అమెరికా వీసా కోసం వింత నాటకంతోఅడ్డంగా బుక్కయ్యారు. నిందితుల్లో నలుగురు భారతీయులతో సహా ఆరుగురు ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ వీసాలు పొందేందుకు ఆయుధాలతో దోపిడీల్లో బాధితులుగా కుట్ర పన్నారు. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్‌కు ఇమ్మిగ్రేషన్ వీసాలు పొందవచ్చని ప్లాన్ వేశారు. చివరికి ఏమైందంటే..
కెంటకీలోని ఎలిజబెత్‌టౌన్‌కు చెందిన భిఖాభాయ్ పటేల్, జాక్స్‌న్‌కు చెందిన నీలేష్ పటేల్, టెన్నెస్సీ, రవినాబెన్ పటేల్, రేసిన్, విస్కాన్సిన్,ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేకు చెందిన రజనీ కుమార్ పటేల్, అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు దశలవారీగా జరిగిన దోపిడీలలో బాధితులుగా నటించారు. తద్వారా మానసిక లేదా శారీరక వేధింపులకు గురైన కొన్ని నేరాల బాధితుల కోసం ఉద్దేశించిన వీసాలు పొందవచ్చని భావించారు.
కానీ పోలీసులకు చిక్కారు. చికాగో సెంట్రల్ కోర్టులో ఆరోపణలు నమోదైనాయి. కోర్టు ప్రకటన ప్రకారం, నిందితులు, కొందరు దోపిడీకి గురైన వారి సర్టిఫికేట్‌ల ఆధారంగా అమెరికా పౌరసత్వం, వీసా సేవలకు నకిలీ U-వీసా దరఖాస్తులను కూడా సమర్పించారు. వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటనలు చేశారని రవీనాబెన్ పటేల్‌పై వేర్వేరుగా ఆరోపణలు వచ్చాయి. ఈ స్కాంలో నలుగురు వ్యక్తులు నయీంకు వేల డాలర్లు చెల్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ నకిలీ దోపిడీ సమయంలో కొందరు వ్యక్తులు ఆయుధాలతో బాధితుల వద్దకు వెళ్లి దోచుకున్నారని కూడా నివేదిక పేర్కొంది. మోసానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై నిందితుడికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటనలు చేసిన ఆరోపణలపై 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే నిబంధన ఉందని ఒక ప్రకటన తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment