
వాషింగ్టన్: భారత్‌కు చెందిన రంజనీ శ్రీనివాసన్‌కు వీసా రద్దు కావడంతో ఆమె తనంతట తానుగా అమెరికాను వీడారు. పాలస్తీనాకు అనుకూలంగా నిరసనల చేసిందుకు అక్కడి అధికారులు.. ఆమె వీసాను రద్దు చేశారు. దీంతో, రంజనీ శ్రీనివాస్ స్వదేశానికి వచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను హోంలాండ్ సెక్యూరిటీ శాఖ విడుదల చేసింది.
భారత పౌరురాలు, కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసాను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. కాగా, ఆమె పాలస్తీనాకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై వీసాను రద్దు చేసినట్టు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. అయితే, రంజనీ శ్రీనివాసన్ హింసకు మద్దతు ఇచ్చారనేందుకు వారి వద్ద ఏ ఆధారాలు ఉన్నాయో అధికారులు మాత్రం చెప్పలేదు. ఇక, 2025 మార్చి 5న విదేశాంగ శాఖ ఆమె వీసాను రద్దు చేసినట్టు ప్రకటనలో ఉంది. ఈ క్రమంలో ఆమె అమెరికాను వీడుతున్న వీడియోను హోంలాండ్ సెక్యూరిటీ శాఖ విడుదల చేసింది. ఈ వీడియోలో లాగార్డియా విమానాశ్రయంలో ఆమె తన లగేజీతో వెళ్తున్నట్టు కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. గతేదాడి పాలస్తీనా-ఇజ్రాయెల్ దాడుల సందర్బంగా పాలస్తీనాకు అనుకూలంగా కొలంబియా యూనివర్సిటీలో నిరసనలు చేపట్టిన విదేశీయులపై ట్రంప్ సర్కార్ ఫోకస్ పెట్టింది. వారిని అమెరికా నుంచి బహిష్కరించాలని, వారిపై చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోందని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ నివేదించింది. ఇందులో భాగంగానే పలువురు విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.
NEW: Columbia rioter Ranjani Srinivasan self deported after her student visa was revoked pic.twitter.com/Fnneiko5qs
— End Wokeness (@EndWokeness) March 14, 2025
విశ్వవిద్యాలయంపై ఒత్తిడి..
ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయం కష్టాలను ఎదుర్కొంటోంది. అమెరికా ప్రభుత్వం 400 మిలియన్ డాలర్ల ఫెడరల్ గ్రాంట్లు, ఒప్పందాలను రద్దు చేసింది. ఇందులో ఎక్కువ భాగం వైద్య పరిశోధనల కోసమే ఉంది. పాలస్తీనాకు సంబంధించిన నిరసనల సమయంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను విమర్శించిన విద్యార్థులు, అధ్యాపకులపై యూనివర్శిటీ కఠినంగా చర్యలు తీసుకోకపోవడానికి శిక్షగా ఈ ఒప్పందాలను రద్దుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment