
మాస్కో: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న వేళ అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. కర్క్స్ ప్రాంతంలో ఉన్న ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవడం మంచిది. లేకపోతే వారు ప్రాణాలతో ఉండరు అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా పశ్చిమ రష్యాలోని కర్క్స్‌లో కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ సేనలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్బంగా పుతిన్ తాజాగా మాట్లాడుతూ..‘కర్క్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ (Ukraine) సేనలు లొంగిపోతే వారు ప్రాణాలతో ఉంటారు. ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతే వారి ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వగలను. లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది. రష్యా ఫెడరేషన్‌తో పాటు అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటాం. మానవతా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న ట్రంప్ పిలుపు నాకు అర్థమైంది. ఆయన సూచన మేరకు ఓ విషయాన్ని వెల్లడిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, పుతిన్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ సేనల్లో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌ను కనికరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తాను విజ్ఞప్తి చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్ధంలో ఆ దేశ పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. కీవ్ సేనలను అన్ని వైపుల నుంచి రష్యా దళాలు చుట్టుముట్టాయని తెలిపారు. అందుకే.. ఉక్రెయిన్ సైనికులపై కనికరం చూపాలని తాను పుతిన్‌కు విజ్ఞప్తి చేశానని చెప్పారు. లేకపోతే రెండో ప్రపంచయుద్ధం తర్వాత జరిగే అతి దారుణమైన ఊచకోతగా ఇది మిగిలిపోతుందని అన్నారు. కాల్పుల విరమణకు సంబంధించి రష్యా నుంచి మంచి సంకేతాలు వస్తున్నాయని, మాస్కోతో జరిపిన చర్చలు ఫలించే అవకాశం ఉందన్నారు. యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నానని పుతిన్ చేసిన ప్రకటనపై ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు.
⚡️ BREAKING: President Putin responded to President Trump regarding his appeal to spare Ukrainian soldiers in the Kursk region:
“We have read today’s appeal from President Trump to spare the lives of servicemen of the Ukrainian Army in the Kursk region. In this regard, please… pic.twitter.com/RmmbqO1oS3— 🇷🇺Russia is not Enemy (@RussiaIsntEnemy) March 14, 2025
Comments
Please login to add a commentAdd a comment