ్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. వెంటనే బలూచీ సాయుధులు భారీ సంఖ్యలో రైలును చుట్టుముట్టారు. నేరుగా ఇంజన్‌పైకి కాల్పులు జరపడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.రైలు ఆగిపోగానే మొత్తం 9 బోగీల్లోకీ చొరబడ్డారు. వారికి, రైల్లోని భద్రతా సిబ్బందికి మధ్య కాసేపు కాల్పులు జరిగాయి. అనంతరం రైలును బీఎల్ఏ సాయుధులు తమ అధీనంలోకి తీసుకుని సమీపంలోని టన్నెల్లోకి తరలించారు. ప్రయాణికుల్లో సాధారణ పౌరులు, మహిళలు, చిన్నారులను ఒకవైపు, సైనికులను మరోవైపు విడదీశారు. అనంతరం సైనికుల్లో 20 నుంచి 30 మందిని కాల్చి చంపారు. సాధారణ పౌరులను వదిలేశారు. 215 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో అత్యధికులు పోలీసు, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్ఐకు, సైన్యానికి చెందినవారే ఉన్నారు. వారంతా సెలవులపై స్వస్థలాలకు వెళ్తున్నారు అని స్థానిక మీడియా పేర్కొంది. ఘటనా స్థలిలో మొబైల్ నెట్వర్క్ వంటివేమీ లేకపోవడంతో రైల్లోని సిబ్బందితో ఎలాంటి కాంటాక్టూ వీలవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడికి పాల్పడింది బీఎల్ఏలోని మజీద్ బ్రిగేడ్‌గా భావిస్తున్నారు. వారితో పాటు స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్, ఫతే స్క్వాడ్ ప్రత్యేక విభాగాలు కూడా దాడిలో పాల్గొన్నట్టు బీఎల్ఏ ప్రకటించింది. -
పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?
భారత్‌కు దాయాది దేశంగా ఉన్న పాకిస్థాన్‌లో బెలూచిస్థాన్ వేర్పాటు వాదులు తాజాగా తీవ్ర కార్యకలాపాలకు పాల్పడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన పాక్ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను (Jaffar Express) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 100కి పైగా ప్రయాణికులను బంధించారు. ఈ చర్యలను ప్రతిఘటించిన ఆరుగురు పాకిస్థాన్ జవాన్లను హతమార్చారు. పాకిస్తాన్ రైల్వే దేశవ్యాప్తంగా ముఖ్యమైన రవాణా సాధనంగా పనిచేస్తోంది. దీని విస్తృతమైన నెట్వర్క్ మారుమూల ప్రాంతాలను అనుసంధానించడంలో, వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో, పర్యాటకానికి మద్దతుగా నిలవడంతో తోడ్పడుతుంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఎకనామీకి ఇలాంటి ఘటనలు కోలుకోలేని దెబ్బగా మారే ప్రమాదముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.భారత్‌తో పోలిస్తే చాలా తక్కువ..పాకిస్థాన్‌లో 1861లో కరాచీ నుంచి కోత్రి మధ్య మొదటి రైల్వే లైన్ ప్రారంభమైంది. బ్రిటిష్ వలసరాజ్య కాలంలో నార్త్ వెస్ట్రన్ స్టేట్ రైల్వేగా స్థాపించిన ఈ రైల్వే 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పాకిస్థాన్ రైల్వేగా మారింది. కాలక్రమేణా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాలను కలుపుతూ నెట్‌వర్క్‌ను విస్తరించింది. ప్రస్తుతం పాకిస్థాన్ రైల్వే సుమారు 7,789 కిలోమీటర్ల మేరకు విస్తరించింది. ఇది భారతరైల్వే విస్తరించిన సుమారు 68,000 కిలోమీటర్ల ట్రాక్‌తో పోలిస్తే చాలా తక్కువ. పాక్ రైల్వే కేవలం 479 స్టేషన్లను కవర్ చేస్తుంది. ఈ నెట్వర్క్ ప్యాసింజర్, సరుకు రవాణా సేవలకు కీలకంగా మారింది.చైనా-పాక్ మధ్య ఎంఎల్-1 ప్రాజెక్ట్ఇటీవలి కాలంలో పాకిస్థాన్ రైల్వే సేవలను పెంచడానికి ఆధునీకరణ కార్యక్రమాలను ప్రారంభించింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మెయిన్ లైన్ 1 (ఎంఎల్-1) వంటి ప్రధాన రైల్వే మార్గాలు ఏర్పాటు చేస్తుంది. ఇది కరాచీ, లాహోర్, పెషావర్ వంటి పట్టణ కేంద్రాలను కలుపుతుంది. ఎంఎల్-1 అప్‌గ్రేడేషన్ వంటి ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రైలు వేగాన్ని పెంచడం, రైల్వే సామర్థ్యాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కరాచీ నుంచి చైనాలోని పెషావర్ వరకు 1,726 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. క్రమంగా భవిష్యత్తులో ట్రాక్‌ను రెట్టింపు చేయడం, రైలు వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకు పెంచడం వంటివి ప్రాజెక్ట్ లక్ష్యాల్లో కీలకంగా ఉన్నాయి.ఈ ప్రాజెక్ట్ ఎందుకోసం అంటే..సరుకులు, ప్రయాణీకుల రవాణాను సులభతరం చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ వాణిజ్యాన్ని పెంచుతుందని నమ్ముతున్నారు. ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తుందని, నిర్మాణ సమయంలో, తర్వాత కాలంలో కూడా వందలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలు, డబుల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవి ఆపరేషనల్ భద్రతను మెరుగుపరుస్తాయని, ప్రమాదాలను తగ్గిస్తాయని అంచనా వేస్తున్నారు. రోడ్డు రవాణా కంటే రైలు మార్గాలను ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తూ, కర్బన ఉద్గారాలను నియంత్రిస్తుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘పెట్టుబడుల కంటే ప్రధానమైనవి ఇవే..’సవాళ్లు ఇవే..ఈ ప్రాజెక్ట్‌కు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పాకిస్థాన్ రైల్వే కాలం చెల్లిన మౌలిక సదుపాయాలతో నెట్టుకొస్తోంది. దేశంలో సరైన భద్రత లేకపోవడంతో తాజాగా జరిగిన ట్రెయిన్ హైజాక్ వంటి ఘటనలు పునరావృత్తమైతే ఆర్థిక వ్యవస్థపై, దేశ సమగ్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే బెలుచిస్థాన్‌లో వేర్పాటు వాదులు పాకిస్థాన్‌కు పక్కలో బళ్లెంలాగా పరిణమిస్తున్నారు. దేశంలో ఇప్పటికే ఆర్థిక పరిస్థితి తీవ్రరూపం దాల్చినట్లు నివేదికలు వెల్లడవుతున్నాయి. చైనా-భారత్ మధ్య చెలరేగుతున్న భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలో భారత్‌కు శత్రు దేశమైన పాకిస్థాన్‌తో చెలిమి చేస్తే భవిష్యత్తులో ఆసరాగా ఉంటుందని చైనా నమ్ముతుంది. దాంతో పాక్ ప్రాజెక్ట్‌ల్లో చైనా పెట్టుబడి పెడుతోంది. పాక్ పెద్దలు ఈ విషయాన్ని గ్రహించినా అక్కడి ఆర్థిక పరిమితులకు లోబడి చైనాతో చెలిమి చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.‘కేసీఆర్’ ప్రాజెక్టుభారత్లో ఐఆర్సీటీసీ మాదిరిగానే పాకిస్థాన్‌లో ఆన్లైన్ టికెట్ బుకింగ్, లైవ్ ట్రైన్ ట్రాకింగ్, డిజిటల్ పేమెంట్స్, రియల్ టైమ్ అప్డేట్స్ అందించే ‘రబితా అప్లికేషన్’ను అక్కడి రైల్వే ప్రవేశపెట్టింది. కరాచీలోని పట్టణ రవాణా వ్యవస్థను పునరుద్ధరించడానికి, ఆధునీకరించడానికి కరాచీ సర్క్యులర్ రైల్వే (కేసీఆర్) ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, నగరవాసులకు రైలు సేవలను చేరువ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. -
లారీ హైజాకింగ్ ముఠా అరెస్టు
– రూ.20 లక్షల సొత్తు రికవరీ – దోపిడీకి పాల్పడింది తమిళనాడు అంతరాష్ట్ర ముఠా పలమనేరు: పలమనేరు పట్టణంలో డ్రైవర్‌పై దాడి చేసి పైపుల లారీని హైజాక్ చేసిన కేసులో నిందితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. లారీతోపాటు అందులోని స్టీల్ పైపులను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శంకర్, సీఐలు సురేందర్ రెడ్డి, రవికుమార్ ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన డ్రైవర్ కమ్ ఓనర్ బాబు లారీలో కోల్‌కతా నుంచి స్టీల్ పైపులను బెంగళూరుకు బయలుదేరాడు. గతనెల 12న పలమనేరులో లారీని ఆపి ఇంటికి వెళ్లాడు. క్లీనర్ రాకపోవడంతో ఆ రాత్రి లారీలోనే నిద్రించాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు లారీలోకి ప్రవేశించి డ్రైవర్‌పై కత్తులతో దాడి చేశారు. కాళ్లు, చేతులు కట్టేసి మొగిలి సమీపంలోని అడవిలో పడేసి లారీని అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మండలంలోని కాలువపల్లె అటవీ ప్రాంతంలో శనివారం తమిళనాడు రాష్ట్రం కేవీ కుప్పం గ్రామానికి చెందిన పళని(29), కోలైనాడుకు చెందిన దయానిధిని అదుపులోకి తీసుకున్నారు. వారు తమ స్నేహితులు అదే ప్రాంతానికి చెందిన గోవిందరాజన్, ప్రవీణ్, గౌతమ్ కలిసి ఇండికా కారులో పలమనేరు వచ్చి డ్రైవర్ బాబుపై దాడి చేసి లారీని తీసుకెళ్లినట్టు అంగీకరించారు. అనంతరం లారీని తమిళనాడులోని క్రిష్ణగిరిలో వదిలేసి పైపులను మరో చోట దాచిపెట్టినట్టు పేర్కొన్నారు. పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని 550 స్టీల్ పైపులను స్వాధీనం చేసుకున్నారు. టైర్లను సైతం రకవరీ చేశారు. ఈ కేసులో మరో ముగ్గురిని త్వరలోనే పట్టికుంటామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో చొరవ చూపిన సీఐలు సురేందర్ రెడ్డి, రవికుమార్, ఎస్ఐ లోకేష్, ఐడీపార్టీ దేవ తదితరులను ఆయన అభినందిచారు. వీరికి రివార్డుల కోసం ఎస్పీ శ్రీనివాస్‌కు సిపారసు చేస్తున్నట్టు తెలిపారు. పోలీసులను స్థానిక లారీ అసోసియేషన్ వారు ఘనంగా సన్మానించారు.